బంగాళాదుంపతో పిగ్మెంటేషన్ దెబ్బకు మాయమవుతుంది! చర్మ సమస్యలు మొటిమలు,  చిన్న మచ్చలు మాత్రమే కాదు, చర్మం అక్కడక్కడా రంగుమారడం కూడా ముఖ చర్మాన్ని దెబ్బతీస్తుంది. హైపర్పిగ్మెంటేషన్  తీవ్రమైన  చర్మ సమస్యగా పరిగణిస్తుంటారు. ఒకసారి ఈ సమస్యలు మొదలైతే దాన్ని వదిలించుకోవడం చాలా కష్టం. స్కిన్ పిగ్మెంటేషన్ అనేక కారణాల వల్ల కావచ్చు. వీటిలో ముఖ్యమైనది అధిక మెలనిన్ ఉత్పత్తి. దీని కారణంగా ముఖం మీద పెదవుల చుట్టూ, ముక్కు ఇరువైపులా, కళ్లకింది భాగంలోనూ చర్మం రంగు మారి కనిపిస్తూ ఉంటుంది. అయితే దీని గురించి చింతించాల్సిన పనిలేదు.  ఈ పిగ్మెంటేషన్ ను సమర్థవంతంగా తొలగించడంలో బంగాళాదుంప అధ్బుతంగా పనిచేస్తుంది.  బంగాళాదుంపలలో ఎంజైమ్‌లు, విటమిన్లు,  మినరల్స్ ఉంటాయి, ఇవి డార్క్ స్పాట్‌లను తేలికపరచడానికి,  చర్మపు రంగును సాధారణ స్థితికి తీసుకురావడానికి సహాయపడతుంది. ఇందుకోసం బంగాళాదుంపను  ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటే.. పిగ్మెంటేషన్ తొలగించడానికి బంగాళాదుంపను ఎలా ఉపయోగించాలి? బంగాళదుంప రసం టోనర్.. బంగాళాదుంప రసం సహజ టోనర్‌గా అద్భుతంగా పనిచేస్తుంది, ఇది చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది.  పిగ్మెంటేషన్‌ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ టోనర్‌ని రెగ్యులర్‌గా ఉపయోగించడం వల్ల డార్క్ స్పాట్స్‌ని తగ్గించి, స్కిన్ టోన్‌ను పెంచడంలో సహాయపడుతుంది. బంగాళాదుంప టోనర్ ఎలా చేయాలంటే.. బంగాళాదుంప టోనర్ చేయడానికి, ఒక బంగాళాదుంపను చెక్కు తీసి దాన్ని సన్నగా  తురుముకోవాలి. తరువాత గట్టిగా పిండితే రసం వస్తుంది. దీన్ని ఒక చిన్న కప్ లో తీసుకోవాలి.  ముఖం మీద మచ్చలు, రంగు మారిన ప్రాంతాలను కవర్ చేస్తూ కాటన్ బాల్ లేదా కాటన్ ప్యాడ్ సహాయంతో రసాన్ని నేరుగా  ముఖంపై అప్లై చేయాలి. దీన్ని 15-20 నిమిషాలు అలాగే ఉంచి, ఆ తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. బంగాళాదుంప మాస్క్ బంగాళాదుంప ముక్కలు చర్మానికి చల్లదనాన్ని,  మృదువు స్వభావాన్ని కలిగిస్తాయి.   పిగ్మెంటేషన్ ద్వారా చికాకు లేదా ఎర్రబడిన ప్రాంతాలను నయం చేయడంలో సహాయపడతాయి.  బంగాళాదుంపను మందపాటి చక్రాలుగా  కట్ చేసి వాటిని ముఖం మీద ప్రభావిత ప్రాంతాలలో ఉంచాలి. ఈ ముక్కలను సుమారు 15-20 నిమిషాలు అలాగే ఉంచండి, ఆపై  ముఖాన్ని నీటితో కడగాలి. దీన్ని క్రమం తప్పకుండా ఫాలో అవుతుంటే కాలక్రమేణా ముఖ చర్మం మీద  ఎరుపు,  పిగ్మెంటేషన్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. బంగాళదుంప,  నిమ్మరసం ఫేస్ ప్యాక్..  బంగాళాదుంప రసానికి సమాన మొత్తంలో తాజా నిమ్మరసం మిక్స్ చేసి, ఆ మిశ్రమాన్ని  ముఖానికి అప్లై చేయాలి. ఈ ప్యాక్ ను 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. నిమ్మరసం కొద్దిగా జలదరింపును కలిగిస్తుంది, కాబట్టి ఈ ఫేస్ ప్యాక్‌ని ఉపయోగించే ముందు ప్యాచ్ టెస్ట్ చేయడం చాలా ముఖ్యం. 15నిమిషాల తరువాత దీన్ని శుభ్రమైన నీటితో కడిగేయాలి. బంగాళాదుంప , తేనె ప్యాక్..  ఒక టీస్పూన్ తేనెతో మిక్సీ పట్టిన  బంగాళాదుంప పేస్ట్ కలపాలి. దీన్ని  మందపాటి పేస్ట్ గా  తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ ను ముఖంపై సమానంగా అప్లై చేసి 20-25 నిమిషాలు అలాగే ఉంచండి. 20-25 నిమిషాల తరువాత  నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది ముఖ చర్మానికి పోషణను ఇవ్వడమే కాకుండా ముఖం మీద మచ్చలు, పిగ్మెంటేషన్,  మొటిమట తాలూకు గుర్తులు తొలగిస్తుంది.                                                                   *నిశ్శబ్ద.

ముడతలు తొలగించి ముఖాన్ని అందంగా మార్చే హోం రెమెడీస్ ఇవే!   అందంగా కనిపించాలంటే మన చర్మం ఆరోగ్యంగా ఉండాలి. చర్మంపై చిన్నపాటి నల్లటి మచ్చ కనిపించినా అది మన అందాన్ని డ్యామేజ్ చేస్తుంది. చిన్న వయసులోనే మనల్ని ముసలివాళ్లలా చేసే ఫైన్ లైన్లు, ముడతలు, మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. కాబట్టి వీటినుంచి బయటపడేందుకు సహజసిద్ధమైన పద్ధతులను పాటిస్తే మంచిది. మార్కెట్‌లో లభించే వివిధ రకాల సౌందర్య సాధనాలను ఉపయోగించవచ్చు. కానీ వాటి ప్రభావం తాత్కాలికమే. వాటితో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. కానీ నేచురల్ రెమెడీస్ చర్మ సౌందర్యాన్ని శాశ్వతంగా పెంచుతాయి. నాలుగు పదుల వయసులోనూ అందంగా కనిపించాలంటే ఈ హోం రెమెడీస్‎ను ఉపయోగించడం మంచిది. గుడ్డులోని తెల్లసొన: గుడ్డులో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అంతేకాదు మీ చర్మ ఆరోగ్యంపై మంచి ప్రభావాన్ని చూపుతుంది. చర్మంపై వచ్చే ముడతలకు నేచురల్ రెమెడీ అని చెప్పవచ్చు. -దీని కోసం మీరు ఒక గిన్నెలో గుడ్డులోని తెల్లసొనను తీసుకొని నేరుగా చర్మంపై అప్లై చేయవచ్చు. -మృదువుగా మసాజ్ చేసి 15 నిమిషాలు ఆరనివ్వండి, ఆపై గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. -ఇలా చేయడం వల్ల గుడ్లలో ఉండే ప్రొటీన్, విటమిన్ బి, విటమిన్ ఇ మీ చర్మంపై ముడతలను తగ్గించడంలో సహాయపడతాయి. ఆలివ్ నూనె: రాత్రి పడుకునే ముందు మీ చర్మంపై కొన్ని చుక్కల ఆలివ్ నూనెతో నెమ్మదిగా మసాజ్ చేయాలి. తర్వాత టవల్ తో శుభ్రం చేసుకోవాలి. మృదువైన చర్మం మీ సొంతం అవుతుంది. నిమ్మరసం: నిమ్మకాయల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీనిలో చర్మంపై ముడతలను తొలగించే తత్వం ఉంటుంది. నిమ్మకాయను ముక్కలుగా చేసి, మీ ముఖంపై, చర్మం ముడతలు పడిన చోట మసాజ్ చేయండి. నిమ్మకాయలో మీ చర్మాన్ని మెరిసేలా చేసే ఆమ్ల గుణాలు ఉన్నాయి. అయితే నిమ్మకాయను ఎక్కువగా ఉపయోగించవద్దు. కలబంద: కలబందలో మాలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చర్మం యొక్క సాగే లక్షణాలను పెంచుతుంది. దీని కోసం మీరు కొంత అలోవెరా జెల్ ను తీసుకుని ముడతలు పడిన చర్మంపై అప్లై చేసి మసాజ్ చేయాలి. 15 నిమిషాలు ఆరనివ్వండి. ఆపై నీటితో శుభ్రం చేసుకోండి. దీనిని విటమిన్ ఇ నూనెతో కూడా కలిపి ముఖానికి రాసుకోవచ్చు. అరటిపండు: ఆరోగ్యకరమైన ఆహారంలో, అరటి మన శరీరానికి పుష్కలంగా పోషకాలను అందిస్తుంది. దీన్ని చర్మంపై అప్లై చేయడం వల్ల కూడా చాలా మేలు జరుగుతుంది. బాగా పండిన అరటిపండును పేస్టులా చేసి చర్మం ముడతలు పడిన చోట రాయాలి. ఇలా దాదాపు అరగంట పాటు అలాగే ఉంచి తర్వాత ముఖం కడుక్కోవాలి. అరటిపండులో కొద్దిగా ఆవకాడో, తేనె కలిపి రాసుకోవచ్చు. క్యారెట్: క్యారెట్‌లో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని మృదువుగా ఉంచడమే కాకుండా చర్మంపై ముడతలను తొలగిస్తుంది. దీని కోసం మీరు క్యారెట్ పేస్ట్‌ను తయారు చేసి, ప్రతిరోజూ మీ ముఖానికి అప్లై చేయాలి. ఒకట్రెండు క్యారెట్లను తీసుకుని నీళ్లలో బాగా మరిగించి ఆ తర్వాత కాస్త తేనె కలిపి పేస్ట్ లా చేసి ముఖానికి పట్టించి అరగంట ఆగి సాధారణ నీళ్లతో కడిగేస్తే ముఖంలో మెరుపు పెరుగుతుంది. ఇది కాకుండా, మీరు తరచుగా పచ్చి క్యారెట్లను తినడం అలవాటు చేసుకోవాలి. పైనాపిల్: మన చర్మ ఆరోగ్యానికి మేలు చేసే అన్ని అంశాలు పైనాపిల్ పండులో ఉంటాయి. మన చర్మం యొక్క తేమను పెంచడంతోపాటు మృతకణాలను తొలగించడం వరకు, పైనాపిల్ నుండి ఎక్స్‌ఫోలియేషన్ ప్రక్రియ జరుగుతుంది . ఇది మన చర్మానికి ఫైబర్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలను అందిస్తుంది. ఇది మన చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. చర్మంపై గీతలు మాయమవుతాయి. పైనాపిల్ ముక్కలను నేరుగా చర్మంపై అప్లై చేసి 20 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి. ఎక్కువ నీరు త్రాగాలి: నీరు ఎక్కువగా తాగడం వల్ల మన చర్మానికి ఎంతో మేలు జరుగుతుంది. డిహైడ్రేషన్ను తగ్గిస్తుంది. మన చర్మం మరింత తేమను కలిగి ఉండటానికి సహాయపడుతుంది. రోజూ రెండు లీటర్ల నీళ్లు తాగే అలవాటు ఉన్నవాళ్లకు చర్మంపై ముడతలు కనిపించవు.

