మేకప్ లేకపోయినా అందంగా కనిపించాలంటే.. ఇలా చేయండి..!

 

అమ్మాయిల అందాన్ని మరింత పెంచడంలో సహాయపడేది మేకప్. ఇప్పట్లో చిన్న పిల్లల నుండి పెద్ద వయసు వారి వరకు ప్రతి ఒక్కరూ కొద్దో, గొప్పో మేకప్ అప్లే చేస్తూనే ఉన్నారు.  ఇక పార్టీలు, పంక్షన్ల సమయంలో మేకప్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే మేకప్ అనేది చాలా వరకు ముఖ చర్మాన్ని దెబ్బతీస్తుంది. మేకప్ వాడకుండా అందంగా కనిపించాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి.

ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం మంచి క్లెన్సర్ తో ముఖాన్ని కడుక్కోవాలి.  చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి మాయిశ్చరైజర్ క్రమం తప్పకుండా అప్లై చేయాలి.  మాయిశ్చరైజర్ కూడా హానికరమైన రసాయనాలు లేకుండా ఉన్నదే వాడాలి.  

వారానికి ఒకసారి ముఖాన్ని పూర్తీగా, లోతుగా శుభ్రం  చేసుకోవాలి.  ఇది మృతకణాలను తొలగించడంలోనూ, చర్మంలో పేరుకున్న మలినాలు తొలగించడంలోనూ సహాయపడుతుంది. ఇందుకోసం ఫేషియల్, స్ర్కబ్బింగ్,  ఎక్స్పోలియేషన్ చేసుకోవాలి.  ఇంటి చిట్కాలతో దీన్ని ఆరోగ్యకరమైన రీతిలో చేసుకోవచ్చు.

ఎండలోకి వెళ్లైముందు సురక్షితమైన సన్ స్క్రీన్ ను అప్లై చేయాలి.  నీరు పుష్కలంగా తాగాలి.  ప్రతిరోజూ 2 నుండి 3 లీటర్ల నీరు తప్పనిసరిగా తీసుకోవాలి.  దీని వల్ల చర్మం హైడ్రేట్ గా ఉంటుంది.

ఆహారంలో పండ్లు, కూరగాయలు పుష్కలంగా తీసుకోవాి.   సమతుల ఆహారాన్ని కూడా తీసుకోవాలి.  ఇది చర్మం ఆరోగ్యంగా ఉండటంలో సహాయపడుతుంది.  పండ్లు, కూరగాయలలో ఫైబర్,  నీటి శాతం బాగా ఉన్నవి తీసుకోవాలి. ఇవి చర్మానికి మెరుపును ఇస్తాయి.  శరీరం డీహైడ్రేషన్ కు లోను కాకుండా ఉంటుంది.

జుట్టు సంరక్షణ కూడా ముఖం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.  తలలో చుండ్రు,  పుండ్లు, జుట్టు పొడిబారి ఉండటం,  లేదా జిడ్డుగా ఉండటం వంటివి జరిగితే అది ముఖ చర్మం మీద ర్యాషెస్,  గుల్లలు,  మొటిమలు,  దద్దుర్లు వంటివి రావడానికి కారణం అవుతుంది.

చర్మం పైన మచ్చలు, వడదెబ్బలు,  వేడి గుల్లలు వంటివి వస్తే వాటిని తగ్గించుకోవడానికి అలోవెరా జెల్, విటమిన్-సి సీరమ్ వంటి తేలికపాటి చర్మ సంరక్షణ ఉత్పత్తులు వాడాలి. ఇవి చర్మానికి హాని చేయకుండా సమస్య తగ్గిస్తాయి.

                                             *రూపశ్రీ