వాకింగ్ షూస్.. రన్నింగ్ షూస్.. ఈ రెండింటి మధ్య తేడాలేంటో తెలుసా?

ఆరోగ్యం మీద స్పృహ ఉన్నవారు  రోజువారీ జీవనశైలిలో నడక, రన్నింగ్, వ్యాయామాలు, జిమ్ వంటివి భాగం చేసుకుంటారు.  ఈ విషయాలను కూడా జాగ్రత్తగా పాటించేవారు ఉంటారు. వారు వాకింగ్ వెళ్లినప్పుడు, రన్నింగ్ చేసేటప్పుడు, జిమ్ చేసేటప్పుడు షూస్ వేసుకుంటారు. అయితే రన్నింగ్, వాకింగ్, జాకింగ్, జిమ్, స్పోర్ట్స్ సమయాల్లో వేసుకునే షూస్ కూడా వేర్వేరుగా ఉంటాయి. సాధారణంగా ఎక్కువమంది చేసే రన్నింగ్, వాకింగ్ కోసం వాడే షూస్ మధ్య తేడాలేంటి?  కొత్త షూస్ కొనేటప్పుడు తీసకోవలసిన జాగ్రత్తలు, గుర్తుంచుకోవలసిన విషయాలేంటో  తెలుసుకుంటే..

 రన్నింగ్ షూస్ బరువు తక్కువగా ఉండాలి.  తేలికగా ఉన్న షూస్ వేసుకుంటే  సులభంగా పరిగెత్తవచ్చు.  తక్కువ బరువున్న బూట్లు ధరించి పరిగెత్తితే పాదాలపై తక్కువ ప్రభావం ఉంటుంది. దీని వల్ల రన్నింగ్ లో అలసిపోరు.


 బూట్లు కొనడానికి వెళ్ళినప్పుడు రన్నింగ్ షూస్ కోసం హీల్స్ కొనకూడదని  గుర్తుంచుకోవాలి. మడమలున్న షూస్ వేసుకుంటే అవి  పాదాలపై ఒత్తిడి తెస్తాయి. దీనివల్ల త్వరగా అలసిపోతారు. రన్నింగ్ షూస్ ఎంత సౌకర్యవంతంగా ఉంటే పాదాలపై ఒత్తిడి అంత తక్కువ ఉంటుంది.


రన్నింగ్ షూల మిడ్‌సోల్‌లో ఎక్కువ కుషన్ ఉంటుంది, ఇది  పాదాలపై ప్రభావం లేకుండా చేస్తుంది.  అలాగే  షాక్ లేదా గాయాన్ని తగ్గించడంలోనూ, గాయాలు కాకుండా ఉండటంలోనూ సహాయపడుతుంది.


రన్నింగ్ షూల ముందు భాగంలో   ఫ్లెక్సిబిలిటీ మరింత ఎక్కువగా ఉంటుంది.  ఇది వేగంగా పరుగెత్తడానికి  సహాయపడుతుంది. ఇలా ఫ్లెక్సిబిలిటీ ఉన్న బూట్లు  పడిపోకుండా కాపాడతాయి.  నడుస్తున్నప్పుడు సపోర్ట్ ఇస్తాయి.

వాకింగ్ షూస్..

రన్నింగ్ షూస్ కంటే వాకింగ్ షూస్ కొంచెం బరువుగా ఉంటాయి. ఎక్కువ దూరం వాకింగ్ కు  వెళ్లాలనుకుంటే తేలికగా,  మంచి కుషనింగ్ ఉన్న షూలను కొనుగోలు చేయాలి. ఇది పాదాలలో మంట లేదా నొప్పిని తగ్గిస్తుంది.


రన్నింగ్ షూస్ లాగా వాకింగ్ షూస్‌లో కూడా మంచి మిడ్‌సోల్ ఉండటం ముఖ్యం. వేగంగా నడిచినప్పుడు, ఈ సోల్  పాదాలను షాక్ నుండి కాపాడుతుంది,  బ్యాలెన్స్‌ను చక్కగా ఉంచుతుంది.


వాకింగ్ షూస్ కు  కూడా హీల్స్ ఉండకూడదు. దీని కారణంగా  ఎక్కువసేపు నడవడానికి ఇబ్బంది పడవచ్చు. మడమలు లేని బూట్లు  మంచి  సపోర్ట్ ఇస్తాయి. నడక సమయంలో  సౌకర్యవంతంగా ఉంటారు.

                                           *నిశ్శబ్ద.