ఈ పొరపాట్లు చేస్తున్నారా

 


లిప్ లైనర్ డార్క్ కలర్, అలాగే లిప్ స్టిక్ లైట్ కలర్ అయితే బావుంటుంది అనుకుంటారు చాల మంది కాని దీని వల్ల పెదవులు అందంగా కనిపించవట. పెదవుల రంగుకి దగ్గరగా ఉండే లైనర్ ని ఎంచుకుంటే పెదవులు అందం పాడవదు. అంటున్నారు నిపుణులు.

 


ఐబ్రోస్ ని డార్క్ గా  దిద్దితే అందంగా కనిపిస్తాయనుకుంటారు, కాని లైట్ కలర్ షేడ్ వాడితేనే అవి  అందంగా కనిపిస్తాయట. ఐబ్రోస్ నేచురల్ కలర్ కంటే లైట్ గా వుండే షేడ్ ని ఎంచుకోవాలి అంటున్నారు నిపుణులు.

 



చర్మం మరీ పొడిబారి వున్నప్పుడు ఫౌండేషన్ వాడకూడదు ఎందుకంటే ఆ పౌండేషన్ చర్మం లో   కలవకుండా  ప్యాచుల్లాకనిపిస్తుంటుంది. కాబట్టి ముందు డెడ్ స్కిన్ తీసేసి మాయిచ్యరైజర్ రాసుకున్నాక పౌండేషన్ వాడాలి అంటున్నారు నిపుణులు.

 


కళ్ళు పెద్దగా, అందంగా కనిపించటానికి  కనురెప్పలకి మస్కాకరా వాడతారు. అయితే రెండు మూడు సార్లు మస్కారా వేస్తే కనురెప్పలు మరీ బిరుతుగా కనిపిస్తాయి. డార్క్ గా కనిపించే రెప్పలు కళ్ళ అందాన్ని పెంచక పోగా, ఎబ్బెట్టుగా కనిపిస్తాయి.


కనురెప్పల పైన గ్లిట్టర్ వేసుకుంటే పార్టీలో ఎట్రాక్టివ్ గా కనిపిస్తాం అనుకుంటే  పొరపాటే టీనేజ్ అమ్మాయిలకి ఓకే కాని మధ్యవయసులో వాటి జోలికి పోకపోవటమే మంచిది అంటున్నారు నిపుణులు. అందం మాట అల వుంచి ఎబెట్టుగా కనిపిస్తారని చెబుతున్నారు.

అలాగే మేకప్ చేసుకున్నపుడు మన ముఖంలో వేటిని హైలెట్ చేయాలనుకుంటున్నామో నిర్ణయించుకోవాలి. ముందు - అప్పుడే సింపుల్ గా , అందంగా కనిపిస్తారు.

- రమా.