LATEST NEWS
అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నాల్లో పాకిస్థాన్ సైన్యాధిపతి జనరల్ అసిమ్ మునీర్ ఒక కీలక వ్యక్తిగా అవతరించడం ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.  డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా యంత్రాంగం మునీర్‌ను రెండు దేశాల మధ్య ఒక దౌత్య వంతెనగా (డిప్లమాటిక్ బ్రిడ్జి) భావిస్తున్నప్పటికీ..  ఇది అమెరికా జాతీయ భద్రతకు ఏ మేరకు మేలు చేస్తుందనే దానిపై నిపుణుల్లో పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.    దౌత్యం కంటే.. నష్టనివారణ అంటే డ్యామేజ్ కంట్రోల్ వైపే మొగ్గు చూపుతున్న ట్రంప్ శైలి.. వాషింగ్టన్‌లోని భద్రతా వర్గాలను కలవరపెడుతోంది. మునీర్ ప్రస్తుతం కేవలం పాకిస్థాన్ సైనిక వ్యవహారాలకే పరిమితం కాకుండా.. టెహ్రాన్, వాషింగ్టన్ మధ్య జరుగుతున్న రహస్య చర్చలలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.  అయితే..  ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. మునీర్‌కు ఇరాన్ అగ్రశ్రేణి సైనిక వర్గాలతో ఉన్న సన్నిహిత సంబంధాలు ఒకవైపు చర్చలకు సహకరిస్తాయని భావిస్తున్నా..  అదే సమయంలో ఆయన విశ్వసనీయతపై అమెరికా నిఘా సంస్థలు   అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. మధ్యవర్తిత్వం పేరుతో ఆయన అమెరికా ప్రయోజనాలకు గండి కొట్టేలా వ్యవహరిస్తారా అన్న సందేహాలు వ్యక్తం అవ్వడమే కాకుండా, ఆ దిశగా  హెచ్చరికలు సైతం జారీ అవుతున్నాయి. చరిత్రను ఒకసారి పరిశీలిస్తే..  పాకిస్థాన్ విషయంలో అమెరికా నమ్మకం పలుమార్లు వమ్ము అయింది.  ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ వ్యవహారంలో తాలిబాన్‌లకు మద్దతు ఇస్తూనే..  అమెరికా నుంచి భారీగా ఆర్థిక సాయాన్ని పొందిన గత రికార్డులను భద్రతా నిపుణులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. రెండు వైపులా చక్రం తిప్పే పాక్ వ్యూహం వల్ల వాషింగ్టన్ ఇప్పటికే చాలా నష్టపోయింది. ఇప్పుడు మునీర్‌పై అతిగా ఆధారపడటం అనేది ఒక రకమైన  జియోపాలిటికల్ జూదం  (జియోపాలిటికల్ గ్యాంబిల్)గా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఈ పరిణామాల మధ్య అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన పాకిస్థాన్ పర్యటనను అకస్మాత్తుగా రద్దు చేసుకోవడం గమనార్హం. దీనికి భద్రతా కారణాలు సాకుగా చూపుతున్నా..  తెరవెనుక నెలకొన్న అనిశ్చితి, మునీర్ నెట్‌వర్క్‌పై   అపనమ్మకమే   కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   సాంప్రదాయ దౌత్య మార్గాలను కాదని, స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ వంటి వ్యక్తిగత సన్నిహితుల ద్వారా ట్రంప్ ఈ వ్యవహారాన్ని నడిపించడం చర్చలకు ఇసుమంతైనా పారదర్శకత లేదనే అనుమానాలను  బలపరుస్తోంది. డొనాల్డ్ ట్రంప్ తన వ్యాపార శైలికి తగ్గట్టుగా  డీల్ ఫస్ట్ అనే సూత్రంతో ముందుకు వెళ్తున్నారు. ఆయన దృష్టిలో మునీర్ ఒక  ఉపయోగకరమైన  వ్యక్తిగా కనిపిస్తున్నారు. అందుకే ఆయనను తన  ఫేవరెట్ ఫీల్డ్ మార్షల్  గా మునీర్ ను అభివర్ణిస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు.  అయితే అంతర్జాతీయ సంబంధాలు కేవలం వ్యక్తిగత సాన్నిహిత్యం మీద కాకుండా.. స్పష్టమైన నిబంధనలు,  పారదర్శకత మీద నడవాలని నిపుణులు సూచిస్తున్నారు. మునీర్ విషయంలో పారదర్శకత సందేహాస్పదంమే. .మధ్యవర్తులను నియమించుకోవడం సులభమే కానీ, వారిని నియంత్రించడం చాలా కష్టం అంటారు. పాకిస్థాన్ గతం,  మునీర్‌కు ఉన్న ఇతర దేశాల సంబంధాలు అమెరికా వ్యూహాన్ని బలహీనపరిచేవిగానే ఉన్నాయి.  శాంతి ఒప్పందాల కోసం తీసుకుంటున్న ఈ చర్యలే రేపు భద్రతా లోపాలుగా మారితే అమెరికా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందనడంలో సందేహం లేదు.    ప్రస్తుతానికి మునీర్‌ను ఎంతగా నమ్మినా, అప్రమత్తత అవసరమని అమెరికా నిఘా వ్యవస్థ స్పష్టం చేస్తోంది. చివరిగా అమెరికాకు ఇప్పుడు కావాల్సింది కేవలం మధ్యవర్తులు కాదు, ఒక పటిష్టమైన, అదే సమయంలో విశ్వసనీయ విదేశాంగ విధానం. వ్యక్తిగత సంబంధాలపై ఆధారపడి చేసే దౌత్యం తాత్కాలికంగా ఫలితాలను ఇచ్చినా..  దీర్ఘకాలంలో దేశ ప్రయోజనాలను ప్రమాదంలో నెట్టే అవకాశం ఉంది. మరి మునీర్ అనే ఈ దౌత్య వంతెన అమెరికాను సురక్షితంగా ఇవతలి ఒడ్డుకు చేరుస్తుందో లేక కొత్త సమస్యల్లోకి నెడుతుందో వేచి చూడాలి. -సీతారాం కంఠంనేని
తమిళనాడు రాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ప్రచారం చేస్తున్న ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి శృంగభంగం తప్పదని సిపిఐ నారాయణ  అన్నారు.  దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అధికారంలో ఉన్నప్పుడు తమిళనాడు రాష్ట్రంలోని తెలుగు భాష బోధించే పాఠశాలను మూసేస్తామని అసెంబ్లీలో తీర్మానం తీసుకొచ్చినప్పుడు తమిళనాడు రాష్ట్రంలో నివసిస్తున్న  తెలుగు ప్రజలు దీనిపై స్పందించాలని చంద్రబాబు నాయుడుని నేరుగా కలిసి విన్నవించుకున్నా పట్టించుకోలేదనీ, అటువంటి చంద్రబాబు ప్రస్తుతం మోడీని కాపాడేందుకు ఎన్డీఏ తరపున తెలుగు ప్రజల మధ్య ప్రచారానికెళ్లడం విడ్డూరమన్నారు. నాడు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి, నేడు తెలుగు ప్రజల దగ్గరికి వెళ్లి ఓట్లు అడగడం సబబు కాదని నారాయణ అన్నారు.    అప్పట్లో తెలుగు స్కూళ్ల మూసివేత పై తలీ నియోజకవర్గం ఎమ్మెల్యే రామచంద్రన్ గట్టిగా జయలలిత ప్రభుత్వంతో కొట్లాడి తీర్మానాన్ని వెనక్కి తీసుకునేలా చేశారనీ..  ఆ విషయాన్ని   తెలుగు ప్రజలు గానీ మర్చిరన్నారు. చంద్రబాబు నాయుడు మోడీని ఎంత వెనకేసుకొచ్చినా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే, కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీల కూటమి ఏ గెలుపొందుతుందన్న నారాయణ..  చంద్రబాబుకి తమిళనాడులో శృంగభంగం తప్పదని చెప్పారు.
