మచ్చలేని ముఖచర్మానికి ఇంట్లోనే  బ్యూటీ క్రీమ్ ఇలా సిద్దం చేసుకోండి!



ఎవరిని అయినా సరే మొదట చూడగానే వారి ముఖమే గమనిస్తారు. ముఖం అందంగా ఉంటే ఇట్టే ఏదో ఆకర్షణ పుడుతుంది. అందుకే అమ్మాయిలు అందంగా తయారవ్వడానికి కష్టపడతారు. ఇప్పుడున్న మేకప్ ల ప్రభావం కారణంగా ఎలాంటి వారు అయినా మేకప్ వేయగానే హీరోయిన్స్ ను తలదన్నేలా ఉంటారు. అయితే ఎంతసేపూ ఇలా మేకప్ లు వేసి ముఖాన్ని కవర్ చేయడం, ముఖం సహజంగా అందంగా మారడం కోసం బ్యూటీ క్రీములు వాడటం చేస్తుంటారు. కానీ ఎంత వాడినా అవి  తగిన ఫలితం ఇవ్వవు. అయితే దీనికి సహజమైన చక్కని పరిష్కారం ఉంది. ఇంట్లోనే ఈజీగా బ్యూటీ క్రీమ్ తయారుచేసుకుని వాడటం వల్ల మచ్చలేని, యవ్వనమైన ముఖ చర్మం సొంతమవుతుంది. దీన్నెలా తయారుచెయ్యాలో, దీనికి కావలసిన పదార్థాలేంటో  తెలుసుకుంటే..

ఇంట్లోనే బ్యూటీ క్రీమ్ తయారుచేయడానికి కావలసిన పదార్థాలు ఇవీ..

బాదం నూనె.. 1/2టేబుల్ స్పూన్
గ్లిజరిన్..1/2 టేబుల్ స్పూన్
కొబ్బరినూనె..1/2టేబుల్ స్పూన్
యాపిల్ జ్యూస్.. 2టేబుల్ స్పూన్లు
అలోవెరా జెల్.. 1 టేబుల్ స్పూన్
విటమిన్ -ఇ టాబ్లెట్.. 1

పై పదార్థాలు అన్నీ ఒకచిన్న గిన్నెలో ఒకదాని తరువాత ఒకటి వేస్తూ మిశ్రమాన్ని బాగా మిక్స్ చెయ్యాలి. దీన్ని ఎక్కువసేపు మిక్స్ చేస్తే ఇది క్రీమ్ లాగా తయారవుతుంది.

ఈ క్రీమ్ ను ముఖానికి అప్లై చేసుకుంటూ ఉంటే ముఖం మీద మచ్చలు, గీతలు,ముడతలు అన్నీ క్రమంగా తగ్గుతాయి. మరీ ముఖ్యంగా ముఖం కాంతివంతంగా తయారవుతుంది.  ఈ క్రీమ్ ను ఏ సమయంలో అయినా ఉపయోగించవచ్చు. దీన్ని చిన్న కంటైనర్ లో భద్రపరిచి ఫ్రిజ్ లో ఉంచితే వారం రోజుల పాటూ ఉపయోగించుకోవచ్చు. ఎక్కువ ఫలితాలు కావాలంటే ఈ క్రీమ్ ను రాత్రి పడుకునేముందు ముఖాన్ని శుభ్రం చేసుకుని నైట్ క్రీమ్ లాగా రాసుకుని పడుకోవాలి.

                                            *నిశ్శబ్ద.