LATEST NEWS
ఇప్ప‌టి వ‌ర‌కూ ఒక న‌టుడు పార్టీ  పెట్టి  పోటీ చేసిన తొలి ఎన్నికల్లో తెచ్చుకున్న ఓట్ల  శాతం ఎంత?  వీరిలో అత్య‌ధిక ఓట్ల శాతం తెచ్చుకున్న ఆ గొప్ప  న‌టుడు ఎవ‌రు? అన్న‌దిప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కార‌ణం విజ‌య్ టీవీకే పార్టీ పెట్టి ఆ పార్టీని ప్ర‌స్తుతం  ఎన్నిక‌ల  ప‌రీక్ష‌కు నిల‌ప‌డంతో.. ఇతర  న‌టుల పార్టీలు, అవి తొలి సారి  ఎన్నిక‌ల్లో పాల్గొన్న‌పుడు సాధించిన ఓట్ల శాతం ఎంత‌? అన్న ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు తెర‌లేచింది. వారిలో టాప్ మోస్ట్ ఎవ‌ర‌ని చూస్తే.. డౌటెందుకు అన్న  ఎన్టీఆర్.  ఇదిరా  తెలుగోడి స‌త్తా  అన్న మాట వినిపిస్తోంది. మిగిలిన వారి ఓటింగ్ శాత‌మెంత‌? ఎన్టీఆర్ సాధించిన ఓట్ షేర్ ఏమిటి అని చూస్తే.. ఎన్టీఆర్.. పార్టీ స్థాపించిన 9 నెలలలో  వచ్చిన ఎన్నికలలో తొలి సారి పోటీ చేసి.. 46.30శాతంతో పార్టీని 201 స్థానాలలో గెలిపించారు. ఇక  ఎంజీఆర్ తన తొలి ప్రయత్నంలో 33.52శాతంతో  130 స్థానాలు, చిరంజీవి 16.32శాతంతో 18స్థానాలనూ దక్కించుకున్నారు. ఆ తరువాత తమిళనటుడు  విజయకాంత్ తన పార్టీని తొలి ప్రయత్నంలో  8.38 ఓట్ల శాతంతో శాతంతో ఒక స్థానంలో మాత్రమే విజయం సాధించారు.  ఇక జపవన్ కళ్యాణ్- 5.53శాతంతో ఒక స్థానం,  కమలహాసన్- 2.52శాతంతో జీరో స్థానాలు సాధించారు. ఇక  ఇప్పుడు విజయ్.. తన తొలి ప్రయత్నంలో ఎంత శాతం ఓట్లు సాధిస్తారు? ఎన్ని సీట్లలో ఆయన పార్టీ విజయం సాధిస్తుంది అన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తం అవుతోంది.   స‌ర్వేల‌ను బ‌ట్టీ  చూస్తే ఆయ‌న‌కు 15- 19 శాతం ఓట్ షేర్ రావ‌చ్చ‌నీ.. ఆయ‌న సాధించ‌బోయే  సీట్ల  సంఖ్య ఓ డజను  వ‌ర‌కూ ఉండొచ్చ‌నీ అంటున్నారు సెఫాల‌జిస్టులు.    ఏది ఏమైనా ఒక న‌టుడు పెట్టిన పార్టీ  తొలి ఎన్నిక‌ల్లో సాధించిన ఓట్ల శాతం, గెలిచిన సీట్ల సంఖ్యలో ఇప్పటి వరకూ ఎన్టీఆరే టాప్. ఇది మ‌రో న‌టుడికి  ఎప్పటికీ సాధ్యం కాదంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఎన్టీఆర్ ఆల్ టైం గ్రేట్ రికార్డ్ ని బ్రేక్  అయ్యే అవకాశాలే లేవని విశ్లేషిస్తున్నారు.   
క‌విత కొత్త పార్టీ పేరేంటి?  గుర్తు ఎలాంటిది? ఆమె పార్టీ జెండా, అజెండా ఎలా ఉండ‌బోతున్నాయ్? అన్న స‌స్పెన్స్ నడుస్తోంది. అయితే క‌విత పార్టీ జెండా ప‌సుపు, నీలం, ఆకుప‌చ్చ  రంగుల్లో లేదా వీటిలో ఏ రెండు రంగులతోనైనా ఉంటుందని అంటున్నారు.  ఇక ఆమె స‌ర్వోద‌య గురించి మాట్లాడతారు. అంటే , స‌బ్బండ వ‌ర్ణాల వార‌ని అర్ధం. ఆపై ఇంకా కొంద‌రు ఉద్య‌మ‌కారుల‌కు న్యాయం జ‌ర‌గ‌లేద‌నీ చెబుతున్నారు. బీసీ, మ‌హిళ‌, యువ‌త సంగ‌తి స‌రే  స‌రి. వీట‌న్నిటిని బట్టి చూస్తే.. కవిత అంద‌రికీ న్యాయం, ధ‌ర్మం జ‌ర‌గాల‌ని కోరుకుంటున్న‌ట్టుగా  భావించవచ్చు. అందుకే ధ‌ర్మ‌గంట ఆమె త‌న గుర్తుగా ఎంపిక చేసుకున్న‌ట్టు కూడా  తెలుస్తోంది. అందుకే క‌విత పార్టీ గుర్తు ధ‌ర్మ‌గంట‌, ఇక రంగులు ప‌సుపు, నీలం, ప‌చ్చ‌ల కాంబినేష‌న్లో ఉండొచ్చ‌ని తెలుస్తోంది. ప‌సుపు ఒక మ‌హిళ‌కు ఎంత ముఖ్య‌మో తెలిసిందే. ఆపై నీలం అంటే ద‌ళిత సందేశం ఇస్తుంది. ఇక పోతే ఆకుప‌చ్చ అంటే అది భార‌త జెండాలో ఒక భాగం. ముస్లీం మైనార్టీల‌ను ఏకం చేసేది. కాబ‌ట్టి క‌విత జెండా రంగుల్లో ఇవి ప్ర‌ముఖంగా  ఉండొచ్చ‌ని తెలుస్తోంది. దీంతో క‌విత ప్ర‌క‌టించ‌బోయే పార్టీ జెండా రంగులు, గుర్తు ఆల్రెడీ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నారు. బేసిగ్గా అయితే ఆమె ఒక్క‌రోజు ఆగండి.. తిన‌బోతూ రుచులెందుకు అని అంటున్నారు క‌విత‌. కానీ కొంద‌రు కార్య‌క‌ర్త‌లు అత్యుత్సాహం కొద్దీ వీటిని ముందుగానే సోష‌ల్ మీడియాలో తిప్పేస్తున్న‌ట్టు స‌మాచారం.
