LATEST NEWS
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ గురువారం (ఏప్రిల్ 23)జరిగిన సంగతి తెలిసిందే. ఈ పోలింగ్ ఒక చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఓటర్లు భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. గణాంకాల ప్రకారం, రాష్ట్రంలో ఓటింగ్ శాతం 92 శాతాన్ని అధిగమించింది. ఇది బెంగాల్ ఎన్నికల చరిత్రలోనే అత్యధికం కావడం విశేషం. ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని ఈ భారీ ఓటింగ్ ప్రతిబింబిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
గురువారం (ఏప్రిల్ 23) జరిగిన మొదటి దశ ఎన్నికల్లో 152 నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహించారు. ఉదయం నుంచే ఓటర్లు ఉత్సాహంగా క్యూ లైన్లలో నిలబడ్డారు. తుది గణాంకాల ప్రకారం, ఓటింగ్ శాతం 92.03 శాతంగా నమోదైంది. ముఖ్యంగా దక్షిణ దినాజ్‌పూర్ జిల్లాలో అత్యధికంగా 94.98 శాతం ఓటింగ్ జరగగా, కూచ్ బెహార్‌లో 94.75 శాతం, బీర్భూమ్‌లో 93.88 శాతం ఓట్లు నమోదయ్యాయి. రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లోనూ 82 శాతానికి పైగా పోలింగ్ జరగడం విశేషం.
బెంగాల్ ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే, ఓటింగ్ శాతం క్రమంగా పెరుగుతూ వస్తోంది. 1969లో కేవలం 70 శాతంగా ఉన్న ఓటింగ్, 1987 నాటికి 78 శాతానికి చేరింది. ఆ తర్వాత 1996లో 80 శాతం, 2011లో 84 శాతంగా నమోదైంది. గత 2021 ఎన్నికల్లో 82 శాతానికి పరిమితమైన ఓటింగ్.. ఇప్పుడు 2026లో ఏకంగా 92 శాతాన్ని దాటి సరికొత్త రికార్డును సృష్టించింది.
ఈ భారీ ఓటింగ్ నమోదు కావడంలో కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న చర్యలు కూడా కీలకమని చెప్పవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2,400 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అక్కడక్కడా చిన్నపాటి ఘర్షణలు చోటుచేసుకున్నప్పటికీ.. పోలింగ్ ప్రక్రియ సాఫీగా సాగడం పట్ల ఎన్నికల ప్రధాన కమిషనర్ సంతృప్తి వ్యక్తం చేశారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో పోలింగ్ జరగడం వల్లే ప్రజలు ఇంత భారీగా తరలివచ్చారని అధికారులు భావిస్తున్నారు.
ఓటింగ్ శాతం భారీగా పెరగడంపై రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. అధికార తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ, ఇతర కూటములు ఈ రికార్డు స్థాయి పోలింగ్‌ను తమకు అనుకూలం అంటే తమకు అనుకూలమని విశ్లేషణలు చేస్తున్నారు. ఓటు హక్కును కాపాడుకోవడానికి ప్రజలు పెద్ద ఎత్తున స్పందించారని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొనగా, ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఓటర్ల ఉత్సాహాన్ని అభినందించారు. ముఖ్యంగా ఓటర్ల జాబితాలో జరిగిన మార్పులు, సిటిజన్‌షిప్ అంశాలు కూడా ప్రజలను చైతన్యపరిచినట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
మొదటి దశలో 1,478 మంది అభ్యర్థుల భవిష్యత్తు ఇప్పుడు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఏప్రిల్ 29న రెండో దశ పోలింగ్ జరగనుంది, మే 4న ఫలితాలు వెలువడనున్నాయి. మొదటి దశలో కనిపించిన ఈ ఉత్సాహం రెండో దశలోనూ కొనసాగుతుందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఎన్నికల ఫలితం బెంగాల్ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించడమే కాకుండా, దేశ రాజకీయాలపై కూడా బలమైన ముద్ర వేసే అవకాశం ఉందంటున్నారు.
తెలుగువన్ ‘వాస్తవ వేదిక’లో ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది. తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ సారథ్యంలో నిర్వహించిన ఈ చర్చలో ‘జమీన్ రైతు’ సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ పాల్గొని తాజా రాజకీయ పరిణామాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు.
మహిళా రిజర్వేషన్ల బిల్లు వాయిదా పడటం మహిళలను నిరుత్సాహానికి గురిచేస్తోందని రవిశంకర్ ప్రశ్నించారు. దీనికి స్పందించిన డోలేంద్ర ప్రసాద్, మహిళలకు నిరీక్షణ కొత్త విషయం కాదని, 1996లో మాజీ ప్రధాని దేవేగౌడ కాలం నుంచి ఈ అంశం పెండింగ్‌లోనే ఉందని గుర్తు చేశారు. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ పలుమార్లు ఈ బిల్లుకు మద్దతు తెలిపిందని, బీజేపీ మాత్రం ఇటీవలి కాలంలో ఒకసారి మద్దతు ప్రకటించిందని పేర్కొన్నారు.
ఆర్‌ఎస్‌ఎస్ భావజాలంలో మహిళలకు సమాన హక్కులపై స్పష్టత లేదని, వారు మనుస్మృతి సిద్ధాంతాలను అనుసరిస్తారని డోలేంద్ర ప్రసాద్ విమర్శించారు. మనుస్మృతిలో మహిళలకు సముచిత గౌరవం, హక్కులు లేవని, కుటుంబ పరిమితుల్లోనే వారి పాత్రను పరిమితం చేసినట్టు ఆయన అభిప్రాయపడ్డారు.
ఇటీవల లోక్‌సభలో ఆమోదం పొందిన 2023 మహిళా రిజర్వేషన్ల బిల్లు అమలులో ఆలస్యం జరుగుతుందని, 2034 వరకు అమలు అయ్యే అవకాశం లేదని ఆయన తెలిపారు. అలాగే డిలిమిటేషన్ ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనే ఆందోళన వ్యక్తం చేశారు.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు ఈ అంశంపై గట్టిగా స్పందించడం లేదని రవిశంకర్ ప్రశ్నించగా, చెన్నైలో డిలిమిటేషన్ వ్యతిరేకంగా నిర్వహించిన సమావేశానికి కేటీఆర్ హాజరై మద్దతు తెలిపారని డోలేంద్ర ప్రసాద్ వివరించారు.
కేంద్ర రాజకీయాలపై మాట్లాడిన ఆయన, ఒకప్పుడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి ఢిల్లీ రాజకీయాలను ధైర్యంగా ఎదుర్కొకున్నారని, ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదన్నారు. ప్రస్తుతం జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటి నేతలు ప్రధాని మోదీ ముందు ఒత్తిడికి లోనవుతున్నారని వ్యాఖ్యానించారు.
మహిళలకు రాజకీయ ప్రతినిధ్యం పెరిగితే వారి జీవితాల్లో మార్పు వస్తుందా అనే ప్రశ్నను రవిశంకర్ ముందుకు తెచ్చారు. ఇలాంటి ఆసక్తికర అంశాలపై కంఠంనేని రవిశంకర్, డోలేంద్ర ప్రసాద్‌ల మధ్య జరిగిన పూర్తి స్థాయి చర్చను తెలుగువన్ యూట్యూబ్ ఛానల్‌లో వీక్షించవచ్చు.
యువత తెలంగాణ జాగృతి పార్టీలో చేరాలని కవిత విన్నపం..
తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త చర్చ.
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు జగిత్యాల వేదికగా జరిగిన సభ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాజాగా జరిగిన ఒక రాజకీయ చేరికల సభను ఉద్దేశించి కవిత చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అసలు తెలంగాణలో యువత లేరా? లేక వారందరినీ విస్మరిస్తున్నారా? అంటూ ఆమె చేసిన ప్రశ్నలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
జగిత్యాలలో జీవన్ రెడ్డి చేరిక సభను ఉద్దేశించి కవిత తనదైన శైలిలో సెటైర్లు విసిరారు. 75 ఏళ్ల వయసున్న నేతలను నవ యువకులుగా పేర్కొంటూ, వారే రాష్ట్రానికి దిక్కు అని చెప్పడం ఏంటని ఆమె నిలదీశారు. రాజకీయాల్లో వయసు మళ్లిన నాయకులనే పదే పదే తెరపైకి తీసుకురావడం యువత ఆకాంక్షలను అవమానించడమేనని ఆమె అభిప్రాయపడ్డారు.
