ఇవి తింటున్నారా
 
 
 
.
ఆహారంలో నూనె గింజల వాడకాన్ని పెంచాలట వీటి వల్ల కొవ్వు పదార్దాలే కాకా పిండి పదార్ధాల వంటి శక్తినిచ్చే పోషకాలు కూడా ఎక్కువగానే లభిస్తాయి అంటున్నారు నిపుణలు. గోధుమ పిండిలో సగానికి రాగుల పిండి గాని, జొన్న పిండి కానీ, సజ్జలు లేదా మరేదైనా చిరుధాన్యాల పిండిని కలిపి వాడుకోవచ్చు. అలాగే గోధుములు పిండిగానే లేదా నానాబెట్టి మొలకెత్తించి, చిటికెడు ఉప్పు, నిమ్మరసం కలిపి తీసుకుంటే శరీరానికి విటమిన్ -సి కూడా అందుతుంది. అలాగే అటుకులలో ఇనుము అధికంగా వుంటుంది. కాబట్టి ఒకరోజు టిఫిన్ గా దానితో ఉప్మా, పులహోర వంటివి చేయటం మంచిది. అలాగే అటుకులని పాలతో కలిపి తీసుకుంటే అధిక పోషకాలు లభిస్తాయట కూడా. ఆలోచిస్తే మీకు బోల్డన్ని చిట్కాలు తోచవచ్చు అవి మాతో పంచుకోండి.