బరువు తగ్గాలా... మీకు తెలియని రహస్యం ఇదే!

మహిళలు సాధారణంగా ఎదుర్కునే పెద్ద సమస్య అధిక బరువు. పెళ్లయ్యాక, పిల్లలు పుట్టాక చాలామంది శరీరం నమ్మలేనంతగ షేపవుట్ అవుతుంది. అయితే అందరూ చేసే ఒక పొరపాటు బరువు పెరగడానికి, బరువు తగ్గకుండా ఉండటానికి కారణం అవుతుంది. అదేంటో తెలుసుకుంటే..

మన శరీరం  పనితీరు శరీరంలో అన్ని అవయవాల ఆరోగ్యానికి సంబంధించినది. అంటే శరీరంలోని ఏదైనా భాగంలో ఏదైనా సమస్య ఉంటే, అది మొత్తం శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. జీవక్రియకు బరువు పెరగటానికి ఉన్న  లింకు కూడా ఇదే. సాధారణంగా, బరువు పెరిగిన వారు దానిని తగ్గించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంటారు.  ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా బరువు తగ్గడంతో లేదంటే శరీరంలో మెటబాలిజం తక్కువ ఉందని అర్థం. 

జీవక్రియ  ఆహారాన్ని శక్తిగా మార్చే ఒక రసాయన ప్రక్రియ. ఇది శరీరంలో కేలరీలను బర్నింగ్  చేసే రేటును కూడా ప్రభావితం చేస్తుంది. తక్కువ జీవక్రియ ఉంటే శరీరంలో కేలరీల బర్న్ కూడా తగ్గిపోతుంది, ఇది బరువుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది.

జీవక్రియను ఎలా పెంచవచ్చో.. ఇది బరువు తగ్గించడంలో  ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుంటే..

బరువుపై జీవక్రియ ప్రభావం..

జీవక్రియ రేటు సాధారణం కంటే తక్కువగా ఉన్నప్పుడు, కేలరీలు బర్న్ అయ్యే ప్రక్రియ కూడా మందగిస్తుంది, అంటే శరీరంలో కొవ్వు పరిమాణం పెరిగిపోతుంది.  అదే జీవక్రియ వేగంగా ఉంటే ఎక్కువ కేలరీలు  బర్న్ చేయగలుగుతారు.  ఎక్కువగా తింటున్నప్పటికీ, అది శక్తి రూపంలో సరిగ్గా ఉపయోగించబడుతుంది.  శరీరంలో కొవ్వు పరిమాణం పెరగదు.

అందుకే ప్రతి ఒక్కరూ జీవక్రియను ఆరోగ్యంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. జీవక్రియ సమస్యను పరిష్కరించుకోవడానికి ఎలాంటి ఏమి చెయ్యాలో తెలుసుకుంటే..

ఎక్కువ నీరు త్రాగాలి..

రోజంతా ఎక్కువ నీరు త్రాగే వ్యక్తులు బరువును తగ్గడంలో, బరువును నియంత్రించడంలో చక్కని  ప్రయోజనాలు పొందుతారు. నీరు  జీవక్రియను తాత్కాలికంగా వేగవంతం చేస్తుంది. 500 మి.లీ.ల నీటిని తాగడం వల్ల సాధారణం కంటే జీవక్రియ రేటు 30% వరకు పెరుగుతుంది.  బరువును తగ్గించుకోవాలనుకుంటే, ఎక్కువ నీరు త్రాగటం ప్రయోజనకరంగా ఉంటుంది.

 వర్కవుట్‌ లు..

హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ (HIIT) వర్కవుట్లు  జీవక్రియను పెంచడంలో,  బరువు తగ్గించడంలో  ప్రయోజనకరంగా ఉంటాయి. ఇది జీవక్రియ రేటును పెంచడం ద్వారా  కొవ్వును బర్న్ చేయడంలో  సహాయపడుతుంది. ఇతర రకాల వ్యాయామాల కంటే జీవక్రియను పెంచడంలో,  బరువు తగ్గించడంలో ఈ వ్యాయామాలు ఎక్కువ ప్రయోజనాలను కలిగి ఉంటాయి. 

చక్కని చిట్కా..

బరువు పెరగడానికి ప్రధాన కారణం ఒకేచోట ఎక్కువసేపు కూర్చోవడం. మహిళలు, ఆఫీసుల్లో పనిచేసేవారు ఎక్కువసేపు కూర్చుంటూ ఉంటారు. ఇది బరువు పెరగడంలో ప్రభావం చూపిస్తుంది. అందుకని వీలైనంత వరకు కూర్చోవడాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నించండి. నడవడం, నిలబడటం వంటి పనుల్ ద్వారా శరీరంలో కొవ్వు పేరుకునే వ్యవస్థను బ్రేక్ చేయొచ్చు. 

*నిశ్శబ్ద.