పదవుల కోసం, రాజకీయ లబ్ధి కోసం యువతను కాదని, సీనియర్లకే ప్రాధాన్యత ఇవ్వడం సమంజసమేనా అని ఆమె ప్రశ్నించారు. ఈ తరహా రాజకీయాలు యువత భవిష్యత్తును అంధకారంలోకి నెట్టడమేనని, ఇప్పటికైనా పార్టీలు యువతకు సరైన వేదిక కల్పించాలని ఆమె సూచించారు. కవిత చేసిన ఈ వ్యాఖ్యలు పరోక్షంగా తన సొంత పార్టీ నాయకత్వంపైనా ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
మరోవైపు, బీఆర్ఎస్ పార్టీపై కూడా కవిత తీవ్ర విమర్శలు చేశారు. ఆ పార్టీలో మహిళలకు సరైన గౌరవం లేదని, స్వార్థపూరిత నిర్ణయాల వల్లే పార్టీ ఇప్పుడు ఈ స్థితికి చేరుకుందని ఆమె ఆరోపించారు. బీఆర్‌ఎస్ కేసీఆర్ చుట్టూ ఉన్న కొందరు స్వార్థపరుల వల్లే ఉద్యమకారులకు అన్యాయం జరిగిందని ఆమె విశ్లేషించారు. ఓటమికి కార్యకర్తలను, ప్రజలను నిందించడం సరైన పద్ధతి కాదని ఆమె హితవు పలికారు.
సీఎం రేవంత్ రెడ్డిపై కూడా ఆమె తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజకీయ డీల్స్ కోసం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని, ప్రతిపక్షం లేకుండా చేయాలని చూడటం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆమె పేర్కొన్నారు. కోర్టు తీర్పుల విషయంలో సీఎం వ్యాఖ్యలు సరికాదని ఆమె మండిపడ్డారు.
రాష్ట్రంలో రెండు ప్రధాన పార్టీలు కేవలం అధికార ప్రదర్శనలకే పరిమితం కాకుండా, ప్రజల సమస్యలపై దృష్టి సారించాలని కవిత కోరారు. రాబోయే కాలంలో కొత్త తరహా రాజకీయాలతో ప్రజల ముందుకు వస్తున్నానని, తనను ఆశీర్వదించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. రాజకీయాల్లో యువతకు భాగస్వామ్యం పెరిగితేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
ALSO ON TELUGUONE N E W S
కామెడీ అనగానే మనకు గుర్తొచ్చే మొదటి పేరు బ్రహ్మానందం (Brahmanandam). ఆయన ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించినప్పటికీ, 'వెంకీ' (Venky) సినిమాలోని 'గజాలా' పాత్ర మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమే. శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ, స్నేహ ప్రధాన పాత్రల్లో నటించిన 'వెంకీ' సినిమా 2004లో విడుదలై, టాలీవుడ్ లో ఒక 'కల్ట్ క్లాసిక్' కామెడీగా నిలిచిపోయింది. ముఖ్యంగా రైలు ప్రయాణంలో బ్రహ్మానందం, రవితేజ బృందం మధ్య జరిగే సన్నివేశాలు ఇప్పటికీ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూనే ఉంటాయి. శ్రీను వైట్ల మార్క్ కామెడీ, రవితేజ టైమింగ్, బ్రహ్మానందం అమాయకపు బిల్డప్స్ అన్నీ కలిసి ఈ సినిమాను ఒక ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజీగా మార్చేశాయి.
అండర్ వేర్ కే దిక్కులేదు.. సాఫ్ట్ వేర్ ఏంటి?
ఈ సినిమాలో బ్రహ్మానందం తనను తాను ఒక పెద్ద సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా పరిచయం చేసుకుంటారు. "హలో.. నేను గజాలా.. సాఫ్ట్ వేర్ ఇంజనీర్" అంటూ ఆయన ఇచ్చే బిల్డప్ చూసి రవితేజ అండ్ గ్యాంగ్ ఆయనను ఆటపట్టించడం మొదలుపెడతారు. ముఖ్యంగా ట్రైన్ కంపార్ట్‌మెంట్‌లో జరిగే సన్నివేశాల్లో, రవితేజ బృందం బ్రహ్మానందంతో పాటలు పాడించడం, డ్యాన్స్ చేయించడం వంటివి హైలైట్‌గా నిలుస్తాయి. "అండర్ వేర్ కే దిక్కు లేదు.. సాఫ్ట్ వేర్ ఎక్కడ ఉంది సార్?" అనే డైలాగ్ నేటికీ సోషల్ మీడియాలో మీమ్స్ రూపంలో వైరల్ అవుతూనే ఉంటుంది.
గజాలా బిల్డప్స్ - రవితేజ కౌంటర్లు
రైలులో ప్రయాణిస్తున్నప్పుడు తోటి ప్రయాణికులను తన హోదాతో ఆకట్టుకోవాలని చూసే గజాలాను, రవితేజ అండ్ ఫ్రెండ్స్ ఎలా బురిడీ కొట్టించారో చూస్తే నవ్వు ఆగదు. బ్రహ్మానందం పాటలు పాడే సన్నివేశాలు, తన సాఫ్ట్ వేర్ కంపెనీ గురించి గొప్పలు చెప్పుకోవడం, చివరకు అసలు విషయం బయటపడినప్పుడు ఆయన పడే పాట్లు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. గజాలా పాత్రలోని అమాయకత్వం, అతి తెలివి రెండూ కలిపి బ్రహ్మానందం తన నటనతో పండించారు.
శ్రీను వైట్ల దర్శకత్వ ప్రతిభకు, రవితేజ ఎనర్జీకి బ్రహ్మానందం హాస్యం తోడవ్వడంతో 'వెంకీ' సినిమా ఒక ఆల్‌టైమ్ ఫేవరెట్ కామెడీ మూవీగా నిలిచింది. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని ఈ కామెడీ సీన్స్, తెలుగు సినీ ప్రేక్షకులకు ఎప్పటికీ ఒక మధుర జ్ఞాపకం. మీరు కూడా గజాలా నవ్వుల విందును మరోసారి ఆస్వాదించాలనుకుంటే 'తెలుగువన్' యూట్యూబ్ ఛానల్ లో ఈ అద్భుతమైన సన్నివేశాలను చూడవచ్చు.
ఇలాంటి మరిన్ని అద్భుతమైన సన్నివేశాలు, సినిమాల కోసం మా 'తెలుగువన్' (TeluguOne) యూట్యూబ్ ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
సెల్యులాయిడ్ పై పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran)చేసే మెస్మరైజ్ ని చూడాలంటే పెట్టి పుట్టాలనే సామెత చాలా బలంగానే ఉంది. అందుకు తగ్గట్టే ఆయన కూడా సెల్యులాయిడ్ ని గౌరవిస్తూ హీరోగానే కాకుండా ముఖ్యమైన క్యారెక్టర్స్ చేస్తూ వస్తున్నాడు. ఈ కోవలోనే సలార్ లో వరదరాజ్ మన్నార్ గా మెప్పించగా ప్రస్తుతం మహేష్, రాజమౌళిల వారణాసిలో 'కుంభ' గా చేస్తున్నాడు. రీసెంట్ గా పృథ్వీ రాజ్ కి సంబంధించిన న్యూస్ ఒకటి ఫ్యాన్స్ లో జోష్ తెప్పిస్తుంది.
'ఖలీఫా'(khalifa)..పృథ్వీరాజ్ చేస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్. 'అమీర్ అలీ' అనే పవర్‌ఫుల్ గ్యాంగ్ స్టర్ రోల్ లో కనిపిస్తున్నాడు. ప్రతీకారం బంగారంతో రాయబడుతుందనే టాగ్ లైన్ అయితే మూవీపై అంచనాలని పెంచుతుంది. దుబాయ్ మరియు కేరళ నేపథ్యంలో సాగే క్రైమ్ డ్రామా. రీసెంట్ గా ఖలీఫా టీం రిలీజ్ డేట్ ని ప్రకటించింది. ఆగస్టు 20, 2026న 'ఓనమ్' పండుగ కానుకగా థియేటర్స్ లో అడుగుపెడుతుంది.
