లైఫ్‌ బ్యూటిఫుల్‌గా వుండాలంటే మనం అందంగా, యాక్టివ్‌గా, హెల్‌దీగా వుండాలి. ఈ మూడూ కావాలంటే రైట్‌ డైట్‌ తీసుకోవాలి. ఆల్‌మోస్ట్‌ మనందరం క్యాలరీలు లెక్క చూసుకుని మరీ తింటుంటాం కదా? దోశలో ఇన్ని క్యాలరీలు, పిజ్జాలో ఇన్ని క్యాలరీలు అంటూ ఏవో కాకి లెక్కలు కాకుండా పక్కాగా మనం తినే ఫుడ్‌లో ఎన్ని క్యాలరీలు వున్నాయో తెలుసుకోవాలంటే ‘న్యూట్రిషినల్‌ ప్యాక్ట్స్‌ స్కేల్‌ అనే మెషిన్‌ని ఇంటికి తెచ్చుకుంటే చాలు

Nutritional Facts Scale, Nutrition scale, Nutrition Facts, Nutritional tips, Fitness Nutrition tips.


న్యూట్రిషియన్‌ ప్యాక్ట్‌స్కేల్‌ మెషిన్‌ మనం బరువు చూసుకునే మెషిన్‌నిలా ఉంటుంది చూడటానికి. కాని ఈ మెషిన్‌పై మనం తినబోయే ఫుడ్‌ ఐటమ్స్‌ని పెడితే చాలు ఒక్క సెకనులో పూర్తి ఇన్‌ఫర్‌మెషన్‌ వచ్చేస్తుంది. మెషిన్‌లో ఓ పక్కన  డిసిప్లెలో మనం పెట్టిన ఫుడ్‌ ఐటమ్‌లో ఉన్న ప్రోటీన్లు, సోడియం, కాలస్ట్రాల్‌, కార్బో హైడ్రేట్లు ఇలా ఓ 16 రకాల వివరాలు డిసిప్లే అవుతాయి. ఆ లెక్కలని చూసి ఓకే అనిపిస్తే మనం తినచ్చు. సో... క్యాలరీలకి స్ట్రిక్టగా చెక్‌ చెప్పాలంటే ఈ మెషిన్‌ని తెచ్చుకుంటే చాలు.