పశ్చిమ బెంగాల్  అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్  గురువారం (ఏప్రిల్ 23)జరిగిన సంగతి తెలిసిందే. ఈ పోలింగ్ ఒక చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఓటర్లు భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు.  గణాంకాల ప్రకారం, రాష్ట్రంలో ఓటింగ్ శాతం  92 శాతాన్ని అధిగమించింది. ఇది బెంగాల్ ఎన్నికల చరిత్రలోనే అత్యధికం కావడం విశేషం. ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని ఈ భారీ ఓటింగ్ ప్రతిబింబిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గురువారం (ఏప్రిల్ 23)  జరిగిన మొదటి దశ ఎన్నికల్లో 152 నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహించారు. ఉదయం నుంచే ఓటర్లు ఉత్సాహంగా క్యూ లైన్లలో నిలబడ్డారు. తుది గణాంకాల ప్రకారం, ఓటింగ్ శాతం 92.03 శాతంగా నమోదైంది. ముఖ్యంగా దక్షిణ దినాజ్‌పూర్ జిల్లాలో అత్యధికంగా 94.98 శాతం ఓటింగ్ జరగగా, కూచ్ బెహార్‌లో 94.75 శాతం, బీర్భూమ్‌లో 93.88 శాతం ఓట్లు నమోదయ్యాయి. రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లోనూ 82 శాతానికి పైగా పోలింగ్ జరగడం విశేషం. బెంగాల్ ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే, ఓటింగ్ శాతం క్రమంగా పెరుగుతూ వస్తోంది. 1969లో కేవలం 70 శాతంగా ఉన్న ఓటింగ్, 1987 నాటికి 78 శాతానికి చేరింది. ఆ తర్వాత 1996లో 80 శాతం, 2011లో 84 శాతంగా నమోదైంది. గత 2021 ఎన్నికల్లో 82 శాతానికి పరిమితమైన ఓటింగ్..  ఇప్పుడు 2026లో ఏకంగా 92 శాతాన్ని దాటి సరికొత్త రికార్డును సృష్టించింది. ఈ భారీ ఓటింగ్ నమోదు కావడంలో కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న చర్యలు కూడా కీలకమని చెప్పవచ్చు.  రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2,400 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అక్కడక్కడా చిన్నపాటి ఘర్షణలు చోటుచేసుకున్నప్పటికీ..  పోలింగ్ ప్రక్రియ సాఫీగా సాగడం పట్ల ఎన్నికల ప్రధాన కమిషనర్ సంతృప్తి వ్యక్తం చేశారు. స్వేచ్ఛాయుత  వాతావరణంలో పోలింగ్ జరగడం వల్లే ప్రజలు ఇంత భారీగా తరలివచ్చారని అధికారులు భావిస్తున్నారు.  ఓటింగ్ శాతం భారీగా పెరగడంపై రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. అధికార తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ,  ఇతర కూటములు ఈ రికార్డు స్థాయి పోలింగ్‌ను తమకు అనుకూలం అంటే తమకు అనుకూలమని విశ్లేషణలు చేస్తున్నారు.  ఓటు హక్కును కాపాడుకోవడానికి ప్రజలు పెద్ద ఎత్తున స్పందించారని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొనగా, ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఓటర్ల ఉత్సాహాన్ని అభినందించారు. ముఖ్యంగా ఓటర్ల జాబితాలో జరిగిన మార్పులు, సిటిజన్‌షిప్ అంశాలు కూడా ప్రజలను చైతన్యపరిచినట్లు  పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.    మొదటి దశలో 1,478 మంది అభ్యర్థుల భవిష్యత్తు ఇప్పుడు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఏప్రిల్ 29న రెండో దశ పోలింగ్ జరగనుంది, మే 4న ఫలితాలు వెలువడనున్నాయి. మొదటి దశలో కనిపించిన ఈ ఉత్సాహం రెండో దశలోనూ కొనసాగుతుందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఎన్నికల ఫలితం బెంగాల్ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించడమే కాకుండా, దేశ రాజకీయాలపై కూడా బలమైన ముద్ర వేసే అవకాశం ఉందంటున్నారు.
ALSO ON TELUGUONE N E W S
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'పెద్ది' (Peddi) సినిమా విడుదల తేదీపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చేసింది. 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రాబోతున్న ఈ భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా కొత్త విడుదల తేదీ లాక్ అయినట్లు సమాచారం. మొదట మార్చి 27న విడుదల కావాల్సిన 'పెద్ది' ఏప్రిల్ 30కి వాయిదా పడింది. ఇటీవల జూన్ కి వాయిదా వేసినట్లు మేకర్స్ ప్రకటించారు కానీ, రిలీజ్ డేట్ ని రివీల్ చేయలేదు. తాజా సమాచారం ప్రకారం, 'పెద్ది' చిత్రాన్ని జూన్ 25, గురువారం నాడు ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది. ఈ మేరకు త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.  రామ్ చరణ్ కెరీర్‌లో ఇది ఒక విభిన్నమైన చిత్రమని, ఆయన పాత్ర గతంలో ఎన్నడూ చూడని విధంగా చాలా రా అండ్ రస్టిక్‌గా ఉంటుందని తెలుస్తోంది. వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటంతో సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పై భారీ అంచనాలు ఉన్నాయి.   
  రాముడి గొప్ప తనాన్ని, భారతీయ సినిమా గొప్పతనాన్ని ఏక కాలంలో ప్రపంచ సినిమాకి తెలియచెయ్యడానికి సెట్స్ పై ఉన్న అద్భుత దృశ్య కావ్యం రామాయణ(Ramayana). రాముడిగా రణబీర్ (Ranbir Kapoor)చేస్తున్నాడనే పేరే కానీ సాక్షాత్తు ఆ శ్రీరాముడే చేస్తున్నట్టుగా ఉంది. అంతలా సెట్ అయ్యాడు. సీతమ్మ తల్లి క్యారక్టర్ విషయంలోను అంతే.. సాయి పల్లవి చేస్తున్నట్టుగా లేదు. సాక్షాత్తు సీతమ్మ తల్లినే చేస్తుందా అనిపిస్తుంది. రావణుడిగా చేస్తున్న యష్ నుంచి ఇంకా లుక్ అధికారకంగా లుక్ రివీల్ కాకపోయినప్పటికీ పైన మనం చెప్పుకున్న ఉదాహరణ లాగానే అభిమానులు భావిస్తున్నారు. రీసెంట్ గా రావణ క్యారక్టర్ కి సంబంధించి యష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అభిమానులని, ప్రేక్షకులని ఆకర్షిస్తున్నాయి. అవేంటో చూద్దాం   యష్(Yash)ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు రావణుడు కేవలం ఒక విలన్ మాత్రమే కాదు. ఆయనలో ఎన్నో కోణాలు ఉన్నాయి. అత్యంత తెలివైనవాడు, గొప్ప పండితుడు మరియు వీరుడు. ఒక నటుడిగా నాకు ఎప్పుడూ ఛాలెంజింగ్ పాత్రలు చేయడమే ఇష్టం. రామాయణంలో రావణుడి పాత్రకు ఉన్న లోతు, అతని వ్యక్తిత్వంలోని విభిన్న షేడ్స్ నన్ను ఆకర్షించాయి. అంతేకాకుండా, దర్శకుడు నితీష్ తివారీ రావణుడిని డిజైన్ చేసిన విధానం బాగా బాగా నచ్చింది. కేవలం ఒక నలుపు-తెలుపు క్యారక్టర్ లా  కాకుండా, రావణుడిలోని మానవీయ కోణాలను కూడా ఇందులో చూపిస్తున్నారు. పైగా ఇలాంటి భారీ సినిమాల్లో ఇండియన్ సినిమాకి చెందిన ప్రతీ ముఖ్య నటుడూ నటించాల్సిన ఆవశ్యకత ఉంటుంది  అందుకే ప్రాజెక్ట్‌లో భాగం కూడా  కావడానికి వెనుకాడలేదని ఆయన స్పష్టం చేశారు. Also read: Ntr: ఎన్టీఆర్ హీరోయిన్ పదిహేను సంవత్సరాల తర్వాత రీ ఎంట్రీ నమిత్ మల్హోత్రాతో కలిసి యష్ తన 'మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్' ద్వారా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. రెండు భాగాలుగా  రామాయణ తెరకెక్కుతుండగా దీపావళికి  మొదటి భాగం రిలీజ్ కానుంది.    
మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన సినిమాలు ఉన్నాయి. అందులోనూ 'గ్యాంగ్ లీడర్' వంటి పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. చిరంజీవి తన విలన్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే పవర్‌ఫుల్ సీన్లతో కూడిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ప్రధానంగా చిరంజీవి మార్కు డైలాగ్ డెలివరీ, ఆ ఇంటెన్సిటీ మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా "మగువ మాంచాలికి ఎక్కువ.. పగబట్టిన పాంచాలికి తక్కువ" అంటూ సాగే సంభాషణలు, తన కుటుంబాన్ని, ఆత్మీయులను ఇబ్బంది పెట్టిన విలన్ల తాట తీసే సన్నివేశాలు హైలైట్‌గా నిలిచాయి. చిరంజీవి కేవలం హీరో మాత్రమే కాదు, యాక్షన్ సన్నివేశాల్లో ఆయన బాడీ లాంగ్వేజ్ ఒక ప్రత్యేకమైన శైలిని కలిగి ఉంటుందని ఈ వీడియో మరోసారి నిరూపించింది. వీడియోలో ఒక కీలక ఘట్టంలో, తన వదిన పట్ల అసభ్యంగా ప్రవర్తించిన గూండాల ఒక్కో చేతిని నరుకుతూ చిరు ఇచ్చే వార్నింగ్ చూస్తుంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. "వదిన ఒంటి మీద చేయి వేసినోడి ఒక్కో చేయిని.." అంటూ సాగే ఆ క్రమం ఒక పక్కా రివెంజ్ డ్రామాను గుర్తుచేస్తుంది. అన్నదమ్ముల అనుబంధం, ఆవేశం, మరియు అధర్మాన్ని ఎదిరించే ధైర్యం ఈ సన్నివేశాల్లో పుష్కలంగా కనిపిస్తాయి. చిరంజీవి సినిమాల్లో డైలాగ్స్ ఎప్పుడూ ట్రెండ్ సెట్టర్లే. ఇందులో "కిరాతకుడికి ఎక్కువ.. రాక్షసుడికి తక్కువ" అంటూ విలన్లను ఎద్దేవా చేసే తీరు ఆకట్టుకుంటుంది. తన తండ్రి ఆశయాలకు అనుగుణంగా రఘుపతి, రాఘవ, రాజారామ్ అనే పేర్లు పెట్టుకున్న అన్నదమ్ములు, సమాజంలోని అన్యాయంపై ఎలా పోరాడారనేది ఈ క్లిప్పింగ్స్‌లో అద్భుతంగా చూపించారు. ఈ స్పెషల్ వీడియో చూసిన అభిమానులు పాత రోజులను గుర్తు చేసుకుంటున్నారు. "మెగాస్టార్‌ను మళ్ళీ ఇలాంటి వింటేజ్ మాస్ రోల్‌లో చూడాలని ఉంది" అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అప్పట్లో ఈ సినిమాలు థియేటర్లలో ఎలాంటి ప్రకంపనలు సృష్టించాయో ఈ వీడియో చూస్తుంటే అర్థమవుతుంది. ఇప్పటికీ చిరంజీవి మాస్ క్రేజ్ తగ్గలేదని చెప్పడానికి ఈ దృశ్యాలే నిదర్శనం. ఇలాంటి ప‌వ‌ర్‌ఫుల్ సీన్స్ కోసం మా Teluguone youtube channelను Subscribe చేసుకోండి.
ఈ ఏడాది సంక్రాంతికి 'మన శంకర వరప్రసాద్ గారు'తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ను అందుకొని మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ఫుల్ జోష్ లో ఉన్నారు. వచ్చే సంక్రాంతికి తన 158వ సినిమాతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. 'వాల్తేరు వీరయ్య' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు బాబీతో చిరంజీవి చేస్తున్న సినిమా కావడంతో 'Mega158' పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ వార్తలపై క్లారిటీ..! గత కొద్ది రోజులుగా ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ యాక్టర్ అనిల్ కపూర్ (Anil Kapoor) ఒక కీలక పాత్రలో నటించబోతున్నారని గట్టిగా ప్రచారం జరిగింది. చిరంజీవి, అనిల్ కపూర్ వంటి ఇద్దరు లెజెండరీ నటులు ఒకే స్క్రీన్ పై కనిపిస్తే చూడాలని అభిమానులు కూడా ఆశపడ్డారు. అయితే, ఈ వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. అవన్నీ కేవలం రూమర్స్ మాత్రమేనని, అనిల్ కపూర్ ఈ ప్రాజెక్టులో భాగం కాదని సమాచారం. అనిల్ కపూర్ ప్రస్తుతం ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న 'డ్రాగన్'లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బాబీ.. ప్రస్తుతం 'Mega158' ప్రీ-ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకున్నాయి. కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు 'కాకాజీ' (Kakaji) అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో ఒక పవర్‌ఫుల్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపిస్తారని వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో ఇందులో తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ హైలైట్ గా నిలవనుందని అంటున్నారు. బాబీ తనదైన శైలిలో మాస్ ఎలిమెంట్స్‌తో పాటు ఎమోషన్స్ తో ఈ కథను సిద్ధం చేసినట్లు సమాచారం. త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.  
మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi)తో కలిసి 'జై చిరంజీవ' లో ఎంటర్ టైన్ మెంట్ ని, మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr)తో 'అశోక్', 'నరసింహుడు' లో యాక్షన్ మోడ్ ని సమపాళ్లలో జోడించి మెప్పించిన భామ సమీరా రెడ్డి(Sameera Reddy). డాన్స్ లు ఒక రేంజ్ లో చేసి ఆ విషయలో  హీరోలు మరింత ఎలర్ట్ గా ఉండేలా చేయగలదు. బాలీవుడ్ లో కూడా సేమ్ సిట్యువేషన్ ఆఫ్ కంట్రోల్ తో పలు క్రేజీ ప్రాజెక్ట్స్ చేసింది. పెళ్లి తర్వాత సినిమాలకి  పూర్తిగా దూరమయ్యారు.ఇప్పుడు మళ్ళీ వెండితెరపై కనిపించబోతున్నారు. అదీ ఒక పవర్‌ఫుల్ స్టార్ హీరో సినిమాలో కీలక పాత్రతో రాబోతుండటం విశేషం. సంజయ్ దత్(Sanjay Dutt)టైటిల్ రోల్ లో తెరకెక్కుతున్న 'ఆఖ్రీ సవాల్'(Aakhri Sawal)లో సమీరా పెర్ఫార్మ్ కి  ఒక ఆస్కారం ఉన్న ఒక సీరియస్ రోల్‌లో కనిపించబోతున్నారు. కథకి ముఖ్యమైన క్యారక్టర్ కూడా. 2014లో వ్యాపారవేత్త అక్షయ్ వర్దేను వివాహం చేసుకున్న తర్వాత సమీర తన కుటుంబ బాధ్యతలకే ప్రాధాన్యత ఇచ్చారు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత తన శరీరంలో వచ్చిన మార్పులు, ఎదురైన విమర్శలను ధైర్యంగా ఎదుర్కొని వాటిపై సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "నేను కేవలం సినిమాలు చేయాలనే ఉద్దేశంతో తిరిగి రావడం లేదు. నటిగా నన్ను నేను నిరూపించుకునే అవకాశం ఉన్న, సమాజానికి ఏదైనా చెప్పే అర్థవంతమైన క్యారక్టర్ లో చేస్తానని చెప్పుకొచ్చింది. ఆ నేపథ్యంలోనే ఇప్పడు ఆఖ్రీ సవాల్ తో వస్తుంది.  '2012 లో క్రిష్, రానా ల కృష్ణం వందే జగద్గురుం'లో స్పెషల్ సాంగ్ లో మెరిసింది. అంటే మళ్ళీ పదిహేను సంవత్సరాల తర్వాత తన సత్తా చాటబోతుంది. Also read: Mrunal Thakur: ప్రియుడి డైరెక్షన్‌లో మృణాల్ ఠాకూర్!.. ప్రియుడు ఎవరో తెలిస్తే నవ్వుకుంటారు  జాతీయ అవార్డు గ్రహీత అభిజీత్ మోహన్ వారంగ్(Abijith Mohan varang)దర్శకత్వం వహిస్తుండగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అలియాస్ ఆర్ఎస్ఎస్ శతాబ్ది ప్రయాణం నేపథ్యంలో సాగుతుంది.   ప్రొఫెసర్ గోపాల్ నాదకర్ణిగా సంజయ్ దత్ కనిపిస్తుండగా ఇప్పటికే విడుదలైన టీజర్ తో పాజిటివ్ వైబ్రేషన్స్ ఏర్పడ్డాయి.    
