పసిపిల్లలకు మసాజ్ చేసే పధ్ధతి

Instructions For Baby Massage

పసి పిల్లలకు స్నానానికి ముందు మసాజ్ చేయడమన్నది చాలా అవసరం. వారి శరీర సౌష్ఠవానికి తల్లిపాలతో బాటు, రోజుకి ఒకసారైనా మసాజ్ చేయడం తప్పనిసరి. దానివల్ల శరీరంలోని కండరాలు గట్టిపడి పిల్లలు బలంగా ఉండటానికి ఉపకరించడంతో బాటు వారి రిలాక్స్ గా ఫీల్ అయి రోజంతా ఆక్టివ్ గా ఉంటారు.

  • మసాజ్ చేయడం వల్ల పిల్లల్లో రక్త ప్రసరణ మెరుగుపడి, జీర్ణశక్తి పెరుగుతుంది.

  • పిల్లల ఎముకల్లో, కండరాలలో పటుత్వం వస్తుంది.

  • పిల్లల్లో అలసట పోయి రిలాక్స్ అవుతారు, ఫలితంగా ఎక్కువ సేపు నిద్రపోతారు.

అలాగని సరైన అవగాహన లేకుండా పిల్లలకు మసాజ్ చేయడానికి సిద్ధపడకూడదు. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వారికి మసాజ్ చేసే ఆయిల్ దగ్గర్నించి, వారి శరీర భాగాలను ఎలా మసాజ్ చేయాలి...? మసాజ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ముందుగా తెలుసుకోవాలి

 

పిల్లలకు మసాజ్ చేసే పధ్ధతి:

  • మసాజ్ చేయడానికి ముందుగా గది వాతావరం వెచ్చగా ఉండేలా చూసుకోవాలి. వాళ్ళను టేబుల్ పై నైనా లేదా మీ కాళ్ళ పైనా పడుకోబెట్టుకోవాలి.

  • వారితో మాట్లాడటం కానీ, పాట పాడటం కానీ చేస్తూ వాళ్ళు కంఫర్ట్ గా ఉన్నారు అని కన్ఫం చేసుకున్న తరవాత మసాజ్ ఆయిల్ ని నుదురు మీదుగా, చెంపల మీదుగా, ముక్కు , కనుబొమ్మల మీదుగా, చెవులపై మృదువుగా మసాజ్ చేయాలి.

  • మెల్లిగా ఛాతీ పై మసాజ్ చేస్తూ, చేతులపై , ఆ తరవాత మృదువుగా చేతివేళ్ళను మసాజ్ చేయాలి. ఆ తరవాత అరికాల్లను, వేళ్ళను మృదువుగా మసాజ్ చేయాలి.

  • ఆ తరవాత వారిని బోర్లా పడుకోబెట్టి మృదువుగా వీపుపై మసాజ్ చేయాలి.

  • మీ పూర్తి ధ్యాస మసాజ్ పైనే కాకుండా పిల్లలతో మాట్లాడుతూ ఉండాలి. మసాజ్ పూర్తయ్యేంత వరకు పిల్లలతో ఐ కాంటాక్ట్ ఉండాలి

ముఖ్య గమనిక : మసాజ్ చేసేటప్పుడు పిల్లల ముక్కుల్లో, చెవుల్లో నూనె పోయడం లాంటివి చేయకూడదు.