పాదాల పగుళ్లను తగ్గించే చిట్కాలు చలికాలంలో పాదాల పగుళ్ల సమస్య ఎక్కువగా ఉంటుంది. పొడి గాలి, తేమ సరిగా లేకపోవడం, పాదాలకు సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల పాదాల పగుళ్లు వస్తుంటాయి. ఆహార లోపాలు, పెరుగుతున్న వయసుతోపాటు ఎక్కువ సేపు గట్టి నేల మీద నిలబడి ఉండాల్సి రావడం కూడా మడమల పగుళ్లకు దారి తీస్తుంటాయి. డయాబెటిస్‌తోపాటు థైరాయిడ్ సమస్యలు కూడా పాదాల పగుళ్లను మరింత పెంచుతాయి. కొద్దిపాటి జాగ్రత్తతో పగిలిన పాదాలను ఇంట్లోనే మృదువుగా మార్చేసుకోవచ్చు. * రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు సబ్బు నీటితో పాదాలను కడిగేసుకోవాలి. మృత చర్మం తొలగిపోయేలా రుద్దాలి. తర్వాత పొడి వస్త్రంతో తుడిచేసి.. పాదాలకు వెజిటబుల్ ఆయిల్స్‌ను రాయాలి. సాక్సులు ధరించి నిద్రించాలి. ఉదయాన్నే పాదాలు మృదువుగా ఉండటాన్ని గమనించొచ్చు. క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల పగుళ్లు పూర్తిగా తగ్గిపోతాయి. * చర్మం రఫ్‌గా మారడం పగుళ్లకు దారి తీస్తుంది. నిమ్మలోని ఆమ్ల గుణాలు రఫ్‌గా మారిన చర్మాన్ని మృదువుగా మారుస్తాయి. వెచ్చటి నీటిలో నిమ్మరసం కలిపి పాదాలను పావు గంటపాటు అందులో ఉంచాలి. తర్వాత మడమల్ని రుద్దేసి.. కడిగేశాక.. పొడిగా ఉండే వస్త్రంతో తుడవాలి. నిమ్మ చెక్కని పగుళ్ళకి రుద్దడం వలన కూడా పగుళ్లు తగ్గుతాయి . * పాదాల పగుళ్లు వచ్చిన వారు రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీటిలో చెంచా ఉప్పు, చిటికెడు పసుపు వేసి ఆ నీటిలో పాదాలను పది నిమిషాల పాటు ఉంచాలి. ఆ తర్వాత పొడి వస్త్రంతో శుభ్రంగా తుడిచి పెట్రోలియం జెల్లీని రాసుకుంటే పగుళ్లు తగ్గుతాయి. * గ్లిజరిన్, రోజ్ వాటర్ మిశ్రమంతోనూ మడమల పగుళ్లను తొలగించొచ్చు. ఈ రెండింటిని సమపాళ్లలో కలిపి రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు మడమలు, పాదాలకు రాయాలి. రోజూ ఇలా చేయడం వల్ల పగుళ్లు తగ్గిపోతాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu

దారుణమైన కండీషన్ లో ఉన్న జుట్టైనా సరే.. ఈ టిప్స్ ఫాలో అయితే ఆరోగ్యంగా మారిపోతుంది.. అమ్మాయిలు జుట్టు గురించి తీసుకునే శ్రద్ద బహుశా ఆరోగ్యం గురించి కూడా తీసుకోరేమో. ఒత్తుగా, పొడవుగా, మెరుస్తూ ఉండే జుట్టంటే అమ్మాయిలకు చాలా ఇష్టం. కానీ చాలా కారణాల వల్ల జుట్టు దెబ్బ తింటుంది. మెరుపును కోల్పోతుంది. విరిగిపోవడం, బూడిద రంగులోకి మారడం, చిట్లడం,  చుండ్రు వంటి సమస్యలు ఎన్నో ఎదురవుతాయి. ఇవన్నీ జుట్టు స్వరూపాన్ని మార్చేస్తాయి. వీటి పరిష్కారం కోసం అందరూ ఎన్నో రకరకాల షాంపూలు, నూనెలు వాడుతుంటారు. అయితే ఎన్ని జుట్టు సమస్యలున్నా కింద చెప్పుకునే టిప్స్ పాటించడం వల్ల జుట్టు తిరిగి ఆరోగ్యంగా, అందంగా  మారుతుంది. జుట్టురాలకుండా ఉండాలంటే.. జుట్టురాలే సమస్య ఉన్నవారు  జుట్టును శుభ్రంగా ఉంచుకోవాలి.  తలస్నానం చేయడానికి ముందు  జుట్టుకు నూనె రాయాలి. జుట్టుకు నూనె రాసిన తరువాత ఎక్కువసేపు ఉంచుకోకూడదు. కేవలం  10 నిమిషాలు మాత్రమే ఉంచుకుని ఆ తరువాత తలస్నానం చెయ్యాలి.  ప్రతి 8-10 వారాలకు ఒకసారి జుట్టు కత్తిరించాలి. ఇలా చేయడం వల్ల జుట్టు పెరుగుదలకు ప్రోత్సాహకంగా ఉంటుంది.   వారానికి ఒకసారి తలస్నానానికి ముందు తాజా ఉల్లిపాయ రసాన్ని తలకు పట్టించాలి . ఇన్ని చేసినా జుట్టు రాలుతోంటే  వైద్యుడిని సంప్రదించడం మంచిది. కొన్నిసార్లు  ఆరోగ్య సమస్యల  కారణంగా జుట్టు రాలుతుంది. కాబట్టి వైద్యుడిని సంప్రదించం కూడా సరైనదే.. జుట్టు మెరుపు లేకుంటే.. ఫ్యాషన్ పేరుతో జుట్టుమీద ప్రయోగాలు చేసేవారు చాలామంది ఉన్నారు. అంతేకాదు  జుట్టును నిర్లక్ష్యం చేస్తే  జుట్టు మెరుపు కోల్పోతుంది. జుట్టుకు తరచుగా రసాయన చికిత్స చేయడం, హీట్ స్టైలింగ్ టూల్స్ వాడటం, ఇవి వాడుతూ  కండీషనర్‌ను అప్లై చేయకపోవడం వంటివి పొరపాట్లు జుట్టును నిర్జీవంగా మారుస్తాయి.  ఈ సమస్యకు మంచి పరిష్కారం ముందస్తు జాగ్రత్తలు.  హెయిర్ వాష్‌కు ముందు  జుట్టుకు పొడవునా నూనె రాయండి. వీలైతే, కనీసం నెలకు ఒకసారి హెయిర్ స్పా చికిత్సకు చేయించుకోవాలి. కుదరని పక్షంలో ఇంట్లోనే హాట్ ఆయిల్ మసాజ్, వేడి నీటిలో ముంచిన టవల్ తలకు చుట్టడం వంటివి ఫాలో కావాలి. జుట్టు మంచి కండీషన్లోకి వచ్చేవరకు జుట్టుకు వేడి, రసాయనాలు తగలకుండా జాగ్రత్త పడాలి. చుండ్రును తొలగించాలంటే.. చుండ్రులో జిడ్డు, పొడి అనే రెండు రకాలు ఉన్నాయి.  జిడ్డుగల చుండ్రును ఎదుర్కొంటున్నట్లయితే, వైద్య సహాయం అవసరమవుతుంది.  నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సందర్శించడం ఉత్తమం.  పొడి చుండ్రుతో బాధపడుతుంటే  తలస్నానానికి   సాధారణ షాంపూతో పాటు ఆపిల్ సైడర్ వెనిగర్‌ను వారానికి ఒకసారి ఉపయోగించాలి. చుండ్రు సమస్య ఉన్నప్పుడు  జుట్టును మరింత శుభ్రంగా ఉంచుకోవాలి. జుట్టు నెరిసిపోవడాన్ని ఎలా అరికట్టాలంటే.. చిన్న వయస్సులోనే జుట్టు బూడిద రంగులోకి మారడం ప్రారంభిస్తే, రసాయన చికిత్సలను నివారించాలి. అదే వయసు పెరిగేకొద్ది  జుట్టు నెరిసిపోతుంటే దీనికి పరిష్కారంగా సహజమైన రంగులు లేదా గోరింటతో కవర్ చేయడం ఉత్తమ పరిష్కారం. ఎప్పుడూ మంచి బ్రాండ్ కలర్‌ను ఉపయోగించాలని గుర్తుంచుకోవాలి. ఇందులో రసాయనాలు లేకుండా చూసుకోవాలి.  ఇంట్లో జుట్టుకు రంగేస్తుంటే చాలా జాగ్రత్తగా వాడాలి.                                                   *నిశ్శబ్ద.