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
  వేసవి కాలం వచ్చిందంచే సాధారణ టేబుల్ ఫ్యాన్ లు,  సీలింగ్ ఫ్యాన్ లు సరిపోవు.  వీటి నుండి వచ్చే గాలి వేసవి వేడిని కంట్రోల్ చేయలేవు. పైగా వేసవి వేడి గాలిని తిప్పి, తిప్పి గది మొత్తం వేడిగా మార్చేస్తాయి. ఈ కారణంగానే ఇప్పట్లో ప్రతి ఇంట్లో కూలర్లు వాడుతున్నారు.  కాస్త అర్థిక స్థితి ఉన్నవారేతై ఏసీ లు కూడా పెట్టించుకుంటారు. కానీ రానురాను పెరుగుతున్న ఎండలు,  వాటి తాలుకూ వేడి కారణంగా కూలర్లు కూడా సరిపోవడం లేదని అనుకుంటూ ఉంటారు. కానీ.. సాధారణ కూలర్ ను కూడా చక్కగా ఏసీ లాంటి చల్లదనం ఇచ్చేలా చేయవచ్చు.  ఇందుకోసం కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. సాధారణ కూలర్ తో ఏసీ లాంటి చల్లదనం కావాలంటే.. ఏ చిట్కాలు పాటించాలో తెలుసుకుంటే.. సాల్ట్ , ఐస్.. కూలర్  చల్లటి గాలిని అందించాలని  అనుకుంటే, ఐస్ లేదా ఉప్పు నీటిని కలపడం చాలా ప్రభావవంతమైన పద్ధతి. ఇది చాలా ఫేమస్ చిట్కా కూడా.  కూలర్ ట్యాంకులో రాళ్ల ఉప్పు,   ఐస్ క్యూబ్స్ వేస్తారు.  రాళ్ల ఉప్పు ఐస్ క్యూబ్స్ కరగకుండా ఎక్కువ సేపు ఉండేలా చేస్తాయి. దీని వల్ల కూలింగ్ బాగా వస్తుంది. అయితే.. ఇది రెగ్యులర్ గా చేయడం మంచిది కాదు.. ఉప్పు తొందరగా చిలుము పట్టేలా చేస్తుంది. దీని వల్ల కూలర్ లోని మెటల్ భాగాలు తొందరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని ఎప్పుడైనా వేడి భరించలేని సమయాల్లో ట్రై చేయడం మంచిది. వెంటిలేషన్.. చాలా మంది ఏసీ లాంటి చల్లదనం వస్తుందని ఆశించి,  కూలర్లను మూసి ఉన్న గదులలో వాడుతుంటారు, కానీ ఇది  పెద్ద పొరపాటు. సరైన వెంటిలేషన్ ఉన్నప్పుడే ఎయిర్ కూలర్ సరిగ్గా పనిచేస్తుంది. గదిలో  వేడి గాలి బయటకు పోవడానికి , చల్లని గాలి లోపల ప్రసరించడానికి వీలుగా ఒక కిటికీని లేదా తలుపును తెరిచి ఉంచడం ముఖ్యం. సరైన వెంటిలేషన్ కూలర్ పనితీరును  మెరుగుపరుస్తుంది. శుభ్రత.. కాలక్రమేణా కూలర్ ప్యాడ్‌లపై దుమ్ము, ధూళి పేరుకుపోయి, వాటి కూలింగ్ సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. అందువల్ల వాటిని క్రమం తప్పకుండా శుభ్రపరచడం లేదా మార్చడం ముఖ్యం. కూలర్ చాలా చల్లని గాలిని ఇవ్వాలి అంటే.. కూలర్ లోపల వట్టివేర్లతో తయారు చేసిన మ్యాట్లను  ఉపయోగించాలి. ఇది కూలింగ్ ను మెరుగుపరుస్తుంది. వట్టివేర్ల  గుండా నీరు ప్రవహించినప్పుడు, గాలి చల్లగా, తాజాగా మారుతుంది, మంచి  తేలికపాటి సువాసనను కూడా అందిస్తుంది. పైన పేర్కొన్న చిట్కాలను పాటించడం వల్ల వేసవి కాలంలో కూలర్ ఏసీ లాంటి చల్లదనాన్నిఇస్తుంది.                                     *రూపశ్రీ.
పెళ్లి... ఎన్నో రొమాంటిక్ ఆలోచనలను గుర్తుకు తెచ్చే ఒక అందమైన పదం. బయటకు వెళ్లడం, లాంగ్ డ్రైవ్‌లకు వెళ్లడం, ఖరీదైన బహుమతులు ఇచ్చుకోవడం.. వీటితో పాటు కాస్త ఆర్థికంగా బాగున్నవారైతే.. హనీమూన్ కు కూడా వెళ్తారు. పెళ్లయిన మొదట్లో..  కొన్ని నెలలు ఎంతో అద్బులంలా.. అంతా పరిపూర్ణంగా, సంతోషంగా ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ హనీమూన్  అయిపోయాక లేదా పెళ్లైన  రెండు మూడు నెలల తర్వాత.. అసలైన లైఫ్ మొదలవుతుంది.  ఇక్కడే అందరూ ఊహించుకునే పెళ్లి జీవితానికి,  వాస్తవానికి మధ్య చాలా తేడా ఉందని తెలుసుకుంటారు.  అసలు అంగీకరించలేని ఎన్నో విషయాలు బయటపడుతుంటాయి,  ఊహించుకున్న జీవితం చాలా రివర్స్ గా,  డిజప్పాయింట్ గా అనిపిస్తుంది.   పెళ్లి తర్వాత అర్థమయ్యే చేదు నిజాలు కొన్ని ఉన్నాయి. పెళ్ళి తర్వాత  జీవితం గురించి కలలు కనే ప్రతి ఒక్కరూ,  పెళ్లి తర్వాత జీవితాన్ని సినిమాటిక్ గా ఊహించుకునే ప్రతి ఒక్కరూ ఆ చేదు నిజాలను తెలుసుకోవాలి. దీని వల్ల పెళ్లి తర్వాత వారు డిజప్పాయింట్ అయ్యే పరిస్థితి ఎదురవ్వదు.  ఆ చేదు నిజాలు ఏంటో తెలుసుకుంటే..  ప్రేమ అంటే.. పెళ్లికి ముందు,  పెళ్లి తర్వాత కొన్ని రోజుల పాటు  ప్రేమ అంటే ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ, పొగడ్తలు చెప్పుకోవడమే అనుకుంటారు. నిజానికి చాలామందికి మొదట్లో అవే జరుగుతుంటాయి. కానీ పెళ్లైన రెండు మూడు నెలల తర్వాత సాధారణ  జీవితానికి తిరిగి వచ్చినప్పుడు, ప్రేమలో సరుకులు కొనడం, కరెంటు బిల్లు కట్టడం, బాధ్యతలు పంచుకోవడం కూడా ఉంటాయని మీరు గ్రహిస్తారు.  బయటకు వెళ్లి క్యాండిల్ లైట్ డిన్నర్ చేయాలని అనుకునేవారు.. పెళ్లైన కొన్ని నెలల తర్వాత.. ఈరోజు రాత్రి భోజనానికి ఏం వండాలి అని ఆలోచిస్తూ ఉంటారు. పెళ్లి తర్వాత ప్రేమ అంటే కేవలం బెడ్ రూమ్ ముచ్చట కాదు.. అది ఇద్దరూ కలిసి బాధ్యతలు పంచుకోవడంలో కూడా ఉంటుంది. పర్పెక్ట్ లైఫ్ పార్టనర్.. పెళ్లికి ముందు కేవలం మాట్లాడుకుంటూ ఉండటం వల్ల తమకు బెస్ట్ పార్ట్నర్ లభించారని అనుకుంటారు.  