ఇంట్లోనే హెయిర్ స్పా క్రీమ్.. ఎలా తయారుచేసుకోవాలో తెలుసా?

ఇంట్లోనే హెయిర్ స్పా క్రీమ్.. ఎలా తయారుచేసుకోవాలో తెలుసా?జుట్టు అందంగా, మెరుస్తూ, నల్లగా, ఒత్తుగా ఉండాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. వారానికి రెండుసార్లు జుట్టుకు నూనె పెట్టాలి.   తదనంతరం తలస్నానం చెయ్యాలి. సాధారణ అమ్మాయిలకు ఇది మాత్రమే తెలుసు. అయితే జుట్టు సంరక్షణ గురించి అవగాహన, శ్రద్ద ఉన్నవారికి హెయిర్ స్పా గురించి కూడా తెలిసే ఉంటుంది.  నెలకొకసారి హెయిర్ స్పా చేస్తే జుట్టు చాలా ఆరోగ్యంగా ఉంటుంది. హెయిర్ స్పా కోసం చాలామంది బ్యూటీ పార్లర్ మీద ఆధారపడతారు. కానీ ఈ హెయిర్ స్పా క్రీమ్ ఇంట్లోనే సిద్దం చేసుకోవచ్చు. దీన్నెలా సిద్దం చేసుకోవాలో తెలుసుకుంటే..

హెయిర్ స్పా క్రీమ్ కు కావలసినవి..

పెరుగు

తేనె

పచ్చిపాలు

తయారీవిధానం..

పెరుగు, తేనె, పచ్చిపాలు తీసుకుని అన్నింటిని బాగా కలపాలి. మొదట జుట్టును షాంపూతో శుభ్రం చేసుకోవాలి.  జుట్టును ఆరబెట్టిన తరువాత తయారుచేసుకున్న పెరుగు మిశ్రమాన్ని జుట్టుకు పట్టించాలి.  ఈ క్రీమ్ ను 30 నుండి 45 నిమిషాలు ఉంచాలి.  ఆ తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేసుకోవాలి.  దీన్ని వారానికి ఒకసారి కూడా అప్లై చేయవచ్చు. ఇది పొడి జుట్టును మృదువుగా, మెరిసేలా చేస్తుంది.

పదార్థాల ఉపయోగాలు..

హెయిర్ స్పా క్రీమ్ లోకి ఉపయోగించిన పదార్థాలు జుట్టుకు ఎలా మేలు చేస్తాయి? వాటిలోని పోషకాలు ఏంటో తెలుసుకుంటే..

తేనె..

విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫమేటరీ లక్షణాలు, ఖనిజాలు తేనెలో ఉంటాయి.  ఇవి ఆరోగ్యానికి అలాగే జుట్టుకు చాలా మేలు చేస్తాయి.

పెరుగు..

నిజానికి పెరుగులో ప్రోటీన్, కాల్షియం, రిబోప్లావిన్, విటమిన్-బి6, విటమిన్-బి12 వంటి పోషకాలు పెరుగులో ఉంటాయి. ఇవి జుట్టుకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

పచ్చిపాలు..

పచ్చిపాలలో కాల్షియం, ఫాస్పరస్, విటమిన్-బి, పొటాషియం, విటమిన్-డి పుష్కలంగా ఉంటాయి.  ఇందులో ప్రోటీన్లు కూడా ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యానికి చాలా మంచివి.

                 *నిశ్శబ్ద.