చుండ్రును తగ్గించే తేలికైన ఉపాయాలు ఇప్పుడున్న పొల్యూషన్ వల్ల రోజు రోజుకి చుండ్రు సమస్యలు ఎక్కువైపోతున్నాయి . చుండ్రు వల్ల జుట్టు రాలిపోవటం, పేలు రావడం, దురద లాంటివి మొదలవుతాయి. ఈ సమస్యను అరికట్టాలంటే చిన్న చిన్న చిట్కాలు చేయాల్సిఉంటుంది . అవేంటో చూసేద్దాం రండి .. * వేపాకులతో చుండ్రును తేలిగ్గా తగ్గించుకోవచ్చు. దురదను తగ్గించడమే కాదు.. చుండ్రు పెరగడానికి కారణమయ్యే ఫంగస్‌ పెరుగుదలను కూడా వేపాకు అరికడుతుంది. రెండు గుపిళ్ల నిండుగా వేపాకు, కొద్దిగా మందారకు,కొద్దిగా కలబంద గుజ్జు ఈ మూడింటిని మిక్సీ లో మెత్తగా గ్రైండ్ చేసి తలకు పట్టించి రెండు గంటలు ఆగి తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారైన చేస్తే మంచి ఫలితం ఉంటుంది. * పిల్ సీడర్ వెనిగర్‌తోనూ చుండ్రును అరికట్టవచ్చు. ఇందుకోసం వెనిగర్ ను, నీటిని సమపాళ్లలో కలపాలి. దీన్ని షాంపుగా వాడి తలస్నానం చేయడం వల్ల చుండ్రు వల్ల వచ్చే దురదను వెంటనే తగ్గించవచ్చు. ఇలా కొద్ది రోజులపాటు చేయడం వల్ల చుండ్రు తగ్గిపోతుంది. * కొబ్బరి నూనెతోనూ చుండ్రుని తరిమేయొచ్చు. కాకపోతే దీనికి టీ ట్రీ ఆయిల్‌ను కలపాల్సి ఉంటుంది. ప్రతి ఐదు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెకు 5 - 10 చుక్కల స్వచ్ఛమైన టీ ట్రీ ఆయిల్ కలపాలి. తర్వాత దాన్ని మాడుకు పట్టించడం వల్ల చుండ్రుకు కారణమైన ఫంగస్ నశిస్తుంది. ఒకవేళ టీ ట్రీ ఆయిల్ లేకపోతే మామూలు కొబ్బరినూనె లో కొద్దిగా కర్పూరం పొడి వేసి కలిపి తలకి పెట్టుకున్న చుండ్రు తగ్గుతుంది. * తాజా నిమ్మరసంలోని యాసిడ్లు చుండ్రును కలిగించే ఫంగస్‌ను నాశనం చేస్తాయి. నిమ్మరసాన్ని తలకు పట్టించడం వల్ల జుట్టు నుంచి మంచి పరిమళం కూడా వస్తుంది. నిమ్మరసాన్ని మాడుకు పట్టించి ఒక నిమిషంపాటు వదిలేయాలి. లేదంటే ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని కప్పు నీటిలో కలిపి తలను కడిగేసుకున్నా ఫలితం ఉంటుంది.చుండ్రు తగ్గే వరకూ ఇలా చేయాలి. * పులిసిన పెరుగును మాస్క్‌గా వేసుకోవడం వల్ల కూడా చుండ్రు తగ్గుముఖం పడుతుంది. ఇందుకోసం ఒక గ్లాస్ పెరుగు లో ఒక స్పూన్ మెంతి పొడి కలిపి రాత్రంతా ఉంచాలి. ఉదయం పూట తలకు పట్టించి గంటపాటు అలా వదిలేయాలి. తర్వాత షాంపూతో కడిగేసుకోవాలి. ఫలితంగా చుండ్రు తగ్గడమే కాకుండా జుట్టు మృదువుగా మారుతుంది.

వర్షాకాలంలో మొటిమలు ఎందుకు వస్తాయి? వేసవి కాలంలో పనిచేసే చర్మ సంరక్షణ ఉత్పత్తులు వర్షాకాలంలో పనికిరావు. వర్షాకాలంలో చర్మ సమస్యలు పెరుగుతాయి. ఈ సీజన్‌లో.. మారుతున్న వాతావరణం చర్మంపై చాలా ప్రభావం చూపుతుంది. వాతావరణం మారినప్పుడు చర్మ సంరక్షణ ఉత్పత్తులలో కూడా మార్పులు చేయాల్సి ఉంటుంది. వర్షాకాలంలో చర్మ సమస్యలు పెరుగుతాయి. ఈ సీజన్‌లో వాతావరణంలో ఉండే తేమ, బ్యాక్టీరియా చర్మాన్ని అంటుకునేలా చేస్తుంది, దీని కారణంగా ముఖంపై మొటిమలు కనిపిస్తాయి. 1. రోజూ ఫేస్ వాష్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. లేదా సున్నిపిండి తో అయిన ఫేస్ వాష్ చేసుకోవచ్చు. 2. వర్షాకాలంలో చర్మంపై జిగట ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల మన ముఖం తేమగా ఉండదు. అయితే వర్షాకాలంలో కూడా ముఖం తేమగా ఉండాలి. అందుకు ముఖానికి తగిన మాయిశ్చరైజర్ వాడటం చాలా ఉత్తమం. 3. ఎక్కువ నీరు త్రాగడం వల్ల శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. చర్మ సమస్యల నుంచి బయటపడుతారు. నీరు తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ ఎక్కువగా మూత్రం ద్వారా శరీరం నుంచి బయటకు వెళ్లిపోతాయి. నీరు ఎక్కువగా తాగడం వల్ల మొటిమల సమస్య దూరమవుతుంది. అలాగే మీ స్కిన్ కూడా మెరుస్తూ ఉంటుంది. 4. ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న వేపను ఉపయోగించడం వల్ల ముఖంపై ఉన్న మొటిమలు, బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి. యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉన్న వేప, దాని ప్యాక్లా చేసుకుని ఉపయోగించవచ్చు. వేప ప్యాక్ చేయడానికి.. 10-12 వేప ఆకులను తీసుకొని మిక్సీలో మెత్తగా పేస్ట్ లాగా చేయాలి. ఈ పేస్ట్‌లో 3 టీస్పూన్ల పసుపు పొడిని మిక్స్ చేసి ముఖానికి  అప్లై చేసి 20 నిమిషాల పాటు వుంచాలి. 20 నిమిషాల తర్వాత ముఖం కడుక్కోవాలి . ఇలా వారానికి ఒకసారి చేస్తే మొటిమలు తొలగిపోతాయి.

50ఏళ్ళ వయసులో 20ఏళ్ళలా యవ్వనంగా కనబడటం సాధ్యమా! 50ఏళ్ళ వయసొచ్చినా 20ఏళ్ళ అమ్మాయిలా యవ్వనంగా కనిపించాలని చాలామంది కోరుకుంటారు. అయితే జీవన శైలి, తీకుకునే ఆహారం, అలవాట్ల కారణంగా 30ఏళ్ళకే ముఖం మీద ముడుతలు మొదలై ఆంటీలా కనబడుతుంటారు. ముడుతలు కనబడకూడదని చాలామంది మేకప్ తో కవర్ చేస్తారు, మరికొందరు యవ్వనంగా ఉంచుతాయంటూ చూపెట్టే ప్రతీ సౌందర్య ఉత్పత్తిని వాడుతారు. కానీ వీటి వల్ల ధీర్ఘకాలిక ఫలితాలు ఉండవు. ముఖం మీద ముడుతలు తొందరగా రాకూడదన్నా, అవి తొలగిపోవాలన్నా కష్టమేమీ కాదు. దీనికోసం చెయ్యాల్సిందల్లా ఒకే ఒక్క పదార్థం ఆహారంలో భాగం చేసుకోవడం. ఇంతకూ ఆహారంలో భాగం చేసుకోవాల్సిందేమిటి? దీన్నెలా తీసుకోవాలి అనే విషయం తెలుసుకంటే.. బ్యూటీ ఉత్పత్తులు ఎప్పుడు ముడుతలు తగ్గించడంలో సహాయపడవు. అవి చర్మం మీద ప్రభావం చూపించి తాత్కాలికంగా ముడుతలు కవర్ చేసినా ఆ తరువాత నష్టాన్ని పెంచుతాయి. కాబట్టి ముడుతలు పోవాలన్నా, రాకూడదన్నా తీసుకోవాల్సిన ముఖ్య పదార్థం విటమిన్-సి. విటమిన్-సి బాగా తీసుకుంటూ ఉంటే ముఖం మీద ముడుతల సమస్యలు తగ్గిపోతాయి. ఈ విషయాన్ని స్వయంగా ఆహార, ఆరోగ్య నిపుణులే సెలవిచ్చారు. విటమిన్-సి లో  సమర్థవంతమైన యాంటీఆక్సిడెంట్ స్వభావాలుంటాయి.  ఇది చర్మానికి సంబంధించిన అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. వయసుతో పాటు వచ్చే చర్మ సమస్యలను కూడా అధిగమిస్తుంది. విటమిన్-సి ముడుతలను తగ్గిస్తుంది కనీసం మూడు నెలల పాటు శరీరానికి సరిపడినంత  విటమిన్-సి ను  రోజువారీగా తీసుకుంటూ ఉంటే  ముఖం, మెడ చర్మంలో ముడతలు, మచ్చలు,  గీతలు మంత్రమేసినట్టు మాయమవుతాయి.  చర్మం యవ్వనంగా మారడమే కాకుండా ముఖ  ఆకృతిలో కూడా ఎంతో మార్పు  కనిపిస్తుంది.విటమిన్-సిని క్రమం తప్పకుండా ఆహారంలో చేర్చుకుంటే, చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో మాత్రమే కాకుండా చర్మసంబంధిత   వ్యాధులను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. మరీ ముఖ్యంగా  సూర్యకాంతి వల్ల వచ్చే చర్మ సమస్యలను తగ్గించడంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. విటమిన్-సి కలిసిన  సన్‌స్క్రీన్‌  హానికరమైన అతినీలలోహిత కిరణాల నుండి చర్మాన్ని రక్షించడంలో సహాయపడుతుందనే విషయం అధ్యయనాల్లో తేలింది. ఇది కేవలం బాహ్య రక్షణకోసం మాత్రమే ఉపయోగపడే మార్గం. సప్లిమెంట్స్ కాదు, ఆహారంపై శ్రద్ధ వహించాలి..  విటమిన్-సి వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని, అది రెగులర్ గా తీసుకోవాలనే ఆలోచనతో చాలామంది విటమిన్-సి సప్లిమెంట్లు తీసకోవడం మీద ఆసక్తి చూపిస్తారు. అయితే ఇది చాలా పెద్ద తప్పు. విటమిన్-సి వల్ల ఆగోర్యకరమైన ప్రయోజనాలు, ఫలితాలు పొందాలి అంటే ఆహారం ద్వారా దాన్ని పొందడమే ఉత్తమం. విటమిన్-సి అనేక ఆహార పదార్థాలలో పుష్కలంగా లభిస్తుంది. నిమ్మ, నారింజ, పైనాపిల్, మామిడి వంటి పండ్లను ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు. సీజన్ పండ్లే కాకుండా స్ట్రాబెర్రీ, కివి లాంటి అన్నిరకాల పుల్లని పండ్లలో కూడా ఈ విటమిన్-సి పుష్కలంగా లభ్యమవుతుంది. కాబట్టి వీటిని తీసుకోవడం చాలా మంచిది. చర్మసమస్యలు ఏవైనా వచ్చినప్పుడు చర్మసంబంద వైద్యుడి సలహా లేకుండా ఎలాంటి ఉత్పత్తులు వాడకూడదు.                                                              *నిశ్శబ్ద.

