Weight Loss Fish Diet
చేపలను ఆహారంగా తీసుకుంటే ఆ చేపలలోని ఫ్యాటీ యాసిడ్స్ మొదడు కణాల వయసును నిలిపి వుంచుతాయని తెలుసు కదా ! అయితే అదేక్కటే కాకుండా చేపలతో ఇతర లాభాలు కూడా ఉన్నాయని ఆస్ట్రేలియా పరిశోధకులు తెలుసుకున్నారు.
అధిక బరువు కలిగినవారికి చేపలు మంచి ఆహారం అని వాళ్ళు అంటున్నారు. చేపలు తింటే బరువు తగ్గుతాము కదా అని తిని కూర్చుంటే సరిపోదు.
చేపలు తినడంతో పాటు కొంచెం వ్యాయామం కూడా చేయాలి మరి. ప్రతిరోజూ కనీసం నిమిషాలు నడవగలిగితే చేపల్లోని ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఫలితం మరింత మెరుగ్గా ఉంటుంది.
చేపల్లోని ఫ్యాటీ యాసిడ్స్ మనిషి శరీరంలోని రక్తనాళాల గోడలు సాగే గుణాన్ని మెరుగు పరుస్తాయి. రక్తప్రసరణ బాగా జరుగుతుంది. దాంతో ఆరోగ్యం మెరుగు పడుతుంది. దీనికి వ్యాయామం కూడా తోడైతే మరి మంచిది. లేకుంటే ఫలితం అంతగా కనిపించదు. అధికబరువు అలాగే నిలిచి ఉంటుంది.