బెంగాల్ చరిత్రను చూస్తే..  ఇది కేవలం ఒక రాష్ట్రం కాదు. భారత ఉపఖండం ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ పరిణామాల్లో కీలక పాత్ర పోషించిన ప్రాంతం. మొఘల్ కాలంలో హుగ్లీ నది పరివాహక ప్రాంతం.. ఓడరేవులు, జనపనార, మస్లిన్, పట్టు, నౌకా నిర్మాణం వంటి రంగాల ద్వారా బెంగాల్ భారత వాణిజ్య వ్యవస్థలో ప్రధాన స్థానం దక్కించుకుంది. బ్రిటిష్ పాలనలో కూడా కోలకత్తా 1911 వరకు రాజధానిగా ఉండటం వల్ల ఈ ప్రాంతం దేశవ్యాప్తంగా మేధో, రాజకీయ ప్రభావాన్ని కొనసాగించింది. బెంగాల్ పునరుజ్జీవనం: ఆలోచనల కేంద్రబిందువు 19వ శతాబ్దంలో రూపుదిద్దుకున్న బెంగాల్ పునరుజ్జీవనం భారత ఆధునిక చరిత్రలో ఒక మలుపు. రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, బంకిం చంద్ర చట్టోపాధ్యాయ, రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి మహనీయులు సమాజ సంస్కరణలు, విద్య, సాహిత్యం, జాతీయ చైతన్యం వంటి రంగాల్లో కొత్త దిశను చూపించారు. భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావ దశలోనూ బెంగాలీ నాయకుల ప్రాబల్యం స్పష్టంగా కనిపించింది. అందువల్ల బెంగాల్ కేవలం భౌగోళిక ప్రాంతం కాకుండా, భారత రాజకీయ ఆలోచనలకు ఒక ప్రయోగశాలగా నిలిచింది. విభజనల ప్రభావం.. రాజకీయ బలం క్షీణత  ఆరంభం బెంగాల్ పతనానికి ప్రధాన మలుపు 1905 విభజన. బ్రిటిష్  విభజించి పాలించు  విధానం హిందూ–ముస్లిం విభేదాలను మరింత లో ఎగదోసి, ప్రాంతీయ సమైక్యతను దెబ్బతీసింది. 1911లో రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చడం బెంగాల్ రాజకీయ ప్రాధాన్యాన్ని తగ్గించింది. 1947 విభజన తర్వాత తూర్పు భాగం పాకిస్తాన్‌లోకి వెళ్లడం, వలసలు, మార్కెట్ విభజన, సరిహద్దు రాజకీయాలు.. ఇవన్నీ  కలిసి బెంగాల్ ఆర్థిక నిర్మాణాన్ని దీర్ఘకాలంలో బలహీనపరిచాయి.  1947 తరువాత కూడా బెంగాల్ వెంటనే కూలిపోలేదు. పారిశ్రామిక పునాది, విద్యా సంప్రదాయం, పట్టణ మధ్యతరగతి, వాణిజ్య వాతావరణం దీన్ని కొంతకాలం నిలబెట్టాయి. కానీ ఈ ప్రారంభ బలం క్రమంగా రాజకీయ అస్థిరత, యూనియన్ సంఘర్షణలు, పరిశ్రమల పట్ల అపనమ్మకం, విధాన వైఫల్యాల కింద క్షీణించసాగింది. లెఫ్ట్ ఫ్రంట్ యుగం.. సంక్షేమం, నియంత్రణ, నెమ్మదిగా క్షీణించిన పారిశ్రామిక పునాది 1977 తరువాత దశాబ్దాలపాటు కొనసాగిన లెఫ్ట్ ఫ్రంట్ పాలన బెంగాల్ చరిత్రలో అత్యంత ప్రభావమంతమైన ఘట్టం. ఈ పాలన గ్రామీణ పేదలకు భూ హక్కులు, పంచాయతీ బలోపేతం, స్థానిక స్వపాలన వంటి రంగాల్లో గణనీయమైన మార్పులు తీసుకువచ్చింది.  ఆపరేషన్ బర్గా  ద్వారా కౌలుదారులకు భద్రత లభించడం, గ్రామీణ జీవితంలో లెఫ్ట్‌కు దీర్ఘకాలిక మద్దతును నిర్మించింది.  అయితే ఇదే కాలంలో పారిశ్రామిక వృద్ధి క్రమంగా వెనక్కి వెళ్లింది. సమ్మెలు, లాకౌట్లు, ఘెరావ్ లు, కేడర్ ఆధారిత రాజకీయ ప్రభావం, పెట్టుబడుల పట్ల అపనమ్మకం ఇవి పరిశ్రమలకు ప్రతికూల వాతావరణాన్ని సృష్టించాయి. బెంగాల్ ఒకప్పుడు దేశ పరిశ్రమల్లో నాయకత్వం వహించిన రాష్ట్రం అయినప్పటికీ..  కాలక్రమంలో అది పెట్టుబడిదారులకు ప్రమాదకరమైన గమ్యంగా మారడం ప్రారంభమైంది. ఈ మార్పు ఒక్క రాత్రిలో జరగలేదు..  కానీ దశాబ్దాలపాటు పేరుకుపోయిన విధాన వైఫల్యాలు, కార్మిక సంబంధాల దృఢత్వం,   రాజకీయ నియంత్రణ దానిని లోపలినుంచి బలహీనపరిచాయి. సింగూర్, నందిగ్రామ్.. రాజకీయ మార్పుకు మలుపు 2000ల మధ్యలో సింగూర్, నందిగ్రామ్ ఘటనలు బెంగాల్ రాజకీయ సమీకరణాన్ని మార్చాయి. టాటా నానో ప్రాజెక్ట్ కోసం భూసేకరణపై వచ్చిన వ్యతిరేకత, నందిగ్రామ్‌లో రసాయన హబ్ ప్రతిపాదనపై నిరసనలు, పోలీసు చర్యలు, హింస   అన్నీ లెఫ్ట్ ఫ్రంట్‌ను ప్రజల దృష్టిలో తిరిగి నిర్వచించాయి.  ఈ పోరాటాన్ని మమతా బెనర్జీ తన రాజకీయ ఎదుగుదలకు బలంగా వినియోగించుకున్నారు. కాంగ్రెస్ నుంచి టీఎంసీ స్థాపన వరకు ఆమె ప్రయాణం, ఆమెను  ప్రజల పక్షాన నిలిచే నాయకురాలు గా ఎదగడానికి సహాయపడింది. సింగూర్, నందిగ్రామ్ నేపథ్యంలో టీఎంసీ 2011లో  అధికారంలోకి వచ్చింది. టీఎంసీ పాలన.. సంక్షేమం బలం, పరిశ్రమల సమస్య టీఎంసీ పాలనలో రాష్ట్రం సంక్షేమ ఆధారిత రాజకీయాలను మరింత విస్తరించింది. మహిళలు, పేదలు, అణగారిన వర్గాల కోసం అనేక పథకాలు మమతా బెనర్జీకి బలమైన రాజకీయ మద్దతును అందించాయి. ఆమె వ్యక్తిగత రాజకీయ శైలి.. సాధారణ దుస్తులు, నిరాడంబరత ప్రజల మధ్య ప్రత్యక్షంగా తిరగడం ఆమెను  సహజ నాయకురాలుగా నిలబెట్టాయి.  అయితే, ఈ విజయాల వెనుక రాష్ట్రం అభివృద్ధి   అనేక సవాళ్లను ఎదుర్కొంది. పారిశ్రామిక పెట్టుబడులు పరిమితంగానే ఉండటం, ప్రధాన కార్యాలయాలు ఇతర రాష్ట్రాలకు వెళ్లడం, ఉద్యోగ సృష్టి నెమ్మదించడం వంటి సమస్యలు పెరిగాయి. బెంగాల్ తలసరి ఆదాయ స్థానం, జాతీయ ప్రమాణాలతో పోలిస్తే, మునుపటి బలంతో పోల్చితే దిగజారింది. స్థానిక అధికారం,  కట్ మనీ,  రాజకీయ ఆర్థిక వ్యవస్థ బెంగాల్ రాజకీయాల్లో అత్యంత వివాదాస్పద అంశం స్థానిక పార్టీ నెట్‌వర్క్‌ల ప్రభావం. కట్ మనీ, సిండికేట్ వ్యవస్థ, కాంట్రాక్టర్ ఆధారిత మధ్యవర్తిత్వం వంటి అంశాలు ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలోనే కాకుండా, వాటిపై రాజకీయ నియంత్రణను కూడా పెంచాయన్న విమర్శలు ఉన్నాయి. పంచాయతీ స్థాయి నుంచి బ్లాక్ స్థాయి వరకు కార్యకర్తల ప్రభావం ఉన్నప్పుడు, రాజకీయ అధికార మార్పు కేవలం ప్రభుత్వ మార్పు కాదు. అది స్థానిక ఆర్థిక వ్యవస్థలోని అధికారం మార్పుగా మారుతుంది. ఇది ఎన్నికల హింసను కూడా పెంచుతుంది. బెంగాల్‌లో పోలింగ్ బూత్‌ల వద్ద కేంద్ర బలగాల మోహరింపు హింసను తగ్గిస్తుందని అనేకసార్లు రుజువైంది. అంటే..  రాష్ట్రంలోని ప్రజాస్వామ్య ప్రక్రియ ఇప్పటికీ పూర్తిగా సాధారణీకరించబడలేదని ఇది సూచిస్తుంది. మతం, వలసలు, మరియు ఓటు రాజకీయాలు బెంగాల్ రాజకీయ చర్చలో ముస్లిం జనాభా పెరుగుదల, సరిహద్దు వలసలు, మరియు గుర్తింపు రాజకీయాలు కూడా కీలక అంశాలుగా మారాయి. అయితే ఈ అంశాలను పరిశీలించేటప్పుడు జాగ్రత్త అవసరం. జనాభా మార్పు, సరిహద్దు భౌగోళికత, ఆర్థిక వలస, డాక్యుమెంటేషన్ సమస్యలు,  రాజకీయ ఆధారాలు  అన్నీ కలిసి ఒక క్లిష్టమైన నిజాన్ని రూపొందిస్తాయి. కేవలం మత గణాంకాలతో మాత్రమే రాజకీయ మార్పును వివరించడం సరిపోదు. అదే సమయంలో, మైనారిటీ ఓటు బ్యాంకు, పార్టీల వ్యూహాలు,   స్థానిక నాయకత్వం మిళితమై ఎన్నికల సమీకరణాన్ని ప్రభావితం చేస్తాయని కూడా అంగీకరించాలి. బెంగాల్‌లో మతం కేవలం విశ్వాస సమస్య కాదు..  అది రాజకీయ ప్రతినిధిత్వం, భద్రత, అభివృద్ధి,   గుర్తింపు ప్రశ్నలతో ముడిపడిన అంశం. నేటి ప్రశ్న: బెంగాల్ తిరిగి ఎటు? బెంగాల్ పునరుజ్జీవనం ఇచ్చిన సాంస్కృతిక గొప్పతనం, లెఫ్ట్ ఫ్రంట్ అందించిన గ్రామీణ భద్రత, టీఎంసీ ఇచ్చిన సంక్షేమ ముఖచిత్రం.. ఈ మూడింటి మధ్య రాష్ట్రం తన అభివృద్ధి దారిని ఇంకా వెతుకుతోంది. కానీ వాస్తవం ఏమిటంటే..  కేవలం నినాదాలతో, పెట్టుబడి సమ్మేళనాలతో, లేదా చిహ్నాత్మక రాజకీయాలతో బెంగాల్ పాత వైభవాన్ని తిరిగి పొందలేదు. అందుకు దీర్ఘకాలిక పెట్టుబడి భరోసా, శాంతిభద్రతల స్థిరత్వం, పరిశ్రమలకు అనుకూలమైన విధానాలు, మరియు రాజకీయ హింసపై కఠిన నియంత్రణ అవసరం. రాష్ట్రం ఒకప్పుడు భారతదేశానికి మేధో కేంద్రంగా నిలిచింది. భవిష్యత్తులో అది మళ్లీ ఆ స్థానాన్ని దక్కించుకోగలదా అనే ప్రశ్న, ఇప్పుడు బెంగాల్ రాజకీయాల కేంద్రంలో ఉంది. Reference: రాహుల్ సాంకృత్యాయన్ జీవన తాత్వికత - పిళ్లా కుమారస్వామి: రవీంద్రనాథ్ ఠాగూర్  వికీపీడియా పశ్చిమ బెంగాల్‌లో మతం భారత్-బంగ్లాదేశ్ వాస్తవిక సాదృశ సదస్సుపై సంయుక్త ప్రకటన     -సీతారాం కంఠంనేని  
ALSO ON TELUGUONE N E W S
    -రాజా సాబ్ తో  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ డీలా! -కానీ 2027 లైనప్ చూస్తే మైండ్ బ్లాంక్  -పవన్ కళ్యాణ్ తో కలిసి కూడా చిత్రాలు  -లైనప్ ఇదేనా! ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది నిర్మాతలకే ప్రత్యేకమైన క్రేజ్ అనేది ఏర్పడుతుంది.  అటువంటి అరుదైన నిర్మాతల్లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ(People Media Factory)అధినేత టీజీ విశ్వప్రసాద్(TG Vishwa Prasad)ఒకరు. సినిమాపై మక్కువతో విదేశాల నుంచి వచ్చి మరి సినిమాలని నిర్మిస్తున్నారు. కుమార్తె కీర్తి ప్రసాద్(Keerthi Prasad)ని కూడా భాగస్వామ్యం చేసుకొని మరి ముందుకు దూసుకెళ్తున్నారు. అటువంటి సినీ అభిలాషి అయిన విశ్వప్రసాద్ అప్పుడే అయిపోయిందనుకోకు, ఇప్పుడే మొదలైంది అనేలా తన లైనప్ ని సెట్ చేస్తున్నారు. ఆ వివరాలేంటో చూద్దాం పీపుల్ మీడియా  ఫ్యాక్టరీ కి ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన రాజాసాబ్ ఊహించని పరాజయాన్ని అందించింది. ప్రభాస్ వంటి పాన్ ఇండియా కట్ అవుట్ ఉన్నా 100 కోట్ల రూపాయల నష్టం మేరకు రావడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. దీంతో విశ్వప్రసాద్ పని అయిపోయిందని కొంత మంది కుహనా శక్తులు చెవులు కొరుక్కోవడం స్టార్ట్ చేసాయి. కానీ పీపుల్ మీడియా లైనప్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వడం గ్యారంటీ.  2027 సంవత్సరాన్ని టార్గెట్ చేస్తూ ఈ సంస్థ ఒక భారీ లైనప్‌ను సిద్ధం చేస్తోంది.గత ఏడాది తేజ సజ్జ తో 'మిరాయ్' తెరక్కించి హిట్ కొత్తగా ఇప్పుడు ఒక భారీ ఫిక్షన్ అండ్  యాక్షన్ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. 'రాయలసీమ నుండి ప్రపంచం చివరి వరకు' అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అడివి శేష్ గూఢచారి 2 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆద్వర్యంలోని పవన్ కళ్యాణ్ క్రియేటీవ్ వర్క్స్ తో  కలిసి మూడు చిత్రాలను నిర్మించేందుకు సిద్దమవుతుండటంతో పాటు మరికొన్ని భారీ బడ్జెట్ చిత్రాలు ప్రస్తుతం స్క్రిప్టింగ్ దశలోఉన్నాయి. ఈ చిత్రాలన్నీ కూడా 2027లో థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది. also read: Chiranjeevi: SP కి అల్టిమేట్ వార్నింగ్ ఇచ్చిన చిరంజీవి మరి ఈ స్పీడ్ చూస్తుంటే విశ్వప్రసాద్ గతంలోనే ప్రకటించినట్లుగానే వంద సినిమాల మార్కుని చేరుకోవడం పెద్ద కష్టమేమి కాదని అనిపిస్తుంది. ఇక విశ్వప్రసాద్ పని అయిపోయిందని చెవులు కోరుకునే వాళ్ళకి మరి తెలుసో లేదో , ప్రభాస్ మరో సినిమా చేస్తాడని మాట ఇచ్చాడు. ఆల్రెడీ స్క్రిప్ట్ పనులు కూడా  జరుగుతున్నాయనేది ఫిలిం సర్కిల్స్ లో ఫ్రెష్ టాక్.     