జుట్టుకు కలబందతో కలిగే లాభాలు!  సీజన్‌ ను బట్టి స్కిన్ కేర్ టిప్స్ మారుస్తుంటారు అమ్మాయిలు. అయితే కేవలం స్కిన్ కేర్ మాత్రమే కాదు హెయిర్ కేర్ టిప్స్ కూడా పాటించాలి. మరీ ముఖ్యంగా హెయిర్ కేర్ టిప్స్ పాటించేవారు  కలబంధను తప్పనిసరిగా చేరుస్తుంటారు. అయితే కలబంధను ఎలా ఉపయోగిస్తున్నాం అనేదాన్ని బట్టి ఫలితాలు కూడా ఉంటాయి. తలలో చుండ్రు, జుట్టు రాలడం, జుట్టు పలుచగా, టెంకాయ పీచులాగా ఉండటం వంటి సమస్యలకు కలబంద గొప్ప సొల్యూషన్ అని చెప్పవచ్చు. అయితే కలబందను వాడటంలోచాలా తప్పులు కూడా చేసేస్తుంటారు. కలబంద ఎలా వాడాలి?? ఎలా వాడితే పలితం ఉంటుంది?? తెలుసుకుంటే..   కలబందను ఉపయోగించడం వల్ల జుట్టు దృఢంగా మారడమే కాకుండా మెరుస్తుంది. అలోవెరాలో విటమిన్ సి, ఇ, ఎ ఉన్నాయి. ఇది జుట్టు పొడవును పెంచడంలో కూడా సహాయపడుతుంది. అందుకే అమ్మాయిలు దీన్ని ఎక్కువ ఉపయోగిస్తున్నారు. దీన్ని సరైన మార్గంలో  ఉపయోగించడం ద్వారా జుట్టుపై మంచి ప్రభావాన్ని చూపుతుంది. జుట్టుకు అప్లై చేయడానికి సరైన మార్గం ఏంటంటే.. ముందుగా తాజా కలబందను మొక్కనుండి వేరు చేశాక శుభ్రంగా కడుక్కోవాలి. ఆకుపచ్చరంగులో వచ్చే పదార్థం మొత్తం వెళ్లిపోయేలా దాన్ని శుభ్రం చేయాలి.   కతి సహాయంతో లోపలి జెల్ ను మాత్రమే తీసుకోవాలి.  కలబంద జెల్ ను పొడి జుట్టు మీద అప్లై చేస్తే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. జెల్‌ని జుట్టు మూలాల్లో అప్లై చేయడం మొదలుపెట్టి జుట్టు చివర్ల వరకు అప్లై చేయాలి. కలబందను జుట్టుకు అప్లై చేసిన తర్వాత అరగంట మాత్రమే  ఉంచాలి. అరగంట తర్వాత గాఢత లేని షాంపూతో కడగాలి.. కలబందను ఉపయోగించడం వల్ల కలిగే లాభాలు కలబందను వారానికి రెండు సార్లు ఉపయోగిస్తే, తల దురద, మంట, చుండ్రు మొదలైనవి కూడా పోతాయి. దీంతో జుట్టు ఆరోగ్యంగా మారుతుంది. కలబందను రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల జుట్టుకు మెరుపు వస్తుంది.                                       ◆నిశ్శబ్ద.

వేసవిలో ఆరెంజ్ పీల్ ఇలా ఉపయోస్తే మెరిసిపోతారు! విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, ఎసెన్షియల్ ఆయిల్స్ వంటివి కలిగి ఉన్న నారింజ తొక్కలు చర్మానికి అనేక విధాలుగా ఉపయోగపడతాయని మీకు తెలుసా ? ఆరెంజ్ పీల్స్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది చర్మాన్ని ప్రకాశవంతం చేయడంలో సహాయపడుతుంది. నల్ల మచ్చలు తగ్గించడానికి నారింజ తొక్కను నేరుగా చర్మంపై రుద్దడం లేదా క్యారియర్ ఆయిల్‌తో కలిపిన నారింజ తొక్క పొడిని ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. ఆరెంజ్ పీల్ చర్మపు రంధ్రాలను బిగించి, అదనపు నూనె ఉత్పత్తిని నియంత్రిస్తుంది, రిఫ్రెష్ అనుభూతిని అందిస్తుంది. ఆరెంజ్ పీల్ లోని యాంటీమైక్రోబయల్ లక్షణాలు మోటిమలు కలిగించే బ్యాక్టీరియాను ఎదుర్కోవడంలో సహాయపడతాయి, ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీ రాడికల్ డ్యామేజ్, అకాల వృద్ధాప్యం నుండి రక్షించడంలో సహాయపడతాయి. జిడ్డుగల చర్మం కోసం: 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి 1 Tbp నారింజ తొక్క పొడి అవసరం మేరకు రోజ్ వాటర్ ఒక చిన్న గిన్నెలో అన్ని పదార్థాలను కలపాలి. వారానికి ఒకసారి ఈ పేస్ట్‌ను ప్యాక్ లాగా వేసుకోవాలి.. పొడి చర్మం కోసం: 1 tbp శనగపిండి 1 tbp ఆరెంజ్ పీల్ పొడి 1 స్పూన్ తేనె అవసరమైనంత నీరు తేనెతో పాటు ఈ ఫేస్‌మాస్క్ అద్భుతాలు చేస్తుంది. అన్ని పదార్థాలను కలపి పేస్ట్ ల్లా చేసి ఫేస్ కు అప్లై చేసుకోవాలి.  వారానికి 1-2 సార్లు ఇలా చేయాలి. ఇది చాలా తొందరగా ముఖ చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది.  ముఖం మీద టాన్ తొలగించడంలో సహాయపడుతుంది. శనగపిండి చర్మాన్ని మృదువుగా చేస్తుంది తేనె మీ చర్మాన్ని తేమగా ఉంచుతుంది.  సాధారణ చర్మ రకం కోసం: 1 tbp ఆరెంజ్ పీల్ పొడి ఒక చిటికెడు పసుపు 1 టీస్పూన్ ముల్తానీ మట్టి, అవసరమైనంత పాలు పైన పేర్కొన్న పదార్థాలతో పేస్ట్ తయారు చేసి వారానికి ఒకసారి అప్లై చేయాలి. ముల్తానీ మట్టిని ఆరెంజ్ పీల్ ప్యాక్‌లో ఉపయోగించడం ద్వారా మీ చర్మం మీద బ్లాక్‌హెడ్స్, వైట్‌హెడ్స్‌ను తొలగించడానికి సహాయపడుతుంది. ఇవి మాత్రమే కాకుండా ఆరంజ్ పీల్ పౌడర్ తో ఈ కింది ప్యాక్ లు కూడా ఉపయోగించవచ్చు.  ఆరెంజ్ పీల్ పౌడర్, కలబంద -  ఒక గిన్నె తీసుకొని, 2 టేబుల్ స్పూన్ల తాజాగా తీసిన కలబంద, 2 టేబుల్ స్పూన్ల ఆరెంజ్ పీల్ పౌడర్ వేసి, 2-3 చుక్కల నిమ్మరసం పిండుకుని, పేస్ట్ చేయాలి. పేస్ట్‌ను అప్లై చేసి 15 నిమిషాలు అలాగే ఉండనివ్వండి. మీ ముఖాన్ని సాధారణ చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.  ఆరెంజ్ పీల్ పౌడర్, చందనం -  ఒక గిన్నె తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ నారింజ గుజ్జు, ఒక స్పూన్ చందనం కలపాలి.  తర్వాత కొన్ని చుక్కల రోజ్ వాటర్, నిమ్మరసం వేసి పేస్ట్ లా చేసుకోవాలి. పేస్ట్‌ను అప్లై చేసి 10 నిమిషాలు ఆరనివ్వాలి. తరువాత  ముఖాన్ని సాధారణ చల్లని నీటితో శుభ్రం చేసుకోండి.  ఆరెంజ్ పీల్ పౌడర్, పెరుగు   ఒక గిన్నె తీసుకుని, అందులో 2 టేబుల్ స్పూన్లు ఆరెంజ్ పీల్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ తేనె మరియు 1 టేబుల్ స్పూన్ పెరుగు కలపాలి. దీన్ని మందపాటి పేస్ట్ లా చేసుకోవాలి.  పేస్ట్‌ను అప్లై చేసి 10-12 నిమిషాలు ఆరనివ్వండి. తరువాత ముఖాన్ని సాధారణ చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆరెంజ్ పీల్ పౌడర్, పంచదార  ఒక గిన్నె తీసుకుని, 1 టేబుల్ స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్, ½ టేబుల్ స్పూన్ పంచదార కలపాలి. ఇది పేస్ట్ చేయడానికి కొన్ని చుక్కల నిమ్మరసం, రోజ్ వాటర్ జోడించాలి. ఈ స్క్రబ్‌ని అప్లై చేసి 5-7 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేయాలి. తరువాత ముఖాన్ని సాధారణ/చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.  ఇవి పాటిస్తే.. ఈ వేసవి కాలంలో ముఖం మెరిసిపోతుంది.                                        ◆నిశ్శబ్ద.

