ప్రసవం గురించి భయాలున్నాయా? ఈ వ్యాయామాలు చేస్తే!
ఆడపిల్లల జీవితంలో తల్లికావడం అత్యుత్తమమైన దశ. నెలలు గడిచేకొద్దీ కడుపులో పెరుగుతున్న బిడ్డ క్షేమం గురించి, ప్రసవం గురించి తలచుకుని భయపడుతుంటారు. ఈ భయాలను పోగొట్టి సుఖవంతమైన ప్రసవానికి బాట వేసేది ప్రసవం కోసం ప్రత్యేకంగా రూపొందింటిన వ్యాయామాలు. ఇవి ప్రసవ ప్రక్రియను సులభతరం చేయడంతో పాటు బిడ్డ ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఈ వ్యాయామాలలో పెరినియల్ మసాజ్, కెగెల్ వ్యాయామాలు ముఖ్యమైనవి. ఇవి ప్రసవ సమయంలో కలిగే అసౌకర్యాన్ని దూరం చేసి బిడ్డ క్షేమంగా బయటకు వచ్చేందుకు సహాయపడుతుంది.
పెరినియల్ మసాజ్ యోనికి పాయువుకు మధ్య కణజాలాన్ని సున్నితంగా సాగదీస్తుంది. బిడ్డ సులభంగా బయటకు రావడానికి సహాయపడుతుంది. యోని మార్గం చిరిగిపోయే ప్రమాదాన్ని అరికడుతుంది.
కెగెల్ వ్యాయామాలు పెల్విక్ ఫ్లోర్ కండరాలను బలోపేతం చేస్తాయి. ప్రసవం సాఫీగా జరగడానికి, ప్రసవం తరువాత మహిళలు వేగంగా కోలుకోవడానికి కూడా ఈ కెగెల్ వ్యాయామాలు సహాయపడతాయి.
అసలు పెరెనియల్ మసాజ్ అంటే ఏంటంటే..
పెరెనియల్ మసాజ్ అనేది సుఖవంతమైన ప్రసవం కోసం యోని, పురీషనాళం మధ్య ప్రాంతాన్ని సాగదీయడానికి, ప్రసవం కోసం సన్నద్దం చేయడానికి చేసే మసాజ్. ఇది ప్రసవం సమయంలో యోని ప్రాంతం చిరిగిపోకుండా చేయడంలో సహాయపడుతుంది. యోనిని దృఢంగా మారుస్తుంది. ప్రసవం సమయంలో నొప్పిని తగ్గిస్తుంది. దీని వల్ల సరైన ఫలితాలు కావాలంటే 34నుండి 36వారాల గర్బం ఉన్నప్పుడు దీన్ని మొదలుపెట్టాలి. దీనికోసం శుభ్రమైన నూనెను చేతులతో లేదా కందెన ఉపయోగించి మసాజ్ చేయాలి. మసాజ్ సమయంలో వెనుకకు కూర్చోవడం, పక్కకు కూర్చోవడం వంటి బంగిమలు సౌకర్యవంతంగా ఉంటాయి. ఈ మసాజ్ చేసేటప్పుడు సున్నితంగా ఒత్తిడి తెస్తూ కిందివైపుకు మసాజ్ చేయాలి.
కెగెల్ వ్యాయామాలు అంటే ఏంటంటే..
కెగెల్ వ్యాయామాలు పెల్విక్ ఫ్లోర్ కండరాలను టార్గెట్ చేసుకుని చేసే వ్యాయామాలు. ఈ కండరాలను ఈ వ్యాయామాలు బలోపేతం చేస్తాయి. మూత్రాశయ నియంత్రణను మెరుగుపరుస్తాయి. ప్రసవం తరువాత తొందరగా కోలుకోవడంలో సహకరిస్తాయి. గర్బధారణ సమయంలో, గర్భధారణ తరువాత యోని లీక్ కావడం వంటి సమస్యలను ఇది చక్కగా నియంత్రిస్తుంది.
పెరినియల్ మసాజ్, కెగెల్స్ వ్యాయామం ప్రతిరోజూ అయినా చేయవచ్చు. లేదా వారానికి ఒకసారి ప్రత్యేక సమయాన్ని కేటాయించుకుని అయినా చేయవచ్చు. దీనిని భాగస్వాముల సహకారంతో చేయడం వల్ల గర్బవతులు మరింత సంతోషంగా తమ గర్బం మోసే కాలాన్ని అనుభూతి చెందగలుగుతారు.
*నిశ్శబ్ద.