సంప్రదాయలతో కూడిన బీచ్ పార్టీ.. నవంబర్ 9,10 తేదీల్లో భీమిలి ఉత్సవాలు

Publish Date:Nov 9, 2019

Advertisement

 

విశాఖపట్టణం అంటే అందరికీ తెలిసిందే. మరి భీమునిపట్టణం అంటే చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. అదే ఇప్పుడు భీమిలిగా పిలవబడే అప్పటి భీమునిపట్నం. విశాఖ నుంచి 24 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ అద్భుత పర్యాటక ప్రాంతాల్లో భీమిలి ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. విశాఖకు పేరు ప్రఖ్యాతలు రాక ముందే ఓ పెద్ద పట్టణంగా చారిత్రక ప్రాంతంగా విలసిల్లింది భీమిలి. ఈ పట్టణం రానురాను కాస్త మరుగున పడింది కానీ ఇప్పటికీ అక్కడ చూడతగ్గ.. ఆస్వాదించదగ్గ.. విశేషాలెన్నో ఉన్నాయి. గతమెంతో ఘనం అనిపించేలా ఆ చరిత్రను గుర్తు చేసుకునే వేడుకలు జరగనున్నాయి. పర్యాటకులను ఆకర్షిస్తూ ఈ నెల 9,10 తేదీల్లో రెండు రోజుల పాటు భీమిలి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. 1861లో ఏర్పాటైన భీమిలి మున్సిపాలిటీ భారతదేశంలోనే రెండో మున్సిపాలిటీగా గుర్తింపు పొందింది. ఏపీలో తొలి మునిసిపాలిటీ భీమిలి.. అది ఏర్పాటై 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 2010లో ప్రారంభమైన భీమిలి ఉత్సవాలను ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు.

పశ్చిమ వైపు ఎత్తుగా ఉండి క్రమంగా తూర్పు వైపు సముద్ర తీరానికి వచ్చేటప్పటికీ పల్లం కావడంతో అక్కడ సముద్ర తీరంలో ప్రకృతి అత్యంత రమణీయంగా ఉంటుంది. పావురాళ్ళకొండ, ప్రఖ్యాత గాంచిన నరసింహస్వామి దేవాలయం, భీమేశ్వర ఆలయం కూడా ఇక్కడే ఉన్నాయి. 16-18  శతాబ్దాల మధ్య ఐరోపా ఖండం వారు భారత దేశానికి వర్తకం చేసుకోటానికి వచ్చినప్పుడు భీమిలిలోనే డచ్ వారు అడుగుపెట్టారు. 1624లో డచ్ వారు ఇక్కడ మొదట వలస వచ్చినప్పుడు ప్రాంతీయులకు డచ్ వారికి మధ్య ఘర్షణలు వచ్చాయని చెబుతుంటారు. ఈ ఘర్షణల్లో 101 మంది సైనికులు 200 మంది స్థానికులు మరణించారని చెప్తుంటారు. ఇప్పటికీ భీమిలిలో డచ్ వారివి సమాధులు ఉండటంతో అక్కడకు వచ్చిన పర్యాటకులు వీటిని తప్పకుండా సందర్శిస్తుంటారు. 

భీమిలి బీచ్ పెద్దగా లోతూ ఉండదు కాబట్టి నిత్యం సందర్శకులతో కళకళలాడుతూ ఉంటుంది. కాకినాడకు, శ్రీకాకుళానికి మధ్య 8 లైట్ హౌస్లు నిర్మించారు.వాటిలో ఉన్న ఒక దీప స్తంభం 18వ శతాబ్దపు భీమిలి నౌకాశ్రయ వైభవాన్నీ తెలియచేస్తోంది. 24 కిలోమీటర్ల పొడవున్న ఈ బీచ్ రోడ్ భారత దేశంలోని పెద్ద బీచ్ రోడ్డు లో ఒకటిగా చెబుతారు. గ్రామీణ వాతావరణం పట్టణం కలగలిసిన ఈ సాగర తీర పట్టణంలో ఎన్నో సినిమాలు తెరకెక్కిస్తుంటారు. 

ఈ నెల 9,10 తేదీల్లో జరిగే భీమిలి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఎయిర్ బెలూన్ ప్రదర్శన, ఫుడ్ ఫెస్టివల్ తదితర కార్యక్రమాలు ఉంటాయి. భీమిలి ఉత్సవ్ సమయంలో విశాఖ నుంచి భీమిలి వరకు ఉచిత బస్సులు నడపనున్నారు. ఈ ఉత్సవాలను 50 లక్షల బడ్జెట్ తో నిర్వహిస్తున్నామని తెలిపారు. భీమిలి చరిత్రను ప్రపంచానికి చాటి చెప్పడానికి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఏపీ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు వెల్లడించారు.

