శాతకర్ణి రాణిగా శ్రియ..?
on May 29, 2016
నందమూరి నటసింహం బాలకృష్ణ 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి షూటింగ్ యమా స్పీడుగా జరుపుకుంటోంది. ఇప్పటికే మొరాకోలో ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుని..యూనిట్ హైదరాబాద్ వచ్చేసింది. అయితే ఇంతవరకు హీరోయిన్ ఎవరన్నది ఖరారు కాలేదు. బాలయ్య సరసన ఎవరిని తీసుకోవాలో అర్థం కాక దర్శకనిర్మాతలు తలపట్టుకుంటున్నారు. అయితే ఇండస్ట్రీలో ఓ రూమర్ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే బాలయ్య పక్కన మహారాణిగా శ్రియా ఎంపికైందని. గతంలో అగ్రకథానాయికగా టాలీవుడ్‌ని ఏలిన శ్రియ ప్రజంట్ చేతిలో ఆఫర్లు లేక ఖాళీగా ఉంటోంది. హీరోయిన్ అన్వేషణలో ఉన్న క్రిష్, బాలయ్య పక్కన శ్రియా అయితే బాగుంటుందని..రాణి పాత్రకి పూర్తి న్యాయం చేయగలుగుతుందని భావించాడు. దీనిపై ఆమెను సంప్రదించిన క్రిష్‌కు శ్రియ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. ఇంతకు ముందు శ్రియ బాలయ్య పక్కన చెన్నకేశవరెడ్డి సినిమాలో నటించింది.