LATEST NEWS
తమిళనాడు రాజకీయాల్లో విలువల పతనం పతాక స్థాయికి చేరిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  రాజకీయ నేతలు అంశాల వారీ విమర్శలు కాకుండా హీరోయిన్లపై అనుచిత,  దిగజారుడు వ్యాఖ్యలూ చేస్తూ చౌకబారు రాజకీయాలకు పాల్పడుతున్నారు.   ప్రముఖ హీరోయిన్లను వివాదాల్లోకి లాగుతూ,  వివాదాల్లోకి లాగుతూ వ్యక్తిగత విమర్శల దిగజారుతున్న తీరు తమిళనాట రాజకీయ ప్రతిష్ఠను దిగజారుస్తున్నది. సీనియర్ హీరోయిన్లు త్రిష, నయనతార లను ఉద్దేశించి తమిళ రాజకీయ నాయకులు కొందరు చేసిన వ్యాఖ్యల పట్ల తమిళనాటే కాకుండా దేశ వ్యప్తంగా నిరసన వ్యక్తం అవుతున్నది.   తాజాగా  ఏఐఏడీఎంకే ఎంపీ షణ్ముగం నయనతారపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయి.  తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఇటీవల రాష్ట్ర ప్రజల కలల గురించి ప్రస్తావించగా.. ఎంపి షణ్ముగం షణ్ముగం మాట్లాడుతూ..  నాకు నయనతార కావాలి, నా కలను నెరవేరుస్తారా? అంటూ తీచౌకబారు వ్యాఖ్యలు చేశారు.   బాధ్యతాయుతమైన ఎంపీ పదవిలో ఉన్న వ్యక్తి ఇలా  ఒక నటిని ఉద్దేశించి ఇంతటి అభ్యంతరకర రీతిలో వ్యాఖ్యానించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  అలాగే మరో అగ్రనటి   త్రిషపై  తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. రాజకీయనాయకుడిగా మారిన నటుడు విజయ్‌ను విమర్శించే క్రమంలో  ఆయన అసందర్బంగా, అనుచితంగా త్రిష పేరు  ప్రస్తావించారు. విజయ్ తన ఇంటి నుంచి బయటకు వచ్చి క్షేత్రస్థాయి పరిస్థితులు చూడాలంటూ త్రిషను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర విమర్శలకు గురయ్యాయి.  సినిమా రంగంలో తమకంటూ  గుర్తింపును, గౌరవాన్న, అశేష ప్రేక్షకాభిమానాన్నీ సంపాదించుకున్న నటీమణులపై ఇటువంటి అసభ్య, అసందర్భ వ్యాఖ్యలు చేయడంపై మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.  రాజకీయ ప్రత్యర్థుల వారి విధానాలను ఎండగడుతూ విమర్శలు చేయాలి కానీ,   సంబంధం లేని మహిళల వ్యక్తిత్వాన్ని కించపరచడం  సరికాదని అంటున్నాయి.  కాగా ఎంపీ  షణ్ముగం నయనతారపై చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్   సీరియస్ అయింది. ప్రజాప్రతినిధులు నోరు అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. త్వరలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో  ప్రచార పర్వంలో ఇంకా ఎలాంటి విమర్శలు వినాల్సి వస్తుందోనన్న ఆందోళన వ్యక్తమౌతోంది. 
మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో తెలుగుదేశం ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ పేరు ప్రముఖంగా ఉండటం తెలుగు రాజకీయాలలో సంచలనంగా మారింది.  డగ్స్   ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏలూరు ఎంపీపై తెలుగుదేశం  అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  పార్టీ క్రమశిక్షణ , ప్రతిష్ట   భంగం కలిగేలా వ్యవహరిస్తే ఎవరినైనా, ఎంతటి వారినైనా ఉపేక్షించే ప్రశ్నే లేదని స్పష్ఠం చేశారు. మంగళవారం (మార్చి 17)  రాత్రి తిరుపతి నియోజకవర్గ నేతలతో జరిగిన అంతర్గత సమావేశంలో చంద్రబాబు పుట్టా మహేష్ యాదవ్ వ్యవహారం ప్రస్తావించారు. గత ఎన్నికలలో   రాష్ట్రంలో డ్రగ్స్ సంస్కృతిని నిర్మూలిస్తామని ప్రజలకు హామీ ఇచ్చామని, అలాంటిది పార్టీకి చెందిన ప్రజాప్రతినిధే ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం క్షమించరాని నేరమన్నారు. యువ నాయకుడు, మంచి నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చాడన్న ఉద్దేశంతో అవకాశం ఇస్తే, పార్టీకి చెడ్డపేరు తీసుకువచ్చారంటూ పుట్టా మహేష్ యాదవ్ పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.  పోరుగు రాష్ట్రంలో ఫామ్ హౌస్ పార్టీకి వెళ్లాల్సిన అవసరం ఏముంది? వెళ్లినా అక్కడ డ్రగ్స్ తీసుకోవడం వంటి చర్యలకు పాల్పడటమేంటని చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది.   ఇప్పటికే ఈ వ్యవహారంపై ఐదు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని పార్టీ అధిష్టానం ఎంపీ పుట్టా మహేష్ కి షోకాజ్ నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిదే.   అప్పటి వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. సాధారణంగా నేతల పట్ల సౌమ్యంగా ఉండే చంద్రబాబు, ఈ విషయంలో మాత్రం అత్యంత కఠినంగా  తిరపతి నియోజకవర్గ నేతలతో జరిగిన అంతర్గత సమావేశంలో పుట్టా మహేష్ యాదవ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేయడం ద్వారా తెలుస్తోంది.  డ్రగ్స్ పరీక్షల్లో మహేష్ యాదవ్‌కు పాజిటివ్ రావడంతో  వైసీపీ విమర్శలకు పదును పెట్టింది. ఈ నేపథ్యంలోనే  పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా వెళ్లే వారిని మోయాల్సిన అవసరం లేదని చంద్రబాబు బాహాటంగానే ప్రకటించారని అంటున్నారు.  పార్టీ షోకాజ్ కు మహేష్ ఇచ్చే వివరణ సంతృప్తి కరంగా లేకుంటే.. ఆయనపై సస్పెన్షన్ వేటు పడటం ఖాయమని తెలుగుదేశం వర్గాలు అంటున్నాయి. పుట్టా మహేష్ యాదవ్ పై తీసుకునే చర్య  ఇతర యువ నేతలకు ఒక హెచ్చరికలా ఉండాలని చంద్రబాబు భావిస్తున్నట్లు చెబుతున్నారు. 
సినిమా స్టార్స్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం కొత్తేమీ కాదు. ఇప్పటికే చాలా మంది సినిమా తారలు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి, రాష్ట్రాలను ఏలారు. తమిళనాడులో ఎంజీఆర్, తెలుగులో సీనియర్ ఎన్టీఆర్ పాలిటిక్స్‌లో తమదైన ముద్ర వేశారు. వారి బాటలోనే తమిళ, తెలుగు హీరోయిన్లు పొలిటికల్ స్క్రీన్‌పై   మెరిసారు. ఎంజీఆర్ సన్నిహితురాలు జయలలిత ఆయన తదనంతరం ఏఐడీఎంకే అధినేత్రిగా తమిళనాడు సీఎం పీఠం అధిరోహించి చక్రం తిప్పారు.  తాజాగా  స్టార్ హీరోయిన్ త్రిష పొలిటికల్ ఎంట్రీకి రెడీ అయ్యారన్న ప్రచారం జోరందుకుంటోంది.  జయలలిత, ఎం.జే.ఆర్ తరహాలో తమిళనాట రాజకీయాల్లో రాణించాలని త్రిష చూస్తున్నారని తెలుస్తోంది.  తెలుగు, తమిళ భాషల్లో త్రిష స్టార్ హీరోయిన్ గా రాణించింది. దాదాపు అందరు స్టార్ హీరోల సరసన త్రిష హీరోయిన్ గా నటించి మెప్పించింది. ప్రస్తుతం తమిళంలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ అలరిస్తున్నది. ఇక ఇప్పుడు త్రిష రాజకీయ ప్రవేశం వెనక టీవీకే పార్టీ అధినేత, హీరో విజయ్ ఉన్నారంటున్నారు. ఇప్పటికే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఓ వైపు డీఎంకే కాంగ్రెస్ కూటమి, మరో వైపు అన్నాడీఎంకే, బీజేపీ కూటములు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు తమదంటే తమదని  ఉధృతంగా ప్రచారం చేస్తున్నాయి.  ఇప్పుడు ఆ రెండు కూటములతో పాటు  టీవీకే అధినేత విజయ్ సీఎం సీటుపై కన్నేశారు.ఇప్పటికే విజయ్ తమిళనాడు వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలతో ఎలక్షన్ క్యాంపెయిన్ హోరెత్తిస్తున్నారు. అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో విజయ్‌ నుంచి విడాకులు కోరుతూ ఆయన భార్య కోర్టు గడపతొక్కడంతో ఈ విషయం ఇటు తమిళనాడులోనే కాకుండా దక్షిణాది రాజకీయాల్లో సైతతం హాట్ టాపిక్‌గా నిలిచింది.  త్రిష కారణంగానే వారి పెళ్లి పెటాకులవ్వబోతోందన్నది ఓపెన్ సీక్రెట్టే.  విషయం ఓపెన్ అయి పోవడంతో..  నిండా మునిగాక చలేముందిలే అన్నట్లుగా విజయ్ కూడా చాలా ఓపెన్ అయ్యాడు. భార్య బ్లాక్‌మెయిల్‌కు బెదిరేది లేదని ప్రజలకు స్పష్టం చేయడానికా అన్నట్లు... ఇటీవల ఓ పెళ్లి వేడుకకు త్రిషతో కలిసి హాజరై అందరికీ షాక్ ఇచ్చాడు. దాంతో త్రిషతో ఉన్న రిలేషన్‌షిప్ పై వస్తున్న వార్తలకు బలం చేకూర్చినట్లైంది.   హీరో విజయ్ కొత్త పార్టీ టీవీకే తొలిసారిగా ఎన్నికల్లో నిలవబోతోంది. ఇప్పటికే అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో విజయ్ ఉన్నారు. ఈ క్రమంలోనే చెన్నై అసెంబ్లీ సీటును విజయ్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు కనిపిస్తోంది.  సినిమా రంగానికి, రాజకీయాలకు విడదీయలేని బంధం ఉన్న తమిళనాడులో  చెన్నై పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రత్యేక స్థానం ఉంది.  చెన్నై నార్త్, సెంట్రల్, సౌత్ అసెంబ్లీ స్థానాల నుండి పలువురు నటీనటులు విజయం సాధించి చట్టసభల్లో అడుగుపెట్టారు. ఎంజీఆర్,  తర్వాత జయలలిత,   మరో మాజీ సీఎం కరుణానిధి చెన్నై నగరం నుంచే గెలిచారు  ప్రస్తుత తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ చెన్నై నుండే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ క్రమంలోనే అక్కడి నుంచి నటి త్రిషను టీవీకే పార్టీ టికెట్ పై పోటీ చేయించాలని భావిస్తున్నారని తమిళ పాలిటిక్స్‌లో ప్రచారం జరుగుతోంది. అయితే తన రాజకీయ అరంగేట్రంపై ఇంకా క్లారిటీ ఇవ్వని త్రిష, రానున్న ఎన్నికల్లో చెన్నైలోని ఏ అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి దిగుతారన్నది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. ఏదిఏమైనా తమిళనాడు రాజకీయాలు ప్రస్తుతం హీరోయిన్ త్రిష చుట్టే తిరుగుతున్నాయి. విజయ్ టీవీకే పార్టీ ఎన్డీఏతో పొత్తు పెట్టుకునే నిర్ణయం ఆమె చేతుల్లోనే ఉందని వార్తలొస్తున్నాయి. ఇటీవల అమిత్ షాతోనూ త్రిష భేటీ అయ్యారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఏఐడీఎంకే నేతలూ త్రిష‌తో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఎన్నికలు సమీపిస్తున్న వేళ త్వరలోనే తమిళ రాజకీయాల్లో సంచలనాలు ఖాయంగా కనిపిస్తున్నాయి. మరి త్రిష తమిళనాడు రాజకీయాల్లో మరో జయలలిత అనిపిం చుకుం టారో? లేకపోతే శశికళలా మిగిలిపోతారో చూడాలి.
