Treatment of High Blood Pressure

It is important to take steps to keep your blood pressure under control.

The treatment goal is blood pressure below 140/90 and lower for people with other conditions, such as diabetes and kidney disease.

Adopting healthy lifestyle habits is an effective first step in both preventing and controlling high blood pressure.

If lifestyle changes alone are not effective in keeping your pressure controlled, it may be necessary to add blood pressure medications.

In this section you will learn about blood pressure-lowering lifestyle habits and blood pressure medications.

హై బీపీ నివారణ

ఈమధ్యకాలంలో ఎక్కువమంది ఎదుర్కొంటున్న సమస్య హై బీపీ.

ఆహారపు అలవాట్లు, జీవన శైలి, ఒత్తిడి, మానసిక ఆందోళన, ఊబకాయం, కిడ్నీ సమస్య,

హార్మోన్లలో మార్పులు, ఉప్పు ఎక్కువగా తినడం, వంశ పారంపర్య లక్షణం లాంటి అనేక

కారణాలతో హై బీపీ వస్తుంది.

కారణం ఏదైతేనేం అధిక రక్తపోటు సమస్య మూత్రపిండాల వ్యాధి, గుండెపోటు లాంటి

ఆటుపోట్లకు దారితీస్తుంది.

బ్రెయిన్ హామరేజ్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. కనుక హై బీపీని అశ్రద్ధ చేయడానికి

వీల్లేదు.

బీపీ అదుపు తప్పకుండా చూసుకోవాలి. అందుకు ఎన్నో సులువైన మార్గాలున్నాయి.

వాటిల్లో ఏ కొన్ని పాటించినా హై బీపీ నుండి బయట పడవచ్చు. అలాంటి రెమెడీలు మీ

కోసం...

* రోజూ వ్యాయామం చేయాలి. అందువల్ల రక్తప్రసరణ సవ్యంగా సాగి, హై బీపీ తగ్గుతుంది.

* పచ్చటి చెట్ల మధ్య అరగంటపాటు వాకింగ్ చేస్తే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.

ప్రాణాయామం, వజ్రాసనం, మత్స్యాసనం మొదలైన ఆసనాలు హై బీపీని తగ్గిస్తాయి.

* తినే పదార్ధాల్లో ఉప్పు బాగా తగ్గించాలి. వత్తిడిని తగ్గించుకోవాలి. అందుకోసం మెడిటేషన్

చేయాలి.

* సిగరెట్, ఆల్కహాల్ లాంటి అలవాట్లు ఉంటే తక్షణం మానేయాలి.

* ఉసిరి పొడిని తేనెతో రంగరించి తింటే హై బీపీ తగ్గుతుంది.

* పుచ్చకాయ జ్యూసు అధిక రక్తపోటును నివారిస్తుంది.

అన్నీ తేలికైన మార్గాలే. వీటిల్లో ఏ కొన్నిటిని పాటించినా హై బీపీ నుండి బయటపడవచ్చు.

ఇంత సులువైన మార్గాలను వదిలి ప్రాణాంతకమైన హై బీపీని పెంచి పోషించాల్సిన

అవసరం లేదు కదా, మీరే ఆలోచించండి.