Tricks to Control Your Weight
మీ బరువు కంట్రోల్ ఇక మీ చేతుల్లోనే
బరువు తగ్గడానికి ప్రతి ఒక్కరికీ ఒకే విధమయిన కామన్ డైట్ పనిచేస్తుందని చెప్పాలేం.
అది ఒక్కొక్కరి అవసరాలు, జీవన విధానాలు, శారీరక తీరుపై ఆధారపడి ఉంటుంది.బరువు
సమతూకంగా ఉండి, చక్కని ఆరోగ్యం కోసం ఓ ప్రణాళిక కార్యక్రమం ఎంతయినా అవసరం.
డైట్: పూర్తి ధాన్యాలు, పప్పులు, తృణ ధాన్యాలు, పండ్లు, నట్స్, గింజలు ఎక్కువగా
ఆహారంలో భాగం తీసుకోవాలి. రిఫైండ్ పదార్థాలకు వీలైనంత దూరంగా ఉండడం ఉత్తమం.
కొవ్వు పదార్థాలు బాగా తగ్గించాలి. నువ్వుల్లో ఐరన్ చాలా అధికంగా లభిస్తుంది.
కూరగాయల రసాలు ఆహారంలో భాగం చేసుకుంటే యాంటీ ఆక్సిడెంట్లు బాగా లభిస్తాయి.
కీరా, టమాటో, క్యారెట్, బీట్ రూట్ వంటి రసాలు ఎక్కువగా తాగుతుండాలి.
పీచు పదార్థాలు : బరువు తగ్గాలని భావించేవారు డైట్ లో పీచు పదార్థాల శాతాన్ని బాగా
పెంచాలి. పండ్లు, కూరగాయలలో పీచు సహజంగానే ఎక్కువగా ఉంటుంది. కనుక
వీలైనంత అధికంగా తీసుకోవాలి. జొన్నలు, రాగులు, ముడిబియ్యం, సజ్జలు వంటి
ధాన్యాలు వాడకం పెంచాలి. జొన్న, సోయా, సజ్జల రోటీలలో పీచు అధికంగా లభిస్తుంది.
సక్రమ ఆహార విధానం: ఎటువంటివారైనా ఉదయానే మంచి ఉపాహారం తీస్కోవాలి.
రోజంతా చురుగా పనిచేయడానికి ఇవి చాలా అవసరం. సరైన వేళకుకు భోజనం
చేస్తుండాలి. రాత్రి పూట త్వరగా భోజనం చేయాలి. దీని వల్ల రాత్రి పడుకునే సమయానికి
ఆకలి వేస్తే ఓ గ్లాసుపాలు తాగాలి . కొద్దిగా బాదం పప్పు తినడం లేదా ఒక కప్పు సూప్
తాగడం చేయవచ్చు. డైటింగ్ లో ఉన్న వారికీ కమలాలు మంచి ఆహారం. పుచ్చకాయ
రసం కూడా బాగా మేలు చేస్తుంది.
వ్యాయామం: మంచి సౌష్టవాన్ని, నాజుకు దనాన్ని కాపాడుకోవాలకునేవారు క్రమ
తప్పకుండా వ్యాయామాలు చేస్తుండాలి. ఏ వ్యయమాన్ని ఇష్టపడితే దాన్ని చేయవచ్చు.
ఐతే లక్ష్యాని దృష్టిలో ఉంచుకుని వ్యాయామం సాగించాలి.
వాటర్ థెరపి: ఏ రకమైన ఆరోగ్య సమస్యలు లేని వారికీ వాటర్ థెరపి బాగా పని చేస్తుంది.
మంచి నీరు చక్కని క్లేనింగ్ మీడియం. మామూలు నీరైనా, వేడి నీరైనా కొద్దిగా అల్లం లేదా
నిమ్మరసం కలుపుకుని తాగితే బాగా పనిచేస్తాయి. కొవ్వు పదార్థలన్నవి ఉండవు.
మోటాబాలిజం తీరు వల్లనే కొవ్వు ఏర్పడుతుంది. బాదం పప్పులు కొవ్వును పెంచుతాయని
చాలా మంది భావిస్తారు. కానీ అవి చాలా శక్తినిస్తాయి. పోషకాలు, పీచు, ప్రోటీన్లు,
ఖనిజాలు, విటమిన్లు, జింక్ పుష్కలంగా ఉండే బాదం పప్పులు ఆరోగ్యానికి చాలా మేలు
చేస్తాయి.