ALSO ON TELUGUONE N E W S
  సినిమా పేరు: ధురంధర్ 2  న‌టీన‌టులు: రణవీర్ సింగ్, సారా అర్జున్, సంజయ్ దత్,  అర్జున్ రామ్ పాల్, మాధవన్, రాకేష్ బేడీ, మనవ్ గోహ్లి, గౌరవ్ గెరా తదితరులు సినిమాటోగ్ర‌ఫీ: వికష్ నౌలఖా  ఎడిటింగ్: శివ్ కుమార్ మ్యూజిక్: సాస్వత్ సచ్ దేవ్   నిర్మాత‌: ఆదిత్య దర్, లోకేష్ దర్, జ్యోతి దేశ్ పాండే బ్యానర్స్: జియో స్టూడియోస్, b 62 స్టూడియోస్   రచన,దర్శకత్వం: ఆదిత్య ధర్  రిలీజ్ డేట్ : మార్చి 19 2026  ఇండియన్ సినీ ప్రేమికులతో పోటీపడుతు తెలుగు ప్రేక్షకులు ఎంతగానో  ఎదురుచూస్తున్న ధురంధర్ 2 (Dhurandhar 2) సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యింది.  ప్రీమియర్స్ నుంచే వాళ్ళ కల నెరవేరడంతో థియేటర్స్ మొత్తం ధురంధర్ అభిమానులతో కిటకిటలాడాయి. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం. కథ రెహ్మాత్ డెకాయత్(అక్షయ్ ఖన్నా) చనిపోయిన తర్వాత ల్యారీ ఏరియాకి ఉజైర్ (దనిష్ పండోర్) ని లీడర్ గా చేస్తాడు హంజా అలీ మజారి ఉరఫ్ జస్కిరాత్. ( రణవీర్ సింగ్). కానీ ఉజైర్ ని దుబాయ్ లో పోలీసులు అరెస్ట్ చేయడంతో జైలు పాలవుతాడు. హంజా మావయ్య ప్రముఖ రాజకీయనాయకుడు జమీల్ జమాల్ (రాకేష్ బేడీ) పిఏపి పార్టీ నుంచి మరో పార్టీలో జాయిన్ అవుతాడు. హంజానే జాయిన్ చేస్తాడు. దీంతో హంజా పాకిస్థాన్ లో బలమైన శక్తిగా తన సామ్రాజ్యాన్ని పెంచుకుంటాడు. మేజర్ ఇక్బల్(అర్జున్ రాంపాల్) యువకుల్ని తీవ్రవాదులుగా చేసే ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తాడు. హంజాని ఇండియాలో పుట్టి పాకిస్థాన్ లో ఉంటూ ఇండియాని నాశనం చెయ్యాలని చూసే దావుద్ ఇబ్రహీం దగ్గరకి తీసుకెళ్తాడు. పోలీస్ ఆఫీసర్ ఎస్ పి అస్లాం చౌదరి( సంజయ్ దత్) కి హంజాపై డౌట్ వస్తుంది. హంజా భార్య ఎలినా(సారా అర్జున్) కి అయితే హంజా ఇండియన్ అని తెలుస్తుంది. దాంతో హంజాని ఒక కోరిక కోరుతుంది. ఎలినా కోరిన కోరిక ఏంటి? హంజా బలమైన శక్తిగా ఎదిగిన తర్వాత అతనికి ఏర్పడిన శత్రువులు ఎవరు?  పాకిస్థాన్ లో ఏ లక్ష్యంతో ఉంటున్నాడో, ఆ లక్ష్యాన్ని ఎలా సాధించాడు? తద్వారా ఇండియాకి ఎలాంటి మంచి జరిగింది? ఇండియన్ ఇంటిలిజెన్స్ బ్యూరో ఆఫీసర్ అజయ్ సన్యాల్(మాధవన్) క్యారక్టర్ ఏంటి? హంజాగా ఉన్న జస్కి రాత్ గతం ఏంటి? చివరకి అతను సంతోషకరమైన జీవితంలో ఉన్నాడా? లేక విషాదకరమా? అనేదే ధురంధర్ 2  ఎనాలసిస్  పార్ట్ 1 అయితే సూపర్ గా ఉంది కదా పార్ట్ 2 లో ఏముంటుందిలే అని చాలా మంది అనుకోని ఉంటారు. కానీ మొదటి భాగం కంటే రెండవ భాగం ఇంకా బాగుంది. మన దేశంలో జరిగిన  రియల్ ఇన్సిడెన్స్ కి లింక్ పెడుతూ కథనం వచ్చే సరికి ఆశ్చర్యపోతాం. ఇదా అసలు నిజమని తెలిసాక ఎన్నో డౌట్స్ కి ఫుల్ స్టాప్ పడుతుంది. ఫస్ట్ హాఫ్ ప్రారంభం నుంచే పిన్ డ్రాప్ సైలెన్స్ తో కథలోకి లీనమైపోతాం. పంజాబ్ స్టేట్ లోని పఠాన్ కోట్ ఎంఎల్ఏ ఇంట్లోకి జస్కిరాత్ వెళ్లి సృషించే మారణహోమంతో పార్ట్ 2 ఎంత సైలెంట్ ని మెయింటైన్ చేస్తుందో, అంతే వైలెంట్ కూడా ఇస్తుందని చెప్పినట్లయింది. ఈ సందర్భంగా వచ్చిన ఫ్లాష్ బ్యాక్ హృదయాల్ని కట్టిపడేస్తుంది. అదే టెంపోతోనే తర్వాతి సీన్స్ వచ్చాయి. వచ్చే ప్రతి సీన్ లో కూడా హంజా గతం ఎలా బయటపడుతుందనే టెన్షన్ మైంటైన్ అవుతూనే వచ్చింది. ఎస్పి అస్లాం చౌదరితో వచ్చే సీన్స్, ఉజైర్ ని ఇరికించే సీన్స్, బలోచి సీన్స్, జస్కి రాత్ బెస్ట్ ఫ్రెండ్ సొంత దేశం ఇండియానే దెబ్బ కొట్టడానికి పంజాబ్ నుంచి పాకిస్థాన్ రావడం, అతన్ని హంజాగా ఉన్న జస్కి రాత్ చంపడం ఇలా  చెప్పుకుంటూ పోతే అన్ని సీన్స్ బాగున్నాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ సూపర్. సెకండ్ హాఫ్ లో హంజా విధ్వంసం స్టార్ట్ కావడంతో పాటు ప్రతి నిమిషం ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ సీన్ టూ సీన్ పెరిగింది. ఎలినాకి హంజా గురించి అసలు నిజం తెలిసాక కథనం జెట్ స్పీడ్ వేగంతో కదిలింది. దావుద్ ఇబ్రహీం ఎపిసోడ్ తో పాటు అస్లాం చౌదరి. మేజర్ ఇక్బల్ సీన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్  అతి పెద్ద ఎసెట్. నటీనటులు సాంకేతిక నిపుణుల పనితీరు  హంజా అలీ మజారి, జస్కి రాత్ సింగ్ గా రణవీర్ సింగ్(Ranveer  singh) పెర్ఫార్మ్ రేంజ్ ని చెప్పుకోవాలంటే మాటలు చాలవు. పార్ట్ 1 ని  మించి తన నట ప్రస్థానం కొనసాగింది. బహుశా తన ఎంటైర్ కెరీర్ లో మళ్ళీ ఇలాంటి క్యారక్టర్ రణవీర్ కి రాదేమో. ముఖ్యంగా జస్కి రాత్ సింగ్ గా చేసిన సెటిల్డ్ పెర్ఫార్మ్ నభూతో నభవిష్యత్. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో  కన్నీళ్లు తెప్పించాడు. సారా అర్జున్ కూడా పార్ట్ 1 లో నా పెర్ఫార్మ్ చూసింది మీరు తక్కువ ఇది నా పెర్ఫార్మ్ అనే రీతిలో నాచురల్ పెర్ఫార్మ్ తో మెప్పించింది. సంజయ్ దత్ కూడా అంతే. ఎస్ పి చౌదరి అస్లాంగా తగ్గేదెలే అనే విధంగా మెస్మరైజ్ చేసాడు. మేజర్ ఇక్బల్ గా అర్జున్ రామ్ పాల్, ఐబి చీఫ్ అజయ్ సన్యాల్ గా మాధవన్ చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ లో కూడా ప్రదర్శించిన అద్భుతమైన పెర్ఫార్మ్ కి హాట్స్ హాఫ్ చెప్పవచ్చు. మిగతా ఆర్టిస్ట్స్ కూడా తమ క్యారెక్టర్స్ మాత్రమే కనపడేలా మెస్మరైజ్ చేసారు. దర్శకుడిగా, రచయితగా ఆదిత్య ధర్(Aditya Dhar)ఇంకో మెట్టు పైకి ఎక్కాడు. క్యారెక్టర్స్ ని ఉపయోగించుకున్న తీరుగాని, పకడ్బందీ స్క్రీన్ ప్లే విషయంలో గాని తన ఇంటెలిజెన్స్ ని ఎంత మెచ్చుకున్నా తక్కువే. కథకి లొకేషన్స్ ప్రధాన ప్లస్ కాబట్టి అందుకు తగ్గ కథనాన్నే సృష్టించుకున్నాడు. భారీ డ్యూరేషన్ అనే విషయాన్నీ తెలియనీయకుండా కూడా ఆదిత్య ధర్ టేకింగ్ సాగింది.  డైలాగ్స్ క్యారెక్టర్స్ రేంజ్ కి తగ్గట్టుగా ఎప్పుడు ఎలా మాట్లాడాలో అలానే  ఉన్నాయి. ఫొటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పార్ట్ 1 కి ఎలా అయితే హెల్ప్ అయ్యాయో, ధురంధర్ 2 కి అంతే హెల్ప్ అయ్యాయి. ఇంకా చెప్పాలంటే అంతకు మించి. నిర్మాణ విలువలు కూడా ఒక  రేంజ్ లో ఉన్నాయి.    ప్లస్ పాయింట్స్  1 . కథ 2 . కథనం నడిచిన విధానం  3 . రణవీర్ సింగ్ తో పాటు ఆల్ ఆర్టిస్ట్స్ పెర్ ఫార్మెన్స్  4 . ఆదిత్య దర్ డైరెక్షన్  5 .యాక్షన్ సీక్వెన్స్  6 . ప్రీ క్లైమాక్స్  7 . క్లైమాక్స్  8 .ఫొటోగ్రఫీ తో పాటు ఆల్ డిపార్ట్మెంట్స్  9 . ఇండియాలో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ చూపించడం  10 .దావుద్ ఇబ్రహీం ఎపిసోడ్  బలహీనతలు  1 . హంజా గురించి అసలు నిజాన్ని సిల్లీగా చూపించడం ఫైనల్ గా చెప్పాలంటే పార్ట్ 1 ని మించి మెప్పించే విధంగా పార్ట్ 2 ఉంది. రణవీర్, ఆదిత్య ధర్ తో పాటు 24 క్రాఫ్ట్స్ సినిమా విజయానికి ప్రాణంగా నిలిచాయి. రేటింగ్ 3 .25 /5                                                                                                            అరుణాచలం   