Also read: Sreeleela: శ్రీలీల ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన దర్శకుడు.. ఎందుకిలా చేస్తున్నారు
పృథ్వీరాజ్ ఈ మూవీలో రిచ్ మరియు డామినేటింగ్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజైన లుక్ ఈ విషయాన్నీ చాలా స్పష్టంగా చెప్తుంది. వైశాఖ్(Vysakh)దర్శకత్వం వహిస్తుండగా గతంలో పృథ్వీరాజ్‌తో 'మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్' నేపథ్యంలో 'మల్లూ సింగ్' వంటి సినిమాలు చేసిన అనుభవం ఈయనకు ఉంది. ఇక ఈ చిత్రానికి ఉన్న అతి పెద్ద స్పెషల్ సూపర్ స్టార్ మోహన్ లాల్ గారు గెస్ట్ రోల్ లో కనిపించడం. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తుండగా, జిను వి. అబ్రహం కథని అందించారు.
మహానటుడు, కారణజన్ముడు ఎన్టీఆర్(Ntr)సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళే అని చెప్పినట్టుగా సినీ తారలకి సిల్వర్ స్క్రీన్ నే దేవాలయం. అభిమానులు, ప్రేక్షకులే దేవుళ్ళు. మరి ముఖ్యంగా అభిమానులు అయితే ఏ స్వార్ధం లేకుండా తమ అభిమాన తార మరింత ఉన్నత స్థితికి ఎదగాలని కోరుకుంటారు. నిద్రలో కూడా అదే ధ్యాస. అందుకే వాళ్ళు అభిమానులు. రీసెంట్ గా శ్రీలీల(Sreeleela)విషయంలో వాళ్లంతా డల్ గా ఉన్నారు. పూర్తి మ్యాటర్ ఏంటో చూద్దాం.
శ్రీలీల బాలీవుడ్ లో వరుస విజయాలతో స్టార్ స్టేటస్ ని కైవసం చేసుకున్న కార్తీక్ ఆర్యన్(Kartik Aaryan)తో ఒక భారీ మ్యూజికల్ లవ్ స్టోరీ చేస్తున్న విషయం తెలిసిందే .లెజండ్రీ దర్శకుడు అనురాగ్ బసు(Anurag Basu)తెరకెక్కిస్తున్నాడు. రీసెంట్ గా ఆయన మాట్లాడుతు మా మూవీ షూటింగ్ ని కంప్లీట్ చేసుకుందనే వార్తలు వస్తున్నాయి. అదంతా అపోహ మాత్రమే. షూటింగ్ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. నలభై ఐదు రోజులకి మించి పని చెయ్యలేదు. అందుకు పలు కారణాలు ఉన్నాయి. రీసెంట్ గా కాశ్మీర్ లో షెడ్యూల్ ని స్టార్ట్ చేసాం. షూటింగ్ పూర్తి కావడానికి ఇంకా చాలా టైం పడుతుందని చెప్పాడు. ఇప్పుడు ఈ మాటలు శ్రీలీల ఫ్యాన్స్ ని షాక్ కి గురి చేస్తున్నాయి. మరి అభిమానులకి శ్రీలీలని బాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ పై చూడటానికి మోక్షం ఎప్పుడు లభిస్తుందో చూడాలి.
Also read: Ajith: తమిళనాడు నో చేంజ్ అని చెప్పిన అజిత్!.. విజయ్ ఫ్యాన్స్ ఆగ్రహం
డేవిడ్ ధావన్ దర్శకత్వంలో వరుణ్ ధావన్ హీరోగా రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్‌లో శ్రీలీల హీరోయిన్‌గా ఎంపికైంది సైఫ్ అలీ ఖాన్ తనయుడు ఇబ్రహీం అలీ ఖాన్ సరసన కూడా శ్రీలీల చెయ్యబోతుందనే న్యూస్ చాలా రోజుల నుంచే వినిపిస్తోంది.
ఇందుగలడందులేడని సందేహము వలదు తండ్రి నారాయణుడు అన్ని చోట్ల ఉన్నాడని అన్నట్టుగా ఒక హీరో అంటే గిట్టని మరో హీరో అభిమానులు అన్ని చోట్లా ఉంటారు. తమిళనాడులో అయితే మరి ఎక్కువ. ఎవరి ప్రాపర్టీ ఎవరు లాక్కోకపోయినా ద్వేషం అనేది మాత్రం కామన్. ఈ ప్రాసెస్ లో వాస్తవాన్ని కూడా ఆలోచించలేరు. అలాంటి ఒక వాస్తవాన్ని ఆలోచించకుండానే విజయ్ ఫ్యాన్స్ అజిత్ పై నోరు పారేసుంటున్నారు. దీంతో అజిత్ టీం వివరణ ఇచ్చింది. పూర్తి మ్యాటర్ చూద్దాం.
నిన్న జరిగిన తమిళనాడు ఎన్నికల్లో అజిత్(Ajith)తన ఓటు హక్కుని వినియోగించుకున్నాడు. అజిత్ ని చుట్టూ ముట్టిన విలేకర్లు' తమిళనాడులో 'మార్పు తద్యమా' అని అడిగారు. నో నెవర్ అని చెప్పి వెళ్ళిపోయాడు. ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో విజయ్(VIjay)అభిమానులు పలు చోట్ల అజిత్ కి వ్యతిరేకంగా నినాదాలు చేసారు . దీంతో పరిస్థితిని గమనించిన అజిత్ మేనేజర్ నో నెవర్ వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ అజిత్ గారు నో నెవర్ అనే ఆన్సర్ ని మార్పు తద్యమా అనే ప్రశ్నకి చెప్పలేదు. వేరే ప్రశ్నకి ఇప్పుడు వద్దు అని వారిస్తూ ఇంగ్లీష్ లో చెప్పాడని తెలియచేసాడు. దీంతో విజయ్ అభిమానులు శాంతించారు.
Also read: D4vd: ప్రముఖ సింగర్ డిక్కీలో 14 ఏళ్ల బాలిక శవం.. నాలుగు నెలల పాటు కారులోనే
విజయ్,అజిత్ తమిళ సినీ పరిశ్రమకి రెండు కళ్ళు. ఆ ఇద్దరి మధ్య వృత్తిపరమైన పోటీ ఉన్నప్పటికీ, వ్యక్తిగతంగా మంచి స్నేహితులు. ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో అజిత్ మాట్లాడుతు విజయ్ తన జీవితంలో తీసుకున్న నిర్ణయాలను నేను గౌరవిస్తానని చెప్పుకొచ్చాడు. అసలు విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పటి నుండి, అజిత్ అభిమానులు కూడా ఆయనకు మద్దతు ఇస్తారనే వార్తలు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారమయ్యాయి. గతంలో విజయ్ రాజకీయ సభల్లో కొందరు అజిత్ అభిమానులు కనిపించడం ఆ వార్తలకి మరింత బలాన్ని చేకూర్చింది. అయితే అజిత్ టీమ్ ఆ వార్తలపై స్పందిస్తు ఏ రాజకీయ పార్టీకి అజిత్ మద్దతు తెలపడం లేదు, అయన పేరు, ఫోటోలని ఏ రాజకీయ వేదికపై వాడకూడదని ఒక నోట్ రిలీజ్ చేసారు.
సూపర్‌స్టార్ రజనీకాంత్ ( Rajinikanth) ప్రస్తుతం 'జైలర్ 2'తో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత చేయనున్న తన 173వ సినిమా (Thalaivar 173) విషయంలో కూడా ఆయన ఒక కీలక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా ఈ సినిమా దర్శకుడి విషయంలో జరుగుతున్న సస్పెన్స్‌కు ఎట్టకేలకు తెరపడింది.
మొదట ఈ చిత్రాన్ని కమల్ హాసన్ నిర్మాణంలో, సుందర్ సి దర్శకత్వంలో తెరకెక్కించనున్నట్లు ప్రకటించారు. కానీ, ఏవో కారణాల వల్ల సుందర్ సి ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. ఆ తర్వాత శిబి చక్రవర్తిను దర్శకుడిగా ప్రకటించారు. ఇటీవల మళ్ళీ దర్శకుడు మారాడు అంటూ అనూహ్యంగా 'డ్రాగన్' ఫేమ్ అశ్వత్ మారిముత్తు పేరు తెరపైకి వచ్చింది. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ భారీ ప్రాజెక్టును పట్టాలెక్కించే బాధ్యతను శిబి చక్రవర్తికే అప్పగించినట్లు సమాచారం. అంటే ఈ ప్రాజెక్ట్ అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ శిబి చక్రవర్తి చేతికే వచ్చింది అన్నమాట.