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని వెండితెరపై కనిపిస్తే ఆ వైబ్రేషన్ వేరేలా ఉంటుంది. తనదైన మేనరిజమ్స్, అదిరిపోయే డైలాగ్ డెలివరీతో యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న రామ్ కెరీర్‌లో మ‌స్కా సినిమా ఒక మైలురాయి. తాజాగా ఈ సినిమాలోని కొన్ని హై వోల్టేజ్ మాస్ యాక్షన్ సీక్వెన్స్‌లు సోషల్ మీడియాలో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ముఖ్యంగా పెళ్లి పీటల మీద రామ్ చేసే రచ్చ చూస్తుంటే ఫ్యాన్స్‌కు పూనకాలు రావాల్సిందే. ఈ వీడియోలో రామ్ తన ప్రేయసి నిశ్చితార్థాన్ని అడ్డుకోవడానికి మాస్ ఎంట్రీ ఇస్తాడు. కేవలం రెండు నిమిషాల సమయం అడిగి, అక్కడ ఉన్న పెళ్లి కూతురు తండ్రిని తుపాకీతో బెదిరించే సీన్ సినిమాకే హైలైట్. "నేను నిశ్చితార్థం చెడగొట్టడానికి రాలేదు, జస్ట్ టూ మినిట్స్" అంటూ రామ్ చెప్పే డైలాగ్స్, ఆ బాడీ లాంగ్వేజ్ అప్పట్లో థియేటర్లలో ఈలలు వేయించాయి. పాత కాలపు స్వయంవరం పద్ధతులను నేటి కాలపు ప్రేమకు ముడిపెడుతూ రామ్ చేసే హంగామా నెటిజన్లను ఆకట్టుకుంటోంది. కేవలం యాక్షన్ మాత్రమే కాదు, ఈ వీడియోలో సీనియర్ నటులతో రామ్ చేసే కామెడీ టైమింగ్ కూడా అద్భుతంగా ఉంది. నకిలీ డాక్టర్‌గా ఎంపీకి ట్రీట్‌మెంట్ చేసే సీన్లలో రామ్ ఎనర్జీ నెక్స్ట్ లెవల్‌లో ఉంది. బాంబు బ్లాస్ట్ కేసులో చిక్కుకున్న విలన్ గ్యాంగ్‌ను ఆటాడుకుంటూనే, తన ప్రేమను గెలిపించు కోవడానికి రామ్ చేసే ప్రయత్నాలు ఆసక్తికరంగా సాగుతాయి. రాజకీయ కుట్రలు, ఎంపీ పదవుల చుట్టూ తిరిగే కథలో రామ్ ఒక సామాన్య యువకుడిగా ఎలా చొరబడ్డాడో ఈ క్లిప్స్‌లో చూడవచ్చు. ఈ మాస్ యాక్షన్ సీక్వెన్స్‌లు చూస్తుంటే రామ్ ఎనర్జీ అప్పట్లో ఎలా ఉండేదో అర్థమవుతుంది. ఇప్పటికీ ఈ సినిమాలోని డైలాగ్స్ మీమ్స్ రూపంలో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మ‌స్కాలోని సాంగ్స్ మరియు ఫైట్స్ రామ్ కెరీర్‌ను మలుపు తిప్పాయి. ఈ పాత వీడియోలు మళ్ళీ వెలుగులోకి రావడంతో రామ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. రాబోయే సినిమాల్లో కూడా రామ్ నుండి ఇలాంటి పక్కా మాస్ ఎనర్జీని ఆశిస్తున్నామని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి మ‌రిన్ని ఎన‌ర్జిటిక్ సీన్స్ కోసం మా Teluguone youtube channelను Subscribe చేసుకోండి.
The much-awaited film Kara, starring Dhanush and directed by Vignesh Raja, is all set for a theatrical release in Telugu on April 30, 2026. The Telugu version will be released by CH Sathish Kumar & Rajesh Kumar Bobbara under Vigneswara Entertainments - R Star Logistics, ensuring the widest reach across the Telugu States. Produced by Dr. Ishari K. Ganesh under Vels Film International Ltd, in association with Think Studios and Vigneswara Entertainments, Kara has been steadily building strong momentum across Tamil, Telugu, and overseas markets. Dhanush, who enjoys a strong and consistent fan base in Telugu, has delivered successful films like Raghuvaran B.Tech (VIP), Asuran, and Saar (Vaathi), all of which Telugu audiences received well. With Kara, he returns with a film already carrying strong expectations and growing curiosity. The film’s buzz has been built across multiple fronts. The Telugu version of the song Kannamma Naa Kannamma has clocked over 4.1 million views on YouTube, creating a strong emotional connection with Telugu audiences. While this is the only song released in Telugu so far, it has played a key role in introducing the film’s tone and world. At the same time, Telugu audiences have widely followed the Tamil songs, promotional glimpses, and interviews, with viewers actively engaging with the content beyond language barriers. This cross-language traction highlights how Kara is not just gaining attention in Tamil, but is equally building its presence in the Telugu market, alongside growing interest in international territories. Directed by Vignesh Raja, who earned acclaim for Por Thozhil, the film is expected to offer a compelling narrative driven by strong performances and rooted storytelling. The film stars Mamitha Baiju as the female lead, along with a notable supporting cast including Jayaram, K. S. Ravikumar, Karunas, and M. S. Bhaskar. On the technical front, Kara brings together a highly accomplished team. Cinematographer Theni Eswar, known for Peranbu, lends a naturalistic visual tone, while editor Sreejith Sarang of Vikram Vedha fame ensures a sharp narrative flow. Music is composed by G. V. Prakash Kumar, whose work in Saar (Vaathi) and Asuran received strong appreciation among Telugu audiences.  The film’s action is handled by Dinesh Kasi, with Mayapandi serving as art director. Costumes are designed by Dinesh Manoharan and Kavya Sriraam, with makeup by Raja and special makeup by Promeon Xavier, contributing to the film’s authentic presentation. With strong buzz driven by music, content, and cross-market engagement, along with Dhanush’s proven popularity in Telugu, Kara is gearing up to arrive with solid expectations. Kara is releasing on April 30th, worldwide.    Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం గ్లోబల్ రేంజ్‌లో గుర్తింపు తెచ్చుకుంటున్నారు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన బన్నీ.. ఇప్పుడు తన క్రేజ్‌ను మరింత పెంచుకునే పనిలో ఉన్నారు. అయితే గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో అల్లు అర్జున్ గురించి ఒక ఆసక్తికరమైన వార్త తెగ వైరల్ అవుతోంది. బన్నీ ముంబైలో ఒక ఖరీదైన విల్లా కొనుగోలు చేశారని, త్వరలోనే ఆయన ఫ్యామిలీతో సహా అక్కడికి మకాం మార్చబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్త విన్న అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. టాలీవుడ్‌ను వదిలి బన్నీ బాలీవుడ్‌కు వెళ్ళిపోతున్నారా అని సోషల్ మీడియా వేదికగా చర్చలు మొదలుపెట్టారు. అసలు ఈ ముంబై ఇంటి గుట్టు ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించగా కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అల్లు అర్జున్ ముంబైలో ఇల్లు కొన్నారన్న వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. కాకపోతే, ముంబైలో ఆయన ఒక ఇంటిని అద్దెకు తీసుకున్న మాట వాస్తవమే. ప్రస్తుతం బన్నీ తన తదుపరి చిత్రాల కోసం ముంబైలో ఎక్కువగా సమయం గడపాల్సి వస్తోంది. ప్రతిసారీ స్టార్ హోటళ్లలో ఉండటం కంటే, సొంతంగా ఒక ప్రైవేట్ స్పేస్ ఉంటే బాగుంటుందని భావించి ఈ అద్దె ఇంటిని ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఒక భారీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు, చర్చలు ప్రస్తుతం ముంబైలోనే జరుగుతున్నాయి. అట్లీ టీమ్‌తో నిరంతరం టచ్‌లో ఉండేందుకు బన్నీ తరచుగా ముంబై వెళ్తున్నారు. గతంలో హోటల్ స్టే కోసం రోజుకు లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చేదని, ఆ భారాన్ని తగ్గించుకోవడంతో పాటు షూటింగ్‌కు సౌకర్యంగా ఉండేందుకు ఈ తాత్కాలిక ఏర్పాట్లు చేసుకున్నారని టాక్. అల్లు అర్జున్ కేవలం సినిమా షూటింగ్ అవసరాల కోసమే అక్కడ ఉంటున్నారు తప్ప, శాశ్వతంగా ముంబైకి షిఫ్ట్ అయ్యే ఆలోచన లేదని ఆయన సన్నిహితులు స్పష్టం చేస్తున్నారు. కేవలం 'రాకా' (RAKA) వంటి భారీ ప్రాజెక్టుల పని ముగిసిన తర్వాత తిరిగి హైదరాబాద్‌లోనే ఉండనున్నారు. ఇప్పటికే ప్రభాస్ వంటి స్టార్ హీరోలు కూడా షూటింగ్ అవసరాల కోసం ఇటలీ వంటి ప్రాంతాల్లో అద్దె ఇళ్లను వాడుతుంటారు, బన్నీ కూడా అదే బాటలో పయనిస్తున్నారు.