తెలంగాణ హైకోర్టు సంచలన నిర్ణయం సినిమా థియేటర్ పార్కింగ్ ఫీజు వసూలు చేసుకోవచ్చు పాత ఉత్తర్వులపై హైకోర్టు స్టే ఏషియన్ కోనార్క్ మినహా అన్ని థియేటర్లలో పార్కింగ్ ఫీజు తెలంగాణలోని సినీ ప్రియులకు హైకోర్టు షాకింగ్ న్యూస్ చెప్పింది. సింగిల్ స్క్రీన్స్/ స్టాండ్ అలోన్ థియేటర్లలో పార్కింగ్ ఫీజులు వసూలు చేయకూడదంటూ ఉన్న నిబంధనపై తాజాగా ఉన్నత న్యాయస్థానం స్టే విధించింది. ఈ కేసులో థియేటర్ యజమానుల తరఫున సీనియర్ అడ్వొకేట్ ఎస్. నిరంజన్ రెడ్డి, అడ్వొకేట్ సిర్గపూర్ సాహిల్ రెడ్డి వాదనలను వినిపించారు. థియేటర్లను ప్రభావితం చేసే ఈ ఆదేశాన్ని, థియేటర్ యజమానుల వాదనలు వినకుండా జారీ చేశారని వారు కోర్టుకు తెలిపారు. దీనివల్ల థియేటర్ల నిర్వహణ భారమవుతుందని వారు పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత హైకోర్టు, ఈ వివాదంలో ఒక కీలకమైన సాంకేతిక అంశాన్ని లేవనెత్తింది. అసలు పిటిషనర్ ఒక నిర్దిష్ట థియేటర్ (ఏషియన్ కోనార్క్) లో వసూలు చేస్తున్న ఫీజుపై మాత్రమే కేసు వేశారని, కానీ ఆ ఉత్తర్వును రాష్ట్రంలోని అన్ని థియేటర్లకు వర్తింపజేయడం సరికాదని కోర్టు అభిప్రాయపడింది. ఆ ఆదేశం కూడా ఆ ఒక్క థియేటర్‌కే పరిమితం కావాలని పేర్కొంది. ప్రస్తుత తీర్పు ప్రకారం, హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో ఉన్న ఏషియన్ కోనార్క్ థియేటర్ మినహా, తెలంగాణ రాష్ట్రంలోని మిగిలిన అన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పార్కింగ్ ఫీజులు వసూలు చేసుకోవచ్చు. ఇది థియేటర్ యజమానులకు పెద్ద ఊరటనిచ్చే విషయమే అయినప్పటికీ, సామాన్య ప్రేక్షకులకు మాత్రం అదనపు భారంగా మారనుంది. ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. ఇప్పటికే టికెట్ ధరలు, క్యాంటీన్ రేట్లు పెరిగిపోయాయని, ఇప్పుడు మళ్లీ పార్కింగ్ ఫీజు కూడా తోడైతే సామాన్యుడు థియేటర్‌కు రావడం కష్టమని నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. మరోవైపు థియేటర్ యజమానులు మాత్రం నిర్వహణ ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ఇది తప్పనిసరి అని వాదిస్తున్నారు.
హరికృష్ణతో కలిసి సిగరెట్ తాగుతూ ఎన్టీఆర్‌కు దొరికిపోయిన చిట్టిబాబు! హరికృష్ణ అంటే ఎన్టీఆర్ తండ్రికి ఎందుకు అంత ప్రాణం?  చిట్టిబాబు ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు! నందమూరి తారకరామారావు క్రమశిక్షణకు మారుపేరు. తన లాగే తన చుట్టూ ఉన్న వారు కూడా క్రమశిక్షణతో ఉండాలి అనుకుంటారు. తాజాగా సీనియర్ నటుడు చిట్టిబాబు(Chitti Babu) తెలుగువన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నందమూరి కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా హరికృష్ణతో కలిసి చేసిన అల్లరి, ఎన్టీఆర్ కి దొరికిపోయిన సందర్భాలను ఆయన మనసు విప్పి మాట్లాడారు. షూటింగ్ సమయంలో హరికృష్ణ, చిట్టిబాబు మంచి స్నేహితులు. ఒకసారి 'బ్రహ్మంగారి చరిత్ర' షూటింగ్ జరుగుతున్నప్పుడు, ఇద్దరూ కలిసి ఎవరికీ తెలియకుండా ఒక చెట్టు వెనుక సిగరెట్ తాగుతున్నారట. అయితే, అటుగా వచ్చిన ఎన్టీఆర్ చెట్టు వెనుక నుంచి పొగ రావడం చూసి, "ఏమిటి ఆ చెట్టు పక్కన పొగ వస్తోంది.. ఏదో అంటుకున్నట్లుంది చూడండి" అని గట్టిగా అరిచారట. ఆ గంభీరమైన స్వరం వినగానే హరికృష్ణ తో సహా చిట్టిబాబు భయంతో సిగరెట్ పారేసి అక్కడి నుంచి పరుగులు తీశారట. ఈ విషయాన్ని గుర్తుచేసుకుంటూ చిట్టిబాబు నవ్వుకున్నారు. కేవలం సరదా ముచ్చట్లే కాదు, ఎన్టీఆర్ కి తన కొడుకుల పట్ల ఉన్న డెడికేషన్ గురించి కూడా చిట్టిబాబు ఆసక్తికర విషయాలు చెప్పారు. హరికృష్ణకి డ్రైవింగ్ అంటే ప్రాణం అని, ఎంతటి క్లిష్టమైన కొండ ప్రాంతాల్లోనైనా జీపును అవలీలగా తోలేవారని కొనియాడారు. డ్రైవర్లు ఎక్కించలేని కొండ మీదకు కూడా హరికృష్ణ జీపును అని తీసుకువెళ్లేవారని, అది చూసి ఎన్టీఆర్ కూడా మురిసిపోయేవారని తెలిపారు. ఎన్టీఆర్ గారి తండ్రికి (హరికృష్ణ తాతగారికి) కూడా మనవళ్లందరిలోకి హరికృష్ణ అంటేనే అమితమైన ప్రాణమని చిట్టిబాబు వెల్లడించారు. షూటింగ్ సెట్‌కి వచ్చినప్పుడు బాలకృష్ణ కంటే హరికృష్ణకే ఎక్కువ ఫైట్ సీన్లు ఇవ్వమని డైరెక్టర్‌తో సరదాగా అనేవారట. నందమూరి కుటుంబంలో ఉన్న అనుబంధాలు, వారి మధ్య ఉన్న ప్రేమానురాగాలను చిట్టిబాబు ఈ ఇంటర్వ్యూలో కళ్ళకు కట్టినట్లు వివరించారు. అలాగే బాలకృష్ణ గురించి మాట్లాడుతూ.. 'బ్రహ్మంగారి చరిత్ర' షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటనను వివరించారు. ఒక సీన్ కోసం బాలయ్య చెప్పులు లేకుండా ముళ్ళ పొదల్లో పరిగెత్తాల్సి వచ్చిందట. ఆ సమయంలో కాలికి ముళ్ళు గుచ్చుకుని రక్తం కారుతున్నా, ఎన్టీఆర్ మాత్రం "ఏం బాలా.. రెడీనా?" అని అడిగారట. తండ్రి క్రమశిక్షణకు తలవంచి బాలయ్య అలాగే రక్తసిక్తమైన పాదాలతో షూటింగ్ పూర్తి చేశారని, ఆ తర్వాతే ఎన్టీఆర్ ప్యాకప్ చెప్పి కొడుకును హాస్పిటల్ కి తీసుకెళ్లారని చిట్టిబాబు చెప్పారు. చిట్టిబాబు చేసిన ఈ వైరల్ కామెంట్స్ చూస్తుంటే, అప్పట్లో షూటింగ్ సెట్స్ ఎంత సందడిగా ఉండేవో అర్థమవుతుంది. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ నెట్టింట హల్చల్ చేస్తోంది. నందమూరి అభిమానులు ఈ పాత జ్ఞాపకాలను చూసి మురిసిపోతున్నారు.  చిట్టిబాబు పూర్తి ఇంటర్వ్యూ కోసం, మరిన్ని ఆసక్తికర సినిమా అప్డేట్స్ కోసం మా 'తెలుగువన్'(TeluguOne) యూట్యూబ్ ఛానల్ ని సబ్‌స్క్రయిబ్ చేసుకోండి.  
