Special healthy Foods for Beautiful Life - 2

జీర్ణ క్రియకు...

బొప్పాయి ఆహారంలో తీసుకునే పదార్థాలు మెరుగైనవి అయినా వాటిని జీర్ణం చేసి

శరీరానికి అందించే జీర్ణవ్యవస్థ (digestive system)సక్రమంగా పనిచేయకపోతే ఆరోగ్యం

వుండదు. అందుకే జీర్ణ వ్యవస్థను మెరుగుపరుచుకోవాలి. ఫలాల్లో బొప్పాయి ఆ పని

చేస్తుంది. జీర్ణక్రియకు ఎంజైములు అవసరం. అటువంటి ఎంజైములను బొప్పాయి

అందిస్తుంది. కాబట్టి ప్రతి రోజూ ఉదయం టిఫెన్లలోను, లేదా రాత్రివేళ ఆహారం తీసుకున్న

తర్వాత బొప్పాయి ముక్కలను తినడం మంచిది.

 

అండాశయాలకు...ఆలివ్

ఆలివ్‍ ఆయిల్‍ (olive oil)తో వంట చేసుకునే వారికి లేదా ఆలివ్‍ ఆయిల్‍ ను ఇతరత్రా

శరీరంలోకి తీసుకునే స్త్రీల లైంగిక ఆరోగ్యం మెరుగ్గా వుంటుందని పరిశోధకులు కనిపెట్టారు.

అటువంటి వారిలో ఆండాశయ క్యాన్సర్‍ వచ్చే అవకాశం కనీసం ౩౦ శాతం తగ్గుతుంది.

ఆలివ్‍ ఆయిల్‍ లో వున్న ఆరోగ్య కారక కొవ్వులు (fats) క్యాన్సర్‍ కారక అంశాలను

అణిచివేస్తాయన్నది వారి నమ్మకం.

 

మెదడుకు... వాల్‍ నట్స్

ఆలోచనలు, జ్ఞాపకశక్తి మెరుగ్గా వుండాలంటే మెదడు చురుకుగా పనిచేయాలి. మెదడు

చురుకుగా పనిచేయాలంటే మెదడులోని నాడీ కణాల మధ్య సమాచార మార్పిడి వేగంగా

జరుగుతుండాలి. అటువంటి సమాచార మార్పిడి వేగం నాడీ కణాల ఆరోగ్యంతో వస్తుంది.

ఇందుకు ఒమేగా - ౩ ఫ్యాటీ ఏసిడ్స్ కావాలి. ఆ తరహా ఫ్యాటీఏసిడ్స్ సమృద్ధిగా

అందించగలిగేవి వాల్‍ నట్స్. ఎండు పళ్ళుగా లభించే వీటి రూపం మెదడు రూపానికి

దగ్గరగా కనిపిస్తుంది కూడా.

 

గుండెకు... ద్రాక్ష

ద్రాక్షలో నల్ల ద్రాక్ష, లేత పచ్చ ద్రాక్ష వుంటాయి. ఈ ద్రాక్షల్లో ఫ్లేవనాయిడ్స్ అధికం. ఇవి

గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. గుండె జబ్బులు, క్యాన్సర్లు దరిచేరనివ్వవు. అంతే కాక.

ద్రాక్ష అధిక రక్త పోటుని నియంత్రిస్తుంది అంటున్నారు శాస్త్రజ్ఞులు. ఒక్క గుండెకే గాక ఈ

ద్రాక్షవల్ల మెదడుకు కూడ ఉపయోగముంది.

 

ప్లీహానికి... చిలకడదుంప

మనిషి శరీరంలో చక్కెర శాతాన్ని నియంత్రించే అవయవం ప్లీహం (pancreas). అది

ఒక గ్రంథి. ఈ గ్రంథి చూడటానికి చిలకడ దుంప ఆకారాన్ని పోలి వుంటుంది. చిలకడ

దుంపలలో చక్కెర శాతం అధికం. అయితే ఇవి ఈ చక్కెరను ఒక్కసారిగా రక్తంలోకి

విడుదల చేయక, అతి నెమ్మది నెమ్మదిగా విడుదల చేస్తుంద. దీనివలన ప్లీహం మీద

వత్తిడి తగ్గుతుంది. అందువలన చిలకడదుంపలను ఆహారంలో భాగంగా చేసుకోవడం

మంచిది.