టాలీవుడ్ లో తనదైన మార్కు డైలాగులు, పవర్ ఫుల్ క్యారెక్టరైజేషన్లతో ట్రెండ్ సెట్ చేసిన దర్శకుడు పూరీ జగన్నాథ్ (Puri Jagannadh). టాలీవుడ్ స్టార్ హీరోలందరికీ మాస్ ఇమేజ్‌ను అందించిన పూరీ, సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి విజయవంతంగా 26 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికరమైన పోస్ట్‌ను పంచుకున్నారు.  పూరీ సార్.. మీతో పని చేయడం గౌరవంగా ఉంది! విజయ్ సేతుపతి 'ఎక్స్' (ట్విట్టర్)లో పూరీ జగన్నాథ్ తో కలిసి సెట్స్‌లో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ భావోద్వేగ సందేశాన్ని రాశారు. "ఈ ప్రయాణం నిజంగా అద్భుతం. సినీ రంగంలో 26 ఏళ్లు పూర్తి చేసుకోవడం అనేది కేవలం ఒక మైలురాయి మాత్రమే కాదు.. ఇది ధైర్యం, నమ్మకం, నిర్భయమైన గొంతుకతో నిర్మించుకున్న ఒక గొప్ప లెగసీ. డియర్ పూరీ సార్, మీతో కలిసి 'స్లమ్‌డాగ్ - 33 టెంపుల్ రోడ్' చిత్రంలో పని చేయడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను" అని పేర్కొన్నారు. నటుల మీద నమ్మకం ఉంచి, వారిని కంఫర్ట్ జోన్ దాటి మరింత మెరుగ్గా నటించేలా ప్రోత్సహించే దర్శకుల కోసం తాము ఎదురుచూస్తుంటామని, పూరీ సార్ ఆ పనిని చాలా సునాయాసంగా చేస్తారని విజయ్ సేతుపతి కొనియాడారు. ఈ సినిమా తమందరికీ ఒక ప్రత్యేకమైన జ్ఞాపకంగా మిగిలిపోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సరికొత్త కాంబినేషన్: స్లమ్‌డాగ్ - 33 టెంపుల్ రోడ్ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'స్లమ్‌డాగ్ - 33 టెంపుల్ రోడ్' (Slumdog: 33 Temple Road) అనే చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతితో పాటు సంయుక్త, టబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పూరీ కనెక్ట్స్, జె.బి మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. షూటింగ్ సెట్ నుండి విజయ్ సేతుపతి షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్చల్ చేస్తున్నాయి.  పూరీ జగన్నాథ్ తన 26 ఏళ్ళ కెరీర్‌లో ఎంతో మంది నటులను సరికొత్తగా చూపించారు. ఇప్పుడు ఆయన డైరెక్షన్‌లో విజయ్ సేతుపతి లాంటి వర్సటైల్ యాక్టర్ నటిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.   https://x.com/VijaySethuOffl/status/2046102796244779092
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
వేసవిలో దాదాపు ప్రతి ఇంట్లోనూ పెరుగు తినడం సర్వసాధారణం. ఇది శరీరాన్ని చల్లబరచడమే కాకుండా, జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది. కానీ వేడి పెరిగేకొద్దీ పెరుగు త్వరగా పులిసిపోతుంది. కొన్నిసార్లు రాత్రి తోడు పెట్టిన  పెరుగు ఉదయానికి తినడానికి వీలులేనంతగా పులిసిపోతుంది. అయితే  కొన్ని సులభమైన చిట్కాలతో పెరుగును ఎక్కువ కాలం తాజాగా,  రుచికరంగా ఉంచుకోవచ్చు. వేసవి కాలంలో పెరుగు పులుపు ఎక్కకుండా ఉండాలంటే ఎలా నిల్వ చేయాలి? ఆ చిట్కాలేంటి? తెలుసుకుంటే.. ఇది గుర్తుపెట్టుకోవాలి.. మొదటగా పెరుగు పులవడం అనేది ఒక సహజ ప్రక్రియ అని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. పాలలో ఉండే ప్రయోజనకరమైన బ్యాక్టీరియా లాక్టోజ్‌ను లాక్టిక్ ఆమ్లంగా మారుస్తుంది, దీనివల్ల పెరుగుకు కొద్దిగా పుల్లని రుచి వస్తుంది. అయితే అధిక వేడిలో ఈ ప్రక్రియ వేగవంతమవుతుంది, దీనివల్ల పెరుగు మరింత త్వరగా పులిసిపోతుంది. పెరుగు తోడు పెట్టడానికి పాల ఎంపిక చాలా కీలకం. ఎల్లప్పుడూ తాజా, నాణ్యమైన పాలను ఉపయోగించాలి. తాజాగా లేని పాలలో బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది, దీనివల్ల పెరుగు త్వరగా పాడవుతుంది. పాలను బాగా మరిగించి, గోరువెచ్చగా ఉన్నప్పుడే పెరుగు చుక్క  కలపాలి. పరిశుభ్రత.. పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.  పెరుగును నిల్వ చేసే పాత్రలు పూర్తిగా శుభ్రంగా , పొడిగా ఉండాలి. కొద్దిపాటి మురికి లేదా బ్యాక్టీరియా కూడా పెరుగు  రుచిని,  ఆకృతిని పాడుచేస్తుంది. వేసవిలో పెరుగు నిల్వ చేయడానికి సరైన ప్రదేశాన్ని ఎంచుకోవడం కూడా చాలా ముఖ్యం. పెరుగును అధిక వేడికి లేదా ప్రత్యక్ష సూర్యరశ్మికి దూరంగా నిల్వ చేయాలి. చాలా వేడిగా ఉండే వాతావరణంలో పెరుగు త్వరగా పుల్లగా మారిపోతుంది. వంటగది చాలా వేడిగా ఉంటే, దానిని ఇంటిలోని చల్లని మూలలో నిల్వ చేయడం ఉత్తమం. ఈ చిట్కా బాగా పనిచేస్తుంది.. పాలు పెరుగుగా మారే సమయంలో అందులో కాస్త పంచదార కలిపితే అందులో బ్యాక్టీరియా బాలెన్స్ గా ఉండటంలో సహాయపడుతుందట.పెరుగు త్వరగా పుల్లగా మారకుండా నివారిస్తుంది. అలాగే, ఎల్లప్పుడూ తాజా పెరుగునే తోడు చుక్కు కోసం  ఉపయోగించాలి. పెరుగు తయారైన తర్వాత దాన్ని ఎక్కువ సేపు బయట ఉంచకూడదు.  వెంటనే ఫ్రిజ్‌లో పెట్టాలి. చల్లని ఉష్ణోగ్రత బ్యాక్టీరియా పెరుగుదలను నెమ్మదింపజేస్తుంది, దీనివల్ల పెరుగు ఎక్కువ కాలం పాటు మంచి రుచిగా ఉంటుంది. ఎలాంటి వాసనలు రాకుండా ఉండటానికి పెరుగును ఎల్లప్పుడూ గాలి చొరబడని టైట్ కంటైనర్ లో నిల్వ చేయాలి. తీపి పెరుగు.. కొందరు స్వీట్ కర్డ్ ఇష్టపడతారు.  తీపి పెరుగు ఇష్టపడే వారు దాన్ని గడ్డకట్టించడానికి పాలలో ముందుగానే చక్కెర కలుపుకోవచ్చు. ఇది రుచిని మెరుగుపరిచి, పులుపును తగ్గిస్తుంది. పెరుగు పులిసిపోకుండా నివారించడం కష్టమేమీ కాదు. సరైన పాలు, శుభ్రమైన పాత్రలు,  ఉష్ణోగ్రత ఎక్కువ లేకుండా చూసుకోవడం,  సరైన పద్దతిలో నిల్వ చేయడం.. ఇవన్నీ చూసుకుంటే చాలు. ఈ సులభమైన చిట్కాలను పాటించడం ద్వారా, రుచికరంగా, చిక్కగా ఉండే పెరుగును ఈ సమ్మర్ లో కూడా ఆస్వాదించవచ్చు.                               *రూపశ్రీ.
