Golden Path For Your Children
మీ పిల్లలకు ఓ బంగారుబాట మీ ఇంట్లో కిడ్డీ బ్యాంక్ ఉందా..? ఆ చిన్ని పెట్టెలోనే ఉంది మీ
బిడ్డల భవిష్యత్తు. బాల్యం నుంచే వారిని పొదుపుబాట పట్టిస్తే, మీ కల నిజమవుతుంది..
అదెలాగో చదవండి...
* పిల్లలు సులువుగా ఓపెన్ చెయ్యలేని కిడ్డీ బ్యాంక్‌ను కొనివ్వండి.
* మీరు ఇస్తున్న పాకెట్‌మనీలో కొంత మొత్తాన్ని మిగిల్చి అందులో వేస్తే, మీరు దానికి
మరికొంత మొత్తాన్ని జమ చేసి ప్రోత్సహించండి.
* పిల్లలకు ఖర్చు చేయడంలో ఉన్న ఎంజాయ్‌మెంట్‌ను దాచుకోవడంలో కూడా
చూపించండి.
* కొన్ని బ్యాంకులు ప్రత్యేకించి పిల్లల కోసమే సేవింగ్ ఖాతాలను ఆహ్వానిస్తున్నాయి. మీ
పిల్లలను తీసుకొని బ్యాంకుకు వెళ్లి, వాళ్ల పేరుతోనే ఇలాంటి అకౌంట్ ఓపెన్ చెయ్యండి.
* బ్యాంకు ఖాతాలో జమ చేయడం, సొమ్మును డ్రా చేయడం.. ఎలాగో మీరే దగ్గరుండి మీ
పిల్లలకు నేర్పించండి.
* పిల్లలు దాచుకున్న సొమ్మును కొంతకాలమయ్యాక- వారిపేరుతోనే పోస్టాఫీసులో
డిపాజిట్ చేయండి. గడువుతీరాక వచ్చే అసలుకు వచ్చే వడ్డీని తిరిగి పిల్లలకే ఇచ్చేయండి.
* మ్యూచువల్‌ఫండ్స్‌లో బోలెడు చిల్డ్రన్‌ప్లాన్స్ ఉన్నాయి. వాటిలో మీ అబ్బాయి,
అమ్మాయిల పేరుతో పెట్టుబడి పెట్టండి. వాళ్ల చదువు కోసం మీరెంత కష్టపడుతున్నారో
అర్థమవుతుంది.
* డబ్బు విలువను చిన్నప్పటి నుంచే పిల్లలకు తెలియజేస్తే.. పెరిగి పెద్దయ్యాక దుబారా
ఖర్చులు చేయరని పలు సర్వేలు చెబుతున్నాయి.
