40 దాటిన మహిళల కోసం..

 

స్త్రీ జీవితంలో అతి ముఖ్యమైన రెండవ దశ మోనోపాజ్..నెలసరి రుతుక్రమం ఆగిపోవడాన్నే "మోనోపాజ్‌" లేదా "ముట్లుడిగిపోవటం" అంటారు. సాధారణంగా స్త్రీలలో మోనోపాజ్ లక్షణాలు 40 సంవత్సరాల నుంచి ప్రారంభమవుతాయి. కొందరికి ఆలస్యం కూడా కావొచ్చు. దీనికి హర్మోన్లలో వచ్చే మార్పులే కారణం. ఈ దశకి చేరువైన స్త్రీ శరీరంలో పలు మార్పులు చోటు చేసుకుంటాయి. ఒక్కసారిగా రుతుక్రమం ఆగిపోవడం, తరచూ తలనొప్పి, తీవ్రమైన ఒత్తిడితో పాటు నిద్రలేమి, ఆకలి లేకపోవుట వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి.

ఈ మార్పుల కారణంగా మహిళలు శారీరకంగా, మానసికంగా కుంగిపోతుంటారు. అయితే కొన్ని నియమాలను క్రమం తప్పకుండా పాటించడం ద్వారా ఈ వయసులోనూ అంతే హుషారుగా ఉండొచ్చు అంటున్నారు నిపుణులు. అవేంటో ఈ వీడియో ద్వారా తెలుసుకోండి.  https://www.youtube.com/watch?v=GjiP6iTpcEE