Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...వామ్మో జగన్..పిల్లల్ని కూడా వదలట్లేదుగా...
posted on: Nov 7, 2017 12:07PM
జగన్ కోసం పిల్లలు అన్నం మానేస్తున్నారా..?జగన్ కోసం నిద్రలో కలవరిస్తున్నారా.. దేవుడు జెలసీగా ఫీలయి వైఎస్ ను తీసుకెళ్లిపోయాడా.. జగన్ అంకుల్ చిక్కిపోయాడు అంటున్నారా..? అవునంటా చిన్న పిల్లలు జగన్ కోసం పరితపిస్తున్నారంట. ఈ మాటలు వింటుంటే.. ఓరి దేవుడో వైసీపీ పిచ్చికి హద్దులు లేకుండా పోయింది అనిపిస్తుంది. వాళ్ల మాటలు చూస్తుంటే... వాళ్ల అరాచకం తట్టు లేక పోతున్నాం. రాజకీయాల కోసం ఏమైనా చేస్తారేమో అనిపిస్తుంది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్లు వైసీపీ పేపర్ ను టిష్యూ పేపర్ అని ఎందుకు అన్నారో ఇప్పుడు అర్ధమయింది. అప్పట్లో వైఎస్ రాజశేఖర్ చనిపోయినప్పుడు ఎవ్వరు ఏ కారణంతో చనిపోయిన రాజశేఖర్ కోసమే చనిపోయాడని పేపర్లోలో వేసుకున్నారు. ఇప్పుడు ఏకంగా చిన్న పిల్లల్ని కూడా తమ స్వార్థం కోసం వాడుకుంటున్నారు. ఓ ఏడేళ్ల చిన్న పిల్లంటా.. జగన్ కోసం అన్న తినడం మానేసిందట. వింటుంటే పిచ్చేక్కుతుంది కదా.. ఆ అరాచకం ఏంటో తెలుసుకుందాం. మారతహళ్లిలో గిరిధర్ అనే వ్యక్తికి నందిని అనే కూతురు ఉంది. ఆమె రెండురోజులుగా అన్న తినడం లేదట. ఎందుకంటే..జగన్ ను సీబీఐ అధికారులు విచారిండమే అంట. జగన్ అన్నయ్య ఎప్పుడు బయటకు వస్తాడని ఏడుస్తుందట. దాంతో జ్వరం రావడంతో హాస్పిటల్ కు తీసుకెళితే అక్కడ... ఎక్కువగా స్పందిస్తే ఇలానే జరుగుతుందని... నిద్ర పోతే సరిపోతుందని చెప్పారట. ఇప్పుడు ఈ స్టోరీని తీసుకెళ్లి తమ పత్రికలో ప్రచురించుకున్నారు. ఇంకో చోట ఇంకో పిల్లాడు కూడా జగన్ ఏకంగా దేవుడికే జలసీ వేసిందని అన్నాడట.. అందుకే వైఎస్ ను తీసుకెళ్లిపోయాడట. ఇలా చెప్పుకుంటూ పోతే.. వాళ్ల మాటలు వింటే షాకవ్వాల్సిందే. నిజంగా ఇవి పిల్లలు రాశారో.. లేక వాళ్లే రాసి పిల్లల పేర్లు చెబుతున్నారో తెలియదు కానీ.. వీళ్ల అతి చూస్తుంటే మాత్రం.. ఈవార్తలు చదివి ఇంకా ఎందుకు బతికి ఉన్నామబ్బా అనిపిస్తుంది కదా. ఎంత సొంత ఛానల్ అయితే మాత్రం ఇంత అతి అవసరమా. ఇంకా ముందు ముందు ఇంకెన్ని ఘోరాలు చదవాల్సి వస్తుందో..
.jpg)


.jpg)
.jpg)


