మీ పిల్లలనే గిఫ్ట్ గా ఇవ్వాలనుకుంటున్నారా...?

ఈ సారీ మీ పాపకి బర్త్ డేకీ అచ్చంగా మీ పాపలా వుండే బొమ్మని గిఫ్ట్ గా ఇస్తే ? తను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా "My twinn" పేరుతో ఇలాంటి బొమ్మలు తయారు చేస్తోంది ఓ అమెరికన్ కంపెని.

"My twinn" బొమ్మ అచ్చుగుద్దినట్టు, మన పాపాయిలానే వుంటుంది. దానికి చేయాల్సినదల్లా మన పాప ఫోటో ఇవ్వటమే. ఆ ఫోటోలోని పాప లాంటి బొమ్మని చేసి మనకిస్తారు. అదే రకం డ్రెస్,హెయిర్ స్టైల్, కలర్.. ఇలా ప్రతిది కూడా మీరు పంపిన ఫోటోలాగే ఉంటుంది. ట్విన్ డాల్ కావాలి అని అనుకుంటే ఒక్క డ్రెస్ ఏం సరిపోతుంది.అందుకే మన పాపాయి డ్రెస్సెస్ లని ఫోటో తీసి పంపిస్తే అలాగే డ్రెస్సెస్ తయారు చేసి ఇస్తారు.షుస్ లాంటి యాక్ససరీస్ కూడా వీళ్ళే సప్లై చేస్తారు. ఎప్పటికప్పుడు పాపాయి డ్రెస్ తో పాటు ట్విన్ డాల్ డ్రెస్సెస్ కూడా ఆర్డర్ చేయవచ్చు.

మన పాపాయికి బుల్లి రూపంలో కనిపించే బొమ్మ మీద కూడా పెడతారు. ఆర్డర్ చేయాలన్న ఇంకా వివరాలు కావాలంటే www.mytwinn.com లోకి లాగిన్ అవ్వండి. మీ పాప ఫోటో వివరాలు పంపిస్తే 3 వారాల్లో మీ పాపను పోలిన ట్విన్ డాల్ మీకు అందుతుంది.

 

- రమ