* సి విటమిన్ ఉండే ఆహారానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. నిమ్మజాతి పండ్లలోనూ, అరటి, జామ వంటి వాటిల్లోనూ సి విటమిన్ అధికంగా ఉంటుంది.
* వంటల్లో నూనె వాడకాన్ని తగ్గించి.. రోజులో రెండు లీటర్ల నీటిని తాగినా చక్కని ఫలితం ఉంటుంది. ఈ దిశగా మొదటి ప్రయత్నం మొదలయినట్టే.
* మొలకలని నేరుగా, దంపుడు బియ్యం, మొక్క జొన్న, బార్లీలు వంటి వాటిని గంజి రూపంలో తీసుకొంటే శరీరం తేలిగ్గా ఉంటుంది.
* ఉడికించిన కూరగాయ ముక్కలని, చిక్కుడు జాతి రకాలయిన బీన్స్‌తో పాటు పెసలు, సెనగలు, రాజ్మా వల్ల వ్యర్ధాలు తొలగుతాయి. తాజా కాయగూరలు, బొప్పాయి, అంజీర, జామ వంటి వాటిని తినడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది.
* ఉప్పు వేయని పిస్తా, వేరుసెనగ, బాదం, జీడిపప్పు, వాల్‌నట్, గుమ్మడి గింజలను తగు మోతాదులో తినడం వల్ల మంచి ఫలితాలుంటాయి.
* ఇంట్లో చేసిన పెరుగు, ఆలివ్‌నూనె, అల్లం వెల్లుల్లి, వెన్న వేయని పాప్‌కార్న్, తేనె.. హెర్బల్ టీ తాగాలి.
* నిల్వ పచ్చళ్లు, చాక్లెట్లు, కేకులు బిస్కెట్లు బాగా తగ్గించుకోవాలి.
* బరువు తగ్గాలనుకొనేవారు.. కచ్చితమైన ఆహార నియమాలు పాటించాలి, నిత్యం కొవ్వు పదార్థాలు, పాల ఉత్పత్తులు, మాంసం, శుద్ధి చేసిన పదార్థాలు అతిగా తినేవారు తప్పనిసరిగా డిటాక్సిఫికేషన్‌ని తప్పక దృష్టి పాటించాలి.