Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...జబర్దస్త్ కామెడీ చేస్తే ఇలానే ఉంటుంది..ఇంత కామెడీనా..!
posted on: Dec 15, 2017 3:21PM
.jpg)
వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా నోటి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నిసార్లు బుక్ అయినా.. ఆమె మాత్రం తన నోటిని కంట్రోల్ లో పెట్టుకోలేదు. ఏదో ఆ మధ్య జగన్ కాస్త వార్నింగ్ ఇచ్చాడు కాబట్టి రోజా సైలెంట్ అయి కాస్త మీడియా సమావేశాలకు దూరంగా ఉంటూ.. నోటిని తాళం వేసింది. దాంతో వాతావరణం ప్రశాంతంగా ఉంది అనుకున్నారు. కానీ మీడియా ముందు గట్టిగా మాట్లాడటం... విమర్శలు చేయడం ఆమెకి అలవాటైన పని.. ప్రాణం ఎలా ఊరుకుంటుంది. అందుకే ఏదో కొన్ని రోజులు సైలెంట్ గా ఉన్నా.. మళ్లీ మామూలైపోయింది. మళ్లీ యాక్టివ్ అయ్యారు. కాకపోతే అప్పట్లో లాగ కాకుండా.. కాస్త ఆచితూచి మాట్లాడటం నేర్చుకుంది. అయితే అలా అనుకోవడం మన తప్పే అని మరోసారి రుజువు చేసింది రోజా. బండ్ల గణేష్ తో టీవీ 9 ఎపిసోడ్ లో ఆమె నోటిదూకుడు ఇంకోసారి ప్రూవ్ అయ్యింది. ఇంకేముంది మరోసారి రోజాగారి నోటి దూకుడుపై విమర్శలు మొదలయ్యాయి. ఇంత రచ్చ రచ్చ అయిన ఎపిసోడ్ నుంచి బయటపడేందుకు రోజా తాజాగా కాస్త కామెడీ మాటలే చెబుతున్నారు.
అది కూడా ఎవరి గురించి అనుకుంటున్నారా.. ఇంకెవరు గురించి... తాను అన్నగా భావించే జగన్ గురించి. గతంలోనే... జగన్ ఎలాంటి అవినీతి చేయలేదని ఆయనపై కేసులన్నీ రాజకీయ కోణంలోవే అని కామెడీ చేసిన ఆమె తాజాగా మరోసారి కామెడీ చేశారు. ఇంతకీ రోజా అంతలా ఏ విషయంలో కామెడీ చేస్తున్నారనుకుంటున్నారా..? పార్టీ ఫిరాయింపుల గురించి. వైసీపీ పార్టీ నుండి... ఇప్పటికీ చాలామంది నేతలు అధికార పార్టీ అయిన టీడీపీ పార్టీలోకి చేరారు. ఇంకా పలువురు నేతలు టీడీపీ పార్టీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారు. సరిగ్గా ఈ విషయంపైనే ప్రెస్ మీట్ లో టీడీపీపై రోజా తీవ్ర స్థాయిలో ధ్వజం ఎత్తారు. ప్రజాస్వామిక విలువలకు సీఎం చంద్రబాబు పాతర వేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ సందర్భంలో ఓ జర్నలిస్ట్ మిత్రుడు వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే టీడీపీ ని దెబ్బ తీయడానికి వలసలు ప్రోత్సహించరా అని అడిగారు. దానికి సమాధానం ఇచ్చిన రోజా జగన్ సీఎం అయితే ఎట్టి పరిస్థితుల్లో పార్టీ ఫిరాయింపులు ఉండబోవని మాంచి కామెడీ చేశారు. ఇక జగన్ తరపున రోజా చేస్తున్న కామెంట్స్ చూసి ఆమె సీరియస్ గా భలే కామెడీ చేస్తున్నారు అనుకుంటూ విలేకరులు నవ్వుకున్నారట. నిజంగా ఏదైనా అద్భుతం జరిగి జగన్ సీఎం అయితే.. మరి రోజా గారికి ఈ మాటలు గుర్తుంటాయా..? అయినా జగన్ గురించి జనం ఏం నమ్ముతారో వాటి మీద రోజా కామెడీ చేస్తే బావుంటుంది. అలా కాకుండా.. జబర్దస్త్ లో చేయాల్సిన కామెడీ.. ఇలాంటి మీడియా సమావేశాల్లో కూడా వేస్తే ఎలా మరి.