భీమిలి ఉత్సవ్ సందర్భంగా ఉప్పుటేరులు, తెప్పల పోటీలు తెగ సందడి చేస్తాయి. కుర్రకారు జోరు చూపించే కబడ్డీ ఆటలు, భీమిలి ప్రత్యేక వంటకాల రుచులు, ఘుమఘుమలతో స్వాగతం పలుకుతాయి. రంగవల్లులతో ఊరంతా అందమైన హరివిల్లుల్లా కనిపిస్తుంది. డప్పుల హోరు..పులివేషాల జోరు.. సంప్రదాయ కళల ప్రదర్శనలు, సినీ కళాకారుల అభినయాలు, సంగీత విభావరులు ఒకటేమిటి రెండు రోజుల పాటు ఆద్యంతం ఆహ్లాదకరం. వైభవంగా జరిగే ఈ ఉత్సవాలను చూసేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా కర్ణాటక తమిళనాడు నుంచి పర్యాటకులు విచ్చేయనున్నట్లు తెలిపారు.

By
en-us Political News

  
నిజానిజాల సంగతి పక్కన పెడితే ఎన్నికల సమయంలో రాజకీయ నాయకుల ప్రచారాలు కోటలు దాటేస్తాయి. పార్టీలు, నేతలు చెప్పేది ఏది నిజం, ఏది అబద్ధం అన్నది వేరే విషయం. ఎవరి మాటలను జనం విశ్వసిస్తున్నారు. ఎవరి మాటలను నమ్మడం లేదు అన్నది జనం ఓటుతో చెప్పే వరకూ అంటే ఎన్నికల ఫలితాలు వచ్చే వరకూ ఎవరికీ తెలియదు.
వైసీపీకి ఇప్పుడు అన్ని అపశకునాలే కనిపిస్తున్నాయి. ఏదీ కలిసిరావడం లేదు. గత ఎన్నికలలో అన్నీ కలిసివచ్చి అందలం దక్కింది. ఈ సారి అన్నీ ఎదురుతిరిగి అధికారం దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. స్వయంగా పార్టీ అధినేత, సీఎం జగన్ రంగంలోకి దిగి బస్సు యాత్ర చేపట్టినా జనంలో స్పందన కనిపించలేదు. చివరాఖరికి సొంత గడ్డ కడపలో కూడా జగన్ పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శనివారం శ్రీవారి దర్శనం కోసం భక్తులు 31 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు.
ప్రస్తుతం ఏపీ రాజ‌కీయాల్లో స‌వాళ్ల ప‌ర్వం స్టార్ట్ అయింది. ప్ర‌చారంలో ప్రధాన పార్టీల నేత‌లు మాట‌ల‌ ప‌దును పెంచుతున్నారు. రాజ‌కీయ స‌వాళ్ళు, ప్ర‌తిస‌వాళ్ళ‌తో నేత‌లు, ఓట‌ర్ల‌ను వినోదాన్ని పంచుతున్నారు. “హాష్ ట్యాగ్ బ్యాండైడ్ ఛాలెంజ్” పేరుతో ట్విట్టర్ లో ఛాలెంజ్ విసురుకుంటున్నారు.
కోడలికి బుద్ధి చెప్పి అత్త మూకుడు నాకిందనే సామెత తెలుగువారందరికీ తెలిసే వుంటుంది.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన రాజకీయ ఉత్కంఠ, టెన్షన్ భరిత వాతావరణం చాలదన్నట్టుగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అగ్నిలో ఆజ్యం పోశారు.
వల్లభనేని వంశీ నామినేషన్ దాఖలు చేసిన రోజునే ఓటమిని అంగీకరించేశారా? అంటే పరిశీలకలు ఔననే అంటున్నారు. ఇవే తనకు చివరి ఎన్నికలు అని ప్రకటించడం ద్వారా తనకు గెలుపు ఆశలు ఆవిరి అయిపోయాయని చెప్పకనే చెప్పేశారు.
డోన్ నియోజకవర్గం వైైసీసీ అభ్యర్థి మంత్రి  బుగ్గన నామినేషన్ పెండింగ్లో పడింది.   మంత్రి బుగ్గన రాజేంద్రనాథ నామినేషన్ ను ఆర్వో పెండింగ్ లో ఉంచారు.
ఏపీ ఎన్నికల సందర్భంగా జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో కమెడియన్ హైపర్ ఆది ప్రచారం చేస్తున్నారు.
హిందూపురం తెలుగుదేశం అభ్యర్థిగా బాలకృష్ణ భార్య వసుంధర నామినేషన్! అనంతపురం జిల్లా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ భార్య వసుంధర గురువారం నామినేషన్ దాఖలు చేశారు.
ఓ వైపు ప్రజా వ్యతిరేకత, మరో వైపు చెల్లెళ్ల విమర్శలు, ఇంకో వైపు పార్టీ నుంచి పెరిగిపోతున్న వలసలు, వెరసి ఓటమి భయంతో జగన్ వణికి పోతున్నారా? ఆఫ్రస్ట్రేషన్ లో సొంత చెల్లెలిపైనే అనుచిత వ్యాఖ్యలు చేసి తనకు తానే నష్టం చేసుకున్నారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు.
ఏంటమ్మా జగనూ... మొన్న చెల్లి షర్మిలమ్మ ఎలక్షన్ కమిషన్ దగ్గర అఫిడవిట్ దాఖలు చేసినప్పుడు చూశాంలే..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.