పండ్లు తినండి ! కానీ అలా తినకండి.

ఆరోగ్యంగా ఉండాలంటే, మన శరీరానికి రకరకాల పోషకాలు అవసరం. అంతేగా! తినేస్తే సరిపోతుందిలే అని అనుకుంటున్నారు చాలా మంది. నిజమే! కానీ వాటికి సంబంధించి కొన్ని నియమాలను పాటిస్తే మంచిది. పండ్లు తింటే మంచిది, పైగా ఆరోగ్యం కూడా అనే ఉద్దేశ్యంతో ఆకలిగా అనిపించినప్పుడు ఏదో ఒక పండును తీసుకుంటాం. కేవలం దాన్ని తినడం వల్ల అంతగా ప్రయోజనం ఉండదు. పండ్లలో ఉండే పిండి పదార్ధాలు రక్తంలో చెక్కెర స్థాయిని పెంచి, తక్కువ సమయానికే ఆకలివేసేలా చేస్తాయి. అలా కాకుండా పండుతో పాటూ ఏదైనా ప్రోటీన్లు ఉన్న ఆహారాన్ని తీసుకుంటే రక్తంలో చెక్కెరస్థాయి పెరగదు. ఉదాహరణకు పెరుగులో పండ్ల ముక్కలు వేసుకొని తినవచ్చు. పొట్టుతో ఉన్న పండ్లు తినడంవల్ల పీచు పదార్థాలు అందుతాయి. పీచు పదార్థాలను సరైన మోతాదులో తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల నుండి దూరంగా ఉండవచ్చు. మన శరీరం వివిధ అనారోగ్యాలతో పోరాడాలంటే ఫైటోకెమికల్స్‌ అందాలి. దానికోసం వారానికి 3సార్లు అయినా ఫ్రూట్‌ సలాడ్స్‌ని తీసుకుంటే మంచిది.

 

- స్వప్న