Facebook Twitter
మార్పుకు నాంది మహిళ

మార్పుకు నాంది మహిళ

అప్పడు భారత దేశంలో

భార్యగా త్యాగం,

తల్లిగా అనురాగం,

ఆడ జన్మ పవిత్రం,

అయినా తప్పలేదు కష్టాలు,

******************************

వరకట్నానికి బలికాకుండా,

కిరోసేన్ అగ్నికి ఆహుతి కాకుండా,

ఫ్యాను కడ్డీలను ఆశ్రయించకుండా,

బతికేదెలా అని భయపడ్డది ఆడ బ్రతుకు .

************************************

ఇప్పుడు

ఆసిడ్ దాడులతో,

ప్రేమపిచ్చి ఆవేశాలతో,

కామ పిశాచుల కోరికలతో,

రాజధాని నడి బొడ్డున పరాభావింప బడ్డాక,

వూరుకోకు మహిళా

ఎందుకంటే

శిక్షలు ప్రభుత్వానివే అయినా

క్రమశిక్షణ ఎప్పుడూ తల్లిదే.

*********************************

ప్రేమా అనురాగాలూ అణుబాంబు కన్నా శక్తిమంతాలు.

అనురాగ మూర్తిగా చేతన కలిగించు

అపర శక్తివై చైతన్యం తెప్పించు,

ఇది చెయ్యగలిగేది ఒక్క ఆడదే ,

అత్యంత శక్తి స్వరూపిణి ఆడది,

అబల కాదు సబల అని నిరూపించేది

సంఘం లో మార్పుకు పునాది వేసేది మహిళే !

రచన- లక్ష్మి రాఘవ