తెలుగులోకి ఇంటర్నేషనల్ రియాలిటీ షో 'ది ట్రెయిటర్స్'  సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న తెలుగు వెర్షన్! టాలీవుడ్ టాప్ హీరోతో అమెజాన్ ప్రైమ్ భారీ స్కెచ్! తెలుగులో సరికొత్త రియాలిటీ షో రాబోతుంది. ఇప్పటివరకు మనం చూసిన రియాలిటీ షోలకు భిన్నంగా, అత్యంత ఉత్కంఠభరితమైన అంతర్జాతీయ షో "ది ట్రెయిటర్స్" (The Traitors) తెలుగులో అడుగుపెట్టబోతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్న ఈ షోను ఒక టాలీవుడ్ టాప్ స్టార్ హీరో హోస్ట్ చేయబోతున్నారనే వార్త ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. 'ది ట్రెయిటర్స్' అనేది నెదర్లాండ్స్‌లో పుట్టిన ఒక మైండ్ గేమ్ రియాలిటీ షో. ఇందులో సుమారు 20 మంది సెలబ్రిటీలు ఒక కోటలో నివసిస్తారు. వారిలో కొందరిని హోస్ట్ రహస్యంగా 'ట్రెయిటర్స్' (నమ్మక ద్రోహులు)గా ఎంపిక చేస్తారు. మిగిలిన వారు 'ఫెయిత్ ఫుల్స్' (నమ్మకస్తులు). ప్రతి రాత్రి ట్రెయిటర్స్ ఒకరిని 'మర్డర్' చేస్తారు, అంటే షో నుండి పంపించేస్తారు. పగలు అందరూ కలిసి చర్చించి ఎవరైతే ట్రెయిటర్ అనుకుంటారో వారిని ఓటింగ్ ద్వారా బయటకు పంపిస్తారు. ఈ షోలో నమ్మకం, వెన్నుపోటు, మైండ్ గేమ్స్ ప్రధాన భూమిక పోషిస్తాయి. ఇప్పటికే యూకే, యూఎస్ వంటి దేశాల్లో ఇది సూపర్ హిట్ అయ్యింది. ఇండియాలోనూ అడుగుపెట్టింది. హిందీ వెర్షన్‌కు కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరిస్తుండగా, ఇప్పుడు తెలుగు వెర్షన్‌ కోసం అమెజాన్ ప్రైమ్ ఒక స్టార్ హీరోతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఆ స్టార్ హీరో హోస్టింగ్ చేస్తే షో రేంజ్ మరో స్థాయిలో ఉంటుందని మేకర్స్ భావిస్తున్నారు. బిగ్ బాస్ వంటి షోల కంటే ఇది మరింత పకడ్బందీగా, విభిన్నంగా ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ షోకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేర్పులు చేసి, భారీ బడ్జెట్‌తో ఈ షోను నిర్మించబోతున్నారు. ఇప్పటికే కొంతమంది ప్రముఖ సెలబ్రిటీలను కంటెస్టెంట్స్‌గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.  ఈ షోపై సోషల్ మీడియాలో కూడా భారీ స్థాయిలో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ ఎవరైనా ఈ షోను హోస్ట్ చేస్తారా? అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో బిగ్ బాస్ హోస్ట్ గా ఎన్టీఆర్ సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. అందుకే ఎన్టీఆర్ హోస్ట్ అయితే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.  మరి ఈ గ్రాండ్ రియాలిటీ షోకు హోస్ట్ ఎవరు అనే విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. త్వరలోనే అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ షోకు సంబంధించిన ప్రోమోను విడుదల చేసే అవకాశం ఉంది. 
Jio Studios and B62 Studios’ much-anticipated film about the unknown men, Dhurandhar The Revenge, releases into cinemas tomorrow, 19th March, with paid previews kicking off today and igniting a storm with early screenings! Ahead of the film’s massive release, director Aditya Dhar has earnestly requested the audience not to share spoilers after watching the high-stakes spy action thriller. Recalling the storm that Dhurandhar was, and one that’s about to unleash tomorrow, Aditya Dhar wrote in his latest social media post, “We've put our hearts into Dhurandhar The Revenge so you can experience every twist, every emotion, exactly the way it's meant to be felt. In a theatre, in the dark, surrounded by friends, family, and even strangers, everyone feeling the same emotions,” he wrote. “That's how films should be experienced. Not on someone's phone in blurry image. Hence, here is my one, heartfelt, earnest request...PLEASE DON'T SHARE SPOILERS! Let every single fan walk in clueless but curious and walk our with their own deeply personal version of what they felt,” he added. What adds to the sky-high curiosity is Aditya Dhar’s caption that certainly states You’re still NOT READY FOR THIS!  “Oh, and one more thing. Don’t leave your seats until the credits have stopped rolling 😉” https://www.instagram.com/p/DWBAY5xkcbO/
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
పరాభవం.. తెలుగు జానపద చిత్రాలు,  జానపద నవలలు చదివితే.. అందులో అవమానం జరిగిందనడానికి బదులుగా పరాభవం ఎదురైంది అనే పదం వాడటం చూస్తూనే ఉంటాము.  పరాభవం అంటే అగౌరవం,  అవమానం, కించపరచడం.. ఇలా చాలా సందర్బాలలో వాడుతూ ఉంటారు. అయితే తెలుగు పంచాంగంలో.. తెలుగు సంవత్సరాలలో 40వ తెలుగు సంపత్సరం పేరు పరాభవ నామ సంవత్సరం.  ఈ సంవత్సరం పేరు వినగానే చాలామంది భయపడుతున్నారు.  రెండేళ్ల క్రితం వచ్చిన క్రోథ నామ సంవత్సరం అప్పుడు ఇలాగే భయపడ్డారు. కానీ కాలంతో ప్రయాణం తప్పదు.  అయితే ప్రజలలో పరాభవనామ సంవత్సరం అనే పేరు వినగానే ఎక్కడలేని భయం పుట్టుకొస్తోంది. ఈ కొత్త ఏడాదిలో అవమానాలు, అగౌరవాలు తప్పవా అని ముందే తమ భవిష్యత్తు గురించి మనసులో బోలెడు భవిష్యవాణి ఊహించుకుంటున్నారు. కానీ పరాభవ నామ సంవత్సరం పేరు వెనుక ఉన్న అర్థం,  అందులో పరమార్థం వేరని, ఈ విషయం తెలిస్తే అందరూ ఎంతో ఊరట చెందుతారని అంటున్నారు పండితులు. ఇంతకూ పండితులు ఈ పరాభవ నామ సంవత్సరం గురించి, దాని పేరులో ఉన్న అర్థం గురించి ఏం చెప్తున్నారో తెలుసుకుంటే.. తెలుగు పంచాంగం ప్రకారం 60 తెలుగు సంవత్సరాలు  ఉంటాయి.  వాటిలో విశ్వావసు నామ సంవత్సరం 39వది కాగా.. పరాభవ నామ సంవత్సరం 40వది.  చైత్ర మాసంలో ఉగాది పర్వదినం సందర్బంగా కొత్త తెలుగు సంవత్సరం అయిన పరాభవ సంవత్సరం మొదలు కాబోతోంది. పరాభవ అనే పేరు వినగానే పరాభవాలే ఎదురవుతాయేమో అనుకుంటారు చాలా మంది. కానీ పరాభవ నామ సంవత్సరం అంటే వేరే అర్థాలు ఉన్నాయి.  పరాభవలో పరా అంటే పరాభట్టారికా దేవి.. లిలితా దేవినే పరాభట్టారికా దేవి అని అంటారు.  భవ అని భవుడు అని పరమేశ్వరుడిని సంభోధిస్తారు.  దీని ప్రకారంగా చూస్తే శక్తి స్వరూపమైన ఆ పార్వతీదేవి,  లయకారుడు అయిన పరమేశ్వరుడి కలయికగా వచ్చినదే తెలుగు సంవత్సరమని,  ఈ పరాభవ నామ సంవత్సరం మీద పార్వతీపరమేశ్వరుల అనుగ్రహం పుష్కలంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు.   చాలా వరకు ప్రజలు ఎందులో అయినా ముందు చెడునే గుర్తిస్తారు, చెడునే తలుస్తారు.  ఈ స్వభావం కారణంగానే పరాభవ నామ సంవత్సరం గురించి పలు ఊహాగానాలు వస్తున్నాయని పండితులు చెబుతున్నారు. మరొక విధంగా చూస్తే.. పర అంటే పరదేవత.. ఆ పరదేవతే లలితా పరమేశ్వరి దేవి,  భవ అంటే అంటే కూడా పరమేశ్వరుడు.. ఎలా చూసినా ఇందులో ఎంతో ఆధ్యాత్మికత,  భక్తి మేళవింపు కనిపిస్తుంది.  ఇంతటి గొప్ప నామం వెనుక పిచ్చి అనుమానాలు, భయాలతో కొత్త ఏడాదిని మొదలుపెట్టడం మంచిది కాదని,  ప్రతి ఒక్కరూ సానుకూల ఆలోచన కలిగి ఉండాలని పండితులు చెబుతున్నారు. పరాభవ నామ సంవత్సరాన్ని అత్యున్నతమైన ఏడాది అని జ్యోతిష్యం చెబుతోంది. పరా అంటే గొప్పది, అత్యున్నతమైనది,  భవ అంటే పుట్టుక లేదా ఉద్భవించేది.  ఉన్నతంగా ఉద్భవించేది పరాభవ.. కాబట్టి ఈ పరాభవ నామ సంవత్సం కూడా ఉన్నతంగా ఉంటుందని చెబుతున్నారు. మనిషి తన కర్తవ్యాన్ని తాను ధర్మం తప్పకుండా నెరవేరుస్తుంటే.. ప్రతి ఏడాదిలో వారికి సానుకూలంగా సాగిపోతుందని ఆధ్యాత్మిక వేత్తలు కూడా చెబుతున్నారు. చెడులోనూ మంచి చూసే గుణం,  సానుకూల ఆలోచనలు ఉండటం ప్రధానం. కాబట్టి ఈ పరాభవ నామ సంవత్సరం రోజు సంతోషంతో ఉగాది పండుగను జరుపుకోవడం ద్వారా అందరూ సుఖ సంతోషాలు పొందాలని కోరుకుంటూ.. అందరికీ పరాభవ నామ తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు..                                   *రూపశ్రీ.