మండిపోయే ఎండలలో ముఖ సౌందర్యాన్ని ఇలా కాపాడుకోండి! ఏడుకేడు ఎండల తీవ్రత పెరిగిపోతోంది. మండుతున్న ఎండ, బలమైన ఈదురుగాలులు, వేడి సెగ అందరినీ ఇబ్బంది పెడుతున్నాయి. ముఖ సౌందర్యాన్ని కంటికి రెప్పలా కాపాడుకునే అమ్మాయిలు పులి మీదకు వస్తున్న జింక పిల్లల్లా అల్లాడిపోతారు. సన్ ట్యాన్, దుమ్ము, ధూళి కారణంగా మొటిమలు, శరీరంలో వేడి పెరగడం కారణంగా వేడి కురుపులు ఏర్పడతాయి. ఆయిల్ స్కిన్ ఉన్న వారికి ఈ సమస్య మరింత పెరుగుతుంది. దద్దుర్లు, దురదలు, మొటిమలు వచ్చినప్పుడు ఈ  సమస్య మరింత పెరుగుతుంది. ఆయిల్ స్కిన్ ఉన్నవారు ముఖంపై మేకప్ సరిగా ఉండకపోవడం, చెమట పట్టడం వల్ల చాలా ఇబ్బంది పడుతుంటారు. వీటి నుండి ఉపశమనం కావాలి అనుకుంటే.. ముల్తానీ మట్టి మంచి ఆప్షన్. వేసవికాలంలో ముఖారవిందాన్ని పెంటే ఫేస్ ప్యాక్ లు ఇవి. ముల్తానీ మట్టితో వీటిని జోడించి ఫేస్ ప్యాక్ వేస్తే ముఖం మెరుపులే.. అవేంటో తెలుసుకుంటే.. టమోటా.. ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్.. టమోటా ముఖారవిందాన్ని పెంచడంలో బాగా పనిచేస్తుంది. పైగా ప్రస్తుతం మార్కెట్ లో వీటి ధర ఎక్కువగా ఏమీ లేదు. టమాటా గుణాలు  చర్మానికి చాలా మేలు చేస్తాయి. ముల్తానీ మిట్టిలో టమాటా రసాన్ని కలిపి ఫేస్ ప్యాక్ వేసుకుంటే ముఖం మెరిసిపోతుంది. ఈ ప్యాక్ చేయడానికి, ఒక గిన్నెలో ఒకటిన్నర టీస్పూన్ల ముల్తానీ మిట్టి మరియు రెండు టమోటాల రసాన్ని కలపాలి. బాగా మిక్స్ చేసి ఈ పేస్ట్ ను ముఖం, మెడ అంతా పట్టించి   ఇరవై నిమిషాలు ఉంటి ఆపై ముఖం కడిగేయాలి.  ముల్తానీ మట్టి.. కలబంద ఫేస్ ప్యాక్.. కలబంద ప్రతీ ఇంట్లో అలంకారం కోసమని పెంచుతూ ఉంటారు. కానీ ఇది మంచి సౌందర్య సాధనం అనే విషయం ఇప్పటికే అందరికీ తెలుసు. వేసవి కాలంలో ముఖాన్ని చల్లబరచడానికి కలబంద బాగా పనిచేస్తుంది. దాన్ని  ముల్తానీ మట్టితో కలిపి రాసుకుంటే చర్మానికి ఎంతో ఉపశమనం లభిస్తుంది. ఇందుకోసం ముల్తానీ మట్టిని ఒక గిన్నెలోకి తీసుకుని, దానికి 1 టేబుల్ స్పూన్ తాజా అలోవెరా జెల్ జోడించండి.పేస్ట్ లాగా చేసుకుని దీన్ని ముఖానికి అప్లై చేయాలి. ఇరవై నిమిషాల తరువాత ఈ పేస్ ప్యాక్ ను తొలగించుకోవాలి. కడిగిన వెంటనే దీని ప్రభావం అంతగా కనిపించదు కానీ మెల్లిగా కనిపిస్తుంది.  ముల్తానీ మట్టి.. తేనె ఫేస్ ప్యాక్.. తేనెలో ఆరోగ్యం కోసమే కాదు.  సౌందర్య సాధనంగానూ శక్తివంతమైనది. ఇది చర్మానికి గొప్పగా ఉపయోగపడుతుంది.చర్మాన్ని మృదువుగానూ, కాంతివంతంగానూ మారుస్తుంది.  ఒక గిన్నెలో ఒకటి నుండి ఒకటిన్నర టీస్పూన్ ముల్తానీ మట్టి మరియు అర టీస్పూన్ తేనె  వేసి కలపండి. ఇది కాస్త పేస్టులా అవ్వడానికి ఇందులోకి కాసింత   రోజ్ వాటర్ కూడా కలపుకోవాలి. ఈ ప్యాక్‌ని ముఖానికి అప్లై చేసి ఇరవై నిమిషాల పాటు ఉంచుకోవాలి. ఆ తరువాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.    నిమ్మరసం.. ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్.. నిమ్మరసంలో ముల్తానీ మట్టిని కలిపి ప్యాక్‌ని సిద్ధం చేసుకోవాలి. దీన్ని వాడటం వల్ల చర్మం మెరుస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవడానికి  రెండు టీస్పూన్ల ముల్తానీ మట్టిలో రెండు టీస్పూన్ల నిమ్మరసం కలపాలి. పేస్ట్ గట్టిగా మారినట్లయితే, దానికి కాసింత రోజ్ వాటర్ జోడించవచ్చు. ఈ ప్యాక్‌ని ముఖానికి పట్టించి ఇరవై నిమిషాల పాటు ఉంచాలి. ఆ తరువాత ముఖాన్నిశుభ్రం చేసుకోవాలి.  పైన చెప్పుకున్న నాలుగు ఫేస్ ప్యాక్ లలో ఏదో ఒకటి మీకు అనుగుణంగా ఉన్నది ఫాలో అయినా సరిపోతుంది. వేసవిలో ముఖచర్మానికి కలిగే అసౌకర్యానికి ఇవి చెక్ పెడతాయి.                                             ◆నిశ్శబ్ద.

పాదాల సంరక్షణకు భలే చిట్కాలు! మహిళల అందంలో ప్రధాన పాత్ర పోషించే శరీర భాగాల్లో పాదాలు కూడా ముఖ్యమైనవే. అయితే సంరక్షణ విషయంలో ఇవి అట్టడుగున ఉంటాయి. ముఖం మీద మొటిమ వచ్చినా, చర్మం ముడతలు పడినా, డ్రెస్ కాస్త సరిగా సెట్ అవ్వకపోయినా ఆందోళన పడిపోయే అమ్మాయిలు పాదాల విషయంలో మాత్రం అసలు పట్టించుకోరు. అయితే కొత్త చెప్పులు కొనడానికి షాపుకు వెళ్లినప్పుడో… నలుగురిలో ఫంక్షన్స్ కు వెళ్ళినప్పుడు పట్టీలు పెట్టుకుని తిరగాల్సినప్పుడో, ఇంకా కొన్ని వేరు వేరు సందర్భాలలోనో… పాదాల పదనిస తగ్గి మనలో పల్స్ ను నలుగురిలో టెస్ట్ చేస్తాయి. పాదాలను సరిగా పట్టించుకోకపోతే పగుళ్లు వచ్చి, చీలిపోయి, చాలా ఎబ్బెట్టుగా కనిపిస్తాయి. అందుకే అందమైన పాదాల కోసం అదిరిపోయే చిట్కాలు మీకోసం…. ప్రతి రోజూ రాత్రి పండుకునే ముందు మూడు చెంచాల నిమ్మ రసములో రెండు చెంచాల గ్లిజరిన్ కలిపి కాళ్ళకు మర్దరా చేయాలి. ఇలా మర్దన చేస్తే.... కాళ్ళు మృదువుగా, అందంగా ఉంటాయి. కాళ్ళ నొప్పులతో బాధపడేవారి కోసం ఒక మంచి చిట్కా ఉంది.  వెడల్పాటి గిన్నెలో గోరువెచ్చని నీరు పోసి, అందులో రెండు చెంచాల జిప్సమ్ సాల్ట్ వేసి ఆ నీటిలో పాదాలు మునిగేలా పదిహేను నిమిషాలు ఉంచాలి. ఇలా ఉంచితే.... కాళ్ళ నొప్పులు  తగ్గుతాయి. అన్నిటికంటే సులువైన మరియు తొందరగా పూర్తయ్యే చిట్కా ఒకటుంది. ప్రతి రోజు స్నానము చేసేటప్పుడు 'వ్యూమిక్ స్టోన్' తో పాదాలను మృదువుగా రుద్దుకుంటే.... పాద సౌందర్యము పెరుగుతుంది. రెండు చెంచాల ఆలివ్ ఆయిల్ లో కాస్త ఉప్పు కలిపుకోవాలి.  ఈ మిశ్రమాన్ని స్నానానికి ముందుగా కాళ్ళకు మర్దన చేసికొంటుంటే.. కాళ్ళకు ఆరోగ్యము అందము లభిస్తుంది. వెడల్పాటి గిన్నెలో- గోరువెచ్చని నీరు పోసి, ఇందులో  ఒక ఔన్స్ 'సోడియమ్ సల్ఫేట్', మూడు ఔన్స్ 'బైకార్బోనేట్', నాలుగు ఔన్స్ ఉప్పువేసి కలిపి, ఈనీటిలో పాదాలు మునిగేలా కాసేపు వుంచితే కాళ్ళ నొప్పులు తగ్గటమే గాక పాదాలు శుభ్ర పడతాయి. కాళ్ళలో ఉండే మురికి, మలినాలు తొలగిపోతాయి. మృతచర్మం మెత్తబడి సులువుగా తొలగించేందుకు వీలవుతుంది.  ప్రతిరోజు ఓ పది నిమిషాలసేపు మునివేళ్ళ మీద నడిస్తే.... కాలి కండరాలలో బలం పుంజుకుంటుంది. శుభ్రముగా వున్న నేల మీద చెప్పులు వేసుకోకుండా కాసేపు నడుస్తుంటే.... పాదాలకు బలము వస్తుంది.  వేడినీటిలో  కాసిని ఆవాలు వేసి, ఆ నీటిలో పాదాలు  పది నిమిషాలుంచి, ఆ తరువాత పాదాలను చన్నీటి పంపు కింద ఉంచాలి. ఇలా ఉంచితే.... పాదాలకు  బలము, సౌందర్యము చేకూరుతాయి.  అందమైన కాళ్ళ కావాలంటే వ్యాయామం అవసరం. దీనికి 'ఈత' మంచి వ్యాయామంగా ఉపయోగపడుతుంది. చెప్పులు లేకుండా కాసేపు ఇసుకలో నడవడం,  కుర్చీలో నిటారుగా కూర్చొని పాదాలతో నేల మీద సున్నా చుట్టుటానికి  ప్రయత్నించడం వలన... కాలి కండరాలు బలంగా తయారవులతాయి. ముందుగా మునివేళ్ళ మీద, తరువాత మడమల మీద మార్చి మార్చి నిలుచుంటే.... కాలి కండరాలు బలంగా తయారవుతాయి.  ఓ కుర్చీలో కూర్చుని, ప్రక్కనున్న కుర్చీలోని టవల్ కాళ్ళతో తీసికొనుటకు ప్రయత్నించుట కాళ్ళకు మంచి వ్యాయామము  కాళ్ల క్రింద ఎత్తుగా రెండు దిండ్లు పెట్టుకొని, కాసేపు విశ్రాంతి తీసుకుంటూ పడుకొంటే.... కాళ్ళ నొప్పులు తగ్గుతాయి. కొత్త చెప్పులు కొననివారు ఉండరు. అవి కరవడం అనుభవించని వారుండరు. అయితే  క్రొత్తగా కొన్న చెప్పులు కరుస్తుంటే.... పాదము మీద, చెప్పు కరుస్తున్నచోట  ఆముదము రాస్తే.... సరిపోతుంది.  అరికాళ్ళ పగుళ్ళతో బాధపడేవారు. క్యాన్వాస్ షూ వాడితే, రెండు నెలల్లో పగుళ్ళు తగ్గిపోయి కాళ్ళు శుభ్రముగా ఉంటాయి.  ఇలా కాళ్ళ పగుళ్లకు ఎన్నో రకాల అద్భుతమైన చిట్కాలున్నాయి. పాటించడమే తరువాయి..                                    ◆నిశ్శబ్ద.

