PCOS సమస్యకు చెక్ పెట్టేందుకు సహాయపడే యోగా ఆసనాలు..!


PCOS మహిళలను చాలా ఇబ్బంది పెడుతున్న సమస్య.  భారతదేశంలో చాలామంది మహిళలు PCOS తో సఫర్ అవుతున్నాయి. చాలమంది మహిళలకు అసలు తమకు PCOS ఉన్నట్టు కూడా తెలియదు. పిసిఓయస్ సమస్య  ఉన్న స్త్రీలలో నెలసరి సరిగా లేకపోవడం,  బరువు పెరగడం, అవాంఛిత రోమాలు, హార్మోన్ల అసమతుల్యత, గర్భం ధరించడంలో ఇబ్బందులు వంటివి ఎదురవుతుంటాయి.  హార్మోన్ల అసమతుల్యత,  ఇన్సులిన్ నిరోధకత, ఒత్తిడి మొదలైనవి పిసిఓఎస్ కు కారణం అవుతాయి.  వీటన్నింటిని తగ్గించడంలో యోగా మెరుగ్గా పనిచేస్తుంది. తద్వారా పిసిఓఎస్ సమస్యకు చెక్ పెట్టడంలో సహాయపడుతుంది. క్రమం తప్పకుండా యోగా సాధన చేయడం వల్ల శరీరం విశ్రాంతి పొందుతుంది, అండాశయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది,  జీవక్రియను పెంచుతుంది. పిసిఓఎస్ తగ్గడానికి సహాయపడే 5 యోగాసనాల గురించి తెలుసుకుంటే..

PCOS/PCOD తగ్గడంలో సహాయపడే ఆసనాలు..

భుజంగాసనం..

థైరాయిడ్,  అండాశయ పనితీరును తిరిగి మెరుగ్గా ఉండేలా చేస్తింది.  హార్మోన్లను బ్యాలెన్స్  చేస్తుంది. భుజంగాసనాన్ని క్రమం తప్పకుండా ప్రాక్టీస్  చేయడం వల్ల బొడ్డు కొవ్వు తగ్గుతుంది.


సేతుబంధాసనం..

సేతుబంధాసనం  ఉద్రిక్తత,  వెన్నునొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. దీనిని ప్రాక్టీస్  చేయడం వల్ల కటి ప్రాంతంలో రక్త ప్రసరణ పెరుగుతుంది.


బాలసన..


బాలసన ప్రాక్టీస్ చేస్తే  మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.  ఒత్తిడి హార్మోన్ అయిన  కార్టిసాల్‌ను తగ్గిస్తుంది. ఇది హార్మోన్ల సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడుతుంది.

పశ్చిమోత్తాసనము..

పశ్చిమోత్తాసనం అండాశయాలు,  గర్భాశయ కండరాలను బలపరుస్తుంది. క్రమం తప్పకుండా సాధన చేయడం వల్ల ఋతు చక్రం మెరుగుపడుతుంది.

సుప్త బద్దకోణాసనం..

 PCOSలో కటి ఆరోగ్యానికి  సుప్త బద్దకోణాసనం  అత్యంత ప్రభావవంతమైన ఆసనాలలో ఒకటి. ఇది చేయడం వల్ల పొత్తి కడుపు ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.  పొట్ట ఆరోగ్యానికి  ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తుంది

                           *రూపశ్రీ.