ఈ రోజుల్లో ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు చదువులో బాగా రాణించాలని, ఆత్మవిశ్వాసంతో ఉండాలని, జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలలు కంటారు. తల్లిదండ్రులు పిల్లల కోసం ఎంత ఖర్చు పెడితే.. పిల్లలు అంత గొప్పగా ఎదుగుతారని అనుకుంటారు. కానీ ఇది చాలా తప్పు.. కేవలం పిల్లల కోసం డబ్బు ఖర్చు చేస్తే పిల్లలు తెలివైన వారుగా,  మంచి విద్యార్థులుగా,  మేధావులుగా ఎదుగుతారు అనుకోవడం మూర్ఖత్వం. రోజువారీ తల్లిదండ్రులు చేసే  చిన్న మార్పులు  పిల్లల ఆలోచన, ప్రవర్తన , భవిష్యత్తుపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి.  దైనందిన జీవితంలో కొన్ని సాధారణ అలవాట్లను అలవర్చుకోవడం వల్ల  పిల్లలు చదువులో రాణించడమే కాకుండా, వారు తెలివైనవారుగా, సృజనాత్మకంగా , తమకు తామే ప్రేరణ ఇచ్చుకుంటూ ముందుకు సాగుతారు. పిల్లలను గొప్పగా తీర్చిదిద్దాలంటే.. తల్లిదండ్రులు అనుసరించాల్సిన ఐదు మార్గాలు ఉన్నాయి.  అవేంటో తెలుసుకుంటే.. మాట్లాడటం.. నేటి తీరికలేని జీవితాలలో తల్లిదండ్రులు తరచుగా  పిల్లలతో కూర్చొని మాట్లాడటాన్ని మరచిపోతుంటారు, కానీ ఈ చిన్న అలవాటు పెద్ద మార్పును తీసుకురాగలదు. ప్రతిరోజూ 10-15 నిమిషాలు  పిల్లలతో మనసు విప్పి మాట్లాడాలి. వారి రోజు ఎలా గడిచిందో, పాఠశాలలో ఏమి జరిగిందో, వారి స్నేహితులు ఎలా ఉన్నారో అడగాలి. ఇది పిల్లలు తమ విషయాలను స్వేచ్ఛగా పంచుకోవడానికి ప్రోత్సహిస్తుంది.  వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అంతేకాకుండా, ఇది వారి ఆలోచనా విధానం, మాట్లాడే సామర్థ్యాలను మెరుగుపరుస్తుంది. ప్రశ్నలకు సమాధానాలు.. పిల్లలు ప్రతిదీ తెలుసుకోవాలనుకుంటారు. కొన్నిసార్లు, వారి ప్రశ్నలతో తల్లిదండ్రులు  విసుగు చెంది, వారిని మౌనంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు, ఇది తప్పు. పిల్లలు ప్రశ్న అడిగినప్పుడు, శ్రద్ధగా విని, వివరించడానికి ప్రయత్నించాలి. ఒకవేళ తల్లిదండ్రులకు  సమాధానం తెలియకపోతే, ఇద్దరూ కలిసి దాన్ని కనుక్కోవడానికి ప్రయత్నించాలి. ఇది పిల్లల ఆలోచనా సామర్థ్యాన్ని, తర్కాన్ని , సృజనాత్మకతను వేగంగా మెరుగుపరుస్తుంది. స్క్రీన్ టైం.. ఈ రోజుల్లో మొబైల్ ఫోన్లు, టీవీలు, టాబ్లెట్లు పిల్లల జీవితంలో ఒక భాగమైపోయాయి. కానీ, స్క్రీన్ ముందు ఎక్కువ సేపు గడపడం వారి మెదడుకు, ఆరోగ్యానికి హానికరం.  పిల్లల స్క్రీన్ సమయాన్ని పరిమితం చేయడానికి ప్రయత్నించాలి. దానికి బదులుగా, పుస్తకాలు చదవమని, బొమ్మలు గీయమని, ఆటలు ఆడమని లేదా పజిల్స్ పరిష్కరించమని వారిని ప్రోత్సహించాలి. ఇది వారి ఏకాగ్రతను, ఊహాశక్తిని బలపరుస్తుంది. పిల్లలు ఇవన్నీ ఇష్టంతో చేయాలంటే.. తల్లిదండ్రులు కూడా పిల్లలతో పాటు స్క్రీన్ టైం తగ్గించి వారికి సహకరించాలి. ఎంకరేజ్.. ప్రతి పిల్లవాడు తమ పనికి ప్రశంసలు పొందాలని కోరుకుంటారు. చిన్న చిన్న విజయాలను సైతం ప్రశంసించడం వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆ ప్రశంస హృదయపూర్వకంగా, నిజాయితీగా ఉండేలా చూసుకోవాలి. గద్దించడానికి బదులుగా, ప్రేమతో చెప్పాలి. ఇది పిల్లలు భయపడకుండా నేర్చుకోవడానికి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి ప్రోత్సాహం అందిస్తుంది. తమ పని తాము చేసుకోవడం.. పిల్లలకు వారి బ్యాగ్  వారే సర్దుకోవడం, పుస్తకాలు పెట్టుకోవడం లేదా వారి గదిని శుభ్రం చేసుకోవడం వంటి చిన్న చిన్న బాధ్యతలు అప్పగించడం ముఖ్యం. ఇది వారిలో క్రమశిక్షణ, బాధ్యతను పెంపొందిస్తుంది. క్రమంగా, వారు తమ సొంత నిర్ణయాలు తీసుకోవడం నేర్చుకుంటారు, ఇది వారి భవిష్యత్తుకు చాలా కీలకం. పైన చెప్పుకున్నవన్నీ పిల్లల జీవితంలో భాగం చేయగలిగితే.. ఆ పిల్లలు భవిష్యత్తులో మేధావులుగా మారడాన్ని ఎవరూ ఆపలేరు.                                         *రూపశ్రీ.
  మానవ శరీరానికి సంక్రమించే జబ్బులలో చాలా రకాలు ఉంటాయి. వాటిలో హిమోఫిలియా జబ్బు కూడా ఒకటి. చాలా మందికి హీమోఫిలియా అనే జబ్బు ఒకటుందని కూడా తెలియదు. హీమోఫిలియా అనేది శరీరం రక్తం గడ్డకట్టే సామర్థ్యాన్ని ప్రభావితం చేసే ఒక ఆరోగ్య పరిస్థితి. శరీరంలో రక్తం గడ్డకట్టే కారకాలు లోపించడం వల్ల, చిన్న గాయాలు కూడా ఎక్కువసేపు రక్తస్రావానికి కారణమవుతాయి. ఇది తరచుగా కుటుంబాలలో వంశపారంపర్యంగా వచ్చే ఒక జన్యుపరమైన వ్యాధి. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 17వ తేదీన ప్రపంచ  హీమోఫిలియా  దినోత్సవాన్ని జరుపుకుంటారు.  ఈ జబ్బు గురించి,  ఈ జబ్బు లక్షణాల గురించి,  ఈ జబ్బుకు గల కారణాల గురించి వివరంగా తెలుసుకుంటే.. హీమోఫిలియా లక్షణాలు.. గాయం తర్వాత ఎక్కువసేపు రక్తస్రావం కావడం,  కీళ్లలో వాపు , నొప్పి, ఎటువంటి కారణం లేకుండా ముక్కు నుండి రక్తస్రావం కావడం, చిన్న గాయాలు కూడా మానడంలో ఆలస్యం కావడం, శరీరంపై నీలి గుర్తులు ఏర్పడటం హీమోఫిలియా వ్యాధి లక్షణాలు. ఏప్రిల్ 17 వ తేదీన ఎందుకు జరుపుకుంటారు? ప్రపంచ హిమోఫిలియా దినోత్సవాన్ని 1989లో ప్రపంచ హిమోఫిలియా సమాఖ్య (World Federation for Hemophilia) మొదటిసారిగా స్థాపించింది. WFH వ్యవస్థాపకుడైన ఫ్రాంక్ ష్నాబెల్ పుట్టినరోజుతో ఏకీభవించేలా ఈ రోజును ఎంచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధిపై అవగాహన పెంచడం,  రోగులకు మెరుగైన చికిత్స అందించడం దీని ఉద్దేశ్యం. థీమ్ ఇదే.. వ్యాధి నిర్థారణే.. సంరక్షణకు మొదటి మెట్టు అనేది ఈ ఏడాది ప్రపంచ హీమోఫిలియా వ్యాధి దినోత్సవానికి థీమ్ గా ఎంపిక చేశారు. ఈ వ్యాధికి చికిత్స,  సంరక్షణ మొదలైనవి.. కేవలం వ్యాధి నిర్థారించడంతోనే సాధ్యమవుతుందని, చికిత్సను సులువు చేస్తుందని దీని అర్థం. హీమోఫిలియా.. శరీరంలో ఏ చిన్న గాయం అయినా.. రక్తం గడ్డకట్టడం ద్వారా రక్తస్రావం ఎక్కువ జరగకుండా ఉండటానికి శరీరంలో కొన్ని కారకాలు ఉంటాయి. ఇవి లోపిస్తే.. హీమోఫిలియా వ్యాధి వస్తుంది.  రక్తస్రావం ఆగకుండా ఉండటం వల్ల శరీరంలో రక్తం కోల్పోయి అతి చాలా ప్రమాదకరమైన పరిస్థితికి దారి తీస్తుంది. ఈ సమస్యను ఎంత తొందరగా గుర్తించి,  నిర్థారించగలిగితే.. మనిషి ప్రాణాన్ని అంత తొందరగా సంరక్షించుకునే అవకాశాలు ఎక్కుువగా ఉంటాయి. ఈ వ్యాధి మీద అవగాహన పెంచడానికి,  ప్రజలను అప్రమత్తం చేయడానికి,  లక్షణాలను గమనించేలా ప్రజలను సన్నద్ధం చేయడానికి ప్రపంచ హీమోఫిలియా దినోత్సవం ఒక వేదికగా నిలుస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యాధి గురించి అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడం,  జబ్బు పట్ల ప్రజలలో అపోహలు తొలగించడం,  ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం వంటివి ఈ ప్రపంచ హీమోఫిలియా దినోత్సవం సందర్బంగా నిర్వహిస్తారు.                                  *రూపశ్రీ.
అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నాల్లో పాకిస్థాన్ సైన్యాధిపతి జనరల్ అసిమ్ మునీర్ ఒక కీలక వ్యక్తిగా అవతరించడం ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.  డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా యంత్రాంగం మునీర్‌ను రెండు దేశాల మధ్య ఒక దౌత్య వంతెనగా (డిప్లమాటిక్ బ్రిడ్జి) భావిస్తున్నప్పటికీ..  ఇది అమెరికా జాతీయ భద్రతకు ఏ మేరకు మేలు చేస్తుందనే దానిపై నిపుణుల్లో పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.    దౌత్యం కంటే.. నష్టనివారణ అంటే డ్యామేజ్ కంట్రోల్ వైపే మొగ్గు చూపుతున్న ట్రంప్ శైలి.. వాషింగ్టన్‌లోని భద్రతా వర్గాలను కలవరపెడుతోంది. మునీర్ ప్రస్తుతం కేవలం పాకిస్థాన్ సైనిక వ్యవహారాలకే పరిమితం కాకుండా.. టెహ్రాన్, వాషింగ్టన్ మధ్య జరుగుతున్న రహస్య చర్చలలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.  అయితే..  ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. మునీర్‌కు ఇరాన్ అగ్రశ్రేణి సైనిక వర్గాలతో ఉన్న సన్నిహిత సంబంధాలు ఒకవైపు చర్చలకు సహకరిస్తాయని భావిస్తున్నా..  అదే సమయంలో ఆయన విశ్వసనీయతపై అమెరికా నిఘా సంస్థలు   అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. మధ్యవర్తిత్వం పేరుతో ఆయన అమెరికా ప్రయోజనాలకు గండి కొట్టేలా వ్యవహరిస్తారా అన్న సందేహాలు వ్యక్తం అవ్వడమే కాకుండా, ఆ దిశగా  హెచ్చరికలు సైతం జారీ అవుతున్నాయి. చరిత్రను ఒకసారి పరిశీలిస్తే..  పాకిస్థాన్ విషయంలో అమెరికా నమ్మకం పలుమార్లు వమ్ము అయింది.  ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ వ్యవహారంలో తాలిబాన్‌లకు మద్దతు ఇస్తూనే..  అమెరికా నుంచి భారీగా ఆర్థిక సాయాన్ని పొందిన గత రికార్డులను భద్రతా నిపుణులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. రెండు వైపులా చక్రం తిప్పే పాక్ వ్యూహం వల్ల వాషింగ్టన్ ఇప్పటికే చాలా నష్టపోయింది. ఇప్పుడు మునీర్‌పై అతిగా ఆధారపడటం అనేది ఒక రకమైన  జియోపాలిటికల్ జూదం  (జియోపాలిటికల్ గ్యాంబిల్)గా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఈ పరిణామాల మధ్య అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన పాకిస్థాన్ పర్యటనను అకస్మాత్తుగా రద్దు చేసుకోవడం గమనార్హం. దీనికి భద్రతా కారణాలు సాకుగా చూపుతున్నా..  తెరవెనుక నెలకొన్న అనిశ్చితి, మునీర్ నెట్‌వర్క్‌పై   అపనమ్మకమే   కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   సాంప్రదాయ దౌత్య మార్గాలను కాదని, స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ వంటి వ్యక్తిగత సన్నిహితుల ద్వారా ట్రంప్ ఈ వ్యవహారాన్ని నడిపించడం చర్చలకు ఇసుమంతైనా పారదర్శకత లేదనే అనుమానాలను  బలపరుస్తోంది. డొనాల్డ్ ట్రంప్ తన వ్యాపార శైలికి తగ్గట్టుగా  డీల్ ఫస్ట్ అనే సూత్రంతో ముందుకు వెళ్తున్నారు. ఆయన దృష్టిలో మునీర్ ఒక  ఉపయోగకరమైన  వ్యక్తిగా కనిపిస్తున్నారు. అందుకే ఆయనను తన  ఫేవరెట్ ఫీల్డ్ మార్షల్  గా మునీర్ ను అభివర్ణిస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు.  అయితే అంతర్జాతీయ సంబంధాలు కేవలం వ్యక్తిగత సాన్నిహిత్యం మీద కాకుండా.. స్పష్టమైన నిబంధనలు,  పారదర్శకత మీద నడవాలని నిపుణులు సూచిస్తున్నారు. మునీర్ విషయంలో పారదర్శకత సందేహాస్పదంమే. .మధ్యవర్తులను నియమించుకోవడం సులభమే కానీ, వారిని నియంత్రించడం చాలా కష్టం అంటారు. పాకిస్థాన్ గతం,  మునీర్‌కు ఉన్న ఇతర దేశాల సంబంధాలు అమెరికా వ్యూహాన్ని బలహీనపరిచేవిగానే ఉన్నాయి.  శాంతి ఒప్పందాల కోసం తీసుకుంటున్న ఈ చర్యలే రేపు భద్రతా లోపాలుగా మారితే అమెరికా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందనడంలో సందేహం లేదు.    ప్రస్తుతానికి మునీర్‌ను ఎంతగా నమ్మినా, అప్రమత్తత అవసరమని అమెరికా నిఘా వ్యవస్థ స్పష్టం చేస్తోంది. చివరిగా అమెరికాకు ఇప్పుడు కావాల్సింది కేవలం మధ్యవర్తులు కాదు, ఒక పటిష్టమైన, అదే సమయంలో విశ్వసనీయ విదేశాంగ విధానం. వ్యక్తిగత సంబంధాలపై ఆధారపడి చేసే దౌత్యం తాత్కాలికంగా ఫలితాలను ఇచ్చినా..  దీర్ఘకాలంలో దేశ ప్రయోజనాలను ప్రమాదంలో నెట్టే అవకాశం ఉంది. మరి మునీర్ అనే ఈ దౌత్య వంతెన అమెరికాను సురక్షితంగా ఇవతలి ఒడ్డుకు చేరుస్తుందో లేక కొత్త సమస్యల్లోకి నెడుతుందో వేచి చూడాలి. -సీతారాం కంఠంనేని
తమిళనాడు రాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ప్రచారం చేస్తున్న ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి శృంగభంగం తప్పదని సిపిఐ నారాయణ  అన్నారు.  దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అధికారంలో ఉన్నప్పుడు తమిళనాడు రాష్ట్రంలోని తెలుగు భాష బోధించే పాఠశాలను మూసేస్తామని అసెంబ్లీలో తీర్మానం తీసుకొచ్చినప్పుడు తమిళనాడు రాష్ట్రంలో నివసిస్తున్న  తెలుగు ప్రజలు దీనిపై స్పందించాలని చంద్రబాబు నాయుడుని నేరుగా కలిసి విన్నవించుకున్నా పట్టించుకోలేదనీ, అటువంటి చంద్రబాబు ప్రస్తుతం మోడీని కాపాడేందుకు ఎన్డీఏ తరపున తెలుగు ప్రజల మధ్య ప్రచారానికెళ్లడం విడ్డూరమన్నారు. నాడు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి, నేడు తెలుగు ప్రజల దగ్గరికి వెళ్లి ఓట్లు అడగడం సబబు కాదని నారాయణ అన్నారు.    అప్పట్లో తెలుగు స్కూళ్ల మూసివేత పై తలీ నియోజకవర్గం ఎమ్మెల్యే రామచంద్రన్ గట్టిగా జయలలిత ప్రభుత్వంతో కొట్లాడి తీర్మానాన్ని వెనక్కి తీసుకునేలా చేశారనీ..  ఆ విషయాన్ని   తెలుగు ప్రజలు గానీ మర్చిరన్నారు. చంద్రబాబు నాయుడు మోడీని ఎంత వెనకేసుకొచ్చినా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే, కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీల కూటమి ఏ గెలుపొందుతుందన్న నారాయణ..  చంద్రబాబుకి తమిళనాడులో శృంగభంగం తప్పదని చెప్పారు.
బెంగాల్ చరిత్రను చూస్తే..  ఇది కేవలం ఒక రాష్ట్రం కాదు. భారత ఉపఖండం ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ పరిణామాల్లో కీలక పాత్ర పోషించిన ప్రాంతం. మొఘల్ కాలంలో హుగ్లీ నది పరివాహక ప్రాంతం.. ఓడరేవులు, జనపనార, మస్లిన్, పట్టు, నౌకా నిర్మాణం వంటి రంగాల ద్వారా బెంగాల్ భారత వాణిజ్య వ్యవస్థలో ప్రధాన స్థానం దక్కించుకుంది. బ్రిటిష్ పాలనలో కూడా కోలకత్తా 1911 వరకు రాజధానిగా ఉండటం వల్ల ఈ ప్రాంతం దేశవ్యాప్తంగా మేధో, రాజకీయ ప్రభావాన్ని కొనసాగించింది. బెంగాల్ పునరుజ్జీవనం: ఆలోచనల కేంద్రబిందువు 19వ శతాబ్దంలో రూపుదిద్దుకున్న బెంగాల్ పునరుజ్జీవనం భారత ఆధునిక చరిత్రలో ఒక మలుపు. రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, బంకిం చంద్ర చట్టోపాధ్యాయ, రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి మహనీయులు సమాజ సంస్కరణలు, విద్య, సాహిత్యం, జాతీయ చైతన్యం వంటి రంగాల్లో కొత్త దిశను చూపించారు. భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావ దశలోనూ బెంగాలీ నాయకుల ప్రాబల్యం స్పష్టంగా కనిపించింది. అందువల్ల బెంగాల్ కేవలం భౌగోళిక ప్రాంతం కాకుండా, భారత రాజకీయ ఆలోచనలకు ఒక ప్రయోగశాలగా నిలిచింది. విభజనల ప్రభావం.. రాజకీయ బలం క్షీణత  ఆరంభం బెంగాల్ పతనానికి ప్రధాన మలుపు 1905 విభజన. బ్రిటిష్  విభజించి పాలించు  విధానం హిందూ–ముస్లిం విభేదాలను మరింత లో ఎగదోసి, ప్రాంతీయ సమైక్యతను దెబ్బతీసింది. 1911లో రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చడం బెంగాల్ రాజకీయ ప్రాధాన్యాన్ని తగ్గించింది. 