  ఎండల్లో హాయిహాయిగా   ఎండాకాలం వచ్చిందంటే చాలు అమ్మాయిలు చర్మసౌందర్యం పట్ల మరింత శ్రద్ధ చూపించటం మొదలుపెడతారు. మిగిలిన కాలాల్లో కాంతులీనుతూ ఉండే చర్మం ఎండాకాలం వచ్చేసరికి మొహం పోడిబారిపోయినట్టు, జీవం లేనట్టు తయారవుతుంది. అలాంటప్పుడు రోజులో ఒక్క 10 నిమిషాలు ఈ సమస్య కోసం టైం కేటాయిస్తే చాలు,  కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలు ఎండల్లో కూడా హాయిహాయిగా ఉండచ్చు.   * ఎండలలో బయట తిరిగి ఇంటికి రాగానే ముందుగా మొహాన్ని శుభ్రం చేసుకోవటం మంచిది. సబ్బులతో పనిలేకుండా ఇంట్లోనే క్లెన్శింగ్ మిక్స్ ను తయారుచేసుకోవచ్చు. కాస్త  బాదంపప్పు ,ఓట్స్, పాలు, రోస్ వాటర్ కలిపి మొహానికి పట్టించి  కాసేపు ఉంచుకుని కడిగేసుకుంటే చాలు. * కీరదోస కూడా మొహం మీద మురికి పోవటానికి చాల బాగా పనిచేస్తుంది. కీరా  పేస్టు లో కొద్దిగా పాలు కలిపి మొహానికి రాసుకుంటే మొహం మీదుండే మురికి మొత్తం పోతుంది.   *  ఎండలో వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ లోషన్ అందరూ వాడతారు, అయితే అలా వాడేటప్పుడు దానిలో SPF అంటే sun protection factor కనీసం 15 ఉండేలా చూసుకోవాలి. ఇది మన చర్మాన్ని 15 శాతం ఎక్కువ కాపాడుతుంది. ఏమి అప్లయ్ చేయని చర్మం ఎండ బారిన పడటానికి 20 నిముషాలు పడుతుంది అదే సన్ స్క్రీన్ వాడితే 300 నిమిషాలు ఎండ మన మీద దాని ప్రభావాన్ని చూపించలేదు. * ఎక్కువగా  ఎండల్లో తిరగాల్సిన పని ఉన్నవాళ్ళు మొహం మీద జిడ్డు మొతాన్ని తొలగించుకోవటానికి స్ట్రాబెర్రీ లేదా బొప్పాయి పండు గుజ్జును మొహానికి పట్టించి పది నిమిషాల తరువాత కడిగేసుకుంటే  కనిపిస్తుంది.   *   ఎండాకాలంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా మొహానికి ఫేషియల్ చేయించుకోవటం కూడా చాలా అవసరం.  ఇంట్లోనే ఈజీగా ఫేషియల్ చేసుకోవాలంటే అలొవెరా జెల్ లో ఆరెంజ్ జ్యూస్ కలిపి మొహానికి పట్టించి 20 నిమిషాల తరువాత కదిగేసుకోవచ్చు. * అరటి పండు, తేనే కలిపి మెత్తగా పేస్టులా చేసి మొహానికి పట్టించి అరగంట తరువాత కడిగేసుకున్నా చాలు మొహంలో మంచి నిగారింపు వస్తుంది.    ఇవన్ని ఎలా ఉన్నా ఎండల్లో కూడా హాయిహాయిగా ఉండాలంటే టీ, కాఫీలకి దూరంగా ఉంటూ కొబ్బరి నీళ్ళు, నిమ్మరసం, బార్లీ, చోడుపిండి అంటే రాగి జావ, తాజా ఆకుకూరలు-కూరగాయలు, చక్కని ఫ్రూట్ జ్యూస్ లు తగిన విధంగా తీసుకుంటే చాలు ఎండ మన దగ్గరకి రావటానికి కూడా భయపడుతుంది. ..కళ్యాణి                    

వీపు భాగం నల్లగా.. ఎబ్బెట్టుగా ఉందా?? ఇలా చేస్తే నలుపు పోతుంది! అందంగా కనిపించాలని కోరుకోకుండా ఎవరూ ఉండరు. ఖరీదైన జీవితం కలిగిన వారి నుండి, సాధారణ కుటుంబాల్లో అమ్మాయిల వరకు అందరూ అందంగా తయారవడానికి ఆసక్తి చూపిస్తారు. ఇప్పటి ఫాషన్ ప్రపంచంలో సాధారణ అమ్మాయిలకు కూడా సరిపోయేలా తక్కువ ధరకు లభించేలా ఎన్నో రకాల మోడల్స్ అందుబాటులో ఉంటున్నాయి. వీటిని వేసుకోవడానికి చాలా ఆసక్తి చూపిస్తారు. అలాంటి డ్రెస్సులలో వీపు భాగం ఎక్పోజ్ అయ్యేవిధంగా ఉండే దుస్తులు ఉంటున్నాయి. చీరకట్టు మహిళలు వివిధ రకాల డిజైనింగ్ బ్లౌజులు వేసుకోవడం నుండి, ఎన్నో రకాల దుస్తులు ఇందులోకే వస్తాయి.  అయితే..  చాలామంది వీపు భాగం గురించి మొదటి నుండి అంత శ్రద్ధ పెట్టరు. ఈ కారణంగా వీపు భాగం చాలామందికి నల్లగా మారిపోయి ఉంటుంది. ఇలాంటి వారు ఫ్యాషన్ దుస్తులు వేసుకోవాలంటే కాస్త ఇబ్బంది పడతారు. వీపుకు ఉన్న నలుపు పోవడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి..  మన ఇంట్లో ఎప్పుడూ నిల్వ ఉండేవాటిలో నిమ్మకాయ కూడా ఒకటి. నోరు బాగలేనప్పుడు కాస్త పుల్లపుల్లగా బాగుంటుందని, నీరసం అనిపించినప్పుడు ఉత్సాహం ఇస్తుందని, వేసవి తాపాన్ని తగ్గిస్తుందని, పులిహోర కలుపుకోవాలని.. ఇలా కారణాలు ఏమైనా నిమ్మకాయను మనకు ఉన్న లింకు లంకె బిందె అంత పెద్దది. అలాంటి నిమ్మకాయను ఉపయోగించి వీపు భాగంలో నలుపును మాయం చేయొచ్చు.. పార్లర్ లలో  వేలాది రూపాయలు ఖర్చు పెట్టి చేయించుకుని ట్రీట్మెంట్ కు ధీటుగా నిమ్మకాయంతో ఇంట్లోనే మ్యాజిక్ చేయచ్చు ఇలా.. నిమ్మకాయ, కలబంద  నిమ్మకాయ మరియు కలబందతో వీపు  తెల్లబడటానికి మంచి చిట్కా ఉంది.  ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలో రెండు నిమ్మకాయల రసాన్ని పిండాలి. దీని తర్వాత దానికి రెండు టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్ కలపాలి. తాజా కలబంద ఉంటే అది ఉపయోగించవచ్చు. రెండింటినీ మిక్స్ చేసి వీపుపై బాగా మసాజ్ చేయాలి. కొంత సమయం తర్వాత కడిగేయాలి. నిమ్మకాయ సెనగపిండి సెనగపిండి మన వంటింట్లో ఎప్పుడూ ఉంటుంది. నిమ్మరసానికి దీన్ని జతచేయడం వల్ల మంచి ఫలితం పొందవచ్చు. ఇందుకోసం ఒక టేబుల్‌స్పూన్ శెనగపిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అందులో ఒక నిమ్మకాయ రసాన్ని పిండాలి. దానికి రెండు చెంచాల పెరుగు, ఒక చెంచా రోజ్ వాటర్ కలపండి. ఇప్పుడు వీపుపై అప్లై చేసి ఐదు నిమిషాల పాటు అలాగే ఉంచాలి. మెల్లిగా  స్క్రబ్ చేస్తూ దీన్ని తొలగించాలి. నిమ్మకాయ-ఎర్రకందిపప్పు ఎర్రకందిపప్పును బ్యూటీ చిట్కాలలో బాగా వాడుతారు. దీన్ని నిమ్మకాయంతో కలిపి మంచి పలితాన్ని రాబట్టుకోవచ్చు. ముందుగా మూడు టేబుల్ స్పూన్ల ఎర్రకందిపప్పు పొడిని ఒక గిన్నెలో తీసుకోవాలి. దానికి రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం కలపండి. ఒక చిన్న చెంచా కలబంద, పెరుగు జోడించాలి. అన్నీ బాగా కలిపిన తర్వాత వీపుపై అప్లై చేసి బాగా ఆరనివ్వాలి. స్క్రబ్బింగ్ చేసిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. నిమ్మరసం-బియ్యం పిండి బియ్యపు పిండిని వీపు శుభ్రం చేయడానికి కూడా ఉపయోగించవచ్చు , ముందుగా ఒక గిన్నెలో బియ్యప్పిండిని తీసుకొని దానికి రెండు చెంచాల పెరుగు వేయండి. దానిపై నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ బియ్యం పిండి ప్యాక్‌ని వీపు భాగంలో అప్లై చేసి 10 నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తర్వాత కడిగేయాలి. ఈ టిప్స్ పాటిస్తే వీపు భాగంలో ఉన్న నలుపు పోతుంది. కేవలం వీపు బాగంలోనే కాదు. మోచేతులు, మోకాళ్ళు, మెడ, పెదవుల చుట్టూ ఉన్న భాగం.. ఇలా అన్ని ప్రాంతాలలో వీటిని ఉపయోగించచ్చు.                                    ◆నిశ్శబ్ద.

