వర్మ నోటి వెంట సారీ...!
on May 29, 2016
వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా..ఎంతటివాడికైనా తలవంచని నైజంతో వార్తల్లో వ్యక్తిగా నిలిచే విలక్షణ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎంతో మందిని ట్విట్టర్ ద్వారా విమర్శిస్తూ ఉంటాడు. తిరిగి తనపై ఎన్ని విమర్శలు వచ్చినా కాని ఏ ఒక్కరికి క్షమాపణ చెప్పిన చరిత్ర రాముకు లేదు. కాని తొలిసారిగా వర్మ క్షమాపణ చెప్పాడు. వర్మ తాజా చిత్రం వీరప్పన్‌పై రాయిటర్స్ వార్తాసంస్థకు చెందిన మహిళా జర్నలిస్ట్ శిల్పా జామ్ ఖండికర్ నెగెటివ్ రివ్యూ రాశారు. దీనిపై రాము మండిపడ్డాడు. అక్కడితో ఆగకుండా ఆమె ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసి..నీ ముఖమంత అందంగా వీరప్పన్ ఉందంటూ కామెంట్ పెట్టాడు. తర్వాత ఏమైందో ఏమో కానీ ఆమెకు క్షమాపణ చెబుతూ ట్వీట్ చేశాడు. ఇప్పటి వరకు తాను ఎవరికీ క్షమాపణ చెప్పలేదని, ఫస్ట్ టైం సారీ చెబుతున్నానని ..తానన్న మాటలను పట్టించుకోవద్దని ఆ పోస్ట్‌లో పేర్కొన్నాడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
