వర్షాకాలంలో పిల్లల చర్మ ఆరోగ్యానికి సూపర్ టిప్స్ ఇవి..!


వర్షాకాలం అంటే వేసవి నెలల్లో మండే వేడి నుండి ఉపశమనం. కానీ ఇది తేమ అధికంగా కలిగి ఉండి అసౌకర్యాన్ని, ఇబ్బందిని కలిగిస్తుంద. ముఖ్యంగా శిశువులలో చర్మ వ్యాధులు,  చికాకులు రావడానికి ఇది ఎక్కువగా అవకాశం కలిగి ఉండే కాలం. అధిక తేమ, ఫంగల్ ఇన్ఫెక్షన్, దోమ కాటు లేదా ఉష్ణోగ్రత తీవ్రతలు పిల్లలను ఇబ్బంది పెడతాయి. పిల్లలకు ఎక్కువ ఇబ్బందిగా ఉన్నప్పుడు వైద్యుని సంప్రదించడం మంచిది. కానీ మరీ ప్రభావం ఎక్కువగా లేనప్పుడు ఇంట్లోనే పిల్లల చర్మ సంరక్షణ తీసుకోవచ్చు.

పిల్లల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి చర్మాన్ని  హైడ్రేట్ గా ఉంచాలి.   చర్మాన్ని వీలైనంత వరకు బయటి వాతావరణం నుండి ప్రభావితం కాకుండా రక్షణ తీసుకోవాలి. మార్కెట్లో దొరికే క్రీములు రాయడం వల్ల చర్మం సేఫ్ అనుకుని ఎడాపెడా మార్కెట్ క్రీములు రాయకూడదు.  

కొబ్బరి నూనె  సహజ యాంటీ ఫంగల్ లక్షణాలను మాత్రమే కాకుండా, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. ఇది మంచి మసాజ్ ఆయిల్ లాగా మాత్రమే కాకుండా మంచి మాయిశ్చరైజర్ లా కూడా పని చేస్తుంది.  తేమ కారణంగా ఫంగల్ ఇన్ఫెక్షన్లను నివారించడానికి ఇది మంచి  మార్గం.  అయితే స్వచ్చమైన కొబ్బరి నూనె వాడాలి.

వేప ఆకుల గురించి అందరికీ తెలిసిందే.  ఇది మంచి యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగి ఉంటుంది. వేపాకులను ఉడికించిన నీటితో శిశువుకు  స్నానం చేయించడం  వల్ల  బిడ్డకు దద్దుర్లు, దురద,  చర్మ ఇన్ఫెక్షన్ల నుండి సహజ రక్షణ లభిస్తుంది.

తాజా కలబంద నుండి వచ్చే జెల్ మండుతున్న చర్మాన్ని చల్లబరుస్తుంది,  శాంతపరుస్తుంది, ఎరుపును తగ్గిస్తుంది.  దాని హైడ్రేటింగ్ రియాక్షన్  చాలా తేలికగా ఉంటుంది. దద్దుర్లు వచ్చే ప్రాంతాలపై చాలా లైట్ గా కలబంద జెల్ పూయడం మంచి చిట్కా.. అయితే పిల్లలకోసం కాబట్టి ముందుగా ప్యాచ్ టెస్ట చేయాలి.

 ఓట్ మీల్ చర్మానికి చాలా  ఉపశమనం కలిగిస్తుంది. ఓట్ మీల్ పొడిలో నీరు లేదా కొబ్బరి నూనె వేసి పేస్ట్ లాగా చేసి పిల్లలకు స్నానం చేయించేటప్పుడు సన్నితంగా రుద్దాలి.  తరువాత గోరువెచ్చని నీటితో స్నానం చేయించాలి. ఇది చర్మాన్ని చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది.

కాటన్ దుస్తులు చర్మం పొడిగా ఉండటానికి సహాయపడతాయి.  చెమట పేరుకుపోవడాన్ని తగ్గిస్తుంది. వర్షాకాలంలో సింథటిక్ బట్టలను ఎప్పుడూ ఎంచుకోకూడదు. ఎందుకంటే అవి తేమను లాక్ చేస్తాయి, చర్మ చికాకును పెంచుతాయి.

                                            *రూపశ్రీ.