‘తాత్కాలిక’ భవనాలంటే అర్థం ఇదయ్యా జగనూ...

జగన్ పార్టీ వాళ్ళు అమరావతి విషయంలో ఎప్పుడూ చేసే కామెంట్ ఒకటుంది.. అమరావతిలో తాత్కాలిక భవనాలు కట్టారు అనేది వాళ్ళు చేసే కామెంట్. ఇప్పుడు రుషికొండ ప్యాలెస్ భాగోతం బయటపడిన తర్వాత మళ్ళీ వైసీపీ పిశాచాలు అమరావతి తాత్కాలిక భవనాలు అనే రాగం ఎత్తుకున్నాయి. అమరావతిలో  అసెంబ్లీ గానీ, శాసనమండలి గానీ, సచివాలయం గానీ, హైకోర్టు గానీ, ఇతర భవనాలు గానీ తాత్కాలిక భవనాల్లో వున్నాయట. చంద్రబాబు నాయుడు అమరావతిలో తాత్కాలిక భవనాలే కట్టారు. మా జగనన్న మాత్ర రుషికొండ మీద అద్భుతమైన బిల్డింగ్స్ కట్టారు అని చెబుతూ ఆనందిస్తున్నారు. 

‘తాత్కాలిక’ అనే మాటకు వైసీపీ వాళ్ళు ఇస్తున్న నిర్వచనం ఏమిటంటే, ‘చంద్రబాబు తాత్కాలికంగా వుండే భవనాలు నిర్మించారు’ అని. కానీ ‘తాత్కాలిక’ అంటే అర్థం అది కాదు.. ‘అసెంబ్లీ తాత్కాలికంగా వుండే భవనం’, ‘శాసనమండలి తాత్కాలికంగా వుంటే భవనం’, ‘సెక్రటేరియట్ తాత్కాలికంగా వుండే భవనం’, ‘హైకోర్టు తాత్కాలికంగా వుండే భవనం’, ‘ఇతర కార్యాలయాలు తాత్కాలికంగా వుండే భవనాలు’. అంటే అసెంబ్లీ గానీ, హైకోర్టుగానీ, సెక్రటేరియట్ గానీ, ఇతర కార్యాలయాలు గానీ సదరు భవనాల్లో తాత్కాలికంగా వుంటాయి... వీటికి తర్వాత వేరే శాశ్వత భవనాలు నిర్మిస్తారు అని అర్థం. అంతేగానీ, ఇప్పుడు ఇవన్నీ ఉన్న భవనాలు రేకుల షెడ్డుల్లా తాత్కాలికంగా నిర్మించిన భవనాలు అని కాదు అర్థం. హైకోర్టు, సెక్రటేరియల్ లాంటివన్నీ శాశ్వత భవనాల్లోకి వెళ్ళిపోగానే, ఇప్పుడున్న ‘తాత్కాలిక’ భవనాలను ఇతర అవసరాలకు ‘పర్మినెంట్’గానే ఉపయోగించుకోవచ్చు. ‘తాత్కాలిక’ అనగానే అవేవో టార్పాలిన్ గుడారాల్లాగా తర్వాత తీసేయాల్సినవి కావు. అవి కూడా పక్కా భవనాలే.. పదికాలలపాటు నిలిచే భవనాలే. అందువల్ల ఈ ‘తాత్కాలిక’ అనే పదానికి అసలు అర్థాన్ని  వైసీపీ నాయకులు బాగా అర్థం చేసుకుంటే వాళ్ళ అజ్ఞానమే బయటపడకుండా వుంటుంది.