కానీ పెళ్ళి  తర్వాత  ఒకే ఇంట్లో కలిసి జీవించడం  మనిషిలో నిజ స్వభావాన్ని బయటపెడుతుంది. మనిషి అలవాట్లు, మాటలు,   రోజువారీ ప్రవర్తన, కొన్నిసార్లు అతిగా రియాక్ట్ అవ్వడం,  కోపం చేసుకోవడం, వాగ్వాదం ఇవన్నీ పెళ్లి తర్వాత ఉంటాయి. ఇవన్నీ పర్పెక్ట్ అనే ట్యాగ్ ను చెరిపేస్తాయి.  అయితే..  అందరూ ఒప్పుకోవాల్సన నిజం ఏమిటంటే.. ఎవరూ కంప్లీట్ గా పర్పెక్ట్ గా ఉండరు. ప్రతి ఒక్కరికీ బలాలు ఉంటాయి,  బలహీనతలు ఉంటాయి. రెండింటినీ అంగీకరించాలి. గొడవలు.. పెళ్లి తర్వాత గొడవ పడని భార్యాభర్తలు ఎక్కడా ఉండరు.  గొడవ పడని  భార్యాభర్తలు ఉన్నారని అనుకోవడం కూడా చాలా పొరపాటు.  విభిన్న మనస్తత్వాలు గల ఇద్దరు వ్యక్తులు కలిసి నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెట్టినప్పుడు అభిప్రాయ భేదాలు రావడం సర్వసాధారణం. టీవీ రిమోట్ దగ్గర నుండి మొదలుకుని ఎన్నో విషయాలలో భార్యాభర్తల మధ్య గొడవలు వస్తూనే ఉంటాయి. చిన్న చిన్న విషయాలపై వాదనలు ప్రతి వైవాహిక జీవితంలో ఒక భాగమే. డబ్బు.. ప్రేమకు దాని స్థానం ఉంది, అలాగే డబ్బుకు దాని స్థానం ఉంది. పెళ్లి తర్వాత, ఇంటి బడ్జెట్‌ను రూపొందించుకోవడం, ఖర్చులను నిర్వహించుకోవడం, పొదుపు గురించి ఆలోచించడం వంటివి చాలా కీలకమవుతాయి. పెళ్లి తర్వాత దంపతులు తమ ఆర్థిక ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయిందని గ్రహిస్తారు. కొందరు పొదుపు చేయాలనుకుంటే, మరికొందరు ఖర్చు చేయాలనుకుంటారు. మరీ ముఖ్యంగా భార్యాభర్తలు ఇద్దరూ సంపాదనా పరులైతే.. ఇద్దరి సంపాదన మీద ఒక్కరే అధికారం చూపించడం  వంటి పరిస్థితులు ఎదురైతే.. అది  వారి బంధంలో పెద్ద చీలికకు దారితీయవచ్చు. కాబట్టి వివాహం తర్వాత డబ్బు గురించి మాట్లాడటం మంచిదే కానీ.. డబ్బు కోసం బంధాన్ని విచ్చిన్నం చేయకూడదు. పర్సనల్ స్పేస్.. పెళ్లికి ముందు స్నేహితులతో మాట్లాడటం నుండి, స్నేహితులతో కలిసి బయటకు వెళ్లడం వరకు  పూర్తిగా స్వేచ్ఛగా ఉంటారు. కానీ పెళ్లి తర్వాత మారిపోతుంది. ప్రతి విషయంలోనూ  భాగస్వామిని కలుపుకోవాలి, వారి సౌకర్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. కొన్నిసార్లు తమకోసం , స్నేహితుల కోసం సమయాన్ని కేటాయించడం కూడా ఇబ్బందిగా ఉంటుంది. పైన చెప్పుకున్న విషయాలు చాలా సాధారణమైనవి. కానీ..పెళ్లికి ముందు చాలా జంటలు ఈ విషయాలలోనే ఊహించని అంచనాలు పెట్టుకుని, పెళ్లి తర్వాత చాలా డిజప్పాయింట్ అవుతారు. కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.                          *రూపశ్రీ.
 ఈ కాలంలో మందు బిళ్లలు మింగకుండా ఒక్కరు కూడా ఉండటం లేదు.  పాపం చిన్న పిల్లలు సైతం  టాబ్లెట్లు మింగాల్సిన పరిస్థితి వస్తోంది.  చాలా మాత్రల మధ్యలో ఒక సన్నని గీత ఉంటుంది. కొన్ని మాత్రలకు ఇది ఉండదు, కానీ చాలా మందులకు ఉంటుంది.  ఈ టాబ్లెట్ల మీద గీత చూసిన చాలామంది ఇది ఒక డిజైన్ అని అనుకుంటారు, కానీ ఈ గీత వెనుక పెద్ద కథే ఉంది.. వైద్య పరిభాషలో, ఈ గీతను స్కోర్ లైన్ అంటారు. మందును సమాన భాగాలుగా విభజించడానికి ఈ గీతను రూపొందిస్తారని  నిపుణులు చెబుతున్నారు. టాబ్లెట్స్ పైన ఈ గీతలు ఎందుకు ఉంటాయి.  ఫార్మా కంపెనీలు ఇలా టాబ్లెట్ల మీద గీతలు ఉంచడం వెనుక కారణం ఏంటి?  వివరంగా తెలుసుకుంటే.. టాబ్లెట్ల మీద గీత.. నిపుణుల అభిప్రాయం ప్రకారం, కొన్ని మాత్రలపై ఉండే గీత మందును సమాన భాగాలుగా విడగొట్టడానికి సహాయపడుతుంది, తద్వారా రోగులు సులభంగా సగం మాత్రను తీసుకోవచ్చు. వైద్యులు తరచుగా సగం మాత్ర మోతాదును కూడా సూచిస్తారు. ఈ గీత మాత్రను సగానికి విరవడాన్ని సులభతరం చేస్తుంది. రోగికి సరైన మోతాదు అందేలా చూసుకోవడానికి, మాత్రను తయారుచేసేటప్పుడు ఈ గీత వచ్చేలా చేస్తారట. గీతలు లేని టాబ్లెట్లు.. మందుపై గీత లేని మాత్రలు. అంటే, టాబ్లెట్ల పై  గీత లేకపోతే ఆ మాత్రను విరవకూడదట. లేకపోతే, దాని ప్రభావం తగ్గిపోవచ్చట. కొన్ని మందులకు ఎంటెరిక్ కోటింగ్ లేదా సస్టెయిన్డ్ రిలీజ్ వంటివి ఉంటాయని, వాటిని విరిస్తే టాబ్లెట్ల ప్రభావం మారవచ్చని వైద్యులు చెబుతున్నారు. అందుకే గీత లేని టాబ్లెట్లను విరవడం వల్ల దుష్ప్రభావాల ప్రమాదం పెరగవచ్చని అంటున్నారు. డిజైన్ మాత్రం కాదు.. నిపుణుల అభిప్రాయం ప్రకారం, టాబ్లెట్ మధ్యలో ఉండే గీత కేవలం డిజైన్ కోసం పెట్టేది కాదు.  అది టాబ్లెట్ డోస్ తీసుకోవడానికి సహాయపడుతుంది. ఆ గీత టాబ్లెట్‌ను సులభంగా విరవడానికి వీలు కల్పిస్తుంది. టాబ్లెట్ లో సగం డోసు తీసుకోవాల్సిన వారు  టాబ్లెట్‌ను సమాన భాగాలుగా విరవకపోతే సరైన డోస్ తీసుకోలేరు. దీని వల్ల  మందు కూడా ప్రభావవంతంగా పనిచేయదు.                                 *రూపశ్రీ.
