శ్రీయ మూడు రోజుల పెళ్లి వేడుకలు అక్కడే..!!
on Feb 28, 2018
సీనియర్ హీరోయిన్ శ్రియా శరన్ పెళ్లిపై గతంలో ఎన్నో పుకార్లు వచ్చాయి. ఢిల్లీకి చెందిన బిజినెస్‌మెన్‌తో ప్రేమాయణం నడుపుతోందని.. విండిస్ క్రికెటర్లు క్రిస్‌గేల్, బ్రావోలతో సన్నిహితంగా ఉంటోందని.. శ్రియాపై లెక్కలేనన్ని గాసిప్పులు వచ్చాయి. రెండు.. మూడు రోజుల ముందు కూడా ఓ షాపింగ్ మాల్‌లో శ్రియ మీడియా కంటపడటంతో.. ఈ ముద్దుగుమ్మ పెళ్లికూతురు కాబోతోందని గాసిప్పులు హోరెత్తాయి. అయితే అప్పట్లో ఆ వార్తల్లి శ్రియ తల్లి ఖండించారు. స్నేహితురాలి వివాహం కోసమే శ్రియ షాపింగ్ చేస్తోందని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు ఆ వార్తలే నిజమయ్యాయి.
రష్యాకు చెందిన ఆండ్రీ కుచ్చేవ్ అనే బిజినెస్‌మెన్ కమ్ క్రీడాకారుడితో శ్రియ పెళ్లి జరగనుంది. ఉదయ్‌పూర్‌లోని ఓ ప్యాలెస్‌లో మార్చి 17 నుంచి మూడు రోజుల పాటు శ్రియ వివాహా వేడుక జరగనుంది. 18న హిందూ సంప్రదాయంలో వివాహాం చేసుకొని.. 19వ తేదీన అతిథులు, స్నేహితులకు గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే బంధుమిత్రులకు, సహనటులకు ఇన్విటేషన్లు వెళ్లినట్లు టాక్. ప్రస్తుతం "వీరభోగ వసంత రాయలు"తో పాటు.. "తడ్కా" అనే హిందీ, "నరగాసురన్" అనే తమిళ సినిమాలో శ్రియ నటిస్తున్నారు.