దైవారాధనలో ధూపదీపాలు ప్రధాన పాత్ర వహిస్తాయి. ఏ పూజ అయినా మొదట వాటితోనే మొదలవుతుంది.
అమ్మవారి పూజకు సమాయత్తం అయినప్పుడు ముందుగా
ఓం ఆర్ద్రాం యః కారిణీ |
యష్టీం సువర్ణాం హేమమాలినీం ||
సూర్యాం హిరణ్మయీం |
లక్ష్మీం జాతవేదో మమావహ ||
అనే మంత్రాన్ని జపించాలి. తర్వాత
వనస్పతి రసైర్దివ్యైర్ |
గంధాద్ధ్యైహ్ సుమనొహరైహ్ ||
కపిలాఘ్రుత సంయుక్తో |
ధూపోయం ప్రతిగృహ్యతాం ||
అనే శ్లోకాన్ని స్మరించి అగరొత్తులు వెలిగించి అమ్మవారికి భక్తిగా చూపి, మూడుసార్లు తిప్పి స్టాండులో గుచ్చాలి.
గణచ్చక్షు స్వరూపంచ |
ప్రాణ రక్షణ కారకం ||
ప్రదీప్తం శుద్ధ రూపంచ |
గృహ్యతాం పరమేశ్వరీ ||
అనే శ్లోకాన్ని పఠిస్తూ దీపం వెలిగించి "దీపం దర్శయామి" అనుకుంటూ నమస్కరించాలి. |