Tips to Reduce Gastric Problem

Tips to Reduce Gastric Problem, how to reduce gastric problem, gastric problem solution tips: What is the solution for Gastric Problem? When you suffer gas problem, you have to be aware of gas relief home remedy because it will help you provide a permanent solution and easy tips to reduce, cause, prevention, diet, complications, long-term outlook.

* Don't take oily and spicy foods.

* Don't drink too hot or cold beverages.

* Take plenty of water, soups etc.

* Topcid 40 or Femotidine tablets prior to meals twice a day for a week.

* Remove causes of tension or anxiety.

 

గ్యాస్ట్రిక్ సమస్యను దూరం చేసే వంటింటి చిట్కాలు

గ్యాస్ ఉన్న వారు సరిగా తినకపోవడం, తొందరగా తిన్నది జీర్ణం కాకపోవడం. కడుపులో

మంట. పులుపు, కారం లాంటివి ఎక్కువ తినలేకపోవడం వంటి ఎన్నో బాధలు

పడుతున్నారు.గ్యాస్ వల్ల పొట్టలో ఉబ్బరం కలుగుతుంది. త్రేన్పులు వస్తాయి. కడుపులో

నొప్పి, అజీర్ణం కలుగుతుంది. అపనవాయువుతో ఇబ్బంది. కడుపులో గ్యాస్

ఆపుకుందామంటే ఆగాడు. ఆపితే విపరీతమైన నొప్పి. వాసన ఉంటే భరించడం కష్టం.

దీని నుండీ బయటపడడం ఎలా? గ్యాస్ ఎందుకు తయారవుతుంది. దాని నివారణకు

ఇంట్లోనే చేసుకునే చిన్నపాటి చిట్కాలు మీ కోసం.

ఎందుకు తయారవుతుంది?

1) మనం తినే ఆహారం.

2) నమలకుండా గబగబా మ్రింగడం

3)మాట్లాడుతూ తినడం.

4)నోరు ఎక్కువగా తెరచి నమలడం

5)బీర్, కోలా వంటి కార్బోనేటేడ్ పానీయాలు కూడా గ్యాస్ కి కారణం.

6)స్మోక్ చేయడం.

7)ఆహారనాళంలో జీర్ణం కానీ షుగర్స్ ను కోలన్ లో బాక్టీరియా స్వీకరించి, గ్యాస్ ను

విడుదల చేస్తాయి.

8)ప్రేగులలోని కొన్ని బాక్టీరియ గ్యాస్ ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి.

 

గ్యాస్ రాకుండా ఉండాలంటే:

* ఆహారాన్ని బాగా నమిలి, నెమ్మదిగా, తక్కువగా తినాలి.

* ధూమపానం, జర్దా తినకూడదు.

* కొన్ని వ్యయమ పద్ధతులు పాటించాలి.

* కూల్ డ్రింక్స్, తీపి పదార్థాలు తగ్గించాలి.

* వేళకి భోజనం చేయాలి.

* రోజుకు 10-12 గ్లాసుల నీరు త్రాగాలి.

 

నివారణకు వంటింటి చిట్కాలు:

* ధనియాలు నమలండి. అది గ్యాస్ ను పోగొడుతుంది. కడుపునొప్పిని తగ్గిస్తుంది.

* కప్పు మరిగే నీటిలో కొద్దిగా అల్లం, తేనె కలిపి త్రాగండి.

* తాజా అల్లం ముక్కని నిమ్మరసంలో ముంచి అన్నం తిన్నాక తింటే ఆహారం తొందరగా

జీర్ణమవుతుంది.

* గ్యాస్ రిలీఫ్ కి ఇంగువ బాగా పనిచేస్తుంది.

* ఒక గ్లాసు మరుగుతున్న నీటిలో పీచ్ ఆకులూ వేసి 10-15 నిమిషాల తర్వాత త్రాగాలి.

రోజుకు మూడు సార్లు చేస్తే తొందరగా ఉపశమనం కలుగుతుంది.

* అరచెంచా వాముపొడి, చెంచా యాలకుల పొడి, ఒక చెంచా మిరియాల పొడి, శొంఠి పొడి

చెంచా కలిపి ఉంచుకోవాలి. రోజుకు రెండు సార్లు 400మి.లీ నీటితో తీసుకుంటే అజీర్ణం,

గ్యాస్, ఉబ్బరం తగ్గుతాయి.

* తులసి ఆకులు నిమితే కడుపులో గ్యాస్ ఏర్పడదు.

* మిరియం,శొంఠి, ఏలకులు ఒక్కొక్క్ టీ స్పూన్ చొప్పన తీసుకుని పొడి చేసి అరస్పూన్

నీటిలో కలిపి భోజనం తరువాత అరగంట ఆగి త్రాగాలి.