1947 విభజన తర్వాత తూర్పు భాగం పాకిస్తాన్‌లోకి వెళ్లడం, వలసలు, మార్కెట్ విభజన, సరిహద్దు రాజకీయాలు.. ఇవన్నీ  కలిసి బెంగాల్ ఆర్థిక నిర్మాణాన్ని దీర్ఘకాలంలో బలహీనపరిచాయి.  1947 తరువాత కూడా బెంగాల్ వెంటనే కూలిపోలేదు. పారిశ్రామిక పునాది, విద్యా సంప్రదాయం, పట్టణ మధ్యతరగతి, వాణిజ్య వాతావరణం దీన్ని కొంతకాలం నిలబెట్టాయి. కానీ ఈ ప్రారంభ బలం క్రమంగా రాజకీయ అస్థిరత, యూనియన్ సంఘర్షణలు, పరిశ్రమల పట్ల అపనమ్మకం, విధాన వైఫల్యాల కింద క్షీణించసాగింది. లెఫ్ట్ ఫ్రంట్ యుగం.. సంక్షేమం, నియంత్రణ, నెమ్మదిగా క్షీణించిన పారిశ్రామిక పునాది 1977 తరువాత దశాబ్దాలపాటు కొనసాగిన లెఫ్ట్ ఫ్రంట్ పాలన బెంగాల్ చరిత్రలో అత్యంత ప్రభావమంతమైన ఘట్టం. ఈ పాలన గ్రామీణ పేదలకు భూ హక్కులు, పంచాయతీ బలోపేతం, స్థానిక స్వపాలన వంటి రంగాల్లో గణనీయమైన మార్పులు తీసుకువచ్చింది.  ఆపరేషన్ బర్గా  ద్వారా కౌలుదారులకు భద్రత లభించడం, గ్రామీణ జీవితంలో లెఫ్ట్‌కు దీర్ఘకాలిక మద్దతును నిర్మించింది.  అయితే ఇదే కాలంలో పారిశ్రామిక వృద్ధి క్రమంగా వెనక్కి వెళ్లింది. సమ్మెలు, లాకౌట్లు, ఘెరావ్ లు, కేడర్ ఆధారిత రాజకీయ ప్రభావం, పెట్టుబడుల పట్ల అపనమ్మకం ఇవి పరిశ్రమలకు ప్రతికూల వాతావరణాన్ని సృష్టించాయి. బెంగాల్ ఒకప్పుడు దేశ పరిశ్రమల్లో నాయకత్వం వహించిన రాష్ట్రం అయినప్పటికీ..  కాలక్రమంలో అది పెట్టుబడిదారులకు ప్రమాదకరమైన గమ్యంగా మారడం ప్రారంభమైంది. ఈ మార్పు ఒక్క రాత్రిలో జరగలేదు..  కానీ దశాబ్దాలపాటు పేరుకుపోయిన విధాన వైఫల్యాలు, కార్మిక సంబంధాల దృఢత్వం,   రాజకీయ నియంత్రణ దానిని లోపలినుంచి బలహీనపరిచాయి. సింగూర్, నందిగ్రామ్.. రాజకీయ మార్పుకు మలుపు 2000ల మధ్యలో సింగూర్, నందిగ్రామ్ ఘటనలు బెంగాల్ రాజకీయ సమీకరణాన్ని మార్చాయి. టాటా నానో ప్రాజెక్ట్ కోసం భూసేకరణపై వచ్చిన వ్యతిరేకత, నందిగ్రామ్‌లో రసాయన హబ్ ప్రతిపాదనపై నిరసనలు, పోలీసు చర్యలు, హింస   అన్నీ లెఫ్ట్ ఫ్రంట్‌ను ప్రజల దృష్టిలో తిరిగి నిర్వచించాయి.  ఈ పోరాటాన్ని మమతా బెనర్జీ తన రాజకీయ ఎదుగుదలకు బలంగా వినియోగించుకున్నారు. కాంగ్రెస్ నుంచి టీఎంసీ స్థాపన వరకు ఆమె ప్రయాణం, ఆమెను  ప్రజల పక్షాన నిలిచే నాయకురాలు గా ఎదగడానికి సహాయపడింది. సింగూర్, నందిగ్రామ్ నేపథ్యంలో టీఎంసీ 2011లో  అధికారంలోకి వచ్చింది. టీఎంసీ పాలన.. సంక్షేమం బలం, పరిశ్రమల సమస్య టీఎంసీ పాలనలో రాష్ట్రం సంక్షేమ ఆధారిత రాజకీయాలను మరింత విస్తరించింది. మహిళలు, పేదలు, అణగారిన వర్గాల కోసం అనేక పథకాలు మమతా బెనర్జీకి బలమైన రాజకీయ మద్దతును అందించాయి. ఆమె వ్యక్తిగత రాజకీయ శైలి.. సాధారణ దుస్తులు, నిరాడంబరత ప్రజల మధ్య ప్రత్యక్షంగా తిరగడం ఆమెను  సహజ నాయకురాలుగా నిలబెట్టాయి.  అయితే, ఈ విజయాల వెనుక రాష్ట్రం అభివృద్ధి   అనేక సవాళ్లను ఎదుర్కొంది. పారిశ్రామిక పెట్టుబడులు పరిమితంగానే ఉండటం, ప్రధాన కార్యాలయాలు ఇతర రాష్ట్రాలకు వెళ్లడం, ఉద్యోగ సృష్టి నెమ్మదించడం వంటి సమస్యలు పెరిగాయి. బెంగాల్ తలసరి ఆదాయ స్థానం, జాతీయ ప్రమాణాలతో పోలిస్తే, మునుపటి బలంతో పోల్చితే దిగజారింది. స్థానిక అధికారం,  కట్ మనీ,  రాజకీయ ఆర్థిక వ్యవస్థ బెంగాల్ రాజకీయాల్లో అత్యంత వివాదాస్పద అంశం స్థానిక పార్టీ నెట్‌వర్క్‌ల ప్రభావం. కట్ మనీ, సిండికేట్ వ్యవస్థ, కాంట్రాక్టర్ ఆధారిత మధ్యవర్తిత్వం వంటి అంశాలు ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలోనే కాకుండా, వాటిపై రాజకీయ నియంత్రణను కూడా పెంచాయన్న విమర్శలు ఉన్నాయి. పంచాయతీ స్థాయి నుంచి బ్లాక్ స్థాయి వరకు కార్యకర్తల ప్రభావం ఉన్నప్పుడు, రాజకీయ అధికార మార్పు కేవలం ప్రభుత్వ మార్పు కాదు. అది స్థానిక ఆర్థిక వ్యవస్థలోని అధికారం మార్పుగా మారుతుంది. ఇది ఎన్నికల హింసను కూడా పెంచుతుంది. బెంగాల్‌లో పోలింగ్ బూత్‌ల వద్ద కేంద్ర బలగాల మోహరింపు హింసను తగ్గిస్తుందని అనేకసార్లు రుజువైంది. అంటే..  రాష్ట్రంలోని ప్రజాస్వామ్య ప్రక్రియ ఇప్పటికీ పూర్తిగా సాధారణీకరించబడలేదని ఇది సూచిస్తుంది. మతం, వలసలు, మరియు ఓటు రాజకీయాలు బెంగాల్ రాజకీయ చర్చలో ముస్లిం జనాభా పెరుగుదల, సరిహద్దు వలసలు, మరియు గుర్తింపు రాజకీయాలు కూడా కీలక అంశాలుగా మారాయి. అయితే ఈ అంశాలను పరిశీలించేటప్పుడు జాగ్రత్త అవసరం. జనాభా మార్పు, సరిహద్దు భౌగోళికత, ఆర్థిక వలస, డాక్యుమెంటేషన్ సమస్యలు,  రాజకీయ ఆధారాలు  అన్నీ కలిసి ఒక క్లిష్టమైన నిజాన్ని రూపొందిస్తాయి. కేవలం మత గణాంకాలతో మాత్రమే రాజకీయ మార్పును వివరించడం సరిపోదు. అదే సమయంలో, మైనారిటీ ఓటు బ్యాంకు, పార్టీల వ్యూహాలు,   స్థానిక నాయకత్వం మిళితమై ఎన్నికల సమీకరణాన్ని ప్రభావితం చేస్తాయని కూడా అంగీకరించాలి. బెంగాల్‌లో మతం కేవలం విశ్వాస సమస్య కాదు..  అది రాజకీయ ప్రతినిధిత్వం, భద్రత, అభివృద్ధి,   గుర్తింపు ప్రశ్నలతో ముడిపడిన అంశం. నేటి ప్రశ్న: బెంగాల్ తిరిగి ఎటు? బెంగాల్ పునరుజ్జీవనం ఇచ్చిన సాంస్కృతిక గొప్పతనం, లెఫ్ట్ ఫ్రంట్ అందించిన గ్రామీణ భద్రత, టీఎంసీ ఇచ్చిన సంక్షేమ ముఖచిత్రం.. ఈ మూడింటి మధ్య రాష్ట్రం తన అభివృద్ధి దారిని ఇంకా వెతుకుతోంది. కానీ వాస్తవం ఏమిటంటే..  కేవలం నినాదాలతో, పెట్టుబడి సమ్మేళనాలతో, లేదా చిహ్నాత్మక రాజకీయాలతో బెంగాల్ పాత వైభవాన్ని తిరిగి పొందలేదు. అందుకు దీర్ఘకాలిక పెట్టుబడి భరోసా, శాంతిభద్రతల స్థిరత్వం, పరిశ్రమలకు అనుకూలమైన విధానాలు, మరియు రాజకీయ హింసపై కఠిన నియంత్రణ అవసరం. రాష్ట్రం ఒకప్పుడు భారతదేశానికి మేధో కేంద్రంగా నిలిచింది. భవిష్యత్తులో అది మళ్లీ ఆ స్థానాన్ని దక్కించుకోగలదా అనే ప్రశ్న, ఇప్పుడు బెంగాల్ రాజకీయాల కేంద్రంలో ఉంది.   ​ Reference: రాహుల్ సాంకృత్యాయన్ జీవన తాత్వికత - పిళ్లా కుమారస్వామి: రవీంద్రనాథ్ ఠాగూర్  వికీపీడియా పశ్చిమ బెంగాల్‌లో మతం భారత్-బంగ్లాదేశ్ వాస్తవిక సాదృశ సదస్సుపై సంయుక్త ప్రకటన ​ -సీతారాం కంఠంనేని  
ఇంట్లోనే లభించే ఆయుర్వేద మూలికలతో మోకాళ్ళ నొప్పులకు చెక్ పెట్టండి! నేటి కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య మోకాళ్ళ నొప్పులు. జీవనశైలిలో మార్పులు, శారీరక శ్రమ తగ్గడం మరియు సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల ఈ సమస్య చిన్న వయస్సులోనే మొదలవుతోంది. అయితే, ఆయుర్వేద నిపుణులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు మోకాళ్ళలో జిగురును పెంచడానికి మరియు నొప్పుల నుండి ఉపశమనం పొందడానికి అద్భుతమైన ఇంటి చిట్కాలను ఈ వీడియోలో వివరించారు. ముఖ్యమైన చిట్కాలు మరియు పరిష్కారాలు: మోకాళ్ళలో జిగురు (Knee Pulp) పెరగడానికి: వయస్సు పెరిగే కొద్దీ మోకాళ్ళలో ఉండే సహజమైన జిగురు తగ్గిపోతుంటుంది. దీనివల్ల ఎముకలు ఒకదానికొకటి రాపిడికి గురై తీవ్రమైన నొప్పి కలుగుతుంది. దీనికి సంబంధించి ఆయుర్వేదంలో సూచించిన సహజమైన ఔషధాల గురించి డాక్టర్ గారు వివరించారు. ఆయుర్వేద మూలికల ఉపయోగాలు: కరక్కాయ పొడి, వాము మరియు శొంఠి వంటి పదార్థాలు మన వంటింట్లోనే లభిస్తాయి. వీటిని సరైన పద్ధతిలో తీసుకోవడం వల్ల శరీరంలోని వాత దోషాలు తగ్గి, నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. జీవనశైలి మార్పులు: నొప్పులు తగ్గాలంటే కేవలం మందులే కాకుండా, తీసుకునే ఆహారం మరియు రోజువారీ వ్యాయామం ఎంత ముఖ్యమో ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు. మీరు కూడా మోకాళ్ళ నొప్పులతో ఇబ్బంది పడుతుంటే, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఈ ఆయుర్వేద పద్ధతులను పాటించి చూడండి. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను తప్పక వీక్షించండి.