శిబి చక్రవర్తి గతంలో 'డాన్' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రజనీకాంత్ ఇమేజ్‌కు తగ్గట్టుగా ఒక పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌ను ఆయన సిద్ధం చేశారట. ఇప్పటికే రజనీకాంత్ కోసం దాదాపు 80కి పైగా విభిన్నమైన గెటప్స్, లుక్ టెస్టులు కూడా జరిగినట్లు ఫిల్మ్ నగర్ టాక్. ఇటీవల బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన 'ధురంధర్' తరహాలో సరికొత్త మాస్ ఫార్ములాతో ఈ సినిమా ఉండబోతోందని సమాచారం.
ఈ ప్రాజెక్టుకు సంబంధించి అన్ని పనులు చకచకా జరుగుతున్నప్పటికీ, డైరెక్టర్ ఎవరనే దానిపై చిత్ర యూనిట్ నుండి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం రజనీకాంత్ 'జైలర్ 2' (Jailer 2) పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఇటీవలే షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. 'జైలర్ 2' విడుదల సమయానికి 'తలైవర్ 173'పై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశముంది.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు.
టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.
జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి.
చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది.
"ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు.
సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు.
గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.
*నిశ్శబ్ద.
ఏదయినా ఒక వస్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధగా వుంటుంది. ఎంతో ఇష్టపడి కొనుక్కున్న వస్తువు చేజారి పడి పగిలిపోయినా, దొంగతనం జరిగినా, ఎక్కడో మర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొందలేమని దిగులు పట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్టమయిన పెయింటింగ్ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో దూరమయింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడగలి గింది.
అదంటే మరి ఆమెకు ప్రాణ సమానం. చాలా కాలం దొరుకుతుందని, తర్వాత ఇక దొరకదేమో అనీ ఎంతో బాధపడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గతేడాది ఆమెను చేరింది. ఆమెది నెదర్లాండ్స్. ఆమె తండ్రి నెదర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్నపిల్లల ఆస్పత్రి డైరెక్టర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విషయానికి వస్తే.. అది 1683లో కాస్పర్ నెషర్ వేసిన స్టీవెన్ ఓల్టర్స్ పెయింటింగ్.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాజీల ఆదేశాలను చార్లెట్ తండ్రి వ్యతిరేకించారు. ఆయన రహస్య జీవనం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం తన నగరంలోని ఒక బ్యాంక్‌లో భద్ర పరచమని ఇచ్చారట. 1940లో నాజీలు నెదర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద పడి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన తర్వాత ఈ పెయింటింగ్ ఎక్కడున్నదీ ఎవరికీ తెలియలేదు. చిత్రంగా 1950ల్లో డసల్‌డార్ష్ ఆర్ట్ గ్యాలరీలో అది ప్రత్యక్షమయింది. 1969లో ఆమ్‌స్టర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాలరీలో వుందని చూసినవారు చెప్పారు. వేలంపాట తర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక కళాపిపాసి తన దగ్గర పెట్టుకున్నాడు. ఆ తర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.
మొత్తానికి వూహించని విధంగా ఎంతో కాలం దూరమయిన గొప్ప కళాఖండం తిరిగి తన వద్దకు చేరడంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే కదా.. పోయిందనుకున్న గొప్ప వస్తువు తిరిగి చేరితే ఆ ఆనందమే వేరు! అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భద్రంగా చూసుకునే ఆసక్తి వున్నప్పటికీ శక్తి సామర్ధ్యాలు లేవు. అందుకనే త్వరలో ఎవరికయినా అమ్మేసీ వచ్చిన సొమ్మును పిల్లలకు పంచుదామనుకుంటోందిట! చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్నదమ్ములు అక్కచెల్లెళ్లు వున్నారు. అలాగే ఇరవై మంది పిల్లలు ఉన్నారు. అందరూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అందరం ఒకే కుటుంబం, చాలాకాలం తర్వాత ఇల్లు చేరిన కళాఖండం మా కుటుంబానిది అన్నది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు.
చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్ విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది.
ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.
అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి 15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్ పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు.
అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో, ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది.
మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన వాగ్దానాన్ని గుర్తు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్-హైదరాబాద్-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.
అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు ఒకే సారి ఆయన మీద విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.
రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .
దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అరవింద్ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.
ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు. వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు ఎవరికి పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .
వేసవి కాలం వచ్చిందంచే సాధారణ టేబుల్ ఫ్యాన్ లు, సీలింగ్ ఫ్యాన్ లు సరిపోవు. వీటి నుండి వచ్చే గాలి వేసవి వేడిని కంట్రోల్ చేయలేవు. పైగా వేసవి వేడి గాలిని తిప్పి, తిప్పి గది మొత్తం వేడిగా మార్చేస్తాయి. ఈ కారణంగానే ఇప్పట్లో ప్రతి ఇంట్లో కూలర్లు వాడుతున్నారు. కాస్త అర్థిక స్థితి ఉన్నవారేతై ఏసీ లు కూడా పెట్టించుకుంటారు. కానీ రానురాను పెరుగుతున్న ఎండలు, వాటి తాలుకూ వేడి కారణంగా కూలర్లు కూడా సరిపోవడం లేదని అనుకుంటూ ఉంటారు. కానీ.. సాధారణ కూలర్ ను కూడా చక్కగా ఏసీ లాంటి చల్లదనం ఇచ్చేలా చేయవచ్చు. ఇందుకోసం కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. సాధారణ కూలర్ తో ఏసీ లాంటి చల్లదనం కావాలంటే.. ఏ చిట్కాలు పాటించాలో తెలుసుకుంటే..
సాల్ట్ , ఐస్..
కూలర్ చల్లటి గాలిని అందించాలని అనుకుంటే, ఐస్ లేదా ఉప్పు నీటిని కలపడం చాలా ప్రభావవంతమైన పద్ధతి. ఇది చాలా ఫేమస్ చిట్కా కూడా. కూలర్ ట్యాంకులో రాళ్ల ఉప్పు, ఐస్ క్యూబ్స్ వేస్తారు. రాళ్ల ఉప్పు ఐస్ క్యూబ్స్ కరగకుండా ఎక్కువ సేపు ఉండేలా చేస్తాయి. దీని వల్ల కూలింగ్ బాగా వస్తుంది. అయితే.. ఇది రెగ్యులర్ గా చేయడం మంచిది కాదు.. ఉప్పు తొందరగా చిలుము పట్టేలా చేస్తుంది. దీని వల్ల కూలర్ లోని మెటల్ భాగాలు తొందరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని ఎప్పుడైనా వేడి భరించలేని సమయాల్లో ట్రై చేయడం మంచిది.
వెంటిలేషన్..
చాలా మంది ఏసీ లాంటి చల్లదనం వస్తుందని ఆశించి, కూలర్లను మూసి ఉన్న గదులలో వాడుతుంటారు, కానీ ఇది పెద్ద పొరపాటు. సరైన వెంటిలేషన్ ఉన్నప్పుడే ఎయిర్ కూలర్ సరిగ్గా పనిచేస్తుంది. గదిలో వేడి గాలి బయటకు పోవడానికి , చల్లని గాలి లోపల ప్రసరించడానికి వీలుగా ఒక కిటికీని లేదా తలుపును తెరిచి ఉంచడం ముఖ్యం. సరైన వెంటిలేషన్ కూలర్ పనితీరును మెరుగుపరుస్తుంది.
శుభ్రత..
కాలక్రమేణా కూలర్ ప్యాడ్‌లపై దుమ్ము, ధూళి పేరుకుపోయి, వాటి కూలింగ్ సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. అందువల్ల వాటిని క్రమం తప్పకుండా శుభ్రపరచడం లేదా మార్చడం ముఖ్యం. కూలర్ చాలా చల్లని గాలిని ఇవ్వాలి అంటే.. కూలర్ లోపల వట్టివేర్లతో తయారు చేసిన మ్యాట్లను ఉపయోగించాలి. ఇది కూలింగ్ ను మెరుగుపరుస్తుంది. వట్టివేర్ల గుండా నీరు ప్రవహించినప్పుడు, గాలి చల్లగా, తాజాగా మారుతుంది, మంచి తేలికపాటి సువాసనను కూడా అందిస్తుంది.
