మేకప్ రిమూవర్ లేకుండా మేకప్ తొలగించడానికి సింపుల్ టిప్స్ ఇవీ..!


మేకప్ ఇప్పటి అమ్మాయిలకు చాలా సాధారణ విషయం.  పార్టీలు,  ఫంక్షన్లు, పెళ్లిళ్ళలో మాత్రమే కాకుండా   సాధారణంగా బయటకు వెళ్లేటప్పుడు కూడా ఫౌండేషన్, లిప్స్టిక్,  కాజల్, ఐ లైనర్ వంటివి అప్లై చేస్తారు.  అయితే వీటిని శుభ్రంగా తొలగించాలంటే మేకప్ రిమూవర్ అవసరం అవుతుంది.  మేకప్ రిమూవ్ చేయకుండా అలాగే ఉంచి పడుకుంటే చర్మం పాడైపోతుంది. కానీ మేకప్ రిమూవ్ చేయడానికి మేకప్ రిమూవర్ లేకపోతే  కొన్ని సింపుల్ మార్గాలలో మేకప్ తొలగించవచ్చు.

కొబ్బరినూనె..

ముఖం మీద మేకప్ తొలగించడానికి కొబ్బరినూనె ఉపయోగించడం ఉత్తమ మార్గం.  మేకప్ రిమూవర్ లేదు అనే చింత లేకుండా కొబ్బరినూనెతో మేకప్ ను తొలగించవచ్చు.  కొబ్బరి నూనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ పంగల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.  ఇది చర్మాన్ని మెరుస్తూ, మృదువుగా చేస్తుంది.  అదే సమయంలో చర్మం మీద మేకప్ ను కూడా చాలా క్లియర్ గా తొలగిస్తుంది.

బాదం నూనె..

బాదం నూనె కూడా మేకప్ తొలగించడంలో బాగా సహాయపడుతుంది.  కాకపోతే బాదం నూనె చాలా ఖరీదైనది.  కానీ ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి.  ఇవి ముఖ చర్మం మీద ఉండే డల్ నెస్ ను తొలగించడంలో సహాయపడతాయి.

ఆలివ్ నూనె..

ఆలివ్ ఆయిల్ వంటల్లోనే కాదు జుట్టు సంరక్షణ, చర్మ సంరక్షణలో కూడా బాగా సహాయపడుతుంది.  ముఖం మీద దుమ్ము, ధూళిని మాత్రమే కాకుండా.. వాటర్ ఫ్రూఫ్ మేకప్ ను కూడా సులభంగా తొలగించడంలో ఆలివ్ నూనె సహాయపడుతుంది.

సన్ ఫ్లవర్ ఆయిల్..

ఈ నూనె ముఖం నుండి మేకప్ తొలగించడంలో గొప్పగా సహాయపడుతుంది.  సన్ ఫ్లవర్ ఆయిల్ ల విటమిన్-ఇ ఉంటుంది. ఇది చర్మాన్ని కాంతివంతంగా, మృదువుగా చేస్తుంది.

ముఖానికి మేకప్ వేసుకున్నప్పుడు రిమూవర్ లేకపోతే.. పై నూనెలను ఉపయోగించి ముఖానికి మేకప్ ను తొలగించవచ్చు.  ఇవి ఎంతో ఆరోగ్యకరమైనవి కూడా.  చర్మానికి ఎలాంటి హాని చేయవు.

                                                   *రూపశ్రీ.