వేసవి మొదలవ్వగానే తీవ్రమైన ఎండ , పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మన రోజువారీ  కార్యకలాపాలు , ఆరోగ్యంపై ప్రభావం చూపడం మొదలవుతుంది. ఈ రోజుల్లో బయట కొద్దిసేపు ఉన్నా కూడా శరీరం అలసిపోయేంత వేడిగా ఉంటుంది. చాలా మందికి తల తిరగడం, తలనొప్పి, నీరసం, లేదా స్పృహ కోల్పోవడం వంటివి జరుగుతాయి. వీటికి ప్రధాన కారణాలు శరీరంలో నీటి శాతం తగ్గడం,  తీవ్రమైన వేడి. అయితే,  దినచర్యలోనూ,  ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా ఈ సమస్యలను నివారించవచ్చు.  వేసవిలో  ఎండకు గురికావడం  శక్తిని ఎలా హరించివేస్తుందో, రోజంతా చురుగ్గా ఉండటానికి ఏమి చెయ్యాలో తెలుసుకుంటే.. వేసవి ఎండలో  ఉన్నప్పుడు శరీరం శక్తి ఎలా కోల్పోతుంది? వేసవిలో ఎండకు గురికావడం వల్ల, అధిక ఉష్ణోగ్రతలు శరీరంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి.  ఎండలో ఉన్నప్పుడు, శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి  ఎక్కువగా చెమట పడుతుంది. ఈ ప్రక్రియ శరీరం నుండి నీటిని , అవసరమైన ఎలక్ట్రోలైట్లను తొలగిస్తుంది, దీనివల్ల  డీహైడ్రేషన్ జరుగుతుంది. నీటి కొరత రక్త ప్రసరణను కూడా నెమ్మదింపజేస్తుంది, దీనివల్ల శరీరానికి తగినంత ఆక్సిజన్ , పోషణ అందవు, ఫలితంగా అలసట, నీరసం , తల తిరగడం వంటివి కలుగుతాయి. అంతేకాకుండా, మండే ఎండలో శరీర ఉష్ణోగ్రత పెరగడం వల్ల, గుండె మరింత కష్టపడి పనిచేయాల్సి వస్తుంది,  శక్తి వేగంగా ఖర్చవుతుంది. అందుకే వేసవిలో కొద్దిసేపు ఎండలో ఉన్నా కూడా శరీరం త్వరగా అలసిపోయినట్లు ,  నీరసంగా అనిపిస్తుంది. రోజంతా చురుకుగా ఉండటానికి ఏమి చేయాలి? శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలి..  వేసవిలో అత్యంత ముఖ్యమైన విషయం శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవడం. రోజంతా కొద్దికొద్దిగా నీరు త్రాగాలి.  దాహం వేసే వరకు వెయిట్ చేయకూడదు.  కొబ్బరి నీరు, నిమ్మరసం, మజ్జిగ,  ఓఆర్ఎస్ వంటి పానీయాలను కూడా తీసుకోవచ్చు. ఇవి శరీరానికి అవసరమైన ఖనిజాలను , లవణాలను అందిస్తాయి. అలాగే, పుచ్చకాయ, కర్బూజా, దోసకాయ , నారింజ వంటి పండ్లను తినాలి, ఎందుకంటే వాటిలో నీటి శాతం అధికంగా ఉంటుంది. ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి.. వేసవిలో తేలికగా , సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని తినాలి . వేయించిన, మసాలా, నూనెతో కూడిన ఆహారాలు శరీర వేడిని పెంచుతాయి.  ఆహారంలో పెరుగు, సలాడ్, పెసలు, ఆకుకూరలు చేర్చుకోవాలి. ఉదయం నానబెట్టిన బాదం, అరటిపండ్లు తినడం వల్ల తక్షణ శక్తి లభించి, నీరసం తగ్గుతుంది. సూర్యరశ్మి నుండి రక్షణ..  మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల మధ్య బయటకు వెళ్లకుండా ఉండేందుకు ప్రయత్నించాలి, ఎందుకంటే ఈ సమయంలో సూర్యరశ్మి చాలా తీవ్రంగా ఉంటుంది. ఒకవేళ  తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వస్తే,  తలను టోపీ, స్కార్ఫ్ లేదా గొడుగుతో కప్పుకోవాలి.  శరీరాన్ని చల్లగా ఉంచడంలో సహాయపడే లేత రంగు, వదులుగా ఉండే కాటన్ దుస్తులను ధరించండి.  ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఈ తప్పులు చేయకూడదు.. ఎండ నుండి వచ్చిన వెంటనే చల్లటి నీటిని తాగకూడదు. కాసేపు విశ్రాంతి తీసుకుని, ఆ తర్వాత గది ఉష్ణోగ్రతలో ఉన్న నీటిని తాగాలి. ఇంటికి తిరిగి వచ్చిన వెంటనే స్నానం చేయడం లేదా బట్టలు మార్చుకోవడం వంటివి చేయకూడదు.  5 నుండి 10 నిమిషాలు విశ్రాంతి తీసుకున్న తర్వాత మాత్రమే ఇలా చేయండి. అలాగే, పని నుండి తిరిగి వచ్చిన వెంటనే ఏసీలోకి వెళ్లే బదులు, ముందుగా ఫ్యాన్ కింద కూర్చోవాలి, దీనివల్ల మీ శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థితికి వస్తుంది. చల్లని ఆహార పదార్థాలను..   ఎండలో నుండి ఇంటికి  వచ్చిన వెంటనే ఐస్ క్రీమ్, చల్లని పండ్లు లేదా ఫ్రిజ్‌లో ఉంచిన నీటిని తాగడం మానుకోవాలి. దీనివల్ల గొంతు నొప్పి లేదా దగ్గు రావచ్చు. శరీరానికి విశ్రాంతి, నిద్ర..   వేడిలో శరీరం త్వరగా అలసిపోతుంది, కాబట్టి తగినంత నిద్రపోవడం చాలా ముఖ్యం. రోజంతా చురుకుగా ఉండటానికి, ప్రతి రాత్రి కనీసం 7 నుండి 8 గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలి. తేలికపాటి వ్యాయామం, యోగా..    ఉదయం లేదా సాయంత్రం తేలికపాటి వ్యాయామం, యోగా లేదా ధ్యానం చేయడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా ఒత్తిడి కూడా తగ్గుతుంది.                                 *రూపశ్రీ.
పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి.  ముఖ్యంగా వేసవి కాలంలో నీటిశాతం అధికంగా ఉన్న పండ్లను ఎంత తీసుకుంటే అంత మంచిదని చెబుతూ ఉంటారు. కానీ చాలామంది వేసవి కాలంలో పండ్ల జ్యూసులు,  ఫ్రూట్ మిల్క్ షేక్ లు తాగడానికే ఇష్టపడతారు. ప్రూట్ జ్యూస్ లు, ఫ్రూట్ షేక్ లు తాగినప్పుడు శరీరానికి చాలా స్వాంతన లభిస్తుంది. అయితే.. కొన్ని రకాల పండ్లతో ప్రూట్ మిల్క్ షేక్ తయారు చేసుకుని తాగడం అస్సలు మంచిది కాదట.  ఏ పండ్లతో మిల్క్ షేక్ లు తయారు చేసుకుని తాగకూడదు?  దీనికి గల కారణాలు ఏంటి? మిల్క్ షేక్ అంటే తెగ ఇష్టపడే ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాలి.. సిట్రస్ ఫ్రూట్స్.. నారింజ, నిమ్మకాయ వంటి సిట్రస్ ప్రూట్స్ ను పాలతో కలిపి మిల్క్ షేక్ లు తయారుచేసుకుని తాగడమే కాదు.. అసలు పాలతో కలిపి తీసుకోకూడదు కూడా. వీటిలోని సిట్రిక్ యాసిడ్ పాలతో చర్య జరపడం వల్ల అది హానికరంగా మారుతుంది.  ఇలా తీసుకున్నప్పుడు ఎసిడిటీ,  కడుపునొప్పి వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. పైనాపిల్.. పైనాపిల్ లో ఉండే ఎంజైమ్ లు పాలతో చర్య జరపడం వల్ల కడుపు సమస్యలు చాలా తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది.  అందుకే పైనాపిల్ ను పాలతో తీసుకోకూడదు,  పైనాపిల్ మిల్క్ షేక్ తాగకూడదు. జామకాయ.. జామకాయను పాలతో కలిపి తీసుకోకూడదట.  ఎందుకంటే జామకాయ మిల్క్ షేక్ కడుపునొప్పికి కారణం కావచ్చు, అంతేకాకుండా.. కడుపు బరువుగా, ఉబ్బరంగా మారే అవకాశం ఉంటుంది. సిట్రస్ పండ్లు+ అరటిపండ్లు మిల్క్ షేక్.. సిట్రస్ పండ్ల షేక్ తాగడమే ఆరోగ్యానికి మంచిది కాదు..అలాంటిది కొందరు సిట్రస్ షేక్ ను అరటిపండ్లతో కలిపి తాగుతుంటారు. ఇది అస్సలు మంచిది కాదు.. ఈ కాంబినేషన్ జీర్ణక్రియను నెమ్మది చేస్తుంది. జీర్ణక్రియను దెబ్బతీస్తుంది. బొప్పాయి.. బొప్పాయి పండును మిల్క్ షేక్ గా తీసుకోవడం అస్సలు మంచిది కాదు. ఇది చర్మానికి, జీర్ణక్రియకు అస్సలు మంచిది కాదు. నిమ్మజాతి పండ్లు +మామిడి పండ్లు.. నిమ్మజాతి పండ్లు అయిన నారింజ, నిమ్మ,  బత్తాయి మొదలైన పండ్లను మామిడి పండ్లతో కలిపి తినకూడదట. ఈ కాంబినేషన్ శరీర వేడిని పెంచి కడుపు సమస్యలను పెంచుతుంది.                                  *రూపశ్రీ.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.