పైన పేర్కొన్న చిట్కాలను పాటించడం వల్ల వేసవి కాలంలో కూలర్ ఏసీ లాంటి చల్లదనాన్నిఇస్తుంది.
*రూపశ్రీ.
పెళ్లి... ఎన్నో రొమాంటిక్ ఆలోచనలను గుర్తుకు తెచ్చే ఒక అందమైన పదం. బయటకు వెళ్లడం, లాంగ్ డ్రైవ్‌లకు వెళ్లడం, ఖరీదైన బహుమతులు ఇచ్చుకోవడం.. వీటితో పాటు కాస్త ఆర్థికంగా బాగున్నవారైతే.. హనీమూన్ కు కూడా వెళ్తారు. పెళ్లయిన మొదట్లో.. కొన్ని నెలలు ఎంతో అద్బులంలా.. అంతా పరిపూర్ణంగా, సంతోషంగా ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ హనీమూన్ అయిపోయాక లేదా పెళ్లైన రెండు మూడు నెలల తర్వాత.. అసలైన లైఫ్ మొదలవుతుంది. ఇక్కడే అందరూ ఊహించుకునే పెళ్లి జీవితానికి, వాస్తవానికి మధ్య చాలా తేడా ఉందని తెలుసుకుంటారు. అసలు అంగీకరించలేని ఎన్నో విషయాలు బయటపడుతుంటాయి, ఊహించుకున్న జీవితం చాలా రివర్స్ గా, డిజప్పాయింట్ గా అనిపిస్తుంది. పెళ్లి తర్వాత అర్థమయ్యే చేదు నిజాలు కొన్ని ఉన్నాయి. పెళ్ళి తర్వాత జీవితం గురించి కలలు కనే ప్రతి ఒక్కరూ, పెళ్లి తర్వాత జీవితాన్ని సినిమాటిక్ గా ఊహించుకునే ప్రతి ఒక్కరూ ఆ చేదు నిజాలను తెలుసుకోవాలి. దీని వల్ల పెళ్లి తర్వాత వారు డిజప్పాయింట్ అయ్యే పరిస్థితి ఎదురవ్వదు. ఆ చేదు నిజాలు ఏంటో తెలుసుకుంటే..
ప్రేమ అంటే..
పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత కొన్ని రోజుల పాటు ప్రేమ అంటే ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ, పొగడ్తలు చెప్పుకోవడమే అనుకుంటారు. నిజానికి చాలామందికి మొదట్లో అవే జరుగుతుంటాయి. కానీ పెళ్లైన రెండు మూడు నెలల తర్వాత సాధారణ జీవితానికి తిరిగి వచ్చినప్పుడు, ప్రేమలో సరుకులు కొనడం, కరెంటు బిల్లు కట్టడం, బాధ్యతలు పంచుకోవడం కూడా ఉంటాయని మీరు గ్రహిస్తారు. బయటకు వెళ్లి క్యాండిల్ లైట్ డిన్నర్ చేయాలని అనుకునేవారు.. పెళ్లైన కొన్ని నెలల తర్వాత.. ఈరోజు రాత్రి భోజనానికి ఏం వండాలి అని ఆలోచిస్తూ ఉంటారు. పెళ్లి తర్వాత ప్రేమ అంటే కేవలం బెడ్ రూమ్ ముచ్చట కాదు.. అది ఇద్దరూ కలిసి బాధ్యతలు పంచుకోవడంలో కూడా ఉంటుంది.
పర్పెక్ట్ లైఫ్ పార్టనర్..
పెళ్లికి ముందు కేవలం మాట్లాడుకుంటూ ఉండటం వల్ల తమకు బెస్ట్ పార్ట్నర్ లభించారని అనుకుంటారు. కానీ పెళ్ళి తర్వాత ఒకే ఇంట్లో కలిసి జీవించడం మనిషిలో నిజ స్వభావాన్ని బయటపెడుతుంది. మనిషి అలవాట్లు, మాటలు, రోజువారీ ప్రవర్తన, కొన్నిసార్లు అతిగా రియాక్ట్ అవ్వడం, కోపం చేసుకోవడం, వాగ్వాదం ఇవన్నీ పెళ్లి తర్వాత ఉంటాయి. ఇవన్నీ పర్పెక్ట్ అనే ట్యాగ్ ను చెరిపేస్తాయి. అయితే.. అందరూ ఒప్పుకోవాల్సన నిజం ఏమిటంటే.. ఎవరూ కంప్లీట్ గా పర్పెక్ట్ గా ఉండరు. ప్రతి ఒక్కరికీ బలాలు ఉంటాయి, బలహీనతలు ఉంటాయి. రెండింటినీ అంగీకరించాలి.
గొడవలు..
పెళ్లి తర్వాత గొడవ పడని భార్యాభర్తలు ఎక్కడా ఉండరు. గొడవ పడని భార్యాభర్తలు ఉన్నారని అనుకోవడం కూడా చాలా పొరపాటు. విభిన్న మనస్తత్వాలు గల ఇద్దరు వ్యక్తులు కలిసి నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెట్టినప్పుడు అభిప్రాయ భేదాలు రావడం సర్వసాధారణం. టీవీ రిమోట్ దగ్గర నుండి మొదలుకుని ఎన్నో విషయాలలో భార్యాభర్తల మధ్య గొడవలు వస్తూనే ఉంటాయి. చిన్న చిన్న విషయాలపై వాదనలు ప్రతి వైవాహిక జీవితంలో ఒక భాగమే.
డబ్బు..
ప్రేమకు దాని స్థానం ఉంది, అలాగే డబ్బుకు దాని స్థానం ఉంది. పెళ్లి తర్వాత, ఇంటి బడ్జెట్‌ను రూపొందించుకోవడం, ఖర్చులను నిర్వహించుకోవడం, పొదుపు గురించి ఆలోచించడం వంటివి చాలా కీలకమవుతాయి. పెళ్లి తర్వాత దంపతులు తమ ఆర్థిక ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయిందని గ్రహిస్తారు. కొందరు పొదుపు చేయాలనుకుంటే, మరికొందరు ఖర్చు చేయాలనుకుంటారు. మరీ ముఖ్యంగా భార్యాభర్తలు ఇద్దరూ సంపాదనా పరులైతే.. ఇద్దరి సంపాదన మీద ఒక్కరే అధికారం చూపించడం వంటి పరిస్థితులు ఎదురైతే.. అది వారి బంధంలో పెద్ద చీలికకు దారితీయవచ్చు. కాబట్టి వివాహం తర్వాత డబ్బు గురించి మాట్లాడటం మంచిదే కానీ.. డబ్బు కోసం బంధాన్ని విచ్చిన్నం చేయకూడదు.
పర్సనల్ స్పేస్..
పెళ్లికి ముందు స్నేహితులతో మాట్లాడటం నుండి, స్నేహితులతో కలిసి బయటకు వెళ్లడం వరకు పూర్తిగా స్వేచ్ఛగా ఉంటారు. కానీ పెళ్లి తర్వాత మారిపోతుంది. ప్రతి విషయంలోనూ భాగస్వామిని కలుపుకోవాలి, వారి సౌకర్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. కొన్నిసార్లు తమకోసం , స్నేహితుల కోసం సమయాన్ని కేటాయించడం కూడా ఇబ్బందిగా ఉంటుంది.
పైన చెప్పుకున్న విషయాలు చాలా సాధారణమైనవి. కానీ..పెళ్లికి ముందు చాలా జంటలు ఈ విషయాలలోనే ఊహించని అంచనాలు పెట్టుకుని, పెళ్లి తర్వాత చాలా డిజప్పాయింట్ అవుతారు. కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.
*రూపశ్రీ.
