కడుపులో కవలలు ఉంటే..

కడుపులో కవలలు ఉంటే..?

 

 

కడుపులో బిడ్డ పడితే తల్లికి ఎంత సంబరమో. అదే కడుపులో ఇద్దరు బిడ్డలు పడితే? సంతోషంతో పాటు కాస్త టెన్షన్ కూడా మొదలవుతుంది. ఒక బిడ్డ ఉంటేనే ఎంతో కేర్ తీసుకుంటాం. మరి ఇద్దరు బిడ్డలు ఉంటే ఎక్కువ కేర్ తీసుకోవద్దా? తీసుకోవాలి. తప్పకుండా తీసుకోవాలి. అలా అని భయపడాల్సిన అవసరం లేదు.

సాధారణంగా వచ్చే ప్రెగ్నెన్సీ కంటే కన్సీవ్ అవ్వడం కోసం మందులు వాడేవాళ్లు, ఐవీఎఫ్ చేయించుకున్నవాళ్లు, ముప్ఫై అయిదేళ్లు దాటిన వారికి కవలలు ఎక్కువగా పుడుతుంటారు. మామూలుగా అయితే ఒక బిడ్డ పెరగడానికి అనువుగానే శరీరం ఉంటుంది. కాబట్టి కవలలు ఉన్నారని తేలితే హైరిస్క్ ప్రెగ్నెన్సీగా పరిగణిస్తుంటారు వైద్యులు.  ఇద్దరు శిశువులకు రెండు మాయలు, రెండు ఉమ్మనీటి సంచులూ ఉంటే పిల్లలిద్దరూ మామూలుగానే పెరిగి, సుఖప్రసవం అవుతుంది. కానీ ఒకే మాయ ఉంటే మాత్రం కొన్ని కాంప్లికేషన్స్ వస్తుంటాయి.

కాబట్టి కడుపులో కవలలు ఉన్నారని తెలిస్తే కాస్త ఎక్కువ కేర్ తీసుకోవం మంచిది. పదకొండు వారాల సమయంలో స్కానింగ్ చేయించుకుంటే కడుపులో శిశువులు ఎలా ఉన్నారు, ఎన్ని మాయలు ఉన్నాయి అనేది తెలిసిపోతుంది. దాన్ని బట్టి ఎలాంటి కేర్ తీసుకోవాలన్నది డాక్టర్స్ చెప్తారు. వాళ్లు చెప్పినట్టు ఫాలో అయితే ఏ సమస్యా ఉండదు. బలమైన ఆహారం తీసుకోవడం, తగినంత వ్యాయామం చేయడం, బరువు పెరగకుండా జాగ్రత్త పడటం వంటి వాటి వల్ల ప్రసవం తేలికగా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇద్దరు బిడ్డలకు ఎలా జన్మనివ్వాలా అని టెన్షన్ పడటం మానేసి, తగిన కేర్ తీసుకుంటూ తల్లి కాబోయే అనుభూతిని ఆస్వాదించండి.

- Sameera