దీపాలు వెలిగె... పరదాలు తొలగె... సిట్యుయేషన్ భలే సింక్ అయింది గురూ!

తెలుగు సినిమా ‘పునర్జన్మ’లో ఒక చక్కటి పాట వుంది.. ఆ పాట ‘దీపాలు వెలిగె.. పరదాలు తొలగె..’ అంటూ సాగుతుంది. అప్పట్లో ఆ పాట సూపర్ హిట్ అయింది. ఆ పాట ఇప్పుడు విన్నా మనసుకు ఎంతో హాయిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఆ పాట మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, రాజధాని అమరావతికి కరెక్ట్.గా సింక్ అవుతోంది. ఈ ఎలక్షన్లలో చంద్రబాబు గెలిచి, ముఖ్యమంత్రి అయ్యాక అమరావతిలో దీపాలు దేదీప్యమానంగా వెలిగాయి.. ఇప్పటి వరకూ ముఖ్యమంత్రి పర్యటిస్తే ఎక్కడికక్కడ పరదాలు ప్రత్యక్షమయ్యేవి.. ఇప్పుడు ఆ పరదాలు కూడా తొలగిపోయాయి.. ఇక ఈ పరదాలు వేయడం, చెట్లు కొట్టేయడం లాంటివి ఆపేయాలని చంద్రబాబు చాలా సీరియస్‌గా అధికారులకు చెప్పారు. అందుకే, ‘దీపాలు వెలిగే.. పరదాలు తొలగె..’ అనే పాట ఇప్పుడు ఆంధ్రులున్న సిట్యుయేషన్‌కి చక్కగా సింక్ అవుతుంది.

అంతేకాదు.. ఈ పాట వున్న సినిమా టైటిల్ కూడా ఇప్పుడున్న పరిస్థితికి కరెక్టుగా సరిపోతుంది.. ఆ సినిమా పేరు ‘పునర్జన్మ’. నిజమే కదా... జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం పోవడంతో ఆంధ్రప్రదేశ్, అమరావతి పునర్జన్మ పొందాయి.