Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ప్రాంక్ పేరుతో సోదరుడి హత్య...ప్రపంచానికే ప్రమాదం....?
posted on: Dec 15, 2017 2:08PM

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ నియంత్రుత్వ పరిపాలన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే పలు ఉదంతాలు ఆయన ఎంత క్రూర స్వభావం కలవాడో నిరూపించాయి. సొంత మనుషులనే క్రూరంగా చంపించిన కిమ్ జాంగ్ ఉన్ గురించి మరో భయంకర విషయం బయటపడింది. దీంతో ఆయనెంతో క్రూరుడో మరోసారి రుజవైంది.
తన సోదరుడు కిమ్ జోంగ్ నామ్ ఈ ఏడాది ఫిబ్రవరి 13న అత్యంత దారుణంగా మరణించిన సంగతి తెలిసిందే కదా. అయితే ఈ హత్య అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది. పోలీసులకు ఇదో పెద్ద మిస్టరీగా మారింది. అయితే ఈ కేసు దర్యాప్తులో పోలీసులకు కొన్ని దిమ్మతిరిగే నిజాలు తెలిశాయి. ఈ హత్య వెనుక కిమ్ జాంగ్ ఉన్ హస్తం ఉన్నట్టు తెలిసింది. అంతేకాదు.. ఈ హత్య ఎలా చేశారో తెలిస్తే దిమ్మతిరగాల్సిందే. దానికి కిమ్ జాంగ్ ఉన్ వేసిన ప్లాన్ చూసి ఆశ్చర్యపోవాల్సిందే. ఇంతకీ ఆ ప్లాన్ ఏంటంటే..
కిమ్ జోంగ్ నామ్ హత్యకు కిమ్ జాంగ్ ఉన్ పెద్ద ప్లానే వేశారు. ఇందుకోసం ఇద్దరు మలేషియా యువతులను ఎంచుకున్నారు. ఈ ఇద్దరికీ ఒకరితో మరొకరికి సంబంధం లేదు. ఒకరు మసాజ్ పార్లర్ లో పనిచేసే యువతి కాగా.. మరొకరు ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగి. టీవీ ప్రాంక్ పేరిట కిమ్ జాంగ్ ఉన్ మనుషులు వీరిని సంప్రదించారు. ఒక ప్రాంక్ వీడియో చేస్తున్నామని, అందులో నటిస్తే 90డాలర్లు ఇస్తామని చెప్పారు. టీవీ ప్రోగ్రామ్ అని చెప్పడంతో వారు ఓకె చెప్పారు. ప్లాన్ లో భాగంగా.. ఇద్దరు యువతులకు కిమ్ జోంగ్ నామ్ ముఖంపై ఆయిల్ చల్లి పారిపోవాలి. అనుకున్నట్టే.. ఆ ఇద్దరు మహిళలు కిమ్ జోంగ్ నామ్ ముఖంపై కెమికల్స్ చల్లి పారిపోయారు. ఇంకేముంది... వాటి ప్రభావంతో మెదడు, ఊపిరితిత్తులు, కాలేయం వంటి అవయవాలు పూర్తిగా దెబ్బతిని కిమ్ జోంగ్ నామ్ కన్నుమూశాడు. అప్పట్లో ఈ హత్య ఎవరికీ అంతుచిక్కలేదు.
ఆయిల్ చల్లినందుకే చనిపోయాడా అని డౌట్ రావచ్చు.. ఇక్కడే ఉంది మరి అసలు ట్విస్ట్... బైనరీ ఫామ్ అనే కెమికల్ ప్రయోగం చేశారు. ఇద్దరు యువతులకు ఇచ్చింది వేరు వేరు రసాయనాలు. కానీ ఆ రెండు కలిస్తే... అత్యంత వీఎక్స్ అనే ప్రమాదకర కెమికల్ గా మారుతుంది. ఈ ప్రయోగమే కిమ్ జోంగ్ నామ్ పై చేశారు. మొత్తానికి హత్య చేస్తున్నామన్న సంగతి కూడా హంతకులకు తెలియకుండా... కిమ్ ఈ ప్లాన్ వేశాడు. కిమ్ జోంగ్ నామ్ హత్య జరిగిన తీరు పోలీసులనే విస్మయపరిచింది. ఇక ఈ హత్య ఉదంతం ఇప్పుడు వెలుగు చూడటంతో.. ప్రజలు వణికిపోతున్నారు. సొంత సోదరుడినే ఇలా చంపాడంటే... ఇంక తనకు శత్రువులుగా భావించే వాళ్లని ఎలా చంపుతాడో అని భయపడుతున్నారు. అంతేకాదు దీని ద్వారా కిమ్ జాంగ్ ఉన్ అందరికీ వార్నింగ్ లు ఇచ్చినట్టైంది అని అంటున్నారు. నాతో పెట్టుకుంటే ఇలా ఉంటుందని కిమ్ జాంగ్ ఉన్ వార్నింగ్ ఇచ్చారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా తమకు శత్రుదేశంగా తయారైన అమెరికాను ఈ రకంగా భయపెట్టాలని... తమ దగ్గర అణు ఆయుధాలతో పాటు.. శక్తివంతమైన రసాయనాలను కలిగి ఉందని చెప్పడానికే కిమ్ జోంగ్ నామ్ ను ఇలా బహిరంగంగా హత్య చేయించి ఉంటారని భావిస్తున్నారు. ఏది ఏమైనా పక్క దేశాన్ని భయపెట్టడానికి ఇలా సొంత మనిషినే చంపించాడంటే.. కిమ్ జాంగ్ ఉన్ ఎంత క్రూరుడో అర్ధమవుతుంది...



.jpg)


