కొండదిగువన ఉన్న శృంగేరి పీఠంలో ప్రతి రోజు 5000 మందికి అన్నదానం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా మరోక ప్రదేశంలో కూడా మరోక 1000 మందికి అన్నదానం చేసే ఏర్పాట్లుచేయమని జిల్లామంత్రికె.పి.సారథి అధికారు లను ఆదేశించడంతో ఆదిశగా ప్రయత్నాలు జరుగుతు న్నాయి. కొండదిగువనే ఉన్న కనకదుర్గా నగర్‌లో భక్తులకు కావాల్సిన లడ్డూ,పులిహోర ప్రసాదాలను విక్రయించే కౌంటర్లు ఏర్పాటు చేశారు. దసరా ఉత్సవాలు ముగిసే వరకు ప్రవేటు వాహనాలను కొండపైకి అనుమతించరు. అయితే వృద్ధులు, వికలాంగులు, వి.వి.ఐ.పి.లు వెళ్లేందుకు 17వ్యాన్స్‌ను అధికారులు ఏర్పాటు చేశారు.
కృష్ణానది ఓడ్డున నాలుగు స్నానఘట్టాలను ఏర్పాటు చేశారు. అక్కడ భక్తులు స్నానాలు చేసేందుకు సౌకర్యాలు కల్పించారు. మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వృద్ధులు, చిన్నారులు నదిలోకి దిగలేకపోయే అవకాశం ఉన్నందున వారికోసం ప్రత్యేకంగా షవర్స్(జల్లుస్నాన ఘట్టాలు) ఏర్పాటు చేశారు. ఒకేసారి 150 మంది భక్తులు స్నానం చేసే విధంగా ఏర్పాటు చేశారు. ఈ ఏడాది సుమారు 1.5లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పిస్తారని అధికా రులు అంచనాలు వేస్తున్నారు. నాలుగు స్నానఘట్టాలలోనూ మూడు షిప్టులుగా సుమారు 600 మంది క్షురకుల్ని నియమించి కేశఖండన చేసేందుకు ఏర్పాట్లు చేశారు. శ్రీఅమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తుల్ని రంజింప చేసేందుకు తుమ్మపలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ఈ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి.
ఈ నెల 25న అమ్మవారి జన్మనక్షత్రం మూల. ఆరోజున ప్రభుత్వం తరుఫున దేవాదాయశాఖమంత్రి శ్రీఅమ్మవారికి పట్టుచీర, పసుపు,కుంకుమ, పూలు సమర్పించడం ఆనవా యితీగా వస్తోంది.
ఈ ఏడాది కూడా దేవాదాయశాఖమంత్రి గాదెవెంకటరెడ్డి శ్రీఅమ్మవారికి వట్టు వస్త్రాలను సమర్పి స్తారు.రాష్ట్ర ముఖ్యమంత్రి కె.రోశయ్య ఈ కార్యక్రమానికి వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. 26న సాయంత్రం 4గంటలకు ఇంద్రకీలాద్రి పై ఉన్న భవానీ దీక్షా మండపంలో వేదవిద్వత్ సభ జరుగుతోంది.రాష్ట్ర దేవాదా యశాఖ కార్యదర్శి కె.వి.రమణాచారి, కమిషనర్ పి.సుందర్ కుమార్ ఈ కార్యక్రమాలకు హజరుకానున్నారు. 28న సాయంత్రం కృష్ణానదిపై దసరా ఉత్సవాల ముగింపులో భాగంగా శ్రీ అమ్మవారు నదీవిహారం చేస్తారు. ప్రత్యేకంగా తయారు చేసిన హంస వాహనంపై శ్రీఅమ్మవారు నదీ విహారం చేయడం ఈ కార్యక్రమం ప్రత్యేకత. తెప్పోత్సవంగా పిలిచే ఈ కార్యక్రమాన్ని లక్షలాది మంది భక్తులు వీక్షిస్తారు. దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చకచకసాగిపోతున్నాయి. |