Facebook Twitter
మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? రమొని లేక రామి

 


మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? రమొని లేక రామి

 


రమొని లేక రామి (1440) బెంగాలి రచయిత్రి. ఈమె ఒక అనాధ చాకలి పిల్ల. పని కోసం ఊళ్ళు తిరుగుతూ తిరుగుతూ నానూర్ (Birbhum district in Bengal) అనే చోటకి వస్తుంది. అక్కడ భాషులి దేవి గుడిలో గుడి శుభ్రం చేసే పనికి కుదురుతుంది. చండీదాస్ అనే బ్రాహ్మణ కవి అక్కడ వంశ పారంపర్యంగా పూజారి. శ్రీక్రిష్ణ కీర్తన్ అనే కావ్యం రాసినవాడు. ఆ గుడిలో పని చేస్తూనే రామి భక్తి ప్రాధాన్యమైన రచనలు చేసింది. వ్యక్తిగతంగా ఆమె భక్తికి ప్రజల్లో మంచి పేరు సంపాదించుకుంది. ఆమెది చక్కని గొంతు. శ్రావ్యంగా పాడేది. చండీదాస్ కవిత్వమంటే పడి చచ్చేది. మొదట వీరిద్దరిమధ్యా స్నేహం కుదురుతుంది. ఆ తర్వాత వారి స్నేహం ప్రేమగా మారుతుంది. అయితే వీరి కులాలు వేరయిన కారణంగా వీరి ప్రేమ ప్రజలకి నచ్చదు. చండీదాసుని వెలివేస్తారు. రామి గుడిలో చేసే పనికి కూడ ఉద్వాసన చెప్తారు. అయితే చండీదాస్ కులం కన్నా మానవత్వం గొప్పదని నమ్మే వ్యక్తి. రామి పట్ల తన ప్రేమను బాహాటంగానే ప్రకటిస్తాడు. ఆమె కోసం తన వంశ పారంపర్యంగా వచ్చే పౌరోహిత్యాన్ని కూడా వదిలేసుకుని వెళ్ళిపోతాడు. వీరిద్దరి ప్రేమను చండీదాస్ తన రచనల్లో ఒక పవిత్రమైన ఆత్మ బంధం (platonic love) లాగా వర్ణిస్తే, రామి మాత్రం నిజాయితీగా తమ మధ్య ఉన్న భౌతికమైన ప్రేమను గురించి రాస్తుంది. చండీ దాస్ తన రచనల్లో ఆమె పాదాలు తాకాలన్న కోరికని express చెయ్యడం అప్పటి సమాజంలో అగ్ర వర్ణమయిన బ్రాహ్మణులు ఒప్పనిది, ఇంకా విప్లవాత్మకమైన తిరుగుబాటు కుల వ్యవస్థ మీద అని చెప్పొచ్చు . కనక చండీదాస్ ఆమె కులానికి పెద్ద ప్రాధాన్యత ఇవ్వలేదని కేవలం ఆమె ప్రేమని మాత్రమే ఆశించాడాన్న విషయాన్ని రుజువు చేస్తుంది.

ఇంత జరిగాకా ఇక్కడ వీరి కధ ఒక అనూహ్యమైన మలుపుతీస్కుంటుంది. గౌర్ నవాబ్ చండీదాసుని తన కోటలో పాడటానికి ఆహ్వానిస్తాడు. చండీదాసు పాట విని ముగ్ధురాలైన నవాబు భార్య చండీదాసు ప్రేమలో పడిపోతుంది. ఆమె ఆశ్చర్యంగా తన ప్రేమను రహస్యంగా ఉంచుకోదు. చండీదాసు కూడ రామీని మరచి ఆమె ప్రేమలో పడిపోతాడు. ఊహించని ఈ పరిణామానికి, చండీదాస్ తనకు చేసిన అన్యాయానికి, రామి చాల బాధ పడుతుంది ఇంకో పక్క నవాబుకి తన భార్య వ్యవహారం నచ్చదు. అధికారం ఉన్నవాడు కాబట్టి చండీదాస్ కి మరణ శిక్ష అది కూడా చాలా కౄరమైన పద్ధతిలో ఏనుగ వీపుకి కట్టి కొరడాతో కొట్టి కొట్టి చంపమంటాడు. ఒక పక్క చండీదాసు తనను మోసం చేసాడన్న బాధ, కోపం ఉన్నా నవాబు కోటకి పరిగెత్తి, తన ప్రియుడిని వదిలేయమని ప్రాధేయ పడుతుంది. తన భార్య తనని కాదని బాహాటంగా చండీదాసు వెంట పడటం భరించలేని నవాబు ఈమె ప్రార్ధనని ఎలా ఒప్పుకుంటాడు. ఒక పక్క నవాబు భార్య కూడా అతన్ని చంపద్దని వేడుకుంటుoది. అయితే నవాబు ఎవ్వరి మాటా వినకుండా చండీ దాసుని హింసిస్తాడు చనిపోయే వరకు. పాపం నవాబు భార్య ఈ ఘోరం చూడలేక్ గుండె బద్దలయ్యి ప్రాణాలు వదిలేస్తుంది.

