శ్రీ రాముడు రావణునితో యుద్ధం చేయడానికి వెళ్ళిన రోజు కాబట్టి విజయదశమి అయిందని కొందరు ,జగన్మాత మహిశాసురుడ్న్నివధించిన రోజు కాబట్టి విజయదశమి అయిందని కొందరు,అజ్ఞాతవాసం పూర్తిఅయినతరువాత విజయుడు జమ్మిచెట్టులో దాచిన ఆయుధాలను తీసుకుని శత్రువుల్ని ఓడించినరోజు కాబట్టి విజయదశమి అయిందని పెద్దలు చెప్తారు.
ఈ దసరా తొమ్మిది రోజులు సుమంగళి పూజ ,కుమారిపుజ చేస్తారు .పదేళ్లలోపు ఆడపిల్లలకు తలంటు పోసి ,పిండి వంటలతో భోజనంపెట్టి ,కొత్త బట్టలుపెట్టి సత్కరిస్తారు.ఇళ్ళలోను ,దేవాలయల్లోను ,కలశపూజలు ,చండిహోమంలు శాస్త్రబద్ధంగా చేస్తారు.
మూల నక్షత్రం సప్తమినాడు సరస్వతి పూజ ,అష్టమినాడు దుర్గాపూజ ,సప్తమినాడు ఆయుధపూజ చేయడం సంప్రదాయం .విజయదశమి నాడు కొత్త ప్రారంబిస్తే ఆ పని విజయవంతం మవుతుందని విశ్వాసం.విజయదశమి సాయంత్రం శమి శమియతే పాపం అని జమ్మి చెట్టును పూజిస్తారు . |