ఇప్ప‌టి వ‌ర‌కూ ఒక న‌టుడు పార్టీ  పెట్టి  పోటీ చేసిన తొలి ఎన్నికల్లో తెచ్చుకున్న ఓట్ల  శాతం ఎంత?  వీరిలో అత్య‌ధిక ఓట్ల శాతం తెచ్చుకున్న ఆ గొప్ప  న‌టుడు ఎవ‌రు? అన్న‌దిప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కార‌ణం విజ‌య్ టీవీకే పార్టీ పెట్టి ఆ పార్టీని ప్ర‌స్తుతం  ఎన్నిక‌ల  ప‌రీక్ష‌కు నిల‌ప‌డంతో.. ఇతర  న‌టుల పార్టీలు, అవి తొలి సారి  ఎన్నిక‌ల్లో పాల్గొన్న‌పుడు సాధించిన ఓట్ల శాతం ఎంత‌? అన్న ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు తెర‌లేచింది. వారిలో టాప్ మోస్ట్ ఎవ‌ర‌ని చూస్తే.. డౌటెందుకు అన్న  ఎన్టీఆర్.  ఇదిరా  తెలుగోడి స‌త్తా  అన్న మాట వినిపిస్తోంది. మిగిలిన వారి ఓటింగ్ శాత‌మెంత‌? ఎన్టీఆర్ సాధించిన ఓట్ షేర్ ఏమిటి అని చూస్తే.. ఎన్టీఆర్.. పార్టీ స్థాపించిన 9 నెలలలో  వచ్చిన ఎన్నికలలో తొలి సారి పోటీ చేసి.. 46.30శాతంతో పార్టీని 201 స్థానాలలో గెలిపించారు. ఇక  ఎంజీఆర్ తన తొలి ప్రయత్నంలో 33.52శాతంతో  130 స్థానాలు, చిరంజీవి 16.32శాతంతో 18స్థానాలనూ దక్కించుకున్నారు. ఆ తరువాత తమిళనటుడు  విజయకాంత్ తన పార్టీని తొలి ప్రయత్నంలో  8.38 ఓట్ల శాతంతో శాతంతో ఒక స్థానంలో మాత్రమే విజయం సాధించారు.  ఇక జపవన్ కళ్యాణ్- 5.53శాతంతో ఒక స్థానం,  కమలహాసన్- 2.52శాతంతో జీరో స్థానాలు సాధించారు. ఇక  ఇప్పుడు విజయ్.. తన తొలి ప్రయత్నంలో ఎంత శాతం ఓట్లు సాధిస్తారు? ఎన్ని సీట్లలో ఆయన పార్టీ విజయం సాధిస్తుంది అన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తం అవుతోంది.   స‌ర్వేల‌ను బ‌ట్టీ  చూస్తే ఆయ‌న‌కు 15- 19 శాతం ఓట్ షేర్ రావ‌చ్చ‌నీ.. ఆయ‌న సాధించ‌బోయే  సీట్ల  సంఖ్య ఓ డజను  వ‌ర‌కూ ఉండొచ్చ‌నీ అంటున్నారు సెఫాల‌జిస్టులు.    ఏది ఏమైనా ఒక న‌టుడు పెట్టిన పార్టీ  తొలి ఎన్నిక‌ల్లో సాధించిన ఓట్ల శాతం, గెలిచిన సీట్ల సంఖ్యలో ఇప్పటి వరకూ ఎన్టీఆరే టాప్. ఇది మ‌రో న‌టుడికి  ఎప్పటికీ సాధ్యం కాదంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఎన్టీఆర్ ఆల్ టైం గ్రేట్ రికార్డ్ ని బ్రేక్  అయ్యే అవకాశాలే లేవని విశ్లేషిస్తున్నారు.   
క‌విత కొత్త పార్టీ పేరేంటి?  గుర్తు ఎలాంటిది? ఆమె పార్టీ జెండా, అజెండా ఎలా ఉండ‌బోతున్నాయ్? అన్న స‌స్పెన్స్ నడుస్తోంది. అయితే క‌విత పార్టీ జెండా ప‌సుపు, నీలం, ఆకుప‌చ్చ  రంగుల్లో లేదా వీటిలో ఏ రెండు రంగులతోనైనా ఉంటుందని అంటున్నారు.  ఇక ఆమె స‌ర్వోద‌య గురించి మాట్లాడతారు. అంటే , స‌బ్బండ వ‌ర్ణాల వార‌ని అర్ధం. ఆపై ఇంకా కొంద‌రు ఉద్య‌మ‌కారుల‌కు న్యాయం జ‌ర‌గ‌లేద‌నీ చెబుతున్నారు. బీసీ, మ‌హిళ‌, యువ‌త సంగ‌తి స‌రే  స‌రి. వీట‌న్నిటిని బట్టి చూస్తే.. కవిత అంద‌రికీ న్యాయం, ధ‌ర్మం జ‌ర‌గాల‌ని కోరుకుంటున్న‌ట్టుగా  భావించవచ్చు. అందుకే ధ‌ర్మ‌గంట ఆమె త‌న గుర్తుగా ఎంపిక చేసుకున్న‌ట్టు కూడా  తెలుస్తోంది. అందుకే క‌విత పార్టీ గుర్తు ధ‌ర్మ‌గంట‌, ఇక రంగులు ప‌సుపు, నీలం, ప‌చ్చ‌ల కాంబినేష‌న్లో ఉండొచ్చ‌ని తెలుస్తోంది. ప‌సుపు ఒక మ‌హిళ‌కు ఎంత ముఖ్య‌మో తెలిసిందే. ఆపై నీలం అంటే ద‌ళిత సందేశం ఇస్తుంది. ఇక పోతే ఆకుప‌చ్చ అంటే అది భార‌త జెండాలో ఒక భాగం. ముస్లీం మైనార్టీల‌ను ఏకం చేసేది. కాబ‌ట్టి క‌విత జెండా రంగుల్లో ఇవి ప్ర‌ముఖంగా  ఉండొచ్చ‌ని తెలుస్తోంది. దీంతో క‌విత ప్ర‌క‌టించ‌బోయే పార్టీ జెండా రంగులు, గుర్తు ఆల్రెడీ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నారు. బేసిగ్గా అయితే ఆమె ఒక్క‌రోజు ఆగండి.. తిన‌బోతూ రుచులెందుకు అని అంటున్నారు క‌విత‌. కానీ కొంద‌రు కార్య‌క‌ర్త‌లు అత్యుత్సాహం కొద్దీ వీటిని ముందుగానే సోష‌ల్ మీడియాలో తిప్పేస్తున్న‌ట్టు స‌మాచారం.