ఈ కాలంలో మందు బిళ్లలు మింగకుండా ఒక్కరు కూడా ఉండటం లేదు. పాపం చిన్న పిల్లలు సైతం టాబ్లెట్లు మింగాల్సిన పరిస్థితి వస్తోంది. చాలా మాత్రల మధ్యలో ఒక సన్నని గీత ఉంటుంది. కొన్ని మాత్రలకు ఇది ఉండదు, కానీ చాలా మందులకు ఉంటుంది. ఈ టాబ్లెట్ల మీద గీత చూసిన చాలామంది ఇది ఒక డిజైన్ అని అనుకుంటారు, కానీ ఈ గీత వెనుక పెద్ద కథే ఉంది.. వైద్య పరిభాషలో, ఈ గీతను స్కోర్ లైన్ అంటారు. మందును సమాన భాగాలుగా విభజించడానికి ఈ గీతను రూపొందిస్తారని నిపుణులు చెబుతున్నారు. టాబ్లెట్స్ పైన ఈ గీతలు ఎందుకు ఉంటాయి. ఫార్మా కంపెనీలు ఇలా టాబ్లెట్ల మీద గీతలు ఉంచడం వెనుక కారణం ఏంటి? వివరంగా తెలుసుకుంటే..
టాబ్లెట్ల మీద గీత..
నిపుణుల అభిప్రాయం ప్రకారం, కొన్ని మాత్రలపై ఉండే గీత మందును సమాన భాగాలుగా విడగొట్టడానికి సహాయపడుతుంది, తద్వారా రోగులు సులభంగా సగం మాత్రను తీసుకోవచ్చు. వైద్యులు తరచుగా సగం మాత్ర మోతాదును కూడా సూచిస్తారు. ఈ గీత మాత్రను సగానికి విరవడాన్ని సులభతరం చేస్తుంది. రోగికి సరైన మోతాదు అందేలా చూసుకోవడానికి, మాత్రను తయారుచేసేటప్పుడు ఈ గీత వచ్చేలా చేస్తారట.
గీతలు లేని టాబ్లెట్లు..
మందుపై గీత లేని మాత్రలు. అంటే, టాబ్లెట్ల పై గీత లేకపోతే ఆ మాత్రను విరవకూడదట. లేకపోతే, దాని ప్రభావం తగ్గిపోవచ్చట. కొన్ని మందులకు ఎంటెరిక్ కోటింగ్ లేదా సస్టెయిన్డ్ రిలీజ్ వంటివి ఉంటాయని, వాటిని విరిస్తే టాబ్లెట్ల ప్రభావం మారవచ్చని వైద్యులు చెబుతున్నారు. అందుకే గీత లేని టాబ్లెట్లను విరవడం వల్ల దుష్ప్రభావాల ప్రమాదం పెరగవచ్చని అంటున్నారు.
డిజైన్ మాత్రం కాదు..
నిపుణుల అభిప్రాయం ప్రకారం, టాబ్లెట్ మధ్యలో ఉండే గీత కేవలం డిజైన్ కోసం పెట్టేది కాదు. అది టాబ్లెట్ డోస్ తీసుకోవడానికి సహాయపడుతుంది. ఆ గీత టాబ్లెట్‌ను సులభంగా విరవడానికి వీలు కల్పిస్తుంది. టాబ్లెట్ లో సగం డోసు తీసుకోవాల్సిన వారు టాబ్లెట్‌ను సమాన భాగాలుగా విరవకపోతే సరైన డోస్ తీసుకోలేరు. దీని వల్ల మందు కూడా ప్రభావవంతంగా పనిచేయదు.
*రూపశ్రీ.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ గురువారం (ఏప్రిల్ 23)జరిగిన సంగతి తెలిసిందే. ఈ పోలింగ్ ఒక చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఓటర్లు భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. గణాంకాల ప్రకారం, రాష్ట్రంలో ఓటింగ్ శాతం 92 శాతాన్ని అధిగమించింది. ఇది బెంగాల్ ఎన్నికల చరిత్రలోనే అత్యధికం కావడం విశేషం. ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని ఈ భారీ ఓటింగ్ ప్రతిబింబిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
గురువారం (ఏప్రిల్ 23) జరిగిన మొదటి దశ ఎన్నికల్లో 152 నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహించారు. ఉదయం నుంచే ఓటర్లు ఉత్సాహంగా క్యూ లైన్లలో నిలబడ్డారు. తుది గణాంకాల ప్రకారం, ఓటింగ్ శాతం 92.03 శాతంగా నమోదైంది. ముఖ్యంగా దక్షిణ దినాజ్‌పూర్ జిల్లాలో అత్యధికంగా 94.98 శాతం ఓటింగ్ జరగగా, కూచ్ బెహార్‌లో 94.75 శాతం, బీర్భూమ్‌లో 93.88 శాతం ఓట్లు నమోదయ్యాయి. రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లోనూ 82 శాతానికి పైగా పోలింగ్ జరగడం విశేషం.
బెంగాల్ ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే, ఓటింగ్ శాతం క్రమంగా పెరుగుతూ వస్తోంది. 1969లో కేవలం 70 శాతంగా ఉన్న ఓటింగ్, 1987 నాటికి 78 శాతానికి చేరింది. ఆ తర్వాత 1996లో 80 శాతం, 2011లో 84 శాతంగా నమోదైంది. గత 2021 ఎన్నికల్లో 82 శాతానికి పరిమితమైన ఓటింగ్.. ఇప్పుడు 2026లో ఏకంగా 92 శాతాన్ని దాటి సరికొత్త రికార్డును సృష్టించింది.
ఈ భారీ ఓటింగ్ నమోదు కావడంలో కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న చర్యలు కూడా కీలకమని చెప్పవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2,400 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అక్కడక్కడా చిన్నపాటి ఘర్షణలు చోటుచేసుకున్నప్పటికీ.. పోలింగ్ ప్రక్రియ సాఫీగా సాగడం పట్ల ఎన్నికల ప్రధాన కమిషనర్ సంతృప్తి వ్యక్తం చేశారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో పోలింగ్ జరగడం వల్లే ప్రజలు ఇంత భారీగా తరలివచ్చారని అధికారులు భావిస్తున్నారు.
ఓటింగ్ శాతం భారీగా పెరగడంపై రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. అధికార తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ, ఇతర కూటములు ఈ రికార్డు స్థాయి పోలింగ్‌ను తమకు అనుకూలం అంటే తమకు అనుకూలమని విశ్లేషణలు చేస్తున్నారు. ఓటు హక్కును కాపాడుకోవడానికి ప్రజలు పెద్ద ఎత్తున స్పందించారని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొనగా, ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఓటర్ల ఉత్సాహాన్ని అభినందించారు. ముఖ్యంగా ఓటర్ల జాబితాలో జరిగిన మార్పులు, సిటిజన్‌షిప్ అంశాలు కూడా ప్రజలను చైతన్యపరిచినట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
మొదటి దశలో 1,478 మంది అభ్యర్థుల భవిష్యత్తు ఇప్పుడు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఏప్రిల్ 29న రెండో దశ పోలింగ్ జరగనుంది, మే 4న ఫలితాలు వెలువడనున్నాయి. మొదటి దశలో కనిపించిన ఈ ఉత్సాహం రెండో దశలోనూ కొనసాగుతుందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఎన్నికల ఫలితం బెంగాల్ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించడమే కాకుండా, దేశ రాజకీయాలపై కూడా బలమైన ముద్ర వేసే అవకాశం ఉందంటున్నారు.
తెలుగువన్ ‘వాస్తవ వేదిక’లో ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది. తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ సారథ్యంలో నిర్వహించిన ఈ చర్చలో ‘జమీన్ రైతు’ సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ పాల్గొని తాజా రాజకీయ పరిణామాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు.
మహిళా రిజర్వేషన్ల బిల్లు వాయిదా పడటం మహిళలను నిరుత్సాహానికి గురిచేస్తోందని రవిశంకర్ ప్రశ్నించారు. దీనికి స్పందించిన డోలేంద్ర ప్రసాద్, మహిళలకు నిరీక్షణ కొత్త విషయం కాదని, 1996లో మాజీ ప్రధాని దేవేగౌడ కాలం నుంచి ఈ అంశం పెండింగ్‌లోనే ఉందని గుర్తు చేశారు. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ పలుమార్లు ఈ బిల్లుకు మద్దతు తెలిపిందని, బీజేపీ మాత్రం ఇటీవలి కాలంలో ఒకసారి మద్దతు ప్రకటించిందని పేర్కొన్నారు.
ఆర్‌ఎస్‌ఎస్ భావజాలంలో మహిళలకు సమాన హక్కులపై స్పష్టత లేదని, వారు మనుస్మృతి సిద్ధాంతాలను అనుసరిస్తారని డోలేంద్ర ప్రసాద్ విమర్శించారు. మనుస్మృతిలో మహిళలకు సముచిత గౌరవం, హక్కులు లేవని, కుటుంబ పరిమితుల్లోనే వారి పాత్రను పరిమితం చేసినట్టు ఆయన అభిప్రాయపడ్డారు.