చిక్కులు పడే జుట్టుకు చక్కని పరిష్కారాలు! అమ్మాయిలకు తమ జుట్టు అంటే చాలా ఇష్టం. పొడవాటి శిరోజాలు కావాలని అనుకోని మహిళ ఉండదు. అయితే జుట్టు ఆరోగ్యకరంగా పెరగడం, ఒత్తుగా, పట్టు కుచ్చులా ఉండటం చాలా కొద్దిమందిలోనే కనబడుతుంది. శారీరక అందాన్ని మరించ పెంచే అంశంలో జుట్టు ప్రధాన పాత్ర పోషిస్తుంది. అందుకే జుట్టు సంరక్షణ విషయంలో దానిని జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం.  అయితే, చాలా తొందరగా చిక్కుబడే జుట్టుతో చెప్పలేనంత నరకం అనుభవిస్తుంటారు ఎంతోమంది. కొందరిలో చిక్కుబడిన జుట్టును విడదీయడం చాలా శ్రమతో కూడుకున్న పనిగా ఉంటుంది.  అలాంటి జుట్టును సరిగ్గా చిక్కు తీయకపోతే, అది హెయిర్ డ్యామేజ్ కు, వెంట్రుకలు విరిగిపోవడానికి, జుట్టు రాలిపోవడానికి కారణం అవుతుంది. అందువల్ల జుట్టుకు ఏమాత్రం హాని కలిగించకుండా చిక్కు తీయడం ఎంతో నేర్పుతో కూడుకున్నది. ఎక్కువ చిక్కుబడిపోయే జుట్టును తేలికగా ఆరోగ్యంగా చిక్కు తీయడానికి కొన్ని టిప్స్ ఇవే…  వెడల్పాటి పంటి దువ్వెన  ఎక్కువ హెయిర్ ఫాల్ లేకుండా సులువుగా చిక్కు తీయడానికి మొదటి మార్గం పర్ఫెక్ట్ దువ్వెన. వెడల్పాటి పళ్ళు కలిగిన దువ్వెన వాడి చిక్కును సులువుగా తీయవచ్చు.  చిక్కు మీద చమ్మక్: లీవ్-ఇన్ కండీషనర్ లేదా డిటాంగ్లింగ్ స్ప్రే వంటి వాటిని ఉపయోగించడం వల్ల  చిక్కుబడిన జుట్టును చాలా సులువుగా తీసేయచ్చు. వీటిని స్ప్రే చేసి పెద్ద పళ్ళ దువ్వెనతో దువ్వితే సరిపోతుంది.  వేళ్లను ఉపయోగించవచ్చు: దువ్వెన లేదా బ్రష్‌ని చిక్కు తీయడానికి ఉపయోగించే ముందు చిక్కుముడులను వేరు చేయడానికి  జుట్టును చేతి వేళ్ళతో చిక్కులు విడదీయాలి.   పాయలుగా విడదీయడం: జుట్టు బాగా చిక్కులుగా ఉన్నప్పుడు దువ్వెనతో పట్టి లాగకుండా  జుట్టును చిన్న పాయలుగా విడదీసి మెల్లిగా చిక్కు తీయాలి.   సున్నితంగా ఉండాలి: చిక్కులు విడదీసేటప్పుడు సున్నితంగా ఉండాలి. చిక్కు చాలా ఎక్కువ ఉందని, అది సులువుగా రావడం లేదని చిరాకు, కోపం అసహనంతో జుట్టును పట్టి లాగకూడదు.  చివర్ల నుండి చిట్కా:  జుట్టు చిక్కులు తీసేటపుడు పై నుండి కిందకు దువ్వకుండా మొదట జుట్టు కింద భాగం దువ్వి చిక్కులు తీసుకోవాలి. ఆ తరువాత పైన నుండి కిందకు దువ్వాలి జుట్టు తడిగా చిక్కులు తీయొద్దు:  చాలామంది జుట్టు తడిగా ఉండగానే జుట్టు లాగడం, దువ్వడం చేస్తుంటారు. ఇది చిక్కులు ఎక్కువ కావడానికి కారణం అవుతుంది. అందుకే జుట్టు పూర్తిగా ఆరిన తరువాతే చిక్కులు తీయాలి. మరొక విషయం ఏమిటంటే ఒత్తిడి ఎక్కువగా ఉన్నా, కోపం చిరాకు అసహనం వంటివి ఉన్నా జుట్టు ఎక్కువగా  చిక్కులు పడుతుంది. వీలైనవరకు ఇలాంటి వాటికి దూరంగా ఉండి ప్రశాంతగా ఉండటానికి ప్రయత్నించండి.                                 ◆నిశ్శబ్ద.

తులసి వల్ల ఈ ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలిస్తే అసలు వదిలిపెట్టరు! భారతీయుల జీవితంలో తులసి అనేది చాలా ప్రత్యేకమైనది. అది కేవలం దైవ సంబంధమైన మొక్కగానే కాకుండా ఆరోగ్యాన్ని సంరక్షించే అద్భుత సంజీవనిగా కూడా అందరికి తెలుసు. మన రోజు వారీ జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తరిమికొట్టడంతో పాటు మొండి రోగాలను, ఎంతో తీవ్రమైన జబ్బులను నెమ్మదిగా తగ్గుముఖం పట్టించడంలో తులసి చాలా గొప్పగా పనిచేస్తుంది. అయితే అమ్మాయిలు సాధారణంగా సౌందర్యాన్ని పెంచుకోవాలని అనుకుంటే వారు తమ సహజమైన బ్యూటీ థెరపిలో కచ్చితంగా తులసిని భాగం చేసుకోవాలి. తులసి శరీరం లోపలి ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా శరీరం పైన చర్మాన్ని కూడా చక్కదిద్దగలదు. అంతర్గతంగా, బాహ్యంగా శరీరాన్ని శుద్ధి చేసే తులసి గ్రేట్ మెడిసిన్. తులసి చర్మానికి అనేక ప్రయోజనాలు చేకూరుస్తుంది.  పొడి, సున్నితమైన చర్మం మీద వచ్చే మొటిమలను, వయసు రీత్యా ఏర్పడే ముడుతలను తగ్గించడంలో తులసిది శక్తివంతమైన పాత్ర. తులసిని రోజువారీ చర్మ సంరక్షణలో భాగం చేసుకుంటే అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది.  అందుకే చాలామంది స్కిన్ స్పెసిషలిస్ట్స్ తులసిని రోజులో భాగం చేసుకోమని కూడా సలహా ఇస్తున్నారు. ఏ రకమైన తులసి అయినా గొప్ప ఔషధ గుణాలు కలిగి ఉంటుంది కాబట్టి ఏ రకమైన తులసి ఉపయోగించాలనే సంశయం కూడా వద్దు. అమ్మాయిలకు తులసితో అద్భుతమైన అయిదు ప్రయోజనాలు ఇవిగో... యాంటీ ఏజింగ్ లక్షణాలు తులసిలో యాంటీఆక్సిడెంట్స్‌లో సమృద్ధిగా ఉంటాయి. ఇది  యాంటీ ఏజింగ్ స్కిన్‌కేర్ రొటీన్‌కు అద్భుతమైన ప్రత్యామ్నాయంగా  ఉంటుంది.  వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేసే ఫ్రీ రాడికల్స్ నుండి చర్మం దెబ్బతినకుండా నిరోధించడంలో తులసి సహాయపడుతుంది.  ఇందులోని అధిక యాంటీఆక్సిడెంట్ కంటెంట్ చర్మం మీద వచ్చే వాపు మరియు ఎరుపును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది, ఈ రెండూ వృద్ధాప్యం రావడానికి దోహదం చేస్తాయి.  తులసి రసం లేదా నూనెతో చర్మ సంరక్షణ ఉత్పత్తులను ఉపయోగించడం ద్వారా చర్మాన్ని యవ్వనంగా  ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.  మొటిమల చికిత్స తులసి మొక్క సహజ యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది.  ఇది మొటిమలకు సమర్థవంతమైన చికిత్స చేస్తుంది.  ఇందులో ఉన్న  యాంటీ బాక్టీరియల్ లక్షణాల కారణంగా, ఇది మొటిమలకు కారణమయ్యే క్రిములను తొలగించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండ మొటిమలు వచ్చినప్పుడు మొటిమల తాలూకూ నొప్పి, మంట తగ్గించడానికి, చర్మ  రంధ్రాలను అన్‌ లాగ్ చేయడంలో సహాయపడుతుంది. చర్మ రంధ్రాలలో దుమ్ము, ధూళి, మురికి మొదలైనవి చేరడం మొటిమలకు దోహదపడే కారకాలు.  తులసిని రోజులో చేర్చడం ద్వారా మొటిమలను క్లియర్ చేయడంలో సహాయపడుతుంది. అలాగే మళ్ళీ మొటిమలు రాకుండా ఇది ప్రొటెక్షన్ ఇస్తుంది.    చర్మానికి మెరుపును ఇస్తుంది తులసిలో అధిక స్థాయిలో విటమిన్ సి ఉంటుంది, ఇది చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది. విటమిన్ సి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, ఇది  డార్క్ స్పాట్స్ మరియు హైపర్ పిగ్మెంటేషన్ ను తగ్గిస్తుంది. అలాగే  చర్మపు రంగును ప్రకాశవంతం చేయడానికి, చర్మం రంగు వెలసిపోకుండా మెరుస్తూ సహాయపడుతుంది.  సాధారణ స్కిన్ కేర్ కంటే తులసిని అందులో భాగం చేసుకుని ఉపయోగించడం వల్ల చర్మానికి అధిక కాంతి, ఆరోగ్యకరమైన మెరుపు వస్తుంది.  నిస్తేజంగా ఉన్న చర్మాన్ని ఆక్టివేట్ చేస్తుంది.  మాయిశ్చరైజింగ్ తులసితో ఉన్న  మాయిశ్చరైజింగ్ లక్షణాల కారణంగా, చర్మాన్ని తేమగా, మృదువుగా చేయడానికి సహాయపడుతుంది.  ఇది చర్మానికి లోతైన పోషణను అందించగల ముఖ్యమైన నూనెలను కలిగి ఉంటుంది, ఇది పొడి చర్మం ఉన్నవారు ఉపయోగిస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి.  ఆరోగ్యకరమైన, తేమతో కూడిన చర్మం కావాలంటే తులసి బెస్ట్ ఆప్షన్. విశ్రాంతిని ఇస్తుంది  తులసిలో ఉన్న సహజమైన గుణాలు ఉన్నాయి,  చర్మపు చికాకును తగ్గించి ప్రశాంతంగా ఉంచడానికి ,  ఉపశమనానికి సహాయపడతాయి.  ఇది యూజెనాల్‌ను కలిగి ఉంటుంది, ఇది యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మరియు అనాల్జేసిక్ లక్షణాలతో కూడిన సమ్మేళనం. ఇదే చర్మాన్ని విశ్రాంత స్థితిలో ఉంచడానికి సహాయపడుతుంది.  ఇలా తులసి చర్మ సంరక్షణలో అద్భుతంగా పనిచేస్తుంది.                                             ◆నిశ్శబ్ద.

