మనందరికీ జుట్టంటే మహా ఇష్టం. ఆడవాళ్ళకయితే మరీను. కేశాలను రకరకాలుగా తీర్చిదిద్దుకుంటూ అందాన్ని పెంచుకుంటారు. ఇంతకీ ఈ జుట్టు ఎలా వచ్చింది? వెంట్రుకల వెనుక ఉన్న రహస్యం ఏమిటి? పురాణాల్లో దీని గురించి చెప్పే కధ ఒకటుంది.
మొదట తలమీద జుట్టు అనేది అసలు ఉండేది కాదట. అమ్మవారు తలపై సర్పాలను అలంకారంగా ఉంచుకునేవారట. ఆ పాములు తమ కోరలతో శిరస్సును గట్టిగా పట్టుకుని ఉండేవట. అమ్మవారిని దర్సిమ్చికోడానికి వెళ్ళిన వాళ్ళంతా దేవి తలపై ఉన్న పాములను చూసి భయపడేవారట. అది చూసిన అమ్మవారు జాలిపడి పాములను సన్నటి దారాలుగా మార్చేశారట.. అవే శిరోజాలన్నమాట. వాటిని చూసి ముచ్చటపడిన భక్తులు తమకూ తలపై కేశాలు మొలవాలని కోరుకున్నారు. అమ్మవారి అనుగ్రహంతో ఆ కోరిక నెరవేరింది.
పాములే వెంట్రుకలుగా మారాయి అనడానికి చిన్న నిదర్శనం ఏమంటే ఏ వెంట్రుకను లాగి చూసినా, దాని మొదలు భాగం తెల్లగా కనిపిస్తూ, రెండుగా చీలి ఉంటుంది. అవి పాము కోరలకు చిహ్నాలుగా అలాగే మిగిలి ఉన్నాయని చెప్తారు. బాప్రే.. అంటే మన తలపై ఉన్నవి పాముల ప్రతిరూపాలా? ఆశ్చర్యంతో కళ్ళు వెడల్పు అయ్యాయి కదూ! కావా మరి?!
|