ఈ విషయం తెలిసిన రామి మాత్రం తన నుంచి తన ప్రియిడిని లాగేసుకుందని కోపం కూడా మరచి ఆమె చావుకు కూడా దుఖిస్తుంది. ఇది స్త్రీ లోని ప్రేమ తత్వానికి ఒక గొప్ప నిదర్శనమేమో. అయితే చనిపోయిన తర్వాత కూడా రామి చండీదాసుని క్షమించలేదు. అతని మీద మాత్రం ఆమె కోపం తగ్గలేదు. ఆమె తరవాతి రచనలు కూడా చండీదాసు తనకు చేసిన అన్యాయాన్ని, లోకం తన పట్ల చూపే ఏవగింపుకి, తన వెంట పడే మగవారినుంచి కాపాడుకోవడానికి తను పడే బాధల్ని గురించి ఆమె రచనల్లో రాస్తుంది. అయితే వీరి కధ మాత్రం అత్యంత ప్రజాదరణ పొందిన నాటకీయాంశం అయింది. అయితే ఈమె రచనలన్నీ బయట పడింది చండీదస్ చనిపోయిన తరవాత అతని రచనల కోసం వెతుకుతున్నప్పుడు కొన్ని manuscriptsకనిపించాయట. అప్పుడు తెలిసింది ప్రపంచానికి ఇవి రాసినది రామి అని.

ఇప్పటివరకూ మనం తెలుసుకున్న రచయిత్రుల్లో, అక్కమహాదేవి కానీ , కన్ హోపాత్రా కాని, జానాబాయి కాని, ముక్తాబాయి కాని, చంద్రబతి కాని అందరూ స్త్రీత్వం వల్ల కష్టాలు పడ్డవారే. వారందరి రచనల్లోనూ, భక్తి తో పాటుగా ఆడదైన కారణంగా పడ్డ కష్టాల గురించి, ఇంట్లో గృహిణిగా వుంటే ఉండే రక్షణ లేక పోవడంవల్ల, బయటి సమాజంలోకి వచ్చి, మగవారివల్ల వాళ్ళు పడ్డ కష్టాలను అనుభవిస్తూ వాటిని కూడా తమ రచనల్లో చూపెట్టిన వారే. వారే కనక ఆ కష్టాలను గురించి రాయకపోతే, అప్పటి సమాజం గురించి మనకు ఇంత వివరంగా తెలిసేది కాదేమో. ఒంటరి ఆడది అప్పటికీ, ఇప్పటికీ కూడా లోకువే. అందరికీ అందుబాటులో ఉండే అంగడి సరుకులాంటిదైపోతుంది. ఆమె మీద ప్రతి మగాడికీ హక్కున్నట్టే భావిస్తాడు.

రామి రాసిన ఈ రెందు పోయంస్ చూద్దాము. ఆమె కధనంతా ఈ కవితలోనే చెప్తుంది.


Where have you gone?

Where have you, my Chandidas, my friend,
Birds thirst without water, despair without rain.
What have you done, O heart less Lord of Gaur?
Not knowing what it means to love, you slay my cherished one.
Lord of my heart, my Chandidas, why did you break,
The vows you made and sing in Court?
Now evil men and beasts come swarming round; heavens turn to hell.
Betrayed by you, I stand in shame; you have crushed my honour in your hands.
Once heedless, untouched by Vasuli's threat,
You told the court, with pride you would leave a brahmin home, you said
to love a washergirl.
Now, lashed to an elephant's back, you reach me with your eyes.
Why should this jealous king heed a washerwoman's cries?
Soul of my soul, how cruelly on your fainting limbs the heavy whip strikes and falls.
Cleave through my heart, and let me die with Chandidas, my love.
And then the queen fell on her knees “Please stop Lord”, she cried,
“His singing pierced me to the heart, No more of this, I plead,
Why must you thus destroy limbs made for love alone?
Free him, I beg of you, my Lord, don't make love your toy.
O Godless king, ho could you know what love can mean?”
So spoke the queem and then, her heart still fixed on Chandidas, she died.
Rami trembled, hearing her, and hastened tothe place.
She threw herself at those queenly feet and wept the tears of death.



నీవెక్కడి కెళ్ళావు?