పశ్చిమ బెంగాల్  అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్  గురువారం (ఏప్రిల్ 23)జరిగిన సంగతి తెలిసిందే. ఈ పోలింగ్ ఒక చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఓటర్లు భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు.  గణాంకాల ప్రకారం, రాష్ట్రంలో ఓటింగ్ శాతం  92 శాతాన్ని అధిగమించింది. ఇది బెంగాల్ ఎన్నికల చరిత్రలోనే అత్యధికం కావడం విశేషం. ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని ఈ భారీ ఓటింగ్ ప్రతిబింబిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గురువారం (ఏప్రిల్ 23)  జరిగిన మొదటి దశ ఎన్నికల్లో 152 నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహించారు. ఉదయం నుంచే ఓటర్లు ఉత్సాహంగా క్యూ లైన్లలో నిలబడ్డారు. తుది గణాంకాల ప్రకారం, ఓటింగ్ శాతం 92.03 శాతంగా నమోదైంది. ముఖ్యంగా దక్షిణ దినాజ్‌పూర్ జిల్లాలో అత్యధికంగా 94.98 శాతం ఓటింగ్ జరగగా, కూచ్ బెహార్‌లో 94.75 శాతం, బీర్భూమ్‌లో 93.88 శాతం ఓట్లు నమోదయ్యాయి. రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లోనూ 82 శాతానికి పైగా పోలింగ్ జరగడం విశేషం. బెంగాల్ ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే, ఓటింగ్ శాతం క్రమంగా పెరుగుతూ వస్తోంది. 1969లో కేవలం 70 శాతంగా ఉన్న ఓటింగ్, 1987 నాటికి 78 శాతానికి చేరింది. ఆ తర్వాత 1996లో 80 శాతం, 2011లో 84 శాతంగా నమోదైంది. గత 2021 ఎన్నికల్లో 82 శాతానికి పరిమితమైన ఓటింగ్..  ఇప్పుడు 2026లో ఏకంగా 92 శాతాన్ని దాటి సరికొత్త రికార్డును సృష్టించింది. ఈ భారీ ఓటింగ్ నమోదు కావడంలో కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న చర్యలు కూడా కీలకమని చెప్పవచ్చు.  రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2,400 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అక్కడక్కడా చిన్నపాటి ఘర్షణలు చోటుచేసుకున్నప్పటికీ..  పోలింగ్ ప్రక్రియ సాఫీగా సాగడం పట్ల ఎన్నికల ప్రధాన కమిషనర్ సంతృప్తి వ్యక్తం చేశారు. స్వేచ్ఛాయుత  వాతావరణంలో పోలింగ్ జరగడం వల్లే ప్రజలు ఇంత భారీగా తరలివచ్చారని అధికారులు భావిస్తున్నారు.  ఓటింగ్ శాతం భారీగా పెరగడంపై రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. అధికార తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ,  ఇతర కూటములు ఈ రికార్డు స్థాయి పోలింగ్‌ను తమకు అనుకూలం అంటే తమకు అనుకూలమని విశ్లేషణలు చేస్తున్నారు.  ఓటు హక్కును కాపాడుకోవడానికి ప్రజలు పెద్ద ఎత్తున స్పందించారని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొనగా, ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఓటర్ల ఉత్సాహాన్ని అభినందించారు. ముఖ్యంగా ఓటర్ల జాబితాలో జరిగిన మార్పులు, సిటిజన్‌షిప్ అంశాలు కూడా ప్రజలను చైతన్యపరిచినట్లు  పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.    మొదటి దశలో 1,478 మంది అభ్యర్థుల భవిష్యత్తు ఇప్పుడు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఏప్రిల్ 29న రెండో దశ పోలింగ్ జరగనుంది, మే 4న ఫలితాలు వెలువడనున్నాయి. మొదటి దశలో కనిపించిన ఈ ఉత్సాహం రెండో దశలోనూ కొనసాగుతుందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఎన్నికల ఫలితం బెంగాల్ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించడమే కాకుండా, దేశ రాజకీయాలపై కూడా బలమైన ముద్ర వేసే అవకాశం ఉందంటున్నారు.
ఇనుప పాత్రలో వంట చేయడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతారు. ఎందుకంటే ఇనుప పాత్రలో వంట చేయడం వల్ల ఆ ఆహారాన్ని ఐరన్ ఖనిజం చేరుతుంది.  దీని వల్ల శరీరానికి ఐరన్ ఎలాంటి సప్లిమెంట్ అవసరం లేకుండా కొద్దిమోతాదులో అందుతుంది.  అయితే  అన్ని రకాల కూరగాయలను ఇనుప పాత్రలో వండకూడదు.  . కొన్ని కూరగాయలు ఐరన్ పాత్రలో వండినప్పుడు రియాక్షన్ జరిగి వాటి రుచి, రంగు లేదా పోషక విలువల్లో మార్పులు జరిగే అవకాశం ఉంటుంది.  ఆహారం  నాణ్యత , రుచిని కోల్పోకుండా ఉండేందుకు, ఐరన్ పాత్రలు వాడే ప్తి ఒక్కరూ వాటిలో వండకూడని కూరగాయలు ఏమిటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. టమోటా.. టమోటాలు వంటల్లో ఎక్కువగా ఉపయోగించే  కూరగాయ. టమోటాలలో ఆమ్లం అధిక మొత్తంలో ఉంటుంది, ఇది ఐరన్ తో చర్య జరుపుతుంది. దీనివల్ల కూరగాయ రంగు ముదురుగా మారవచ్చు , కొద్దిగా వగరు రుచిని కలిగి ఉండవచ్చు. ఎక్కువసేపు వండటం ఈ ప్రభావాన్ని మరింత ఎక్కువ చేస్తుంది. అందువల్ల, టమోటా వంటి  కూరగాయలను స్టీల్ లేదా నాన్-స్టిక్ పాన్ లేదా బౌల్స్ లో వండాలి. పాలకూర.. పాలకూర వంటి ఆకుకూరలు ఐరన్ ప్రభావానికి గురైనప్పుడు వాటి  ఆకుపచ్చ రంగును కోల్పోయి, ముదురు రంగులోకి లేదా నల్లగా మారవచ్చు, దీనివల్ల అవి తినడానికి పనికిరావు. రుచిలో కూడా కొద్దిగా మార్పు ఉంటుంది. ఆకుకూరలను అల్యూమినియం లేదా స్టీల్ పాత్రలలో వండటం ఉత్తమం. చింతపండు.. చింతపండు ఉపయోగించి వండే  కూరను ఇనుప పెనంలో వండకూడదు. వీటిలో ఉండే ఆమ్లాలు ఇనుముతో చర్య జరిపి ఆహారం రుచిని మార్చి, దానికి లోహపు రుచిని ఇస్తాయి. ఇది అనారోగ్యకరమైనదిగా కూడా పరిగణించబడుతుంది. అందువల్ల, స్టీల్ లేదా నాన్-స్టిక్ పెనాన్ని ఉపయోగించాలి.  కేవలం చింతపండు మాత్రమే కాకుండా నిమ్మకాయ,  మామిడికాయ వంటివి కూడా ఐరన్ పాత్రలలో వండకూడదు. పెరుగు వంటలు.. పెరుగుతో చేసిన కూర లేదా పెరుగు గ్రేవీ వంటి కూరగాయల వంటకాలను ఇనుప పెనంలో వండినప్పుడు వాటి రుచి భిన్నంగా ఉంటుంది. పెరుగులోని పులుపు ఇనుముతో కలిసి కొద్దిగా చేదును కలిగిస్తుంది. అంతేకాకుండా రంగు ముదురుగా మారవచ్చు , కూరలో కొద్దిగా నలుపు కనిపించవచ్చు. నిమ్మకాయ.. కూరగాయలకు నిమ్మరసం కలపడం వల్ల వాటికి కొద్దిగా పులుపు, రుచి వస్తుంది, కానీ అది ఐరన్ తో  చర్య జరిపి రుచిని పాడుచేసే అవకాశం ఉంది.  దీనివల్ల ఆహారానికి లోహపు, వగరు రుచి వస్తుంది, కాబట్టి నిమ్మరసాన్ని ఎల్లప్పుడూ వంట చేసిన తర్వాత, తినడానికి ముందు మాత్రమే కలపాలి. ఎక్కువ నీటి శాతం కలిగిన కూరలు.. అధిక నీటి శాతం ఉన్న కూరగాయలను ఐరన్ పెనంలో వండినప్పుడు వాటి రంగు, ఆకృతి మారవచ్చు. ఈ కూరగాయలను ఎక్కువ సేపు వండితే నల్లగా మారిపోతాయి. అందువల్ల వాటిని రసాయనాలతో చర్య జరపని పాత్రలలో వండటం మంచిది.                               *రూపశ్రీ.