నిజమే ఉగాది పండుగ మనదే. తెలుగువారి కొత్త సంవత్సరం ఉగాది తోనే ప్రారంభమవుతుంది.  మన కొత్త సంవత్సరం అంతా ఎంతో కళను నింపుకుని ఉంటుంది. సాంప్రదాయంగా ఉంటుంది. ముఖ్యంగా కృత్రిమత్వంలో పడిపోతున్న మనిషిని బయటకు తీసుకొచ్చి కాసింత ప్రకృతి మధ్య నిలబెడుతుంది. ఇంతకూ మన ఉగాది మనకు మాత్రమే తెలుసా!! మనకు తెలిసిన ఉగాది ఏంటి?? మనం రేపటి తరానికి ఉగాది గురించి చెబుతున్నది ఏంటి??  ఉగాది వెనుక కథ!! సోమకుడు అనేవాడు వేదాలను హరించాడు(దొంగిలించాడు). అలా వేదాలను దొంగిలించిన సోమకుడిని  మత్స్యవతారంలో ఉన్న  విష్ణువు వధించి(సంహరించి, చంపి) వేదాలను బ్రహ్మకు అప్పగించిన శుభదినంను పురస్కరించుకుని విష్ణువు ప్రీత్యర్ధం 'ఉగాది' ఆచరణలోకి వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి.  అయితే చైత్రశుక్లపాడ్యమినాడు ఈ విశాల విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు కాబట్టి, సృష్టి ఆరంభించిన సంకేతంగా ఉగాది జరుపబడుతుందని కూడా చెప్పబడుతుంది. శాలివాహన చక్రవర్తి చైత్రశుక్లపాడ్యమినాడే పట్టాభిషిక్తుడై తన శౌర్యపరాక్రమాలతో శాలివాహన యుగకర్తగా మారిన కారణంతో ఆ యోధుడిని స్మరించుకుంటూ ఉగాది జరుపుకుంటారని చారిత్రక వృత్తాంతం. ఇలా కారణాలు ఎన్ని ఉన్నా ఉగాది అనేది ఓ కొత్తదనానికి సూచిక.  ఆశను మొలిపించే తరుణం!! మనిషి తరతరాలుగా ఓ నమ్మకంతో ఉన్నాడు. అదే కొత్తదనంలో జీవితం కొత్తగా మారుతుందని. అది చాలా మంచి ఆశావహదృక్పథం కలిగి ఉంటుంది. ఆకురాల్చు కాలంలో చెట్ల ఆకులు అన్నీ పోయాక, మోడువారి ఏమీలేనితనంతో ఉన్నప్పుడు, వసంతం వస్తుంది, మెల్లిగా చివురులు తొడుగుతాయి చెట్లు. అవన్నీ పచ్చని ఆశల చివురులు, ఉగాదిలో దాగున్నది అదే అంటారు అందరూ. షడ్రుచులు-జీవితసారం!! ఉగాది రోజు అందరి ఇళ్లలో ఉండే ప్రత్యేక విందు ఉగాది పచ్చడి. నిజానికి జీవితమంతా ఆ పచ్చడిలోనే ఉందని చెబుతారు పెద్దలు. కష్టాలు, సుఖాలు, బాధలు, ఇబ్బందులు, ప్రేమలు, పొట్లాటలు ఇలా అన్నీ ఉగాది పచ్చడిలో ఉండే ఆరు రుచులలో కలిసిపోయి ఉంటాయని చెబుతారు. అందుకే ఉగాది రోజు ఉగాది పచ్చడికి నత ప్రత్యేకత వచ్చి పడింది. అలాగే మరొక విషయం కూడా. ఉగాది సమయంలోనే కొత్త బెల్లం దొరుకుతుంది, మామిడికాయల గురించి ప్రత్యేకంగా చెప్పాలా?? ఈ సమయానికి కాస్త చిన్న చిన్నగా ఉన్న వగరుతో ఉన్న కాయలు వస్తాయి. ఇంకా ఎంతో గొప్ప ఔషధ మూలాలు కలిగిన వేపచెట్లకు పువ్వులు పూస్తాయి, కొత్త చింతపండు ఎర్రెర్రగా నిగానిగలాడుతూ అందరి ముందుకూ వస్తుంది.  వీటన్నింటి కలయిక అయిన వేపపచ్చడి ఆరు రుచులతో కనువిందు చేస్తుంది. సంప్రదాయపు గీతిక!! ఉగాది రోజు మగవాళ్ళు అందరూ పంచెకట్టులోనూ, ఆడవాళ్లు పట్టుచీరల్లోనూ, పిల్లలు కొత్త బట్టల్లోనూ మెరిసిపోతూ ఉంటారు. ఆ వస్త్రధారణలో అసలైన తెలుగుదనం ఉట్టిపడుతూ ఉంటుంది. నగరాలలో కృత్రిమత్వంలో మునిగిపోయిన యువత ఎంతో అందంగా, పద్దతిగా, బుద్దిగా ఇలా తయారైతే ఇంటిల్లిపాదికీ ఎంత సంతోషమో!! ఇంకా పంచాంగ శ్రవణం మరొక వేడుక, పిండి వంటల సంబరం మరొక ఎత్తు. ఇలా అన్ని విధాలుగా ఉగాది మనిషి జీవితంతో ముడిపడి ఉంటుంది. మనిషి జీవితానికి అసలైన నిర్వచనాన్ని ఉగాది చెబుతుంది. అభివృద్ధి వేగంలో మనిషి మర్చిపోతున్న అసలైన నడవడికను మన ఉగాది మనకు తిరిగి అందిస్తుంది. అందుకే ఇది మన తెలుగుసంవత్సరం అని గొప్పగా జరుపుకోవాలి.                                    ◆ వెంకటేష్ పువ్వాడ.
హిందువులకు తులసి మొక్క దైవంతో సమానం. తులసి మొక్క పచ్చగా కళకళలాడుతూ ఉంటే ా ఇంట్లో ఎంతో సానుకూల శక్తి,  మరెంతో సంతోషం ఉంటాయని చెబుతారు. అయితే వేసవి కాలం వచ్చేసింది. తులసి మొక్కతో సహా చాలా రకాల మొక్కలు వేసవి ఎండల కారణంగా వాడిపోయి ఎండిపోతుంటాయి. కానీ పవిత్రమైన తులసి మొక్క పచ్చగా ఉంటేనే మంచిది.  ఇది ఇంటికి అందాన్నే కాకుండా సానుకూల శక్తిని కూడా నిలిపి ఉంచుతుంది.  వేసవి ఎండలు ఎంత ఉన్నా తులసి మొక్క అందంగా,  పచ్చగా ఉండాలంటే  కొన్ని చిట్కాలు పాటించాలి. అవేంటో తెలుసుకుంటే.. తులసి మొక్క ఔషధ గుణాలతో సమృద్ధిగా ఉంటుంది. వేసవి కాలం కదా అని చాలామంది తులసి మొక్కకు ఎక్కువ నీరు పెడుతూ ఉంటారు. కానీ ఇది చాలా తప్పు.  ఎక్కువ నీరు పెట్టడం వల్ల మొక్క దెబ్బతింటుంది. నేల తేమగా  ఉండేందుకు తగినంత మాత్రమే మొక్కకు నీరు పెట్టాలి. మొక్క నీటిలో మునిగినట్టు ఉంటే ఆ మొక్కకు హాని కలుగుతుంది. తులసి మొక్క గురించి నిర్లక్ష్యంగా ఉండకూడదు.  కొన్నిసార్లు, మొక్కను సరిగ్గా చూసుకోకపోవడం వల్ల అది కుళ్ళిపోతుంది.  కొన్ని ఇళ్లలో వర్షాకాలంలో కూడా తులసి మొక్క పచ్చగా కనిపించదు. అలాంటి వారు జాగ్రత్తలు తీసుకోవాలి. మొక్కలను కుండీలలో పెంచుతూ ఉంటారు.  వీటికి కొన్నిసార్లు,  పోషకాహార లోపం కూడా  ఎదురవుతుంది.  మొక్కల ఎదుగుదలకు  అవసరమైన పోషకాలు అందించడం చాలా ముఖ్యం. తులసి మొక్కను పచ్చగా ఉంచడానికి,  ఎరువులు వేయాలి. ప్రతి 15 రోజులకు ఒకసారి ఎరువులు వేస్తూ ఉంటే కొన్ని రోజులకే మొక్క పచ్చగా మారుతుంది. తులసి మొక్క ఎండిపోయినట్టు ఉంటే మొక్క  మట్టికి ఆవాల కేక్ వేయవచ్చు. ఆవాల కేక్ వేయడం వల్ల మొక్క వేగంగా పెరుగుతుంది.  ఆవాల నూనె తీసిన తర్వాత వచ్చే పిప్పిని ఆవాల కేక్ అని అంటారు.  ఒకవేళ ఇది అందుబాటులో లేకపోతే ఒక స్పూన్ ఆవాలను బాగా గ్రైండ్ చేసి ఆ పొడిని నేరుగా మట్టిలో మిక్స్ చేయవచ్చు. లేదంటే ఆవాల పొడిని నీటిలో వేసి ఒక రోజంతా అలాగే ఉంచి,  ఆ తరువాత  ఆ నీటిని మొక్కకు పోయవచ్చు. మొక్క బలంగా పచ్చగా పెరుగుతుంది. తులసి మొక్క ఎండిపోతూ ఉంటే.. ఎండిపోయిన కొమ్మలను తొలగించి,  ఆవాల పొడిని వేయడం వల్ల మొక్క తిరిగి కొన్ని రోజులకే పచ్చగా మారుతుంది.                                          *రూపశ్రీ.
తమిళనాడు రాజకీయాల్లో విలువల పతనం పతాక స్థాయికి చేరిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  రాజకీయ నేతలు అంశాల వారీ విమర్శలు కాకుండా హీరోయిన్లపై అనుచిత,  దిగజారుడు వ్యాఖ్యలూ చేస్తూ చౌకబారు రాజకీయాలకు పాల్పడుతున్నారు.   ప్రముఖ హీరోయిన్లను వివాదాల్లోకి లాగుతూ,  వివాదాల్లోకి లాగుతూ వ్యక్తిగత విమర్శల దిగజారుతున్న తీరు తమిళనాట రాజకీయ ప్రతిష్ఠను దిగజారుస్తున్నది. సీనియర్ హీరోయిన్లు త్రిష, నయనతార లను ఉద్దేశించి తమిళ రాజకీయ నాయకులు కొందరు చేసిన వ్యాఖ్యల పట్ల తమిళనాటే కాకుండా దేశ వ్యప్తంగా నిరసన వ్యక్తం అవుతున్నది.   తాజాగా  ఏఐఏడీఎంకే ఎంపీ షణ్ముగం నయనతారపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయి.  తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఇటీవల రాష్ట్ర ప్రజల కలల గురించి ప్రస్తావించగా.. ఎంపి షణ్ముగం షణ్ముగం మాట్లాడుతూ..  నాకు నయనతార కావాలి, నా కలను నెరవేరుస్తారా? అంటూ తీచౌకబారు వ్యాఖ్యలు చేశారు.   బాధ్యతాయుతమైన ఎంపీ పదవిలో ఉన్న వ్యక్తి ఇలా  ఒక నటిని ఉద్దేశించి ఇంతటి అభ్యంతరకర రీతిలో వ్యాఖ్యానించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  అలాగే మరో అగ్రనటి   త్రిషపై  తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. రాజకీయనాయకుడిగా మారిన నటుడు విజయ్‌ను విమర్శించే క్రమంలో  ఆయన అసందర్బంగా, అనుచితంగా త్రిష పేరు  ప్రస్తావించారు. విజయ్ తన ఇంటి నుంచి బయటకు వచ్చి క్షేత్రస్థాయి పరిస్థితులు చూడాలంటూ త్రిషను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర విమర్శలకు గురయ్యాయి.  సినిమా రంగంలో తమకంటూ  గుర్తింపును, గౌరవాన్న, అశేష ప్రేక్షకాభిమానాన్నీ సంపాదించుకున్న నటీమణులపై ఇటువంటి అసభ్య, అసందర్భ వ్యాఖ్యలు చేయడంపై మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.  రాజకీయ ప్రత్యర్థుల వారి విధానాలను ఎండగడుతూ విమర్శలు చేయాలి కానీ,   సంబంధం లేని మహిళల వ్యక్తిత్వాన్ని కించపరచడం  సరికాదని అంటున్నాయి.  కాగా ఎంపీ  షణ్ముగం నయనతారపై చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్   సీరియస్ అయింది. ప్రజాప్రతినిధులు నోరు అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. త్వరలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో  ప్రచార పర్వంలో ఇంకా ఎలాంటి విమర్శలు వినాల్సి వస్తుందోనన్న ఆందోళన వ్యక్తమౌతోంది. 
మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో తెలుగుదేశం ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ పేరు ప్రముఖంగా ఉండటం తెలుగు రాజకీయాలలో సంచలనంగా మారింది.  డగ్స్   ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏలూరు ఎంపీపై తెలుగుదేశం  అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  పార్టీ క్రమశిక్షణ , ప్రతిష్ట   భంగం కలిగేలా వ్యవహరిస్తే ఎవరినైనా, ఎంతటి వారినైనా ఉపేక్షించే ప్రశ్నే లేదని స్పష్ఠం చేశారు. మంగళవారం (మార్చి 17)  రాత్రి తిరుపతి నియోజకవర్గ నేతలతో జరిగిన అంతర్గత సమావేశంలో చంద్రబాబు పుట్టా మహేష్ యాదవ్ వ్యవహారం ప్రస్తావించారు. గత ఎన్నికలలో   రాష్ట్రంలో డ్రగ్స్ సంస్కృతిని నిర్మూలిస్తామని ప్రజలకు హామీ ఇచ్చామని, అలాంటిది పార్టీకి చెందిన ప్రజాప్రతినిధే ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం క్షమించరాని నేరమన్నారు. యువ నాయకుడు, మంచి నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చాడన్న ఉద్దేశంతో అవకాశం ఇస్తే, పార్టీకి చెడ్డపేరు తీసుకువచ్చారంటూ పుట్టా మహేష్ యాదవ్ పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.  పోరుగు రాష్ట్రంలో ఫామ్ హౌస్ పార్టీకి వెళ్లాల్సిన అవసరం ఏముంది? వెళ్లినా అక్కడ డ్రగ్స్ తీసుకోవడం వంటి చర్యలకు పాల్పడటమేంటని చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది.   ఇప్పటికే ఈ వ్యవహారంపై ఐదు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని పార్టీ అధిష్టానం ఎంపీ పుట్టా మహేష్ కి షోకాజ్ నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిదే.   అప్పటి వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. సాధారణంగా నేతల పట్ల సౌమ్యంగా ఉండే చంద్రబాబు, ఈ విషయంలో మాత్రం అత్యంత కఠినంగా  తిరపతి నియోజకవర్గ నేతలతో జరిగిన అంతర్గత సమావేశంలో పుట్టా మహేష్ యాదవ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేయడం ద్వారా తెలుస్తోంది.  డ్రగ్స్ పరీక్షల్లో మహేష్ యాదవ్‌కు పాజిటివ్ రావడంతో  వైసీపీ విమర్శలకు పదును పెట్టింది. ఈ నేపథ్యంలోనే  పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా వెళ్లే వారిని మోయాల్సిన అవసరం లేదని చంద్రబాబు బాహాటంగానే ప్రకటించారని అంటున్నారు.  పార్టీ షోకాజ్ కు మహేష్ ఇచ్చే వివరణ సంతృప్తి కరంగా లేకుంటే.. ఆయనపై సస్పెన్షన్ వేటు పడటం ఖాయమని తెలుగుదేశం వర్గాలు అంటున్నాయి. పుట్టా మహేష్ యాదవ్ పై తీసుకునే చర్య  ఇతర యువ నేతలకు ఒక హెచ్చరికలా ఉండాలని చంద్రబాబు భావిస్తున్నట్లు చెబుతున్నారు. 
సినిమా స్టార్స్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం కొత్తేమీ కాదు. ఇప్పటికే చాలా మంది సినిమా తారలు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి, రాష్ట్రాలను ఏలారు. తమిళనాడులో ఎంజీఆర్, తెలుగులో సీనియర్ ఎన్టీఆర్ పాలిటిక్స్‌లో తమదైన ముద్ర వేశారు. వారి బాటలోనే తమిళ, తెలుగు హీరోయిన్లు పొలిటికల్ స్క్రీన్‌పై   మెరిసారు. ఎంజీఆర్ సన్నిహితురాలు జయలలిత ఆయన తదనంతరం ఏఐడీఎంకే అధినేత్రిగా తమిళనాడు సీఎం పీఠం అధిరోహించి చక్రం తిప్పారు.  తాజాగా  స్టార్ హీరోయిన్ త్రిష పొలిటికల్ ఎంట్రీకి రెడీ అయ్యారన్న ప్రచారం జోరందుకుంటోంది.  జయలలిత, ఎం.జే.ఆర్ తరహాలో తమిళనాట రాజకీయాల్లో రాణించాలని త్రిష చూస్తున్నారని తెలుస్తోంది.  తెలుగు, తమిళ భాషల్లో త్రిష స్టార్ హీరోయిన్ గా రాణించింది. దాదాపు అందరు స్టార్ హీరోల సరసన త్రిష హీరోయిన్ గా నటించి మెప్పించింది. ప్రస్తుతం తమిళంలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ అలరిస్తున్నది. ఇక ఇప్పుడు త్రిష రాజకీయ ప్రవేశం వెనక టీవీకే పార్టీ అధినేత, హీరో విజయ్ ఉన్నారంటున్నారు. ఇప్పటికే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఓ వైపు డీఎంకే కాంగ్రెస్ కూటమి, మరో వైపు అన్నాడీఎంకే, బీజేపీ కూటములు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు తమదంటే తమదని  ఉధృతంగా ప్రచారం చేస్తున్నాయి.  ఇప్పుడు ఆ రెండు కూటములతో పాటు  టీవీకే అధినేత విజయ్ సీఎం సీటుపై కన్నేశారు.ఇప్పటికే విజయ్ తమిళనాడు వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలతో ఎలక్షన్ క్యాంపెయిన్ హోరెత్తిస్తున్నారు. అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో విజయ్‌ నుంచి విడాకులు కోరుతూ ఆయన భార్య కోర్టు గడపతొక్కడంతో ఈ విషయం ఇటు తమిళనాడులోనే కాకుండా దక్షిణాది రాజకీయాల్లో సైతతం హాట్ టాపిక్‌గా నిలిచింది.  త్రిష కారణంగానే వారి పెళ్లి పెటాకులవ్వబోతోందన్నది ఓపెన్ సీక్రెట్టే.  విషయం ఓపెన్ అయి పోవడంతో..  నిండా మునిగాక చలేముందిలే అన్నట్లుగా విజయ్ కూడా చాలా ఓపెన్ అయ్యాడు. భార్య బ్లాక్‌మెయిల్‌కు బెదిరేది లేదని ప్రజలకు స్పష్టం చేయడానికా అన్నట్లు... ఇటీవల ఓ పెళ్లి వేడుకకు త్రిషతో కలిసి హాజరై అందరికీ షాక్ ఇచ్చాడు. దాంతో త్రిషతో ఉన్న రిలేషన్‌షిప్ పై వస్తున్న వార్తలకు బలం చేకూర్చినట్లైంది.   హీరో విజయ్ కొత్త పార్టీ టీవీకే తొలిసారిగా ఎన్నికల్లో నిలవబోతోంది. ఇప్పటికే అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో విజయ్ ఉన్నారు. ఈ క్రమంలోనే చెన్నై అసెంబ్లీ సీటును విజయ్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు కనిపిస్తోంది.  సినిమా రంగానికి, రాజకీయాలకు విడదీయలేని బంధం ఉన్న తమిళనాడులో  చెన్నై పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రత్యేక స్థానం ఉంది.  చెన్నై నార్త్, సెంట్రల్, సౌత్ అసెంబ్లీ స్థానాల నుండి పలువురు నటీనటులు విజయం సాధించి చట్టసభల్లో అడుగుపెట్టారు. ఎంజీఆర్,  తర్వాత జయలలిత,   మరో మాజీ సీఎం కరుణానిధి చెన్నై నగరం నుంచే గెలిచారు  ప్రస్తుత తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ చెన్నై నుండే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ క్రమంలోనే అక్కడి నుంచి నటి త్రిషను టీవీకే పార్టీ టికెట్ పై పోటీ చేయించాలని భావిస్తున్నారని తమిళ పాలిటిక్స్‌లో ప్రచారం జరుగుతోంది. అయితే తన రాజకీయ అరంగేట్రంపై ఇంకా క్లారిటీ ఇవ్వని త్రిష, రానున్న ఎన్నికల్లో చెన్నైలోని ఏ అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి దిగుతారన్నది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. ఏదిఏమైనా తమిళనాడు రాజకీయాలు ప్రస్తుతం హీరోయిన్ త్రిష చుట్టే తిరుగుతున్నాయి. విజయ్ టీవీకే పార్టీ ఎన్డీఏతో పొత్తు పెట్టుకునే నిర్ణయం ఆమె చేతుల్లోనే ఉందని వార్తలొస్తున్నాయి. ఇటీవల అమిత్ షాతోనూ త్రిష భేటీ అయ్యారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఏఐడీఎంకే నేతలూ త్రిష‌తో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఎన్నికలు సమీపిస్తున్న వేళ త్వరలోనే తమిళ రాజకీయాల్లో సంచలనాలు ఖాయంగా కనిపిస్తున్నాయి. మరి త్రిష తమిళనాడు రాజకీయాల్లో మరో జయలలిత అనిపిం చుకుం టారో? లేకపోతే శశికళలా మిగిలిపోతారో చూడాలి.