ఇటీవల లోక్‌సభలో ఆమోదం పొందిన 2023 మహిళా రిజర్వేషన్ల బిల్లు అమలులో ఆలస్యం జరుగుతుందని, 2034 వరకు అమలు అయ్యే అవకాశం లేదని ఆయన తెలిపారు. అలాగే డిలిమిటేషన్ ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనే ఆందోళన వ్యక్తం చేశారు.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు ఈ అంశంపై గట్టిగా స్పందించడం లేదని రవిశంకర్ ప్రశ్నించగా, చెన్నైలో డిలిమిటేషన్ వ్యతిరేకంగా నిర్వహించిన సమావేశానికి కేటీఆర్ హాజరై మద్దతు తెలిపారని డోలేంద్ర ప్రసాద్ వివరించారు.
కేంద్ర రాజకీయాలపై మాట్లాడిన ఆయన, ఒకప్పుడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి ఢిల్లీ రాజకీయాలను ధైర్యంగా ఎదుర్కొకున్నారని, ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదన్నారు. ప్రస్తుతం జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటి నేతలు ప్రధాని మోదీ ముందు ఒత్తిడికి లోనవుతున్నారని వ్యాఖ్యానించారు.
మహిళలకు రాజకీయ ప్రతినిధ్యం పెరిగితే వారి జీవితాల్లో మార్పు వస్తుందా అనే ప్రశ్నను రవిశంకర్ ముందుకు తెచ్చారు. ఇలాంటి ఆసక్తికర అంశాలపై కంఠంనేని రవిశంకర్, డోలేంద్ర ప్రసాద్‌ల మధ్య జరిగిన పూర్తి స్థాయి చర్చను తెలుగువన్ యూట్యూబ్ ఛానల్‌లో వీక్షించవచ్చు.
యువత తెలంగాణ జాగృతి పార్టీలో చేరాలని కవిత విన్నపం..
తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త చర్చ.
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు జగిత్యాల వేదికగా జరిగిన సభ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాజాగా జరిగిన ఒక రాజకీయ చేరికల సభను ఉద్దేశించి కవిత చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అసలు తెలంగాణలో యువత లేరా? లేక వారందరినీ విస్మరిస్తున్నారా? అంటూ ఆమె చేసిన ప్రశ్నలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
జగిత్యాలలో జీవన్ రెడ్డి చేరిక సభను ఉద్దేశించి కవిత తనదైన శైలిలో సెటైర్లు విసిరారు. 75 ఏళ్ల వయసున్న నేతలను నవ యువకులుగా పేర్కొంటూ, వారే రాష్ట్రానికి దిక్కు అని చెప్పడం ఏంటని ఆమె నిలదీశారు. రాజకీయాల్లో వయసు మళ్లిన నాయకులనే పదే పదే తెరపైకి తీసుకురావడం యువత ఆకాంక్షలను అవమానించడమేనని ఆమె అభిప్రాయపడ్డారు.
పదవుల కోసం, రాజకీయ లబ్ధి కోసం యువతను కాదని, సీనియర్లకే ప్రాధాన్యత ఇవ్వడం సమంజసమేనా అని ఆమె ప్రశ్నించారు. ఈ తరహా రాజకీయాలు యువత భవిష్యత్తును అంధకారంలోకి నెట్టడమేనని, ఇప్పటికైనా పార్టీలు యువతకు సరైన వేదిక కల్పించాలని ఆమె సూచించారు. కవిత చేసిన ఈ వ్యాఖ్యలు పరోక్షంగా తన సొంత పార్టీ నాయకత్వంపైనా ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
మరోవైపు, బీఆర్ఎస్ పార్టీపై కూడా కవిత తీవ్ర విమర్శలు చేశారు. ఆ పార్టీలో మహిళలకు సరైన గౌరవం లేదని, స్వార్థపూరిత నిర్ణయాల వల్లే పార్టీ ఇప్పుడు ఈ స్థితికి చేరుకుందని ఆమె ఆరోపించారు. బీఆర్‌ఎస్ కేసీఆర్ చుట్టూ ఉన్న కొందరు స్వార్థపరుల వల్లే ఉద్యమకారులకు అన్యాయం జరిగిందని ఆమె విశ్లేషించారు. ఓటమికి కార్యకర్తలను, ప్రజలను నిందించడం సరైన పద్ధతి కాదని ఆమె హితవు పలికారు.
సీఎం రేవంత్ రెడ్డిపై కూడా ఆమె తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజకీయ డీల్స్ కోసం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని, ప్రతిపక్షం లేకుండా చేయాలని చూడటం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆమె పేర్కొన్నారు. కోర్టు తీర్పుల విషయంలో సీఎం వ్యాఖ్యలు సరికాదని ఆమె మండిపడ్డారు.
రాష్ట్రంలో రెండు ప్రధాన పార్టీలు కేవలం అధికార ప్రదర్శనలకే పరిమితం కాకుండా, ప్రజల సమస్యలపై దృష్టి సారించాలని కవిత కోరారు. రాబోయే కాలంలో కొత్త తరహా రాజకీయాలతో ప్రజల ముందుకు వస్తున్నానని, తనను ఆశీర్వదించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. రాజకీయాల్లో యువతకు భాగస్వామ్యం పెరిగితేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇనుప పాత్రలో వంట చేయడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతారు. ఎందుకంటే ఇనుప పాత్రలో వంట చేయడం వల్ల ఆ ఆహారాన్ని ఐరన్ ఖనిజం చేరుతుంది. దీని వల్ల శరీరానికి ఐరన్ ఎలాంటి సప్లిమెంట్ అవసరం లేకుండా కొద్దిమోతాదులో అందుతుంది. అయితే అన్ని రకాల కూరగాయలను ఇనుప పాత్రలో వండకూడదు. . కొన్ని కూరగాయలు ఐరన్ పాత్రలో వండినప్పుడు రియాక్షన్ జరిగి వాటి రుచి, రంగు లేదా పోషక విలువల్లో మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. ఆహారం నాణ్యత , రుచిని కోల్పోకుండా ఉండేందుకు, ఐరన్ పాత్రలు వాడే ప్తి ఒక్కరూ వాటిలో వండకూడని కూరగాయలు ఏమిటో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
టమోటా..
టమోటాలు వంటల్లో ఎక్కువగా ఉపయోగించే కూరగాయ. టమోటాలలో ఆమ్లం అధిక మొత్తంలో ఉంటుంది, ఇది ఐరన్ తో చర్య జరుపుతుంది. దీనివల్ల కూరగాయ రంగు ముదురుగా మారవచ్చు , కొద్దిగా వగరు రుచిని కలిగి ఉండవచ్చు. ఎక్కువసేపు వండటం ఈ ప్రభావాన్ని మరింత ఎక్కువ చేస్తుంది. అందువల్ల, టమోటా వంటి కూరగాయలను స్టీల్ లేదా నాన్-స్టిక్ పాన్ లేదా బౌల్స్ లో వండాలి.
పాలకూర..
పాలకూర వంటి ఆకుకూరలు ఐరన్ ప్రభావానికి గురైనప్పుడు వాటి ఆకుపచ్చ రంగును కోల్పోయి, ముదురు రంగులోకి లేదా నల్లగా మారవచ్చు, దీనివల్ల అవి తినడానికి పనికిరావు. రుచిలో కూడా కొద్దిగా మార్పు ఉంటుంది. ఆకుకూరలను అల్యూమినియం లేదా స్టీల్ పాత్రలలో వండటం ఉత్తమం.
చింతపండు..
చింతపండు ఉపయోగించి వండే కూరను ఇనుప పెనంలో వండకూడదు. వీటిలో ఉండే ఆమ్లాలు ఇనుముతో చర్య జరిపి ఆహారం రుచిని మార్చి, దానికి లోహపు రుచిని ఇస్తాయి. ఇది అనారోగ్యకరమైనదిగా కూడా పరిగణించబడుతుంది. అందువల్ల, స్టీల్ లేదా నాన్-స్టిక్ పెనాన్ని ఉపయోగించాలి. కేవలం చింతపండు మాత్రమే కాకుండా నిమ్మకాయ, మామిడికాయ వంటివి కూడా ఐరన్ పాత్రలలో వండకూడదు.
