ఉల్లిపాయ రసం వాడినా జుట్టు పెరగట్లేదా.. ఇదిగో ఇలా వాడితే షాక్ అవుతారు..!

 

మార్కెట్లో అమ్ముడవుతున్న జుట్టు సంరక్షణ ఉత్పత్తులలో ఉల్లిపాయను 'హీరో'గా చూపించి ఉత్పత్తులు అమ్ముడుపోయేలా చేస్తుంటారు ఉత్పత్తి దారులు.   ఉల్లిపాయ జుట్టు సంరక్షణ ఉత్పత్తులలో బాగా ప్రాచుర్యం పొందింది. నూనె, షాంపూ, కండిషనర్ వంటి చాలా జుట్టు సంరక్షణ ఉత్పత్తులలో ఉల్లిపాయను సారాన్ని చేర్చుతున్నారు. ఉల్లిపాయపై చూపే ఈ ప్రత్యేక శ్రద్ధ కారణంగా ఉల్లిపాయ జుట్టుకు బాగా పనిచేస్తుందని ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది అందరికీ.   కానీ దానిని ఉపయోగించినా జుట్టు పెరుగుదల సరిగా లేక చాలామంది నిరాశకు లోనవుతూ ఉంటారు.  అయితే ఉల్లిపాయ జుట్టుకు చేసే మేలు ఏంటి? దాన్ని ఎలా ఉపయోగించడం కరెక్ట్.. మొదలైన విషయాలు తెలుసుకుంటే..

జుట్టు సంరక్షణ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. దేశంలోని 90% మందికి ఉల్లిపాయ రసాన్ని ఎలా ఉపయోగించాలో తెలియదట. అందుకే  జుట్టు పెరుగుదలలో ఎటువంటి తేడా కనిపించడం లేదని అంటున్నారు.  దీని కారణంగా అసలు ఉల్లిపాయ జుట్టు పెరుగుదలకు నిజంగానే మేలు చేస్తుందా అనే ప్రశ్న చాలామందిలో సందేహంగా మిగిలి ఉంది. అయితే  ఉల్లిపాయ రసం కొత్త జుట్టు పెరగడానికి సహాయపడుతుంది.  జుట్టు రాలడాన్ని ఆపుతుంది.  లేదా తగ్గిస్తుంది . వైద్యుల అభిప్రాయం ప్రకారం ప్రతిరోజూ ఉల్లిపాయ రసం రాయడం వల్ల జుట్టు పెరుగుదల మెరుగవుతుంది.  

పులియబెడితే..

ఉల్లిపాయను గ్రైండ్ చేసి రసాన్ని ఫిల్టర్ చేసిన తరువాత ఆ రసాన్ని నేరుగా తలకు అప్లై చేస్తుంటారు కొందరు. అయితే ఇది కరెక్ట్ పద్దతి కాదట.  ఉల్లిపాయ రసాన్ని 72 గంటలు అంటే  మూడు రోజుల పాటు దాన్ని పులియబెడితే అది మ్యాజిక్ లాగా పనిచేస్తుందట.  ఇలా పులియబెట్టడం వల్ల  ఆ ఉల్లిపాయ రసంలో క్వెర్సెటిన్ స్థాయిలు పెరుగుతాయట,  PH తల చర్మానని అసమతుల్యం చేస్తుందట. కొత్త విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఏర్పడతాయట.

పై విధంగా తయారైన ఉల్లిపాయ రసాన్ని తలకు అప్లై చేస్తే  జుట్టు చాలా ఆరోగ్యంగా, వేగంగా పెరుగుతుంది.


                               *రూపశ్రీ.