  ఈ రోజుల్లో పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరు   ఎక్కువ సమయాన్ని మొబైల్, ల్యాప్‌టాప్ లేదా టాబ్లెట్ స్క్రీన్‌ల ముందు గడుపుతున్నారు. దీని ఫలితంగా, కంటి అలసట , చికాకు సర్వసాధారణమైపోయాయి. ఈ సమస్య నుండి కళ్లకు ఉపశమం కలిగించడానికి చాలా మంది బ్లూ లైట్ కళ్లద్దాలు వాడుతున్నారు.  ప్రస్తుతం ఈ బ్లూ లైట్ కళ్లద్దాల వినియోగం చాలా ఎక్కువైంది కూడా.  అయితే, ఈ కళ్లద్దాలు నిజంగా  కళ్లకు రక్షణ కవచంలా పనిచేస్తాయా? , లేక ఇవి కేవలం ఒక ట్రెండ్‌లో భాగమా? కంటి సంరక్షణ నిపుణులు దీని గురించి ఏం చెప్తున్నారు? తెలుసుకుంటే.. బ్లూ లైట్ ఎఫెక్ట్.. నీలి కాంతి అనేది ఒక రకమైన అధిక శక్తి గల కాంతి. ఇది కేవలం డిజిటల్ స్క్రీన్‌ల నుండే కాకుండా, సూర్యరశ్మి నుండి కూడా వెలువడుతుంది. మనం గంటల తరబడి స్క్రీన్‌లను చూస్తూ ఉన్నప్పుడు, కళ్ళు పొడిబారడం, చికాకు, అలసట , తలనొప్పి వంటి కంటి సమస్యలను ఎదురవుతాయి. ఇలా కంటి సమస్యలు రావడాన్ని  డిజిటల్ ఐ స్ట్రెయిన్ అని అంటారు. ఈ సమస్యలకు స్క్రీన్‌ల నుండి వెలువడే నీలి కాంతియే ప్రధాన కారణమని చాలా మంది భావిస్తారు. బ్లూ లైట్ గ్లాసెస్.. మార్కెట్లో లభించే బ్లూ లైట్ గ్లాసెస్, వాటి ప్రత్యేక లెన్సులు నీలి కాంతిని కళ్ళలోకి చేరకుండా అడ్డుకుంటాయని బ్లూ లైట్ గ్లాసెస్ అమ్మకం దారులు చెబుతారు. నీలి కాంతి మనిషిలో నిద్ర హార్మోన్లను ప్రభావితం చేస్తుంది కాబట్టి, ఇది కంటి ఒత్తిడిని తగ్గించి, నిద్రను మెరుగుపరుస్తుందని కంపెనీలు వాదిస్తున్నాయి. అయితే శాస్త్రీయంగా ఇది నిరూపణ కాలేదు.  బ్లూ లైట్ గ్లాసెస్ అమ్మకం దారులు చెప్పే విషయాలను పరిశోధనలు సమర్థించడం లేదు. పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే.. బ్లూ లైట్ గ్లాసెస్  కంటి అలసటను తగ్గించడంలో అంత ప్రభావవంతంగా ఉండవు.  కంటి నొప్పి , పొడిబారడానికి అసలు కారణం బ్లూ లైట్ కాదు,  విరామం లేకుండా తదేకంగా  స్క్రీన్‌ను చూడటం ద్వారానే అసలు సమస్య వస్తోంది , కూర్చున్నప్పుడు  తప్పు పొజిషన్ లో కూర్చోవడం,  స్క్రీన్‌ను చూస్తున్నప్పుడు తక్కువగా కనురెప్పలు వాల్చడం వంటివి కళ్లకు అలసట, పొడిబారడం వంటి సమస్యలు తెచ్చిపెడతాయి. అందువల్ల, కేవలం కళ్లజోడు పెట్టుకోవడం వల్ల ఈ సమస్యను పూర్తిగా తొలగించలేము. బ్లూ లైట్ గ్లాసెస్ పనికిరావా? బ్లూ లైట్  కళ్లద్దాలు ధరించడం వల్ల కొంతమందికి కొంత సౌకర్యం కలగవచ్చనేది నిజమే. ముఖ్యంగా రాత్రి పొద్దుపోయే వరకు తమ మొబైల్ ఫోన్లు లేదా ల్యాప్‌టాప్‌లపై పనిచేసే వారికి కొంత ఉపశమనం లభించవచ్చు లేదా వారి నిద్ర పోవడానికి ఎక్కువ రిస్క్ లేకుండా ఈ బ్లూ లైట్ కళ్లద్దాలు కాస్త హెల్ప్ చేయవచ్చు.   కానీ పూర్తి కంటి రక్షణకు ఈ కళ్లద్దాలు పెట్టుకోవడం  ఏకైక పరిష్కారంగా భావించడం సరికాదని వైద్యులు చెబుతున్నారు.                                    *రూపశ్రీ.
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో సరైన నిద్ర లేకపోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే, రాత్రి పూట సరైన సమయానికి నిద్రపోవడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా రాత్రి 10 గంటలకు నిద్రపోవాలని  వైద్య నిపుణులు ఎందుకు చెబుతున్నారు? దీని వెనుక ఉన్న రహస్యాలేమిటో ఈ వీడియోలో చూద్దాం.  ముఖ్య అంశాలు: శరీర పునరుద్ధరణ: రాత్రి 10 నుండి తెల్లవారుజామున 2 గంటల మధ్య మన శరీరంలో కణాల మరమ్మత్తు ప్రక్రియ వేగంగా జరుగుతుంది.  మెదడు ఆరోగ్యం: సరైన సమయానికి నిద్రపోవడం వల్ల మెదడు చురుగ్గా మారుతుంది, ఒత్తిడి (Stress) తగ్గుతుంది మరియు జ్ఞాపకశక్తి పెరుగుతుంది.  యునానీ వైద్య విధానం: నిద్ర మరియు ఆరోగ్యంపై యునానీ వైద్య శాస్త్రం చెప్పిన అద్భుతమైన ఆరోగ్య సూత్రాలు.  బరువు నియంత్రణ: సరైన నిద్ర జీవక్రియను (Metabolism) మెరుగుపరిచి, బరువు తగ్గడానికి ఎలా సహాయపడుతుందో వివరించబడింది. మీరు నిత్యం ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండాలనుకుంటే మీ నిద్ర సమయాన్ని మార్చుకోవాల్సిందే. ఈ వీడియో చూసి, రాత్రి 10 గంటల నిద్ర వల్ల కలిగే మరిన్ని లాభాలను తెలుసుకోండి! ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఆరోగ్య చిట్కాల కోసం మా యూట్యూబ్  "TeluguOne Health" ఛానెల్ ను సందర్శించండి. (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!) 🙏✨
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.