పెరుగు వంటలు..
పెరుగుతో చేసిన కూర లేదా పెరుగు గ్రేవీ వంటి కూరగాయల వంటకాలను ఇనుప పెనంలో వండినప్పుడు వాటి రుచి భిన్నంగా ఉంటుంది. పెరుగులోని పులుపు ఇనుముతో కలిసి కొద్దిగా చేదును కలిగిస్తుంది. అంతేకాకుండా రంగు ముదురుగా మారవచ్చు , కూరలో కొద్దిగా నలుపు కనిపించవచ్చు.
నిమ్మకాయ..
కూరగాయలకు నిమ్మరసం కలపడం వల్ల వాటికి కొద్దిగా పులుపు, రుచి వస్తుంది, కానీ అది ఐరన్ తో చర్య జరిపి రుచిని పాడుచేసే అవకాశం ఉంది. దీనివల్ల ఆహారానికి లోహపు, వగరు రుచి వస్తుంది, కాబట్టి నిమ్మరసాన్ని ఎల్లప్పుడూ వంట చేసిన తర్వాత, తినడానికి ముందు మాత్రమే కలపాలి.
ఎక్కువ నీటి శాతం కలిగిన కూరలు..
అధిక నీటి శాతం ఉన్న కూరగాయలను ఐరన్ పెనంలో వండినప్పుడు వాటి రంగు, ఆకృతి మారవచ్చు. ఈ కూరగాయలను ఎక్కువ సేపు వండితే నల్లగా మారిపోతాయి. అందువల్ల వాటిని రసాయనాలతో చర్య జరపని పాత్రలలో వండటం మంచిది.
*రూపశ్రీ.
ఈ రోజుల్లో పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరు ఎక్కువ సమయాన్ని మొబైల్, ల్యాప్‌టాప్ లేదా టాబ్లెట్ స్క్రీన్‌ల ముందు గడుపుతున్నారు. దీని ఫలితంగా, కంటి అలసట , చికాకు సర్వసాధారణమైపోయాయి. ఈ సమస్య నుండి కళ్లకు ఉపశమం కలిగించడానికి చాలా మంది బ్లూ లైట్ కళ్లద్దాలు వాడుతున్నారు. ప్రస్తుతం ఈ బ్లూ లైట్ కళ్లద్దాల వినియోగం చాలా ఎక్కువైంది కూడా. అయితే, ఈ కళ్లద్దాలు నిజంగా కళ్లకు రక్షణ కవచంలా పనిచేస్తాయా? , లేక ఇవి కేవలం ఒక ట్రెండ్‌లో భాగమా? కంటి సంరక్షణ నిపుణులు దీని గురించి ఏం చెప్తున్నారు? తెలుసుకుంటే..
బ్లూ లైట్ ఎఫెక్ట్..
నీలి కాంతి అనేది ఒక రకమైన అధిక శక్తి గల కాంతి. ఇది కేవలం డిజిటల్ స్క్రీన్‌ల నుండే కాకుండా, సూర్యరశ్మి నుండి కూడా వెలువడుతుంది. మనం గంటల తరబడి స్క్రీన్‌లను చూస్తూ ఉన్నప్పుడు, కళ్ళు పొడిబారడం, చికాకు, అలసట , తలనొప్పి వంటి కంటి సమస్యలను ఎదురవుతాయి. ఇలా కంటి సమస్యలు రావడాన్ని డిజిటల్ ఐ స్ట్రెయిన్ అని అంటారు. ఈ సమస్యలకు స్క్రీన్‌ల నుండి వెలువడే నీలి కాంతియే ప్రధాన కారణమని చాలా మంది భావిస్తారు.
బ్లూ లైట్ గ్లాసెస్..
మార్కెట్లో లభించే బ్లూ లైట్ గ్లాసెస్, వాటి ప్రత్యేక లెన్సులు నీలి కాంతిని కళ్ళలోకి చేరకుండా అడ్డుకుంటాయని బ్లూ లైట్ గ్లాసెస్ అమ్మకం దారులు చెబుతారు. నీలి కాంతి మనిషిలో నిద్ర హార్మోన్లను ప్రభావితం చేస్తుంది కాబట్టి, ఇది కంటి ఒత్తిడిని తగ్గించి, నిద్రను మెరుగుపరుస్తుందని కంపెనీలు వాదిస్తున్నాయి. అయితే శాస్త్రీయంగా ఇది నిరూపణ కాలేదు. బ్లూ లైట్ గ్లాసెస్ అమ్మకం దారులు చెప్పే విషయాలను పరిశోధనలు సమర్థించడం లేదు.
పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే..
బ్లూ లైట్ గ్లాసెస్ కంటి అలసటను తగ్గించడంలో అంత ప్రభావవంతంగా ఉండవు. కంటి నొప్పి , పొడిబారడానికి అసలు కారణం బ్లూ లైట్ కాదు, విరామం లేకుండా తదేకంగా స్క్రీన్‌ను చూడటం ద్వారానే అసలు సమస్య వస్తోంది , కూర్చున్నప్పుడు తప్పు పొజిషన్ లో కూర్చోవడం, స్క్రీన్‌ను చూస్తున్నప్పుడు తక్కువగా కనురెప్పలు వాల్చడం వంటివి కళ్లకు అలసట, పొడిబారడం వంటి సమస్యలు తెచ్చిపెడతాయి. అందువల్ల, కేవలం కళ్లజోడు పెట్టుకోవడం వల్ల ఈ సమస్యను పూర్తిగా తొలగించలేము.
బ్లూ లైట్ గ్లాసెస్ పనికిరావా?
బ్లూ లైట్ కళ్లద్దాలు ధరించడం వల్ల కొంతమందికి కొంత సౌకర్యం కలగవచ్చనేది నిజమే. ముఖ్యంగా రాత్రి పొద్దుపోయే వరకు తమ మొబైల్ ఫోన్లు లేదా ల్యాప్‌టాప్‌లపై పనిచేసే వారికి కొంత ఉపశమనం లభించవచ్చు లేదా వారి నిద్ర పోవడానికి ఎక్కువ రిస్క్ లేకుండా ఈ బ్లూ లైట్ కళ్లద్దాలు కాస్త హెల్ప్ చేయవచ్చు. కానీ పూర్తి కంటి రక్షణకు ఈ కళ్లద్దాలు పెట్టుకోవడం ఏకైక పరిష్కారంగా భావించడం సరికాదని వైద్యులు చెబుతున్నారు.
*రూపశ్రీ.
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో సరైన నిద్ర లేకపోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే, రాత్రి పూట సరైన సమయానికి నిద్రపోవడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా రాత్రి 10 గంటలకు నిద్రపోవాలని వైద్య నిపుణులు ఎందుకు చెబుతున్నారు? దీని వెనుక ఉన్న రహస్యాలేమిటో ఈ వీడియోలో చూద్దాం.
ముఖ్య అంశాలు:
శరీర పునరుద్ధరణ: రాత్రి 10 నుండి తెల్లవారుజామున 2 గంటల మధ్య మన శరీరంలో కణాల మరమ్మత్తు ప్రక్రియ వేగంగా జరుగుతుంది.
మెదడు ఆరోగ్యం: సరైన సమయానికి నిద్రపోవడం వల్ల మెదడు చురుగ్గా మారుతుంది, ఒత్తిడి (Stress) తగ్గుతుంది మరియు జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
యునానీ వైద్య విధానం: నిద్ర మరియు ఆరోగ్యంపై యునానీ వైద్య శాస్త్రం చెప్పిన అద్భుతమైన ఆరోగ్య సూత్రాలు.
బరువు నియంత్రణ: సరైన నిద్ర జీవక్రియను (Metabolism) మెరుగుపరిచి, బరువు తగ్గడానికి ఎలా సహాయపడుతుందో వివరించబడింది.
మీరు నిత్యం ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండాలనుకుంటే మీ నిద్ర సమయాన్ని మార్చుకోవాల్సిందే. ఈ వీడియో చూసి, రాత్రి 10 గంటల నిద్ర వల్ల కలిగే మరిన్ని లాభాలను తెలుసుకోండి!
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఆరోగ్య చిట్కాల కోసం మా యూట్యూబ్ "TeluguOne Health" ఛానెల్ ను సందర్శించండి. (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!) 🙏✨