నీ వెక్కడికెళ్ళావు? చండీదాస్, నా స్నేహితుడా;
దాహంతో, వానలేక, నైరాశ్యంలో పక్షులు అలమటిస్తున్నాయి.
ఏం చేసావు నువు? ఓ గౌర్ నవాబూ?
ప్రేమించడమంటే తెలియక, నా ప్రియుణ్ణి వధించావు.
నువు చేసిన బాసలన్నీ మరిచిన నా హృదయనాధా! ఓ చండీదాస్, నీవెందుకు దివాణంలో పాడావు?
ఇప్పుడు మగ మృగాలన్నీ నా చుట్టూ మూగుతున్నాయి, ఇక్కడ స్వర్గం ఇపుడు నరకమైంది
నీచే వంచించబడి, నా గౌరవాన్ని నీ చేతుల్తో నలిపేస్తే, అవమాన భారంతో నిలిచాను.
ఒకసారి, ఏమాత్రం ఆలోచించకుండా, భాసులీ దేవి భయం లేకుండా
ఒక చాకలి వనిత కోసం నువు బ్రాహ్మణీకాన్ని ఒదిలేసావు.
ఇప్పుడు నిన్ను కట్టేసిన ఏనుగు మీంచి నీ చూపుల్తోనే నన్ను చేరతావు,
ఈర్ష్యలో కాలుతున్న నవాబు ఒక చాకలమ్మాయి రోదనలెందుకు వింటాడు?
నా ఆత్మలో ఆత్మవైన నీవు ; ఎంత కౄరంగా పడుతున్నాయి కొరడా దెబ్బలు నీ వంటి మీద
నా గుండెను చీరుకుని నన్ను కూడా నేతోనే మరణించనీ చండీదాస్ ఓ నా ప్రేమికుడా.
ఇక రాణీ కూడా మోకరిల్లి "ఆపండి రాజా అని ఏడ్చింది, అతని పాట నా గుండెను కోసింది
ఇక చాలు అని అర్ధిస్తున్నా, ప్రేమకోసం మాత్రం చాచే చేతుల్ని నాశనం చేయొద్దు,
అతన్ని వదిలెయ్యండి ఓ రాజా, ప్రేమను మీ ఆటబొమ్మను చేయకండి,
ఓ దైవత్వం లేని రాజా, ప్రేమ ఏంటో నీకెలా తెలుస్తుంది?"
అంటూ వాపోయిన రాణి, చండీదాసుపై పెట్టుకున్న హృదయం బద్దలై చనిపోయింది
ఇది విన్న రామి చలించి పోయింది, పరిగెత్తి వెళ్ళి
తాను రాణి పాదాలపై వాలి వలవల విలపించింది.
xxxxx


What can I say, friend?

I don't have enough words!
Even as I weep when I tell you this story,
My accursed face breaks into laughter
Can you imagine the cheek of the sinister men?
They have stopped worshipping the Devi
And have started tarnishing my reputation
Let the thunderbolt crash on the heads of those
Who from thier housetops shout abuses at good people
I wouldn't stay any longer in this land of injustice,
I will go to a place where there are no hellhounds.

నాదగ్గర పదాలు లేవు. నా ఈ వ్యధాభరిత కధను చెప్పడానికి. ఏడుస్తూ నేను నా కధను చెప్తున్నపుడు, నా శాపగ్రస్త మొహంలో నవ్వు కనిపిస్తుంది. దుర్మార్గులైన మగవాళ్ళెలా నవ్వుతారో అసలు నీకు తెలుసా? వాళ్ళంతా దేవిని కొలవటం మాని నామీద, నాగౌరవం మీద దుమ్మెత్తి పోస్తున్నారు. ఇళ్ళపై నుంచి బిగ్గరగా అరుస్తూ మంచివాళ్ళని దుర్భాషలాడే వీళ్ళ తలలపై పిడుగులు పడనీ. ఇటువంటి ప్రపంచంలో, న్యాయం లేని ప్రపంచంలో నేనుండను. ఇలాంటి కుక్కల నరకంలేని చోటకెళ్ళిపోతాను.

ఒక స్త్రీకి స్త్రీత్వం ఎంత సహజమో పురుషాధిక్య సమాజంలో వివక్షకి, వంచనకి, ద్రోహానికి, అణిచివేతకి గురవడం కూడ అంతే సహజమై పోయింది. ఎన్ని శతాబ్దాలు వెనక్కి వెళ్ళి చూసినా స్త్రీల జీవితంలో ఇదొక అనివార్యమైన అంశంలాగా ఉంది. అదే ఆడది లేకపోతే క్షణం గడవని మగాడు, ఆడదాన్ని ఈ రకంగా physical and psychologicalగా హింసించే అనాచారం గురించి ఎందుకు ఆలోచించట్లేదో అర్ధం కాదు. భార్యా భర్తలిద్దరి మధ్యా ప్రేమా, గౌరవం, పరస్పర నమ్మకం ఉండి సజావుగా సంసారాలు సాగితే అక్కడ పిల్లలు ఎంత మానసిక ఆరోగ్యంతో పెరుగుతారు. ఇదెప్పటికీ ఒక తీరని కలగా మిగలాల్సిందేనా, ఎదో కొందరిని తప్పించి అని బాధ కల్గుతుంది. ఒక ఆడదాని పోరాటం తన ఇంట్లోంచే మొదొలెట్టాల్సిన అవసరం ఇంకెన్నాళ్ళో.

 

 

 

 

 

- Sivapurapu Sharada