డా ..చిరు మావిళ్ళ మురళీ మనోహర్.. ఉగాది అంటే ఉగాది పచ్చడి మాత్రమే అని అనుకుంటారు. కానీ ఉగాది పచ్చడిలో ఉన్న ఆయుర్వేద ఆరోగ్య రహస్యం ఏమిటో తెలుసా?ఇప్పుడు చైత్ర మాసం లో వసంత రుతువు లో ఉన్నాం ఆకు రాలిన తరువాత కొత్త కొత్త గా రేకు విచ్చినట్లు చిగుర్లు తోడుగుతాయి. ఆప్రాంతం అంతా పచ్చటి తివాచి పరిచినట్లు పచ్చగా విరబూస్తాయి. పువ్వులు పరిమళాలు.మావిడి పూత సువాసనలు, మామిడి చెట్లపై కొత్తగా చిగురులు తొడిగిన మామిడి పూత గుత్తులు,మామిడి పిందెలు ఆ వసంత శోభ అప్పుడే వచ్చిందా అనిపిస్తుంది మది పులక రిస్తుంది. కొత్త కొత్త పూతని ఆస్వాదించాలని అనిపిస్తూ ఉండడం సహజం.ప్రకృతి లో మార్పు వచ్చింది శీతకాలం నుండి ఎండా కాలానికి వాతావరణం మారుతుంది ఇక ఎండవేడి ని తట్టుకోవ దానికి మన శరీరం సన్నద్ధం కావాలి.వాతావరణం లో మార్పులకు తగ్గట్టుగా శరీరంలో వేడిమి ని,తట్టుకోవడం. శరీరం దానంతట అదే చల్లబడే సహజ లక్షణాన్ని వృద్ది   చేయడంకీలకం.ముఖ్యంగా ఎండాకాలం లో వేడికి శరీరం నీర సించి పోవడం.ఒక్కో సారి అతిసారం బారిన పడడం. ముఖ్యంగా డయాబెటీస్, గుండె సంబధిత సమస్యలు ఉన్న రోగులలో వచ్చే హార్ట్ బీట్ లో మార్పులు.లేదా శరీరంలో రక్త ప్రసరణలో సమస్యలు వస్తూ ఉంటాయని ప్రముఖ ఆయుర్వేద వైద్యులు  డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్ విశ్లేషించారు.ఈ క్రమం లో మనం ఉగాది రోజున తీసుకున్నే ఆరు రకాల లో ఉన్న ఆరోగ్య రహస్యాలు, వాటిలో  ఉండే పోషక విలువల గురించి తెలుగు వన్ హెల్త్ కు  వివరించారు. మనం పండగ పూట లేదా కొన్ని సందర్భాలాలో తీసుకున్న ఆహారం శరీరంలో తామస ,రజో గుణాలు పెంచు తాయని  శరీరంలో వేడి వల్ల వచ్చే సమస్యల ను అధిగమించాలి సత్వ ప్రాధాన మైనగుణాన్ని అలవారచుకోవాలాంటే ఉగాది పచ్చడి ఉపయోగ పడుతుందని ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్ పేర్కొన్నారు. వేసవి రాగానే శరీరం లో కొన్ని రకాల రసాయన చర్యల వల్ల శరీరం లో సమతౌల్యం లోపిస్తుందని సమ తౌల్యాన్ని నియంత్రించే శక్తి ఉగాది పచ్చడి సమతుల పోషకాలు అందిస్తయాని అన్నారు డాక్టర్ చిరుమావిళ్ళ మురళీ మనోహార్. సాంప్రదాయ పద్దతిలో ఉగాది పచ్చడి కావాల్సిన పదార్ధాలు... **మట్టి పాత్ర,లేదా కుండ. **వేప పూత ఒక భాగం. **మామిడి పిందెలు  ముక్కలు రెండు భాగాలు.  . **చింత పండు,పా తది. నాలుగు భాగాలు. **ఉప్పు 5 భాగాలు. **బెల్లం ఆరు భాగాలు .ఇంకా అరిటి పండు ముక్కలు  అన్నీ కలిపి నీరు పోయాలి. పైన పేర్కొన్న కావాల్సిన పదార్ధాలలో  మధురం-తీపి  ఆమ్లం-పులుపు. లవణం-ఉప్పు . తి త్తం -చేదు. వగరు వంటి లక్షణాలు ఉంటాయి.ఇలా తయారు చేసిన వేప పచ్చడిని నింబ కుసుమ భక్షణం అని అంటారు.నింబ కుసుమము అంటే వేప పూత అని అర్ధం. మామిడి ముక్కలు,బెల్లము,పులుపు,చేదు వంటివి చింత పండు అరటి పండు,మిరియాలపొడి,ఉప్పు వంటివి వేసిన నింబ కుసుమ భక్షణం అంటే తింటే మరెన్నో లాభాలు ఔషద గుణాలు ఉన్నాయి.అని డాక్టర్ మురళీ మనోహర్ తెలుగు వన్ హెల్త్ కు వివరించారు. షడ్రసో పేతం ఉగాది పచ్చడి... ఉగాది పచ్చడిలో ఆరు రకాల రుచులు ఉంటాయని వాటిని షట్ రుచులుగా పేర్కొన్నారు.ఎందుకంటే జీవితానికి ఉగాదికి మానసిక సంబంధమైన సంబంధం ఉందని అంటారు చిరు మావిళ్ళ.అవును మనజీవితం లో తెలుగు వారికి తెలుగు సంవత్సరాది యుగ ఆది అంటే మరో యుగం నికి ఆది అంటే తొలి అడుగు. ఈ సమయం లో మనం ఎదుర్కునే ఎన్నోరకాల సమస్యలు ఒక్కో రుచిని సూచిస్తాయి. అన్ని సమపాళ్ళలో ఉంటె పచ్చడిని ఎలా అస్వాదిస్తామో.కస్టాలు,కడ గళ్ళు,ఆనందం,ఉత్సాహం, కష్టం,నష్టం, వచ్చినా మానసికంగా ఎదుర్కోడానికి మనల్ని సిద్ధం చేసేది ఉగాది అని అంటారు పండితులు.ఉగాది పచ్చడి ఔషద గుణాలు...వేప పువ్వు ,దీనిని బద్ర అని నింబ అని కూడా పిలుస్తారు. నిచిన, నిచినిండిన్ మార్గోసిన్ అనే పదార్ధాలు ఉంటాయని. వేప యాంటి ఫంగల్,యాంటి బ్యాక్టీరియాగా పని చేస్తుందని వేప  వల్ల వివిదరకాల జబ్బులను తగ్గించే గుణం వేపాకు ఉందని స్పష్టం చేసారు చిరుమవిళ్ళ మురళీ మనోహర్.వేపాలో తిత్త రసం ఉందని అంటే చెడు గుణం ఉన్నందున శరీరంలో వచ్చే కఫ,పిత్త దోషాన్ని తొలగించి ఆకలి పెంచుతుందని విశ్లేషించారు.వేపను తీసుకోవడం వల్ల ముఖ్యంగా డయాబెటీస్ ను నియంత్రించే గుణం వేపకు ఉందని వీటితో పాటు కామెర్లు,చర్మ సంబంధిత వ్యాధులను నివారిస్తుంది.పిల్లలకు వేపను తినిపించడం వల్ల కడుపులో ఉండే నులి పురుగులు చచ్చిపోతాయని కాబట్టి పిల్లకు మేలు చేస్తుందని.పేర్కొన్నారు. బెల్లం... ఉగాది పచ్చడికి కీలకమైన ఇంగ్రీడియంట్. బెల్లానికి తీపిగుణం ఉంటుంది. బెల్లానికి కఫం పెంచే గుణం ఉంది. బెల్లం ఉగాది నుంచి వాడితే కఫ దోషాన్ని తగ్గిస్తుంది. ఎండాకాలం లో వచ్చే ఎందవేదిమిని తట్టుకోడానికి ఎండబారిన పడ్డ వారికి నీ రసం  తగ్గించితక్షణ శక్తి నిచ్చేది గ్లుకోజ్ గా బెల్లం పనిచేస్తుంది.బెల్లం ఒక సువాసన,శ్రమ నీరసం తగ్గించి వడ దెబ్బ నుండి కాపాడే శక్తినిచ్చి ప్రోటీన్లను అందించేది బెల్లమే  అయితే బెల్లము అరిటి పండు కలిపి తీసుకుంటే మంచిదని అంటారు చిరుమామిళ్ళ. మామిడి ... ఉగాదిపచ్చడికి ఎన్ని ఉన్న మామిడి ముక్క పుల్లగా తగలనిదే పచ్చడికి రుచి ఉండదు. అని పెద్దలు అంటూ ఉంటారు.ముఖ్యంగా వేసవి కాలం లో చాలామంది కడుపు నొప్పి తో బాధ పడుతూఉంటారు.మామిదిపండులో ఉండే విటమిన్ సి మనలో ఇమ్యునిటీ పెంచుతుంది. మామిడి కాయ వల్ల గుండెజబ్బులు, డయాబెటిస్ రాకుండా నియంత్రిస్తుంది.  చింత పండు... దీనిని తెమరందన్ ఇండియా భారత దేశం లో అతి పురాతన మైన విటమిన్లు,పిండి పదార్ధాలు ఉంటాయి. చింతపండులో ముఖ్యంగా పాత చింత పండు ఉష్ణం తగ్గిస్తుంది. వాతాన్ని, బడలిక, జీర్ణ ప్రక్రియను సరి చేస్తుంది. శరీరంలో వచ్చే వేడి తగ్గించి చల్ల దానాన్ని ఇస్తుంది.ముఖ్యంగా చింత అంటే చింతలు తీర్చేది చింత రసం త్వరగా శక్తి నిస్తుంది.మూత్ర విసర్జన సాఫీగా సాగేట్లు సహకరిస్తుంది చింత రసం. అందుకు చింత పండు రసం వేసవి కాలం లో తీసుకోవడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఉప్పు... ఉగాది పచ్చడి రుచిని పెంచేది చవి లేదా లవణం,ఉప్పు మన శరీర అవసరాలకు జీవన శక్తి నిచ్చేది లవణం. ఆహారం లో వేసే ఉప్పు ఆ వంటకు మంచి రుచిని ఇస్తుంది.ఉప్పు త్రిదోషాల ను హరిస్తుంది. అరటి పండు... అరటి పండు లో పోషక విలువలు పొటాషియం, యాంటి ఫంగల్, కూడా అరటి పండు పనిచేస్తుంది.అతిసారం నుండి రక్షించే సంజీవనిగా పేర్కొన్నారు వైద్యులు. అరటి పండు అధిక రక్త పోటు, కిడ్నీ సమస్యలు, రసాయనం గా పనిచేస్తుంది. ఇవి ఉగాది ఔషదం అధ్బుత ఫలితాలు ఉగాది పచ్చడి ఉగాది రోజే తీసుకోవాలా అప్పుడప్పుడూ తీసుకోవచ్చు అంటున్నారు. ముఖ్యంగా ఉగాది నుండి శ్రీరామ నవమి వరకు ఎప్పుడైనా తీసుకుంటే వేసవి కాలం లో ఎన్ని సార్లు తీస్జుకున్న తప్పులేదు. వ్యక్తిలో ఉండే త్రి దోషాల నుండి ముక్తి నిచ్చేది ఉగాది పచ్చడి.   
  ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు ఊరికే అనలేదు. కానీ నేటి కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి వల్ల మనలో చాలా మంది మలబద్ధకం (Constipation) మరియు మధుమేహం (Diabetes) వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. ప్రతిరోజూ మాత్రలు మింగడం, ఇన్సులిన్ తీసుకోవడం మానసికంగా ఎంతో కుంగదీస్తుంది. మీ ఇంట్లోనే, మీ వంటింట్లో ఉండే పదార్థాలతో ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తే ఎంత బాగుంటుంది కదా? ఆయుర్వేద నిపుణులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు సూచించిన ఒక అద్భుతమైన "డబుల్ ధమాకా" చిట్కా గురించి ఈ Video Link క్లిక్ చేసిన మనం వివరంగా తెలుసుకుందాం. మనం ఈ మార్పు ఎందుకు చేసుకోవాలి? (Why Should We?) సాధారణంగా మనం తినే రోటీలు కేవలం ఆకలిని తీరుస్తాయి. కానీ వాటికి కొన్ని ప్రత్యేక పదార్థాలను జత చేయడం వల్ల అవి ఔషధాలుగా మారుతాయి: • సహజసిద్ధమైన పరిష్కారం: ఎటువంటి రసాయనిక మందులు లేకుండానే ఉదయం పూట సాఫీగా విరేచనం అయ్యేలా చేస్తుంది. • పోషకాల గని: చియా సీడ్స్ వల్ల శరీరానికి అవసరమైన ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, కాల్షియం మరియు ఫైబర్ అందుతాయి. • దీర్ఘకాలిక ప్రయోజనాలు: కేవలం షుగర్ కంట్రోల్ చేయడమే కాకుండా, భవిష్యత్తులో బరువు పెరగకుండా, హార్మోన్ల అసమతుల్యత కలగకుండా కాపాడుతుంది. • మెదడు ఆరోగ్యం: వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు (అల్జీమర్స్), పార్కిన్సన్స్ వంటి సమస్యలు రాకుండా ఈ పదార్థాలు రక్షణనిస్తాయి. • మందుల వాడకం తగ్గుతుంది: సరైన ఆహార నియమాలు పాటిస్తూ ఈ రోటీలు తీసుకోవడం వల్ల మీరు వాడే షుగర్ మాత్రల డోస్, ఇన్సులిన్ అవసరం క్రమంగా తగ్గే అవకాశం ఉంది. ఎలా తయారు చేసుకోవాలి? (How-to Guide) మీరు రోజూ తినే రెండు పుల్కాలు లేదా రోటీల పిండిలో ఈ క్రింది విధంగా కలపండి: 1. మలబద్ధకం సమస్య ఉన్నవారి కోసం: • చియా సీడ్స్: 2 నుండి 3 టీస్పూన్ల చియా సీడ్స్‌ను 15 నిమిషాల పాటు నీటిలో నానబెట్టాలి. • సబ్జా గింజలు: 1 నుండి 1.5 టీస్పూన్ల సబ్జా గింజలను కూడా నానబెట్టుకోవాలి. • ఈ నానబెట్టిన గింజలను నీటితో సహా పిండిలో కలిపేసి రొట్టెలు చేసుకోవాలి. 2. షుగర్ (డయాబెటిస్) నియంత్రణ కోసం: • పచ్చి పనసకాయ పొడి: 2 నుండి 3 టీస్పూన్ల పచ్చి పనసకాయల పొడిని పిండిలో కలపాలి (ఇది ఆన్‌లైన్ లేదా మెడికల్ షాపుల్లో దొరుకుతుంది). • మెంతి పొడి: ఒక టీస్పూన్ వేయించిన మెంతుల పొడిని కలపాలి. • ఈ మిశ్రమంతో రోటీలు చేసుకుంటే మెంతి పొడి వల్ల వచ్చే చేదు కూడా వేడి చేయడం వల్ల తగ్గుతుంది, రుచిగా ఉంటుంది. ఏమి చేయకూడదు? (What Not to Do) • నానబెట్టకుండా వాడకండి: చియా సీడ్స్ లేదా సబ్జా గింజలను నేరుగా పిండిలో కలపకూడదు, కచ్చితంగా నానబెట్టాలి. • పనస పండు వద్దు: షుగర్ ఉన్నవారు పనస పండు తినకూడదు (గ్లైసమిక్ ఇండెక్స్ ఎక్కువ), కేవలం 'పచ్చి పనసకాయ పొడి' మాత్రమే వాడాలి. • మందులు ఆపకండి: ఈ చిట్కాలు పాటిస్తూనే డాక్టర్ సలహా మేరకు మందులు వాడుతూ, షుగర్ లెవల్స్ తగ్గుతున్న కొద్దీ డాక్టర్ సలహాతోనే డోస్ తగ్గించుకోవాలి. • అతిగా వద్దు: ఆరోగ్యానికి మంచిది కదా అని మితిమీరిన పరిమాణంలో పదార్థాలను వాడకండి, పైన చెప్పిన కొలతలు పాటించండి. ప్రశ్నలు - సమాధానాలు (Q&A) ప్ర: ఈ రోటీలను పిల్లలకు ఇవ్వవచ్చా? జ: తప్పకుండా ఇవ్వవచ్చు. చిన్న పిల్లలకు ఇచ్చేటప్పుడు పదార్థాల పరిమాణం (డోస్) కాస్త తగ్గిస్తే సరిపోతుంది. ఇది వారి జీర్ణక్రియకు చాలా మంచిది. ప్ర: గింజలను విడిగా నీటిలో కలుపుకొని తాగితే సరిపోదా? రోటీలోనే ఎందుకు కలపాలి?  జ: రోటీలో కలిపి వేడి చేయడం వల్ల అవి సులభంగా జీర్ణమవుతాయి. అలాగే, ఔషధంలా విడిగా తీసుకోకుండా ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మానసికంగా కూడా బాగుంటుంది మరియు రుచిగా ఉంటుంది. ప్ర: ఆరోగ్యంగా ఉన్నవారు కూడా ఇవి తీసుకోవచ్చా?  జ: అవును, ఎటువంటి సమస్యలు లేని వారు కూడా వీటిని తీసుకోవడం వల్ల భవిష్యత్తులో షుగర్, బరువు పెరగడం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఆరోగ్యకరమైన జీవనశైలి మన చేతుల్లోనే ఉంది. చిన్న చిన్న మార్పులతో పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఈ చిట్కాలను పాటించి మీ అనుభవాలను మాతో పంచుకోండి. మరిన్ని ఆసక్తికరమైన మరియు ఆరోగ్యకరమైన చిట్కాల కోసం, ప్రత్యక్ష నిపుణుల సలహాల కోసం మా యూట్యూబ్ ఛానల్  క్లిక్ చేయండి  👉 [www.youtube.com/@Naveenacolumn] (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
  డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి.  చాలమంది డ్రై ఫ్రూట్స్ ను నేరుగా తినడం కంటే వాటిని నానబెట్టుకుని తినడం చాలా మంచిదని చెబుతారు. ఇలా నానబెట్టుకుని తినే డ్రై ప్రూట్స్ లో బాదం,  జీడిపప్పు, ఎండు ద్రాక్ష,  ఖర్జూరం మొదలైనవాటితో పాటు వాల్నట్స్ కూడా ఉంటాయి.  వీటిని నానబెట్టుకుని తినడం వల్ల పోషకాలు లభిస్తాయి. శరీరానికి ప్రోటీన్ లభిస్తుంది.  అలాగే సాధారణంగా ఉన్న డ్రై ఫ్రూట్స్ ను తినడం కంటే.. నానబెట్టిన వాటిని తినడం వల్ల ఎక్కువ పోషకాలు లభిస్తాయి.  అయితే నానబెట్టిన వాల్నట్స్ ను సాధారణంగా రాత్రి నానబెట్టి,  ఉదయాన్నే  తింటుంటారు.  కానీ.. ఇలా నానబెట్టిన వాల్నట్స్ ను ఉదయం కాకుండా వేరే సమయంలో తినడం వల్ల ఫలితాలు బాగుంటాయట.  శరీరానికి మంచి బెనిఫిట్ చేకూరుతుందట.  ఇంతకీ నానబెట్టిన వాల్నట్స్ ను ఏ సమయంలో తినాలి? ఏ సమయంలో తినడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి? తెలుసుకుంటే.. సాయంత్రం.. నానబెట్టిన వాల్నట్స్ ను సాయంత్రం సమయంలో తినడం చాలా మంచిదని వైద్యులు, ఆహార నిపుణులు అంటున్నారు. వాల్నట్స్ లో ఉండే పోషకాలలో ప్రముఖమైనది ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు.  అలాగే మెలటోనిన్ కూడా పుష్కలంగా ఉంటుంది.  అందుకే వీటిని సాయంత్రం సమయంలో తినడం మంచిదని అంటారు. వాల్నట్స్ లో ఉండే ఒమేగా-3 మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది మెదడు పని తీరుకు చాలా సహాయపడుతుంది.  అలాగే వాల్నట్స్ లో ఉండే మెలటోనిన్ కూడా శరీరానికి చాలా అవసరం. ఇది నిద్రను మెరుగ్గా ఉంచడంలో, నిద్రను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. వాల్నట్స్ లో ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు, మెలటోనిన్ మాత్రమే కాకుండా పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను, అభ్యాసన సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి. వాల్నట్స్ లో ఉండే ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు ఆరోగ్యకరమైన కొవ్వుల జాబితాకు చెందినవి. ఇవి మంచి కొలెస్ట్రాల్ ను పెంచడంలో సహాయపడుతుంది. అట్లాగే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ ను డీల్ చేయడం ద్వారా గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. నానబెట్టిన వాల్నట్స్ తింటే జీర్ణవ్యవస్థ కూడా బలపడుతుంది. ఎందుకంటే వాల్నట్స్ నానడం ద్వారా ఫైబర్ మెరుగవుతుంది.  ఈ ఫైబర్ జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. ఇది మలబద్దకం సమస్యను నివారిస్తుంది. నానబెట్టిన వాల్నట్స్ తింటే ఎక్కువ సేపు కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. ఇది ఆహారం ఎక్కువ తీసుకోవడాన్ని నివారిస్తుంది. తద్వారా బరువు అదుపులో ఉంచడం లేదా బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది.                                         *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.