    Jojoba oil is a nutrient rich natural oil that is great for hair and skin. Over the years, jojoba oil has been increasingly used in cosmetics, soaps and hair conditioners.  There are numerous health benefits the oil offers. Jojoba oil has amazing healing properties. This oil will leave the skin feeling refreshed after massage. It not only soothes away muscle aches and pains, but it will speed heeling of scars or abrasions on the skin, making it more comfortable and easier to move freely. It is non-greasy and feels light on the skin. It's natural feel allows the therapist to apply and massage easily. It also hydrates dry, flaky skin with deep penetrating fatty acids and nourishing vitamins that helps to keep skin feeling soft and smooth. The different species of plants have been discovered through research over the years, but the jojoba plant and its extracted oil is the only one that comes close to resembling the oils our body excretes naturally. The fact that it is so close to human sebum means the scalp on our head will not react badly with the oil. The natural balance is maintained on the top of our head and that’s why jojoba oil is so good for hair as well as for your beard. Since jojoba oil regulates the production of sebum, which causes acne, its use can help reduce further breakouts. Because it is very similar to sebum, it does not clog pores and will even help to clean out build-up of dead skin cells around pores that lead to acne. The vitamin E present in the oil contains anti-oxidants that help remove damaged cells and help new ones grow, therefore fading acne scars.  When used as a conditioner will help to eliminate dandruff. Often times, dandruff is caused by a dry scalp. Using jojoba oil helps to moisturize the scalp, thereby preventing dandruff. Simply, massage the oil into your head half an hour before washing your hair. Afterwards, shampoo as usual. Jojoba oil contains Linoleic acid and other antioxidants that aid in skin and cell regeneration.  This is especially important to those of us who have struggled or are struggling with hair loss issues.  With our body regenerating cells, this allows our scalp to grow new, strong and healthy hairs, which contributes to the overall health, volume and lustre of our hair. Most people forget to exfoliate but this can lead to aged and wrinkled skin. Use a few drops of jojoba oil, emulsify with water, massage face using a muslin cloth then rinse well with clean water. This is a gentle way of exfoliating – you can do this once a week. Jojoba oil improves the look and health of skin, especially in regards to fine lines and texture. Although a topical product won’t solve the underlying health issues which lead to eczema and psoriasis, jojoba oil is a favorite among people looking for relief from these conditions. Jojoba oil works well to treat the dry, scaly skin typical of eczema, and is a favorite of many eczema-prone natural beauties even when they’re not in the middle of a flare-up.Flaky skin is especially helped by jojoba oil.     ..Divya  

వెంట్రుకలు రాగి రంగులోకి మారుతున్నాయా?? ఇదిగో మీకోసమే ఇది.. అమ్మాయిలకు వెంట్రుకలు అంటే ప్రాణం. జుట్టు పొడవుగా పెంచుకోవాలని అందరూ అనుకుంటారు. ఒకప్పుడు మహిళలకు చాలమంచి కేశసంపద ఉండేది. అయితే రాను రాను అది తగ్గిపోతోంది. జుట్టు తెల్లబడటం, రాగి రంగులోకి మారడం, పలుచగా మారిపోవడం వంటి సమస్యలు మహిళలను వెంటాడుతుంటాయి.  వెంట్రుకలు పలుచగా వున్న స్త్రీలు వారమునకు రెండుసార్లు తల స్నానం చెయ్యాలి. రాత్రులు తేలికగా నూనె వ్రాసుకొని అలాగే వదిలేయవలెను. అప్పుడప్పుడు కొబ్బరి నుండే వేడి చేసి, తలకు మర్దించాలి. వెంట్రుకలు పలుచదనం పోయి దృఢంగా తయారవడానికి  పౌష్టిక ఆహారము, బి-కాంప్లెక్సు  సమృద్ధిగా తీసుకోవాలి. . కుంకుడుకాయలు రాత్రి నాన పెట్టి, ఉదయము నానిన కుంకుడుకాయలు ఉడికించి ఆ నీటితో  తలంటుకోవాలి.   పోషకాహారముతోనే అందమైన జుట్టు సొంతమవుతుంది. ముఖ్యంగా జుట్టు రాగి రంగులోకి మారడం, వెంట్రుకలు రాలిపోవడం మొదలైన సమస్యలకు వెంట్రుకలు నల్లగా, దృఢముగా వుండటానికి పైపై మెఱుగులు ప్రయోజనాన్ని ఇవ్వవు. అందుకే పౌష్టికాహారము తీసుకొనుటలో శ్రద్ధ అధికముగా చూపాలి  గుడ్లు, చేప మాంసము, ఆకుకూరలు,  పళ్ళు మొదలైనవి ఎక్కువగా తీసుకోవాలి! వెంట్రుకలు "కెరోటిన్” అనే 'మాంసకృత్తు'ల వలన తయారౌతాయి వెంట్రుకలు నల్లగా, నిగనిగలాడాలంటే....' ఆమ్లతైలము' ఉపయోగించడం మంచిది.  తలంటు పోసుకోవడానికి ఒక గంట ముందుగా ఆమ్లతైలము బాగా దట్టముగా పట్టించాలి. ఆ తరువాత నిమ్మరసమ తీసుకొని, తలకు మర్దన చేయాలి. ఆ తరువాత  ఆరనిచ్చి, సీకాయ లేక కుంకుడు కాయతో తలంటు పోసుకోవాలి.  దీనివల్ల కొంత కాలానికి వెంట్రుకలు నల్లగా నిగనిగలాడే స్థితికి మారుతాయి.  షాంపూ లాంటి 'కెమికలైజ్డ్' పదార్థాలు ఉపయోగించకూడదు.  అలాగే ఐరన్, విటమిన్ బి వంటివి ఆహారంలో పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. రాగిరంగు వెంట్రుకలు నల్లబడటానికి హెయిర్ ఆయిల్ ఎలా చేసుకోవాలంటే..   250 గ్రా॥ల "మస్టర్డ్ ఆయిల్" (Mustard oil = ఆవాల నూనె)" ను మరగబెట్టాలి. ఈ నూనె మరిగేటప్పుడు 60 గ్రా॥ల గోరింటాకు తైలాన్ని వేసి, బాగా కలియబెట్టి, బాగా కాచాలి. తరువాత వడగట్టి, సీసాలో పోసుకొని, కొద్ది రోజులు నిలువ వుంచాలి. వెంటనే వాడకూడదు. కొన్నిరోజుల తరువాత ఈ నూనెను తలనూనెగా ఉపయోగిస్తూ వుంటే . మంచి ఫలితాలు కన్పిస్తాయి. ఈ నూనెను ఒక్కసారే ఎక్కువగా చేసుకోకూడదు. కొంచెం కొంచెం చేసుకుని వాడుకుంటూ ఉంటే మంచిది. అలాగే జుట్టు సంరక్షణకు మరికొన్ని సహజమైన మార్గాలు.. మెత్తగా దంచిన ఉసిరికాయ పై చెక్కులను రాత్రిపూట నీటిలో వేసి, నానపెట్టి వుంచాలి. ఉదయమే ఆ నీటిని తలకు పట్టించి, కొద్దిసేపు ఆరనిచ్చి, ఆ తరువాత తలకు కొబ్బరి నూనె వ్రాసుకోవాలి. ఈ విధానము వలన వెంట్రుకలు నల్లగా మారతాయి. పైన చెప్పుకున్నట్టే ఉసిరికాయ  పై తొక్కను గిన్నెలో వేసి, అందులో "గుంటగలిజేరు" రసము పోసి, ఏడురోజులు నానబెట్టాలి. ఆ తదుపరి ఆ తొక్కలను ఎండించి, చూర్ణముచేసి, పూటకు పావుతులము(2.5grms) చొప్పున తేనెలో కలిపి తింటూవుంటే  వెంట్రుకలు తుమ్మెద రెక్కల్లా నల్లబడతాయి. ఇది చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది. మెంతి ఆకులు బాగా నూరి, శిరోజాలకు రాత్రి పడుకొనే ముందు పట్టించి, ఉదయము తల స్నానము చేస్తే వెంట్రుకలు  మృదువుగా మారతాయి.  రేగు చెట్టు ఆకులు బాగా నూరి, తలకు పట్టించి, 1-2 గంటలు వుంచి, తల స్నానము చేస్తే .. వెంట్రుకలు బాగా పెరిగి, పట్టులా మృదువుగా వుంటాయి. ప్రతిరోజూ కొబ్బరినూనె క్రమము తప్పకుండా జుట్టుకు రాస్తూవుంటే..... వెంట్రుకల  కుదుళ్ళు గట్టిపడతాయి. వెంట్రుకలు తుమ్మెద రెక్కల్లా నల్లగా వుంటాయి. బాగా పెరుగుతాయి. చాలా మృదువుగా కూడా వుంటాయి. తలకు నూనె అవసరం లేదు అనే మాట చాలామంది చెబుతారు. కానీ జుట్టు రఫ్ గా మారిపోతుంది. అందుకే జుట్టుకు నూనె పెట్టడం అవసరం.                                        ◆నిశ్శబ్ద.

Getting Fair Skin Is Now Very Easy! To have fair skin is the dream of every girl. Now all girls will be pleasantly surprised to know that this dream can come true. You don’t have to go very far to get the perfect skin complexion. Simply reach out to the natural ingredients at home and you can get your dream look. As tea rejuvenates you from within, it has the capacity to do the same for your skin. Use a pack of green tea, lemon tea or herbal tea while taking a bath or spray it on your face whenever you feel the need to refresh your skin. Adding honey to the tea is also a good idea as it keeps your skin hydrated.   The procedure of making a face pack with these ingredients, is also very simple. Make a fine mixture of a cup of cooled tea water, 2 spoons of rice flour and half a spoon of honey. Keep it on for 20 minutes and massage your skin in circular motion before washing it off. In this case the rice flour acts as a scrub to help you get rid of dead skin. The next option is a mix of oats and lemon juice. Oats are natural exfoliators and therefore very beneficial to the skin. They are also used in the treatment of eczema. Besides, they also help you get rid of excess oils, grime and impurities. Coming to lime, its extracts are known to lighten your skin because of the presence of vitamin C.     --Kruthi Beesam