చర్మంలో తేమను పెంచే ఫేషియల్స్

చలికాలంలో చర్మంలోని తేమను కాపాడే ఫేషియల్స్ మంచివి అని అంటున్నారు సౌందర్య నిపుణులు. ఆ ఫేషియల్స్ కూడా మన ఇంట్లో దొరికే తేనే, పెరుగు వంటి వాటితో ఈజీగా చేసుకోవచ్చట.

తేనే ఒకటిన్నర స్పూన్

గుడ్డులోని తెల్లసొన

గ్లిజరిన్ రెండు టీస్పూన్లు

ఈ మూడింటిని కలిపి బాగా గిలకొట్టండి. తర్వాత అందులో సరిపడా శనగపిండి వేసి కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు రాసి పావుగంట తర్వాత చల్లటి నీళ్ళతో కడిగేయాలి.

ఇక ఇంకా సింపుల్ గా కావాలంటే... ముఖానికి పెరుగు రాసుకోండి చాలు. చర్మంలో తేమను ఎక్కువసేపు నిలిపి ఉంచే శక్తి పెరుగుకు ఉంది. ముఖానికి పెరుగును పట్టించి, ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో కడిగితే చాలు. ఫేషియల్ పూర్తయినట్టే. మరింకెందుకు ఆలస్యం. మీరు కూడా ఒకసారి ఈ ఫేషియల్ చేసి చూడండి.

- రమ