Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...హైదరాబాద్ మెట్రోలో అమీర్ పేట స్పెషల్
posted on: Nov 8, 2017 4:03PM
.jpg)
ఎన్నో ఏళ్లుగా భాగ్యనగర వాసులు వెయ్యి కళ్ల తో ఎదురుచూస్తోన్న హైదరాబాద్ మెట్రో ఈ నెలలోనే పరుగులు తీయబోతోంది. ప్రధాని నరేంద్రమోడీ నవంబర్ 28న హైదరాబాద్ మెట్రోను జాతికి అంకితం చేయనున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్ - ప్రైవేట్ భాగస్వామ్యంతో రూపుదిద్దుకుంటున్న మన మెట్రోలో ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకున్నాయి. భాగ్యనగరంలో ఎన్నో మెట్రో స్టేషన్లు ఉండగా.. వాటన్నింటిలోకి అమీర్ పేట స్టేషణ్
సంథింగ్ స్పెషల్ అట. దీని ప్రత్యేకతలు ఏంటో ఒకసారి చూస్తేః
* ఇది ఇంటర్ చేంజ్ మెట్రో స్టేషన్.. దీని విస్తీర్ణం 2 లక్షల చదరపు అడుగులు.. పొడవు 476 అడుగులు కాగా... వెడల్పు 148 అడుగులు. ఈ స్టేషన్ నుంచి ఒకేసారి 4 మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి.
* దీనిని మూడు అంతస్తుల్లో నిర్మించారు. మొదటి అంతస్తులో టికెటింగ్, ఎంటర్ టైన్ మెంట్, షాపింగ్ లు ఉంటాయి. రెండో అంతస్తులో ఒక మార్గం నుంచే వచ్చే రైళ్లు ఆగుతాయి. మరో మార్గం నుంచి వచ్చే రైళ్లు మూడో అంతస్తులో ఆగుతాయి.
* హైదరాబాద్ లోని అన్ని మెట్రో స్టేషన్ లలో రైళ్లు 20 సెకన్లు మాత్రమే ఆగుతాయి. కానీ అమీర్ పేటలో మాత్రం రెండు నిమిషాలు ఆగుతుంది.
* ఈ స్టేషన్ లో 12 ఎస్కలేటర్లు, 16 లిఫ్టులు, 12 మెట్ల మార్గాలు ఉన్నాయి.


.jpg)


