అంబానీ భార్య వాడే ఫోన్ ధర… అమ్మో అనిపించకమానదు!

అంబానీ… ఈ పేరు ఇండియాలో డబ్బుకి మారు పేరు! మనీ అన్నా, అంబానీ అన్నా ఒకేలా ఫీలవుతారు మన వాళ్లు! నిజంగానే… అంతలా డబ్బు సంపాదించేశారు అంబానీ ఫ్యామిలీ వారు! ఇక ఈ మధ్య జియోతో మరోసారి తన సత్తా చాటారు ముఖేష్ అంబానీ. 4జీ స్మార్ట్ ఫోనుని ఉచితంగా ఇస్తానంటూ మొబైల్ బిజినెస్ లో గేమ్ రూల్స్ అన్నీ ఛేంజ్ చేసేశారు. అది ఆయన ప్రొఫెషనల్ లైఫ్లోని లేటెస్ట్ న్యూస్. కాని, ముఖేష్ అంబానీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు కూడా అప్పుడప్పుడూ సంచలనం రేపుతుంటాయి. అటువంటిదే తాజాగా ఒకటి బయటకొచ్చింది…

 

అంబానీ భారతదేశంలోనే అ్యతంత ధనికుడు. మరి ఆయన లైఫ్ స్టైల్ కూడా అందుకు తగ్గుట్టుగానే వుంటుంది కదా! ఆ మధ్య ఆయన ఇల్లు కట్టారు. ముంబైలోని ఆ మహల్ ధర 12వేల కోట్లు! మరోసారి 25కోట్లు పెట్టి కార్ కొన్నారు ముఖేష్ అంబానీ. ఇక ఆయన దగ్గర మొత్తం 160కార్లు వున్నాయని ఓ టాక్! అంతే కాదు… ఆ మధ్య ఓ సారి తన భార్య నీతా అంబానీకి ముఖేష్ బర్త్ డే గిఫ్ట్ గా ఏమిచ్చారో తెలుసుగా? షిప్ బహుమతిగా ఇచ్చారు! అవును… వందల కోట్ల విలువైన షిప్పును ముఖేష్ … నీతాకి బహుమానంగా ఇచ్చారు!

 

అంబానీల ఖరీదైన విలాసల గురించి ఇప్పుడు మరోసారి ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే … జియో బంపరాఫర్ కింద 15వందల రీఫండబుల్ అమౌంట్ తో 4జీ ఫోన్ ఉచితంగా ఇస్తోన్న ముఖేష్ అంబానీ … భార్య నీతా అంబానీకి ఏ రేంజ్ ఫోన్ కొన్నిచ్చాడో తెలుసా? మిసెస్ నీతా ముఖేష్ అంబానీ వాడుతోన్న ప్రస్తుత ఫోన్ ఖరీదు 312 కోట్లు! మీరు విన్నది కరెక్టే! అక్షరాలా 312కోట్లు విలువ చేసే ఫాల్కన్ సూపర్ నోవా ఐఫోన్6 పింక్ డైమండ్ ఫోన్ ఆమె వాడుతున్నారట! ఈ కాస్ ట్లీయస్ట్ ఫోన్ స్పెషల్ ఆర్డర్ మీద మాత్రమే తయారు చేస్తారు. పూర్తిగా బంగారంతో తయారైన నీతా అంబానీ ఫోన్ వెనుక భాగంలో పింక్ కలర్ డైమండ్ కూడా వుంటుంది! మరిక వజ్రం బంగారంలో పొదిగిన అంబానీల ఫోన్ 312కోట్లు ఖరీదు చేయటం… ఆశ్చర్యమేముంది?