పిన్నెల్లి పిల్లి అరెస్ట్!

మాచర్ల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. మాచర్లలో పోలింగ్ సందర్బంగా ఈవీఎంలను ధ్వంసం చేయడం, అలా ధ్వంసం చేయడాన్ని అడ్డుకున్న వారి మీద దాడి చేసిన కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేశారు. ఆ తర్వాత అయన్ని పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయానికి తరలించారు. పిన్నెల్లిని మాచర్ల కోర్టులో హాజరుపరుస్తారు. పిన్నెల్లి గతంలో పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్లలను హైకోర్టు కొట్టివేయడంతో పిన్నెల్లిని పోలీసులు అరెస్టు చేశారు.