వేసవిలో ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి
మనలో చాలామంది వేసవి వస్తుంది కదా ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో ఏమో అని
భయపడుతూ ఉంటారు. అలా భయపడుతూ మరింతగా ఆరోగ్యాన్ని పట్టించుకోరు.
దాంతో మరింతగా ఆరోగ్యం దెబ్బతింటుంది. అప్పుడు వేసవిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం
ఎలా అని ఆలోచిస్తాము. ఆ ఆలోచన ఏదో వేసవి వస్తుండటంతో ఆలోచిస్తే వేసవిలో మన
ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అందుకోసం సింపుల్ గా ఈ కింది చిట్కాలు పాటిస్తే
సరిపోతుంది.
* ప్రతిరోజూ కొబ్బరి నీళ్ళు, పళ్ళరసాలు, మంచినీళ్ళు, మజ్జిగ, తాటిముంజెల నీరు
తీసుకుంటే మంచిది.
* బార్లీ గింజల్లో నీరుపోసి, ఉడికిన తరువాత బార్లీ నీళ్ళల్లో ఉప్పుగాని, పంచదార లేదా
నిమ్మరసం వేసుకొని తాగితే చలువ చేస్తుంది. ఈ నీరు పిల్లలకి చాలా ఉపయోగదాయకం.
* ఉదయం పూట తీసుకొనే టిఫిన్స్ కాని, సాయంత్రం పూట తీసుకొనే స్నాక్స్ కానీ నూనె
లేనివి తీసుకోవాలి.